మనం మళ్ళీ మళ్ళీ సందర్శించాలి
1 ఎవరైనా మీతో సువార్తను పంచుకున్న మొదటిసారే మీరు దానికి అనుకూలంగా ప్రతిస్పందించారా? అలా ప్రతిస్పందించకపోతే, యెహోవాసాక్షులు తాము అందించే బైబిలు పఠనాన్ని మీరు అంగీకరించేంత వరకూ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ సందర్శించినందుకు, మీరు తప్పక కృతజ్ఞులై ఉండాలి. మీకు కేటాయించబడిన ప్రాంతంలో మళ్లీ మళ్లీ పని చేస్తున్నప్పుడు, ఆ విషయాన్ని గురించి ఆలోచించడం మంచిది.
2 ప్రజల జీవితాలు ఎప్పటి కప్పుడు మారుతూవున్నాయి. వాళ్లు క్రొత్త క్రొత్త పరిస్థితులను లేక క్రొత్త క్రొత్త సమస్యలను ఎదుర్కొంటారు, సమాజంలో లేదా ప్రపంచంలో జరిగే కల్లోలిత సంఘటనల్ని గురించి వింటారు, ఆర్థిక పరిస్థితులు తలక్రిందులవ్వడాన్ని చవిచూస్తారు, లేక కుటుంబంలో అనారోగ్యం లేక మరణించడం వంటి వాటిని ఎదుర్కొంటారు. వాళ్లు వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని అనుకునేలా అవి చేస్తాయి. ప్రజల మనస్సుల్లో పెను భారమై కూర్చున్న విషయాల్ని మనం వివేచించాలి, ఆ తర్వాత ఓదార్పుకరమైన సందేశంతో ప్రతిస్పందించాలి.
3 ఇది రక్షించే పని: విపత్తు జరిగిన ప్రాంతంలో సహాయకచర్యల్ని చేపట్టేవారిని గురించి ఆలోచించండి. సహాయక చర్యల్ని చేపట్టే కొందరు బ్రతికి బయటపడ్డ వ్యక్తులు కొద్దిమందే ఉన్న విపత్తు ప్రాంతంలో వారిని వెతికి రక్షించడానికి బహుశా అన్వేషిస్తున్నప్పటికీ, విపత్తు జరిగిన ఇతర ప్రాంతాల్లో తమతోటి పనివాళ్లు అనేకమందిని వెతికి రక్షిస్తున్నారు గదా అని, వాళ్లు తాము చేస్తున్న పనిని అశ్రద్ధ చేయరు, నిలిపివేయరు. రక్షించడానికి మనం చేసే పని ఇంకా ఆపుచేయబడలేదు. ‘‘మహాశ్రమల’’ నుండి తప్పించుకోవాలనుకునే వందల వేలకొలది మందిని ప్రతీ సంవత్సరము మనం కనుగొంటున్నాం.—ప్రక. 7:9, 14.
4 “యెహోవా నామమును బట్టి ప్రార్థించే ప్రతి ఒక్కరు రక్షించబడతారు.” (రోమా. 10:13-15, NW) పరిచర్యలో పట్టుదల కలిగివుండడానికి ఈ వాక్యాలు మనలో ప్రతీ ఒక్కరి మీద ప్రభావం చూపాలి. మన ప్రాంతాన్ని కవర్ చేయడం మొదలుపెట్టిన కాలం నుండి ఇప్పటికి పిల్లలు పెరిగి, తమను గురించీ, తమ భవిష్యత్తు గురించీ, జీవిత సంకల్పం గురించీ గంభీరంగా ఆలోచించేంత స్థాయికి ఎదిగివుండవచ్చు. చిట్ట చివరకు మనం చెప్పే వాటిని వినేవాళ్లెవరో మనకు తెలియదు. (ప్రసం. 11:6) ఇంతకు ముందు వ్యతిరేకించిన అనేకమంది వ్యక్తులు, సత్యాన్ని అంగీకరించారు. మన పని, ప్రజలకు తీర్పు తీర్చడం కాదుగాని, వినడానికీ, ఈ పాత విధానం నుండి తప్పించుకోవడానికీ వాళ్లకు అవకాశాన్ని ఇస్తూ ఉండడమే. యేసు తొలి శిష్యులు చేసినట్లే, మనం ప్రజలవద్దకు “విడువక వెళ్లాలి,” రాజ్య సందేశంపట్ల వారి ఆసక్తిని రేకెత్తించేందుకు ప్రయత్నించాలి.’’—మత్త. 10:6, 7, NW.
5 ప్రకటించడానికి మార్గము మనకు ఇంకా తెరిచేవుందన్న వాస్తవం, యెహోవా కనికరానికి ప్రతిరూపమై ఉంది. (2 పేతు. 3:9) సందేశాన్ని మళ్లీ మళ్లీ వినేలా ఇతరులను సందర్శించడం ద్వారా, మనం దేవుని ప్రేమని ఉన్నతపరుస్తాం, మరి ఆ విధంగా ఆయన్ను స్తుతిస్తాం.