కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/99 పేజీ 1
  • ముందుగా పథకం వేసుకోండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముందుగా పథకం వేసుకోండి!
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • వేసవి కొరకైన మీ పథకాలేమిటి?
    మన రాజ్య పరిచర్య—1996
  • ‘ఆయన నీ ప్రణాళికలన్నిటినీ సఫలం చేయాలి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • మీ సమయాన్ని జ్ఞానవంతంగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • వేసవిలో దైవపరిపాలనా పనులను వెంబడిస్తూ ఉండండి
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 5/99 పేజీ 1

ముందుగా పథకం వేసుకోండి!

1 యెహోవా సంస్థ మన ఆధ్యాత్మిక అవసరాలన్నిటిని తీర్చడానికి దైవ పరిపాలనా క్రియాశీలతల ఒక క్రమమైన కార్యక్రమాన్ని రూపొందించి అందిస్తుంది. స్థానికంగా పథకం వేయబడిన ప్రయాణ పైవిచారణ కర్త సందర్శనాలు, అసెంబ్లీలు, సమావేశాలు, ఇతర ప్రత్యేక కార్యశీలతల వంటి ప్రతి ఏర్పాటు నుండి పూర్తి ప్రయోజనం పొందేలా మనకు గల మెప్పుదల మనల్ని కదిలించాలి. (మత్త. 5:3) కొందరు తమకున్న ఇతర పథకాల కారణంగా ఈ ఆధ్యాత్మిక ఏర్పాట్లలో అనేకమైన వాటిని జారవిడుచుకుంటున్నారు. దీనిని నివారించాలంటే ఏమి చేయాలి? “శ్రేష్ఠమైన కార్యముల” స్థానంలో దైవపరిపాలనా కార్యకలాపాలు కాని విషయాలు జొరబడకుండా మనమెలా చూసుకోవచ్చు?—ఫిలి. 1:10.

2 వివేచనతో కూడిన పథకం ప్రాముఖ్యం: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” అని సామెతలు 21:5 చెబుతుంది. ఆధ్యాత్మిక ‘లాభం’ పొందాలంటే, ఏర్పాటు చేయబడుతున్న దైవపరిపాలనా కార్యకలాపాలను మనస్సులో ఉంచుకుని, శ్రద్ధతో ముందుగా పథకం వేసుకోవడం అవసరం. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందేందుకు దైవపరిపాలనా కార్యకలాపాల్లో నిమగ్నం కావడాన్ని ఆటంక పరచని సమయాలనే మన వ్యక్తిగత కార్యక్రమాలకు షెడ్యూల్‌ వేసుకోవాలి. రానున్న దైవపరిపాలనా కార్యక్రమాలను గురించి ఆలోచించకుండా, మనం వ్యక్తిగతంగా ఏం చేయాలనుకుంటున్నామో వాటికి తొందరపడి పథకాలను వేసుకుంటే, తర్వాత ఆధ్యాత్మిక ‘నష్టము’ను అనుభవిస్తాం.

3 కోల్పోకండి! మనమందరం సెలవులు, వ్యాపార సంబంధ రాకపోకలు, బంధువులను సందర్శించడం వాటితో సహా భవిష్యత్తును గురించి మనమందరం పథకాలు వేస్తాము. మిమ్మల్ని మీకు బద్ధుల్ని చేసుకోవడానికి ముందు లేదా మీ పథకాలను నిర్ణయించుకునే ముందు జరగబోయే ఆధ్యాత్మిక కార్యకలాపాల షెడ్యూల్‌ను సంప్రదించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న సమయంలోనే ప్రాంతీయ పైవిచారణకర్త వస్తున్నారనో, అసెంబ్లీ ఉందనో మీరు కనుగొన్నట్లయితే, మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనగల్గేందుకు మీ పథకాలను మార్చుకోవడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించండి. భవిష్యత్తులో జరగబోయే పెద్ద పెద్ద కార్యక్రమాల విషయమై మనకు ముందుగానే తెలియజేయబడుతుంది. స్థానికంగా ఏమి పథకం వేయబడుతుందో మీ సంఘంలోని పెద్దలు మీకు చెప్పగలరు.

4 అభ్యాస సిద్ధమైన ముందుచూపుతో మరింత ప్రాముఖ్యమైన విషయాలను గురించి ముందుగా పథకం వేసుకోవడం ద్వారా, “దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు,” మనం “నీతిఫలములతో నిండికొనిన”వారమవుతాము.—ఫిలి. 1:11.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి