మేనెలలోని సేవాకూటాలు
మే 3తో ప్రారంభమయ్యే వారం
పాట 7 (17)
8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.
17 నిమి: “ఇతరులు ప్రయోజనం పొందేందుకు వారికి బోధించండి.” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువకు పరిమితం చేయాలి. తర్వాత, ప్రశ్నా జవాబుల చర్చను చేయండి. జ్ఞానము పుస్తకంలోని 13వ అధ్యాయాన్ని ఉపయోగిస్తూ బైబిలు సూత్రాలను పఠించి, అర్థం చేసుకుని, అన్వర్తించుకోవడం ద్వారా ప్రజలు ఆచరణాత్మకమైన విధంగా ఎలా ప్రయోజనం పొందగలరో సోదాహరణంగా చెప్పండి.
20 నిమి: కరపత్రాలతో ప్రత్యేక ప్రచారపని. ప్రదర్శనలతో కూడిన ఉత్సాహవంతమైన చర్చను ఒక పెద్ద నిర్వహిస్తాడు. ఈ కార్యక్రమంలో ప్రస్తావించబడుతున్న నాలుగు కరపత్రాల సెట్ ప్రసంగీకుడితో సహా అందరి దగ్గర ఉండేలా నిశ్చయపర్చుకోండి. సంఘంలోని అందరికీ పంచిపెట్టేందుకు ఈ కరపత్రాలను కూటానికి ముందు సిద్ధంగా ఉంచుకోవాలని సంఘం నిర్ణయించుకోవచ్చు. ఇన్‌సర్ట్‌లోని 1-6 పేరాలను ప్రేక్షకులతో చర్చించండి. తర్వాత 10వ పేరాలోని మొదటి రెండు అందింపులను ఉపయోగిస్తూ అలాగే, 6వ పేజీలోని బాక్స్‌లో ఉన్న ఒక సాధారణ అభ్యంతరాన్ని అధిగమించడానికి గల మొదటి రెండు మార్గాలను ఉపయోగిస్తూ బాగా సిద్ధమైన రెండు ప్రదర్శనలను చూపించండి. మేలో ఈ ప్రత్యేక ప్రచారపనిలో పాల్గొనమని అందర్నీ ప్రోత్సహించండి.
పాట 11 (9), ముగింపు ప్రార్థన.
మే 10తో ప్రారంభమయ్యే వారం
పాట 15 (2)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
12 నిమి: వేసవిలో మీ పథకాలు ఏమిటి? ఒక కుటుంబం కరపత్రాలతో ప్రత్యేక ప్రచార పని చేయడానికీ, సహాయ పయినీరుసేవ చేయడానికీ, సెలవు దినాలు గడపడానికీ, వినోదానికీ తాము చేసుకొనే ఏర్పాట్లను పునఃసమీక్షిస్తుంది. (మే 1998 మన రాజ్య పరిచర్య, పేజీ 7 చూడండి.) వాళ్ళు అనియత సాక్ష్యమివ్వడానికి పథకం వేసుకోవడం గురించి, అనియత సాక్ష్యాన్ని ఇవ్వడం గురించి చర్చిస్తారు, అలాగే సంభాషణను ఎలా ప్రారంభించాలో ప్రదర్శిస్తారు. వ్యక్తిగత పఠనాన్ని, కుటుంబ బైబిలు పఠనాన్ని కొనసాగించవలసిన అవసరాన్ని, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి సంఘ కూటాలకు హాజరు కావలసిన అవసరాన్ని, మీ సొంత సంఘానికి క్షేత్ర సేవా కార్యక్రమ రిపోర్టును పంపవలసిన అవసరాన్ని నొక్కి చెప్పండి. ఆ కుటుంబం ఇతర సంఘాలను సందర్శించినప్పుడు కలిగిన మంచి అనుభవాలను, ఆనందాలను గుర్తు చేసుకుంటుంది. తమ సంఘానికి ఎవరైనా సందర్శకులు వస్తే వారికి ఆతిథ్యమివ్వగల మార్గాలను గురించి ఆలోచిస్తారు.
25 నిమి: కరపత్రాలతో ప్రత్యేక ప్రచారపని. ఒక పెద్ద, చర్చను ప్రదర్శనలను నిర్వహిస్తాడు, అనుభవాలను పేర్కొంటాడు. ప్రస్తావిస్తున్న నాలుగు కరపత్రాల సెట్ హాజరై ఉన్న అందరి దగ్గర ఉండేలా నిశ్చయపరుచుకోండి. గత వారంలో చర్చించబడిన దాన్ని క్లుప్తంగా పునఃసమీక్షించండి. పరిచర్యలో కరపత్రాలను ఉపయోగించిన ఒకరు లేదా ఇద్దరు ప్రచారకులను తమ ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పమనండి. 7-9, 11, 12 పేరాలను ప్రేక్షకులను పాల్గొననిస్తూ చర్చించండి. ఇన్‌సర్ట్‌లోని 10వ పేరాలోని చివరి రెండు అందింపులను ఉపయోగిస్తూ, అలాగే 6వ పేజీలోని బాక్స్‌లో ప్రస్తావించిన సాధారణ అభ్యంతరాలను అధిగమించేందుకు గల చివరి రెండు మార్గాలను ఉపయోగిస్తూ బాగా సిద్ధమైన రెండు ప్రదర్శనలను చూపించండి. సాహిత్యాలను అందించిన చోట్ల, కరపత్రాలను అందించిన చోట్లతో సహా పునఃదర్శనాలను చేయాలని అందర్నీ ప్రోత్సహించండి.
పాట 19 (4), ముగింపు ప్రార్థన.
మే 17తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (3)
10 నిమి: స్థానిక ప్రకటనలను ఒక పెద్ద నిర్వహిస్తారు. “రాజ్యమందిరపు ఋణాలు” చర్చిస్తారు. వ్యక్తిగతంగా ఫండ్‌ల కోసం అభ్యర్థించకూడదని నొక్కి చెప్పండి.
12 నిమి: “ముందుగా పథకం వేసుకోండి!” తర్వాతి అనేక నెలల కోసం స్థానికంగా పథకం వేయబడిన దైవపరిపాలనా కార్యకలాపాలన్నింటిని పునఃసమీక్షించే ప్రసంగం. తమ క్యాలెండర్ మీద తేదీలను గుర్తు పెట్టమని, ఇతరత్రా ఏమీ దానిలో జొరబడడానికి అనుమతించవద్దని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.
23 నిమి: “మీ పరిచర్యను విస్తృతపర్చుకునే మార్గాలు.” ప్రేక్షకుల్లోని వేర్వేరు వ్యక్తుల నుండి వచ్చిన ప్రశ్నలకు ప్రతిస్పందనగా ఇద్దరు పెద్దలు ఈ శీర్షికను చర్చిస్తారు. ఒక యౌవన ప్రచారకుడు, ఒక వివాహిత దంపతులు, రిటైర్‌మెంట్‌కు వచ్చిన సహోదరుడు తమ పరిచర్యను విస్తృతపర్చుకోగల మార్గాలను గురించి ఈ పెద్దలను అడుగుతారు. ఈ శీర్షికలో ఉన్న అలాగే, మన పరిచర్య పుస్తకంలోని 9వ అధ్యాయంలోని 116-18 పేజీల్లో “భవిష్యత్ కొరకు నీ ఆత్మీయ గమ్యములేమిటి?” అనే హెడ్డింగ్ క్రింద ఉన్న ఆచరణాత్మక సూచనలు ప్రతిపాదించబడతాయి. సమీప భవిష్యత్తులో సేవా కార్యశీలతను విస్తృతపరచుకోవడానికి ఎలా పథకం వేసుకోవాలో చూపిస్తూ, సొసైటీ అందజేస్తున్న సహాయకర సమాచారానికి ఆ ప్రచారకులు మెప్పుదలను వ్యక్తీకరిస్తారు.
పాట 29 (18), ముగింపు ప్రార్థన.
మే 24తో ప్రారంభమయ్యే వారం
పాట 41 (6)
15 నిమి: స్థానిక ప్రకటనలు. ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌ను ఉపయోగించడాన్ని గురించి చర్చిస్తున్న అక్టోబరు 15, 1998 నాటి సొసైటీ ఉత్తరాన్ని పునఃసమీక్షించండి. అనియత సాక్ష్యాన్ని ఇస్తున్నప్పుడు ఇతర భాషల్లో మాట్లాడే ప్రజలను సందర్శించినప్పుడు ఆసక్తిని కనపరిస్తే వారిని తిరిగి దర్శించేందుకు ఇది ఎలా సహాయం చేయగలదో వివరించండి. ఈ ఫారమ్‌లను బాగా ఉపయోగించుకోమని ప్రచారకులను ప్రోత్సహించండి.
12 నిమి: ప్రశ్నా భాగం. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
18 నిమి: వేరుచేసే పనిలో మనం భాగం వహిస్తున్నామా? జూలై 1, 1997, కావలికోట, పేజీలు 30-1 ఆధారంగా పురికొల్పునిచ్చే ప్రసంగాన్ని సేవా పైవిచారణ కర్త ఇస్తారు.
పాట 32 (3), ముగింపు ప్రార్థన.
మే 31తో ప్రారంభమయ్యే వారం
పాట 43 (4)
15 నిమి: స్థానిక ప్రకటనలు. మే నెల క్షేత్రసేవా రిపోర్టును ఇవ్వాలని అందరికి గుర్తు చేయండి. జూన్ నెల సాహిత్య ప్రతిపాదనను పునఃసమీక్షించండి. జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించేటప్పుడు దానితో పాటు సంఘంలో ఎక్కువ స్టాకులో ఉన్న 192-పేజీల పాత పుస్తకాన్ని ప్రతిపాదించండి. ఒక నమూనా అందింపును ప్రదర్శించండి.
15 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: నా మతంలో తప్పేమిటి? ఇద్దరు పరిచర్య సేవకుల మధ్య చర్చ. సత్యం విషయమై అనుకూలంగా ప్రతిస్పందించే, యెహోవాసాక్షులను ప్రశంసించే అనేకమంది ప్రజలు మనకు తారసిల్లుతూ ఉంటారు. అయితే వారికి చర్చితో ఉండే సన్నిహిత సంబంధాలు వారికి అవరోధంగా నిలుస్తాయి. ఆటంకపరుస్తాయి. మనం ఏకైక సత్య మతాన్ని కలిగి ఉన్నామని, వారి ఆరాధనా విధానం అబద్ధమని నమ్మడం కష్టమని వారు కనుగొంటారు. ఇది వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక పెద్ద అవరోధం అవుతుంది. ఇతర మతాలు బైబిలును అనుసరించవని స్పష్టంగా చూపిస్తున్న తర్కము పుస్తకంలోని పేజీ 204లో పేర్కొన్న ఆరు కారకాలను ఆ సహోదరులు పునఃసమీక్షిస్తారు. తమ మత నమ్మకాలను మదింపు చేసుకునేలా యథార్థవంతులకు చాతుర్యంగా సహాయం చేసేందుకు ఈ కారకాలను ఉపయోగించాలని ప్రేక్షకులను ప్రోత్సహించండి.
పాట 50 (6), ముగింపు ప్రార్థన.