కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/98 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 12/98 పేజీలు 5-6

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

1998 సెప్టెంబరు 4 నుండి డిసెంబరు 24 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలను మూసి చేసే పునఃసమీక్ష. కేటాయంచబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. రెండవ తిమోతి 1:6లో చెప్పబడిన “కృపావరము” దేవుని పరిశుద్ధాత్మ ప్రక్రియ ద్వారా తిమోతికి ఇవ్వబడిన వివిధ భాషలను మాట్లాడే వరాన్ని సూచిస్తుంది. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E85 5/1 16వ పేజీ, 15వ పేరా.]

2. పరిపక్వతగల క్రైస్తవుడు దేవుని వాక్యంలో తనకున్న జ్ఞానాన్ని ఉపయోగంలో పెట్టడాన్ని అలవాటుగా చేసుకోవడం ద్వారా “మేలు కీడులను వివేచించుటకు” తన ‘జ్ఞానేంద్రియములను సాధకముచేసుకుంటాడు.’ (హెబ్రీ. 5:14) [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w86 1/1 10వ పేజీ, 7వ పేరా.]

3. యెహోవా “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయంపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు” అన్న వాస్తవం, ఆయన మానవులతో వ్యవహరించేటప్పుడు, ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటాడని సూచిస్తుంది. (మత్త. 5:45) [w96 11/15 25వ పేజీ, 7వ పేరా]

4. బైబిలులో ఒక పత్రికను వ్రాసిన యాకోబూ, సున్నతి విషయమై నిర్ణయం తీసుకోబడిన సమయంలో ‘అపొస్తలులకూ పెద్దలకూ’ వక్తగానుండిన యాకోబూ ఒకరే. (అపొ. 15:6, 13; యాకో. 1:1) [si 248వ పేజీ, 2-3 పేరాలు]

5. పేతురు తన మొదటి లేఖనాన్ని వ్రాసినప్పుడు, ఆయన బబులోనులో ఉన్నాడని 1 పేతురు 5:13 చెబుతున్నప్పటికీ, రోమ్‌కు బదులుగా సూచనార్థకంగా వాడిన పేరే బబులోను అని రుజువులు చూపిస్తున్నాయి. [si 251వ పేజీ, 4వ పేరా]

6. మొదటి యోహాను 2:18 లోని “క్రీస్తు విరోధి వచ్చున”న్న వ్యక్తీకరణ పరోక్షంగా ఒక వ్యక్తినే సూచిస్తుంది. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి rs 32వ పేజీ, 3వ పేరా.]

7. రెండవ యోహాను 10వ వచనంలో, వానిని మీ యంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు అన్న ఆజ్ఞ అబద్ధ సిద్ధాంతాలకు ప్రాచుర్యం ఇచ్చేవారిని మాత్రమే సూచిస్తుంది. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E85 7/15 30వ పేజీ, 1-3 పేరాలు.]

8. అపొస్తలుడైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథాన్ని బైబిలులో చివరన ఉంచడం సరైనదే. ఎందుకంటే అది చివరన వ్రాయబడిన గ్రంథం. [si 263వ పేజీ, 1వ పేరా]

9. ఆంగ్లో అమెరికన్‌ ప్రపంచ శక్తి నానాజాతి సమితికి, దాని తర్వాత వచ్చిన ఐక్య రాజ్య సమితికి ముఖ్య మద్దతుదారుగా, అలాగే జీవదాతగా ఎలా అయ్యిందో ప్రకటన 13:11-15 ఖచ్చితంగా చిత్రీకరిస్తుంది. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E88 12/15 19వ పేజీ, 3వ పేరా.]

10. బైబిలు మద్యపానాన్ని అనుమతిస్తుంది గనుక, స్థానిక ఆచారాలూ, సంప్రదాయాలు మనమెంత మద్యాన్ని సేవించాలనే దాన్ని శాసించేందుకు అనుమతించడం సముచితమే. (కీర్త. 104:15) [w96 12/15 27వ పేజీ, 5వ పేరా]

క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:

11. పైవిచారణకర్త “కొట్టువాడు” అయ్యుండకూడదు అంటే భావం ఏమిటి? (తీతు 1:7) [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w91 5/1 19వ పేజీ, 21వ పేరా.]

12. యెహోవా, ఇవ్వడాన్ని సత్యారాధనలో ఒక భాగంగా చేయడానికి గల రెండు కారణాలను వ్రాయండి. [w96 11/1 29వ పేజీ, 3-6 పేరాలు; 30వ పేజీ, 3వ పేరా]

13. “బలియు అర్పణయు నీవు కోరలేదు” అని యేసు అనడంలో భావమేమిటి? (హెబ్రీయులు 10:5) [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w96 7/1 14వ పేజీ, 3వ పేరా.]

14. క్రైస్తవులు ఎలా “లోకమును జయంచ”గలరు? (1 యోహా. 5:3, 4) [si 258వ పేజీ, 12వ పేరా]

15. “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు” అన్న పేతురు వ్యక్తీకరణలో ఏమి ఇమిడి ఉంది? (2 పేతు. 3:11) [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w97 9/1 19వ పేజీ, 2వ పేరా.]

16. యేసు బలి మరణం వల్ల ప్రయోజనం పొందే రెండు గుంపులను గుర్తించేందుకు సహాయపడే ఏ ముఖ్య పదాలు 1 యోహాను 2:2లో ఉన్నాయి? [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w90 8/1 16వ పేజీ, 11వ పేరా.]

17. ప్రకటన 1:7కు అనుగుణ్యంగా, యేసును పొడిచినవారు ఆయన “మేఘారూఢుడై వచ్చు”టను ఎలా చూడగల్గుతారు? [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w93 5/1 22వ పేజీ, 7వ పేరా.]

18. యేసు మూడున్నర సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మధ్య గడిపినప్పటికీ, వారిలో అధిక సంఖ్యాకులు ఆయనను మెస్సీయగా ఎందుకు అంగీకరించలేదు? [w96 11/15 29వ పేజీ, 1, 6 పేరాలు; 30వ పేజీ, 3వ పేరా.]

19. ప్రకటన 13:1, 2లో లోక ప్రభుత్వాన్ని “క్రూరమృగము”గా వర్ణించడం ఎందుకు సముచితమై ఉన్నది? [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w89 4/1 19వ పేజీ, 17వ పేరా.]

20. ప్రకటన 4:4లో చెప్పబడిన “ఇరువదినలుగురు పెద్దలు” ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాళ్ళ “కిరీటములు,” ‘సింహాసనములు’ మనకు వేటిని జ్ఞాపకానికి తెస్తాయి? [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 7/1 13వ పేజీ, 17వ పేరా.]

క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:

21. తిమోతికి పౌలు వ్రాసిన రెండవ పత్రిక సా.శ. లో ఆయన _____________________ లో ఉన్నప్పుడు వ్రాశాడు. అప్పుడు తిమోతి బహుశా _____________________ లోనే ఉండి ఉండవచ్చు. [si 237వ పేజీ, 3వ పేరా]

22. మనముందు ఉంచబడిన పందెంలో పరుగెత్తేందుకు, మనం ప్రతి భారమును, మనలను సులభముగా చిక్కులబెట్టే _____________________ అయిన _____________________ ను విడిచిపెట్టడం అవసరం. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w98 1/1 10వ పేజీ, 15వ పేరా.]

23. అపొస్తలుడైన పేతురు 2 పేతురు 1:5-8లో, మనం _____________________ లేదా _____________________ గా ఉండకుండా సహాయపడే దైవిక లక్షణాలను అలవర్చుకునేందుకు _____________________ అని మనకు సలహా ఇస్తున్నాడు. [si 255వ పేజీ, 9వ పేరా]

24. ప్రకటన 6:1-8లో ఎఱ్ఱనిదైన గుఱ్ఱముపై స్వారీ చేసే వ్యక్తి _____________________ కి ప్రతీకగా ఉన్నాడు; నల్లని గుఱ్ఱముపై స్వారీ చేసే వ్యక్తి _____________________ కు, _____________________ కు ప్రతీకగా ఉన్నాడు; పాండుర వర్ణపు గుఱ్ఱంపై మృత్యువు స్వారీ చేయడం, మహామారి వల్ల, మరితర కారకాల వల్ల కలిగే _____________________ ను సూచిస్తుంది. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w86 1/15 3వ పేజీలో బాక్స్‌.]

25. క్రీస్తుకు పూర్వం _____________________ లో, _____________________ అనే బోధను యూదులు గ్రీకుల నుండి అరువు తెచ్చుకున్నారన్నది స్పష్టం. [w96 8/1 6వ పేజీ, 2-3 పేరాలు]

క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

26. పౌలు మొదటిసారి రోమ్‌లో ఖైదీగా ఉన్నప్పుడు, ఆయన బోధను విన్నవారిలో (ఫిలిప్పు, ఫేస్తు; ఫిలేమోను) ఇంటి నుండి పారిపోయిన దాసుడైన (ఓనేసిఫోరు; ఒనేసిము; ఓనాను) ఒకరు. [si 241వ పేజీ, 2వ పేరా]

27. పౌలు (స్పెయిన్‌లో; క్రేతులో; ఇటలీలో) ఉన్నాడు, (తిమోతి; తీతు; యాకోబు)తో సహవసించాడు వంటి (బాహ్య; అంతర; లౌకిక) రుజువులు హెబ్రీయులకు పత్రిక వ్రాసింది పౌలేనన్న విషయానికి మద్దతునిస్తున్నాయి. [si 243వ పేజీ, 3వ పేరా]

28. హెబ్రీయులు 11:10లో “పునాదులుగల ఆ పట్టణము” (పునర్నిర్మించిన యెరూషలేమును; యెహెజ్కేలు 48:35లో పేర్కొన్న నగరాన్ని; మెస్సీయా రాజ్యమును) సూచిస్తుంది. [si 247వ పేజీ, 26వ పేరా]

29. యూదా 8లో పేర్కొన్న “ప్రభుత్వము” (యేసుకున్న హోదాను; యెహోవా సర్వాధిపత్యాన్ని; క్రైస్తవ సంఘంలోని దైవదత్తమైన అధికారాన్ని) సూచిస్తుంది. [si 263వ పేజీ, 9వ పేరా]

30. ప్రకటన 11:11లో అభిషిక్తశేషము తమ శత్రువుల దృష్టిలో శవాలలా కనిపించినప్పటి “ఆ మూడుదినములన్నర” (మూడున్నర సంవత్సరాలను; స్వల్పకాలవ్యవధిని; మూడున్నర నెలలను) సూచిస్తుంది. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి re-E 167వ పేజీ, 21వ పేరా.]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:

1 కొరిం. 6:9-11; హెబ్రీ. 2:1; హెబ్రీ. 10:32; యాకో. 4:15; 1 పేతు. 3:4

31. లోకంలో ఎడతెగక ఉన్న ప్రచార ప్రభావాన్ని ఎదిరించడానికి, మంచి పఠన అలవాట్లను అలవర్చుకుంటూ, మంచి పట్టిక వేసుకుని బైబిలు చదువుతూ దేవుని వాక్యం విషయంలో “మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.” [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w98 1/1 7వ పేజీ, 9వ పేరా.]

32. మనం భవిష్యత్తు కోసం పథకాలు వేసుకున్నప్పుడెల్లా, అవి దేవుని సంకల్పంతో పొసుగుతున్నాయా అని ప్రార్థనాపూర్వకంగా పరిశీలించాలి. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w97 11/15 21వ పేజీ, 10-11 పేరాలు.]

33. క్రైస్తవ భార్యకు, తల్లికి ఉన్న ‘సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణము’ భర్తను ప్రీతిపరచడమే కాక, మరి ముఖ్యంగా దేవుడ్ని ప్రీతిపరుస్తుంది. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E89 5/15 19వ పేజీ, 12వ పేరా.]

34. ఆధ్యాత్మిక యుద్ధంలో నమ్మకంగా ప్రవర్తించిన గతకాలాన్ని జ్ఞాపకం చేసుకోవడం జీవిత పరుగును పూర్తి చేసేందుకు కావలసిన ధైర్యాన్ని మనకిస్తుంది. [w96 12/1 29వ పేజీ, 3వ పేరా]

35. పశ్చాత్తాపపడక త్రాగుబోతులైనవారినెవరినీ యెహోవాసాక్షులు క్రైస్తవ సంఘంలో ఉంచరు. [w96 12/15 25వ పేజీ, 3వ పేరా]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి