ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు మేలో: కరపత్రాలతో ప్రత్యేక ప్రచార పని. కావలికోట, తేజరిల్లు! కోసం చందాలు. ఆసక్తి గల ప్రజల కోసం దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్‌లను ఉంచుకొని, గృహ బైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించండి. జూన్‌లో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జూలై, ఆగస్టులలో: ఈ క్రింది 32-పేజీల బ్రోషూర్‌లలో వేటినైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . . వీలైన చోట్ల మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? మృతుల ఆత్మలు అవి మీకు సహాయం చేయగలవా లేక హాని చేయగలవా? అవి నిజానికి ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధం లేని లోకం ఎప్పటికైనా వస్తుందా?, సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూర్‌లను ప్రతిపాదించండి.