ప్రకటనలు
◼ ఆగస్టు నెల కొరకు సాహిత్య ప్రతిపాదనలు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైనచోట ఈ బ్రోషూర్లను అంటే దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, సర్వమానవాళి కొరకైన గ్రంథము, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్లను అందించవచ్చు. సెప్టెంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ప్రత్యామ్నాయంగా, సృష్టి పుస్తకాన్నిగానీ లేదా నిరంతర జీవితము పుస్తకాన్నిగానీ ప్రతిపాదించవచ్చు. అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! కొరకు చందాలు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, కావలికోట, తేజరిల్లు! విడిప్రతుల్ని ప్రతిపాదించవచ్చు. నవంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము.
◼ ప్రచారకులందరు ఆగస్టు నెల ప్రాంతీయ సేవా రిపోర్టులను ఆగస్టు 30 ఆదివారంకల్లా లేదా కనీసం ఆగస్టు 31 సోమవారంనాడైనా ఇవ్వమని ప్రోత్సహిస్తున్నాము. సకాలంలో మేము సేవా సంవత్సర రిపోర్టును సంకలనం చేసుకొనేందుకు వీలుగా కనీసం సెప్టెంబరు 3 బుధవారం నాటికి సంఘ రిపోర్టును (S-1) సిద్ధం చేసి, పోస్టు చెయ్యాలని సంఘ సెక్రెటరీలు కోరబడుతున్నారు.
◼ ప్రతి సంఘానికి మూడు లిటరేచర్ ఇన్వెంటరీ ఫారంలు (S-AB-18) అందుతాయి. ఆగస్టు నెలారంభంలో సంఘ సెక్రెటరి లిటరేచర్ సర్వెంట్ను కలిసి, నెలాఖరులో సంఘంలో స్టాకు ఉన్న సాహిత్య ఇన్వెంటరీని తీసుకోవడానికిగాను ఒక తేదీని నిర్ణయించుకోవాలి. స్టాకులో ఉన్న సాహిత్యాన్నంతటినీ తప్పక లెక్కించి, వాటి మొత్తాల్ని లిటరేచర్ ఇన్వెంటరీ ఫారంలో ఎక్కించాలి. ప్రస్తుతమున్న పత్రికల మొత్తాన్ని మ్యాగజైన్ సర్వెంట్నుండి పొందవచ్చు. దయచేసి ఒరిజినల్ను సొసైటీకి సెప్టెంబరు 6కు లోపలే పోస్టు చేయండి. మీ ఫైళ్ళ నిమిత్తం ఒక కార్బన్ కాపీని ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్ షీటుగా ఉపయోగించవచ్చు. ఇన్వెంటరీని సెక్రెటరీ పర్యవేక్షణలో తీసుకోవాలి, పూర్తి చేయబడిన ఫారాన్ని సంఘ పైవిచారణకర్త చెక్ చేయాలి. సెక్రెటరీ, సంఘ పైవిచారణకర్తా ఇద్దరూ ఫారంపై సంతకాలు చేస్తారు.
◼ సంఘ సెక్రెటరీ కాంగ్రిగేషన్ అనాలసిస్ రిపోర్ట్ ఫారం (S-10)ని కూడా నింపుతాడు. పబ్లిషర్ రికార్డ్ కార్డులనుండి (S-21) అవసరమయ్యే సమాచారాన్ని జాగ్రత్తగా పట్టికవేసేలా రూఢిపర్చుకోవడానికి ఆ రిపోర్టును నింపడంలో బహుశ ఆయనకు సహాయం చేస్తున్న ఎవరైనా పెద్దకైనా గానీ లేక పరిచర్య సేవకునికైనా గానీ ఆయన జాగ్రత్తగా నిర్దేశనాలనిస్తాడు. ఫారాన్ని నింపడానికి ముందు దానిపైనున్న సూచనలన్నింటినీ దయచేసి జాగ్రత్తగా చదవండి. కాంగ్రిగేషన్ అనాలసిస్ రిపోర్ట్ ఫారాన్ని కచ్చితంగానూ శుభ్రంగానూ నింపి, సంతకం చేసేముందు సేవా కమిటీ జాగ్రత్తగా చెక్ చేయాలి. దయచేసి ఒరిజినల్ S-10 ఫారాన్ని సొసైటీకి సెప్టెంబరు 10కి లోపలే పోస్టు చేయండి; ఒక కార్బన్ కాపీని మీ ఫైలులో ఉంచండి.
సంఘ సేవా కమిటీ క్రమ పయనీరు సేవకోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటికీ సరియైన అవధానాన్ని ఇవ్వాలి. దరఖాస్తు చేసిన వ్యక్తి కావాల్సిన గంటల్ని చేరుకుంటున్నాడా లేదా అని చూసేందుకు సేవా కమిటీ ఆ వ్యక్తి దరఖాస్తును నొక్కి పెట్టకూడదు. ఎప్పటినుండి పయినీరు సేవ ప్రారంభించాలని దరఖాస్తుపై రాశారో ఆ తారీఖు దాటిపోయిన తర్వాత వచ్చిన ఫారమ్ల దరఖాస్తుదారుల నియామక తారీఖు బహుశా మారవచ్చు. పరిస్థితులు చెప్పుకోదగినంత తీవ్రంగా ఉంటే తప్ప, దరఖాస్తు వచ్చిన తేదీకన్నా ముందున్న తేదీలలో నియామకాలను చేయడం జరగదు. అలాంటి పరిస్థితులు గనుక ఎదురైతే, దరఖాస్తుతోపాటూ ఒక ఉత్తారాన్ని రాయాలి—మన రాజ్య పరిచర్య (ఆంగ్లం) అక్టోబరు 1986 ఇన్సర్ట్లో 24-6 పేరాలను చూడండి.
◼ సెప్టెంబరు 21తో ప్రారంభమయ్యే వారంనుండి దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు సంఘ పుస్తక పఠనంలో పఠించబడుతుందని మన రాజ్య పరిచర్య జూలై 1998 సంచికలోని ఒక ప్రకటన తెలియజేసింది. దీని తర్వాత జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? బ్రోషూర్లు పరిశీలించబడతాయి.
◼ మరలా లభ్యమౌతున్న ప్రచురణలు:
మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము (రివైజ్డ్)—ఆంగ్లం
ఎంఫటిక్ డయగ్లట్—ఆంగ్లం
కింగ్డమ్ ఇంటర్లీనియర్—ఆంగ్లం
పరిశుద్ధలేఖనాల నూతనలోక అనువాదము, (పెద్ద అచ్చులో) [నాలుగు వాల్యూమ్లలో] ఆంగ్లం
ది బైబిల్ ఇన్ లివింగ్ ఇంగ్లీష్