ప్రకటనలు
◼ డిసెంబరు నెల కొరకు సాహిత్య ప్రతిపాదనలు: నూతన లోక అనువాదముతో పాటు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జనవరి: సగం ధరకు, ప్రత్యేక ధరకు పేర్కొనబడిన 192-పేజీల ఏ పాత పుస్తకాన్నైనా ప్రతిపాదించండి. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యం. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహబైబిలు పఠనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి.
◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయనచే నిర్దేశించబడిన వ్యక్తి సంఘం యొక్క అకౌంట్లను డిసెంబరు 1 లేదా తర్వాత, వీలైనంత త్వరగా తనిఖీ చేయాలి. ఇది జరిగిన తర్వాత, అకౌంట్ల రిపోర్టును సంఘంలో చదవాలి.
◼ జనవరి 1999 ప్రారంభంలో, “మీరు దేవునితో నడుస్తున్నారా?” అనే బహిరంగ ప్రసంగాన్ని ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇస్తారు. “యెహోవా బల్ల యొద్ద ఆహారాన్ని క్రమంగా తీసుకోండి” అనే సేవాప్రసంగాన్ని మంగళవారం ఇస్తారు, “దేవుని రాజ్యము—మీకు దాని భావాన్ని గ్రహిస్తున్నారా?” అనే అంశాన్ని గూర్చి ప్రాంతీయ పైవిచారణకర్త గురువారం (లేదా శుక్రవారం) మాట్లాడతారు.
◼ 1999 కొరకు వార్షిక వచనం: “ఇదిగో! ఇదే రక్షణదినము”—2 కొరింథీయులు 6:2. జనవరి 1, 1999 లేదా దాని తర్వాత వీలైనంత త్వరగా సంఘాలు క్రొత్త వార్షికవచనం బోర్డును సిద్ధం చేసి ప్రదర్శించడం మంచిది.
◼ లభ్యమయ్యే క్రొత్త సాహిత్యాలు:
ఫిర్దౌసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా (ముస్లిమ్‌ల కొరకు)—అస్సామీ, ఆంగ్లము, ఒరియా, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ.
◼ క్రొత్త కాంపాక్ట్ డిస్క్ లభ్యం:
సిడి-రామ్ వాచ్‌టవర్ లైబ్రరీ—1997
పయినీర్లు మరియు ప్రచారకులకు సిడిరామ్ వెల రూ. 400.00. ఈ సిడిరామ్ కేవలం సంఘసభ్యులకు మాత్రమే పరిమితం.
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 1997—ఇంగ్లీషు (వెల పయినీర్లకు రూ. 8.00, సంఘానికీ పబ్లిక్‌కీ రూ. 12.00)