దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
1998 మే 4 నుండి ఆగస్టు 24 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలను మూసి చేసే పునఃసమీక్ష. కేటాయంచబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. బైబిలు నివేదిక ప్రకారంగా, పౌలు కొరింథును మూడుసార్లు సందర్శించాడు. [si పేజీ 214 పేరా 3]
2. శవదహనపు చితాభస్మాన్ని వెదజల్లడం లేఖనవిరుద్ధమైన విషయం. [w96 9/15 పేజీ 30 పేరా 6-పేజీ 31 పేరా 1]
3. రాజ్యాసక్తులను పెంపొందింపజేయడానికి చూపించే అత్యధికమైన ఆసక్తి, ఇతరులతో వ్యవహరించేటప్పుడు చూపించాల్సిన యుక్తి, సానుభూతి, కనికరం వంటివి లేకపోవడాన్ని సమర్థించదు. (1 కొరిం. 13:2, 3) [వారపు బైబిలు పఠనం; w95 10/15 పేజీ 31 పేరా 5 చూడండి.]
4. పరలోకజీవితానికి పునరుత్థానం చేయబడడమనేది కాలంలోనూ శ్రేణిలోనూ మొదటిది గనుక అది “మొదటి పునరుత్థానము” అని పిలువబడింది. (ప్రక. 20:6) [w96 10/15 పేజీ 6 పేరా 5]
5. గలతీయులు 5:26, NWవ వచనం నిజ క్రైస్తవులు పోటీ స్వభావంగల క్రీడల్లో, ఆటల్లో పాల్గొనడాన్ని నిషేధిస్తుంది. [9, వారపు బైబిలు పఠనం; g96 1/8 పేజీ 27 పేరా 9 చూడండి.]
6. రెండవ కొరింథీయులు 10:4లో “మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావు” అని పౌలు చెప్పినప్పుడు, ఆయన సంఘాన్ని అబద్ధబోధల నుండి కాపాడేందుకు కుయుక్తులు, ప్రగల్భాలు, లేక పశుప్రాయమైన కుతంత్రాలు వంటి శరీరసంబంధమైన ఆయుధాల్ని క్రైస్తవులు ఆశ్రయించకూడదని నొక్కి చెప్పాడు. [వారపు బైబిలు పఠనం; rs పేజీ 271 పేరా 3]
7. ఫిలిప్పీలో పౌలు సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నెలలకే ఆయన ఫిలిప్పీయులకు పత్రికను రాశాడు, మరి ఆ పత్రిక రాయడానికి కారణం వారిమధ్య తలెత్తిన గంభీరమైన సమస్యలే. [si పేజీ 224 పేరా 3]
8. యేసు తాను పునరుత్థానుడైనప్పుడు ఆత్మ జీవితాన్ని బహుమానంగా పొందడం ద్వారా మొదటి తిమోతి 3:16లో ప్రస్తావించినట్టు, “ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను”; మొత్తంమీద యేసు పూర్తిగా నీతిమంతుడనీ, ఉన్నతపర్చబడిన మరిన్ని నియామకాలకు యోగ్యుడనీ దేవుడు ప్రకటించడంతో సమానం. [వారపు బైబిలు పఠనం; w90 1/15 పేజీ 13 పేరా 12 చూడండి.]
9. ఫిలిప్పీయులు 1:23లో సూచించబడిన ‘వెడలిపోవడం’ అనేది మరణించిన తర్వాత వెనువెంటనే క్రీస్తుతోపాటు ఉండాలనే పౌలు ఉత్తరాపేక్షను స్పష్టంగా సూచిస్తోంది. [వారపు బైబిలు పఠనం; w95 3/1 పేజీ 30 పేరా 4 చూడండి.]
10. పౌలు తాను రోములో మొదటిసారి చేయబడిన ఖైదునుండి విడుదల పొందిన సమయానికీ, చివరిసారి ఖైదు చేయబడిన సమయానికీ మధ్యనున్న కాలంలో 1 తిమోతి పత్రికను రాశాడు. [si పేజీ 234 పేరా 2]
ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి:
11. క్రీస్తు మరణ జ్ఞాపకార్థదిన ఆచరణను ఆచరించేందుకు కొరింథులోని క్రైస్తవులు సమకూడినప్పుడు వారిలో కొందరు చిహ్నాల్లో ఏ విధంగా “అయోగ్యముగా” పాలుపుచ్చుకొన్నారు? (1 కొరిం. 11:27) [వారపు బైబిలు పఠనం; w91 2/1 పేజీ 29 పేరా 17 చూడండి.]
12. కొరింథు సంఘ సంక్షేమానికి ముప్పును తెచ్చిన ఎవరి ఉనికి, కొరింథీయులకు తన రెండవ లేఖను రాయడానికి పౌలును కదిలించింది? [si పేజీ 214 పేరా 2]
13. తాను తప్పేమీ చేయలేదని ఒక క్రైస్తవుడు భావించినప్పటికీ, ఆయన క్షమాపణ చెప్పడానికి ఎందుకు సుముఖుడై ఉండాలి? [w96 9/15 పేజీ 22 పేరాలు 4, 7]
14. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక, “[పవిత్ర] మర్మమునుగూర్చి”న ఏ ప్రాముఖ్యమైన అంశాన్ని స్పష్టపర్చింది? (ఎఫె. 3:4-6) [si పేజీ 223 పేరా 18]
15. దేవుని వాక్యాన్ని తాను ఉపయోగించడంలో, నేటి క్రైస్తవ పరిచారకులకు పౌలు ఒక శ్రేష్ఠమైన మాదిరిని ఎలా ఉంచాడు?
[si పేజీ 217 పేరా 19]
16. ధర్మశాస్త్రం “అతిక్రమములనుబట్టి . . . తరువాత ఇయ్యబడెను” అని అపొస్తలుడైన పౌలు చెప్పినప్పుడు ఆయన భావమేమిటి? (గల. 3:19) [వారపు బైబిలు పఠనం; uw పేజీ 147 పేరాలు 3-4 చూడండి.]
17. ఫిలిప్పీయులు 1:3-7లలో, పౌలు ఏ కారణాల్నిబట్టి ఆ సహోదరుల్ని మెచ్చుకున్నాడు, మరి వారి మాదిరినుండి మనమెలా ప్రయోజనం పొందగలం? [si పేజీ 225 పేరా 12]
18. కొలొస్సయులు 4:6లో ఉన్న సలహాను క్రైస్తవ పరిచారకులందరూ ఎందుకు అనుసరించాలి? [si పేజీ 228 పేరా 13]
19. స్త్రీలు ‘తగుమాత్రంగా . . . అలంకరించుకొనవలెనని’ తాను కోరుకుంటున్నానని అపొస్తలుడైన పౌలు అన్నప్పుడు ఆయన భావమేమైవుంది? (1 తిమో. 2:9) [వారపు బైబిలు పఠనం; g90 6/22 పేజీ 19 పేరా 2 చూడండి.]
20. మొదటి తిమోతి 6:4లోని “వాగ్వాదముల”కు సంబంధించిన పౌలు హెచ్చరికను క్రైస్తవులు ఎందుకు లక్ష్యపెట్టాలి? [si పేజీ 236 పేరా 15]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని(పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. రెండవ కొరింథీయుల పత్రిక _____________________ లో నుండి రాయబడింది, _____________________ దాన్ని అందించినట్టుగా స్పష్టమౌతోంది. [si పేజీ 214 పేరా 2]
22. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక _____________________ గూర్చిన మన అవగాహనను విస్తృతపర్చుకోవడంలో ఎంతో ప్రయోజనకరమైంది, ఆ పత్రిక వాటిలో నుండి అనేక లేఖనాల్ని ఉల్లేఖించింది. [si పేజీ 213 పేరా 23]
23. గలతీయులకు రాసిన తన పత్రికలో, _____________________ క్రియలమూలమున గాక క్రీస్తుయేసునందలి _____________________వలననే నీతిమంతులని తీర్చబడడం సాధ్యమౌతుందనీ, మరి అందుచేత క్రైస్తవులు _____________________ చేయించుకోనవసరం లేదనీ పౌలు రుజువుచేశాడు. [si పేజీ 218 పేరా 6]
24. పౌలు థెస్సలొనీకయులకు తాను రాసిన మొదటి పత్రికలో, యేసుక్రీస్తు _____________________ గురించి నాలుగుసార్లు ప్రస్తావించాడు, ఆ బోధలో సంఘానికున్న ఆసక్తినిబట్టే అలా ప్రస్తావించడం జరిగిందని స్పష్టమౌతోంది. [si పేజీ 231 పేరా 15]
25. _____________________ తాను _____________________లో ఉండగా _____________________వ సంవత్సరంలో థెస్సలొనీకయులకు రెండవ పత్రికను రాశాడు. [si పేజీ 232 పేరా 4]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. పౌలు పరిచర్య ద్వారా జీవనం సాగించే తన హక్కును గురించి చర్చిస్తూ, పనిచేస్తున్న జంతువుల మూతికి చిక్కం పెట్టకూడదనీ, ఆలయసేవలో ఉండే (లేవీయులు; నెతీనియులు, అహరోను యాజక కుటుంబం) బలిపీఠం మీద అర్పించబడిన దానిలో పాలివారనీ చెబుతున్న (టాల్ముడ్; మిష్నా; మోషే ధర్మశాస్త్రాన్ని) సూచించాడు. [si పేజీ 213 పేరా 24]
27. పౌలు గలతీయులకు రాసిన పత్రిక యెహోవా యొక్క స్త్రీని (భూసంబంధమైన యెరూషలేముగా; పైనున్న యెరూషలేముగా; నూతన యెరూషలేముగా) సూచిస్తూ, యెషయా 54:1-6 వచనాల భావాన్ని తెలియజేస్తోంది. (గల. 4:21-26) [si పేజీ 219 పేరా 16]
28. ఎఫెసీయులు 1:10, NWలో “నిర్వహణ” అనే పదం (మెస్సీయా రాజ్యాన్ని; పరిపాలక సభను; దేవుడు తన గృహ వ్యవహారాల్ని అజమాయిషీ చేసే విధానాన్ని) సూచిస్తోంది. [si పేజీ 221 పేరా 8]
29. (యూదా మతనాయకులు; క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువుల తరగతి; మహా బబులోను) 2 థెస్సలొనీకయులు 2:3లో ప్రస్తావించబడిన ‘పాపపురుషుని’తోపాటూ గుర్తించబడింది. [వారపు బైబిలు పఠనం; w90 8/1 పేజీ 23 పేరా 11]
30. మొదటి కొరింథీయులు 12:31 లోని “సర్వోత్తమమైన మార్గము” (సత్య; ప్రేమ; ఆధ్యాత్మిక కృపావరాలతో నిండిన జీవిత) మార్గాన్ని సూచిస్తోంది. [వారపు బైబిలు పఠనం; w92 7/15 పేజీ 27 పేరా 3 చూడండి.]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:
1 కొరిం. 10:11, 12; 2 కొరిం. 4:7; 2 కొరిం. 8:14; ఫిలి. 4:6, 7; 2 థెస్స. 1:8, 9, 12
31. ఒకరు తన జీవితంలో క్రైస్తవ పరిచర్యను మొదట ఉంచినప్పుడు, ఆ వ్యక్తి దేవుడు అనుగ్రహించే శక్తిని చవిచూస్తాడు. [వారపు బైబిలు పఠనం; w90 3/1 పేజీ 29 పేరా 5 చూడండి.]
32. మోషే నడిపింపు క్రిందవున్న ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన హెచ్చరికా మాదిరిని మనం లక్ష్యపెట్టి, మనపై మనం ఆధారపడడాన్ని విడనాడాలి. [si పేజీ 213 పేరాలు 24]
33. బాధితుల ఆసక్తీ, సహనమూ దాతల ఆనంద, ప్రోత్సాహాలకొక మూలంగా ఉన్నప్పటికీ, వస్తుదాయకంగా కొదువవున్న ప్రాంతాల్లో జీవించే ప్రజల అవసరాల్ని తీర్చడానికి ధనవంతులైన క్రైస్తవుల నుండి వచ్చే ఉదారమైన బహుమతులు సహాయపడగలవు. [వారపు బైబిలు పఠనం; w93 12/15 పేజీ 21 పేరా 20 చూడండి.]
34. సువార్తను ప్రకటించడంలో మనం వెనుక తీయకూడదు. ఎందుకంటే బైబిలు ప్రకారంగా, ఈ దుష్ట విధానాంతం వరకూ జీవించివుండి, సత్యారాధన విరోధులని తీర్పుతీర్చబడే, నేడు జీవించివున్న ప్రజలంతా నిత్యనాశనానికి గురౌతారు. [వారపు బైబిలు పఠనం; w89 5/1 పేజీ 19 పేరా 4 చూడండి.]
35. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోవా నెమ్మదినీ, ప్రశాంతతనూ ఇస్తాడు. [వారపు బైబిలు పఠనం; w88 11/1 పేజీ 30 పేరాలు 19-20 చూడండి.]