మనం ప్రత్యేకమైనవారమని వారు గుర్తిస్తున్నారు
1 గత సంవత్సరం, 3,00,000 పైగా క్రొత్తవారు బాప్తిస్మం తీసుకొని మనతో చేరారు. వీరు యెహోవాసాక్షుల్లో ఏమి చూసి దేవుని సంస్థలో భాగమవ్వాలని ప్రేరేపితులయ్యారు? ఇతర మతాలనుండి మనం ఎందుకు ప్రత్యేకమైన వారిగా ఉన్నాము? ఇక్కడ కొన్ని స్పష్టమైన జవాబులు ఇవ్వబడ్డాయి:
— మనం వ్యక్తిగత తలంపులకు బదులు బైబిలును అంటిపెట్టుకుని ఉంటాము: యేసుక్రీస్తు చెప్పినట్లుగా, మనం యెహోవా దేవుడ్ని “ఆత్మతోను సత్యముతోను” ఆరాధిస్తాము. అంటే దేవుని లిఖిత వాక్యానికి అనుగుణ్యంగా మారుతూ, అబద్ధమత సిద్ధాంతాల్ని తిరస్కరిస్తాము.—యోహా. 4:23, 24; 2 తిమో. 3:15-17.
—ప్రజలు మన దగ్గరకి రావాలని కనిపెట్టే బదులు, మనమే వారి దగ్గరకి వెళ్తాము: ప్రకటించి, బోధించమన్న క్రీస్తు ఆజ్ఞను మనం స్వీకరించి, యథార్థహృదయులైన వ్యక్తులను కనుగొనే విషయంలో క్రీస్తు మాదిరిని అనుకరిస్తాము. మనం ప్రజల్ని ఇళ్ళల్లోనూ, వీధుల్లోనూ, ఎక్కడ కనబడితే అక్కడ కలుస్తాము.—మత్త. 9:35; 10:11; 28:19, 20; అపొ. 10:42.
—మనం ప్రతీ ఒక్కరికీ ఉచితంగా బైబిలు బోధని అందిస్తాము: దేవుని సేవలో ఉచితంగా మన వనరులను, శక్తిని వినియోగిస్తూ, ప్రతీ సంవత్సరం వంద కోట్ల కన్నా ఎక్కువ గంటలను వెచ్చిస్తున్నాము. పక్షపాతం లేకుండా, మనం అన్ని రకాల ప్రజలతో బైబిలు పఠిస్తాము.—మత్త. 10:8; అపొ. 10:34, 35; ప్రక. 22:17.
—ఆధ్యాత్మికంగా ప్రజలకి సహాయం చేయడానికి మనం చక్కని తర్ఫీదును పొందాము: బైబిలును వ్యక్తిగతంగా పఠించడం ద్వారా, సంఘ కూటాల్లో అసెంబ్లీల్లో సమావేశాల్లో ఇవ్వబడే నిర్దేశాల ద్వారా, వెలకట్టలేని దైవ పరిపాలనా విద్యాభ్యాసాన్ని క్రమంగా పొందుతున్నాము. ఇతరులకు ఆధ్యాత్మికంగా జ్ఞానోదయం కల్గించేందుకు ఈ విద్యాభ్యాసం మనల్ని సమర్థుల్ని చేస్తుంది.—యెష. 54:13; 2 తిమో. 2:15; 1 పేతు. 3:15.
—మన ప్రతిదిన జీవితంలో సత్యాన్ని గంభీరంగా తీసుకొని దానిని అనుసరిస్తాము: దేవునిపై మనకున్న ప్రేమను బట్టి, మార్పులు చేసుకొని, ఆయన చిత్తానికి అనుగుణ్యంగా మన జీవితాలను మలచుకుంటాము. మనం క్రీస్తులాంటి నవీన స్వభావం కల్గివుండటం వల్ల, ఇతరులు సత్యానికి ఆకర్షితులు అవుతున్నారు.—కొలొ. 3:9, 10; యాకో. 1:22, 25; 1 యోహా. 5:3.
—ఇతరులతో సమాధానంగా కలసి జీవించడానికి పని చేయడానికి ప్రయత్నిస్తాము: దైవిక లక్షణాలను వృద్ధిపర్చుకోవడం మన క్రియలను, మాటలను అదుపు చేసుకోవడానికి సహాయం చేస్తుంది. మనం అందరితోనూ, ‘సమాధానమును వెదకి దాన్ని వెంటాడతాము.’—1 పేతు. 3:10, 11; ఎఫె. 4:1-3.
2 యెహోవా సంస్థలోని క్రైస్తవ జీవిత మాదిరులు చూసినప్పుడు అనేక మంది సత్యాన్ని స్వీకరించడానికి ప్రేరేపితులయ్యారు. మనకి తెలిసినవారి మీద కూడా మన వ్యక్తిగత మాదిరి అదే ప్రభావాన్ని చూపించాలి.