కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/98 పేజీ 2
  • డిసెంబరులోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరులోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఉపశీర్షికలు
  • డిసెంబరు 7తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 14తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 21తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 28తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1998
km 12/98 పేజీ 2

డిసెంబరులోని సేవా కూటాలు

డిసెంబరు 7తో ప్రారంభమయ్యే వారం

పాట 186, (22)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: “మనం మళ్ళీ మళ్ళీ సందర్శించాలి.” ప్రశ్నాజవాబులు. యెహెజ్కేలు 3:17-19 పై క్లుప్త వ్యాఖ్యానం చేస్తూ, హెచ్చరికా సమాచారాన్ని మనం సాధ్యమైనంతగా నెరవేర్చే బాధ్యతను నొక్కి చెప్పండి.

20 నిమి: “నూతన లోక అనువాదము ప్రతిపాదన.” ఇద్దరు లేక ముగ్గురు అనుభవజ్ఞులైన ప్రచారకులతో ఒక సహోదరుడు ఈ శీర్షికను చర్చిస్తాడు. “ప్రతి లేఖనము” (ఆంగ్లం) పుస్తకంలోని 327-31 పేజీలకు సంబంధించిన విషయాలు కొన్ని చేర్చండి. డిసెంబరులో ఎలా అందింపుని ఇవ్వవచ్చో ప్రదర్శించండి.

పాట 176, (8) ముగింపు ప్రార్థన.

డిసెంబరు 14తో ప్రారంభమయ్యే వారం

పాట 206, (6)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్ట్‌. లౌకిక సెలవుదిన శుభాకాంక్షలకు యుక్తిగా ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో సూచించండి. సంఘంలో మహాగొప్ప మనిషి లేక మహాగొప్ప బోధకుడు (ఆంగ్లం) అనే పుస్తక ప్రతులు స్టాక్‌లో ఉన్నట్లయితే, వాటిని క్రిస్మస్‌ సెలవుల్లో శ్రేష్ఠమైన రీతిలో ఎలా అందివ్వవచ్చో చూపండి. డిసెంబరు 25 మరియు జనవరి 1న ప్రత్యేక పరిచర్య సేవకై ఏర్పాట్లు చేయండి.

15 నిమి: “పైవిచారణ కర్తలు నేతృత్వం వహిస్తారు—కావలికోట పఠన నిర్వాహకుడు.” కావలికోట పఠన నిర్వాహకుడు ఇచ్చే ప్రసంగం. ఆయనకి ఉన్న బాధ్యతలను వివరిస్తూ, పఠనాన్ని ఉత్సాహవంతంగానూ, ఉపదేశించేదిగానూ, ఆధ్యాత్మికతను పెంచేదిగానూ చేయడానికి హాజరైన వారంతా ఎలా సహాయం చేయగలరో వివరిస్తాడు.—మన పరిచర్య, పేజి 67 చూడండి.

20 నిమి: “మనం ప్రత్యేకమైనవారమని వారు గుర్తిస్తున్నారు.” ప్రశ్నాజవాబులు. మనల్ని ప్రత్యేకమైన వారిగా చేసే ప్రతీ గుర్తులను క్లుప్తంగా సమీక్షించండి. ఆసక్తి గల వారిని సంస్థ వైపుకి నడిపించడానికి, ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపించండి. అంతేగాక, సత్యానికి అనుగుణ్యంగా జీవించేవారి జీవితాల్లో ఆ సత్యము ఎలా క్రైస్తవ లక్షణాలను ఉత్పన్నం చేస్తుందో చూపించడానికి కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించండి.

పాట 146, (11) ముగింపు ప్రార్థన.

డిసెంబరు 21తో ప్రారంభమయ్యే వారం

పాట 163, (23)

8 నిమి: స్థానిక ప్రకటనలు. క్రొత్త సంవత్సరంనుంచి మీ సంఘ కూటాల సమయం ఒకవేళ మార్చుకుంటున్నట్లైతే, క్రొత్త సమయాలని బట్టి క్రమమైన రీతిలో కూటాలకు హాజరవ్వడంలో కొనసాగమని ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఎలాంటి మార్పులు జరిగినా, బైబిల్‌ విద్యార్థులకు, ఇంకా ఆసక్తిగల వారందరికి తెలియజేయాలని ప్రచారకులకు గుర్తుచేయండి. ప్రచారకులందరూ వారివ్యక్తిగత ప్రతులైన మనరాజ్య పరిచర్యను ముఖ్యంగా అన్ని ఇన్‌సర్ట్‌ల్ని దాచివుంచుకోమని ప్రోత్సహించండి. భవిష్యత్తులో వాటి ప్రస్తావన రావచ్చు. తర్వాతి వారంలో జరిగే సేవా కూటానికి మే 1998 మనరాజ్య పరిచర్యలోని ఇన్‌సర్ట్‌ని అందరూ తీసుకురావాలని గుర్తుచేయండి.

12 నిమి:స్థానిక అవసరతలు.

25 నిమి:“యెహోవా సేవను కేంద్రంగా చేసుకొని మీ జీవితాన్ని నిర్మించుకోండి” ప్రశ్నా జవాబులు. క్షేత్రసేవలో క్రమమైన పట్టిక కల్గి, ప్రతీ వారం దాన్ని పాటిస్తూ విజయాన్ని సాధించిన ఒక అవివాహితుడ్ని, మరొక కుటుంబ పెద్దని ఇంటర్వ్యూ చేయండి. ఆధ్యాత్మిక ఆసక్తుల్ని ప్రథమస్థానంలో ఉంచడం కోసం ఏయే వ్యక్తిగత వ్యవస్థీకరణ అవసరమో వారిని చెప్పమనండి.

పాట 119, (17) ముగింపు ప్రార్థన.

డిసెంబరు 28తో ప్రారంభమయ్యే వారం

పాట 178, (20)

10 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు సేవా రిపోర్ట్‌ను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. జనవరి పత్రికా ప్రతిపాదనలో భాగంగా అందుబాటులో ఉన్న పాత పుస్తకాల్ని చూపండి. ఈ వారాంతంలో అందించడానికి కొన్ని ప్రచురణలను తీసుకోమని ప్రచారకులను ప్రోత్సహించండి.

10 నిమి: “దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందండి.” దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. కొంతమంది ప్రచారకులు “చదవవలసిన బైబిలు భాగం అదనపు పట్టిక”ను అనుసరించి సాధించిన ప్రయోజనాల్ని చెప్పమనండి. ప్రతీ రోజూ దేవుని వాక్యాన్ని చదవమని అందర్ని ప్రోత్సహించండి.

25 నిమి: “కావలెను—మరిన్ని బైబిలు పఠనములు” మే 1998 మన రాజ్య పరిచర్యలోని ఇన్‌సర్ట్‌ని పునఃసమీక్షిస్తాడు. మే 1998 నుంచి బైబిలు పఠన పనిలో ఎంత అభివృద్ధి సాధించబడిందో సేవా పైవిచారణకర్త సమీక్షించండి. బైబిలు పఠనాలు లేనివారు అప్పుడప్పుడు ఈ ఇన్‌సర్ట్‌ని ప్రార్థన పూర్వకంగా పరిశీలించమని ప్రోత్సహించండి. సంఘంలో ఇప్పటికే ఒక బైబిల్‌ పఠనం చేస్తున్నవారిని కూడా ఇంకా ఎక్కువ బైబిల్‌ పఠనాలు కల్గివుండమని ప్రోత్సహించవచ్చు.

పాట 195, (8) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి