ఆగస్టులోని సేవా కూటాలు
ఆగస్టు 3తో ప్రారంభమయ్యే వారం
పాట 216 (9)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. మన దేశం యొక్క, స్థానిక సంఘం యొక్క ఏప్రిల్ క్షేత్ర సేవా రిపోర్టుపై వ్యాఖ్యానించండి.
15 నిమి: “ఆగస్ట్ పతాక నెల అవుతుందా?” ప్రశ్నాజవాబులు. ఆగస్టులోనూ, క్రొత్త సేవా సంవత్సరంలోని ప్రతీ నెలలోనూ పరిచర్యలో భాగంవహించమని ప్రతిఒక్కరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “మనస్సునూ, హృదయాన్నీ ఆకట్టుకునేందుకు బ్రోషూర్‌లను ఉపయోగించండి.” ప్రేక్షకులతో చర్చ. ప్రాముఖ్యమైన లేఖనాధార విషయాల్ని గురించి ప్రజలకు తెలియజేయడానికి సంవత్సరాలుగా ప్రచురించబడిన బ్రోషూర్లను క్లుప్తంగా పునఃసమీక్షించండి. (వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 1986-1995, 652-3 పేజీలను చూడండి.) ఇటీవలి బ్రోషూర్లను ఉన్నతపర్చి, వాటిలో ఒక్కొక్కటీ ఎవరికి ఆసక్తికరమైనదిగా ఉంటుందో చర్చించండి. ఒకటి రెండు అందింపుల్ని ప్రదర్శించండి.
పాట 191 (21), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 10తో ప్రారంభమయ్యే వారం
పాట 127 (15)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. ఆగస్టులో క్షేత్రసేవయందు ప్రచారకులందరూ భాగంవహించాలనే లక్ష్యాన్ని గురించి ప్రస్తావించండి.
15 నిమి: స్థానిక అవసరతలు.
20 నిమి: “యౌవనస్థులారా—మీ పాఠశాల విద్యాభ్యాస కాలాన్ని సద్వినియోగపరచుకోండి.” ప్రశ్నాజవాబులు. తేజరిల్లు! (ఆంగ్లం) 8, 1992, 17-19 పేజీల్లో నుండీ, కావలికోట (ఆంగ్లం) జూలై 15, 1991 23-6 పేజీల్లో నుండీ సముచితమైన వ్యాఖ్యానాల్ని చేర్చండి.
పాట 37 (9), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 17తో ప్రారంభమయ్యే వారం
పాట 163 (23)
10 నిమి: స్థానిక ప్రకటనలు. వీధిలోగానీ, పార్కులోగానీ లేదా మరెక్కడైనాగానీ తారసపడ్డ వ్యక్తికి సాక్ష్యమిచ్చినప్పుడు అతణ్ణి తిరిగి కలిసేందుకు ఆ వ్యక్తి పేరునీ, చిరునామానూ ఎలా రాబట్టవచ్చో అనేదానిపై క్లుప్తమైన వ్యాఖ్యానాల్ని ఆహ్వానించండి.
35 నిమి: “శిష్యుల్నిచేసే ఆవశ్యకమైన పనిని గూర్చిన పురోభివృద్ధికరమైన పరిశీలన.” ప్రశ్నాజవాబులు. 5, 10, 11 పేరాలను చదవండి. స్థానికంగా బైబిలు పఠనాల పని ఎలా పురోభివృద్ధిచెందుతుందో పునఃసమీక్షించండి. బైబిలు పఠనాల్ని నిర్వహిస్తున్న వారందర్నీ తమ బోధనా నైపుణ్యాల్ని మెరుగుపర్చుకునేందుకు మన రాజ్య పరిచర్య జూన్ 1996లోని ఇన్‌సెర్ట్‌ని మరోసారి చదవమని ప్రోత్సహించండి. ఆ ఇన్‌సెర్ట్‌లోని 5, 25 పేరాలను పరిశీలించండి.
పాట 108 (5), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 24తో ప్రారంభమయ్యే వారం
పాట 213 (23)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య జూలై 1998లో ఉన్న “ఇరవై వేలు!” అనే పేరుగల బాక్సును పరిశీలించండి. ఆగస్టునెల పూర్తవ్వడానికి ఇక ఒక్క వారమే మిగిలివుంది గనుక ఈ నెల గడిచిపోకముందే పరిచర్యలో భాగంవహించమని ప్రతిఒక్కరినీ ప్రోత్సహించండి. ఆగస్టు కొరకైన క్షేత్రసేవా రిపోర్టును ఆగస్టు 30నాటికి లేదా కనీసం ఆగస్టు 31నాటికి ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. సెప్టెంబరు 3నాటికి రిపోర్టులన్నింటినీ లెక్కించేలా సెక్రెటరీకి సహాయపడేందుకు తమ పుస్తక పఠన గుంపుల్లోని వారంతా తమ తమ రిపోర్టులను ఇచ్చారా అని పుస్తక పఠన నిర్వాహకులు చెక్ చేయాలి. “క్రొత్త ప్రత్యేక సమావేశదిన కార్యక్రమము”ను పునఃసమీక్షించండి.
18 నిమి: పయినీరు సేవలో పట్టుదలతో ఎలా కొనసాగగలం. కావలికోట సెప్టెంబరు 15, 1993, 28-31 పేజీల ఆధారంగా ఇచ్చే ప్రసంగం. గంభీరమైన సమస్యల్ని తాళుకోవడం నేర్చుకున్న, పయినీరు సేవలో కొనసాగుతున్న ఒక పయినీరుని ఇంటర్వ్యూ చేయండి.
15 నిమి: మన రాజ్య పరిచర్యను బాగా ఉపయోగించండి. ప్రేక్షకులతో చర్చ. ఇటీవల ఉదాహరణలను ఉపయోగిస్తూ, మన రాజ్య పరిచర్య పుటల్లో ఉన్న సమయానుకూలమైన సమాచారాన్నీ, దాన్నుండి మనం పొందే లాభాల్నీ ఉదహరించండి: (1) పరిచర్యలో క్రమంగా భాగం వహించేందుకు మనల్ని ప్రేరేపించే శీర్షికలు; (2) మన పవిత్ర సేవలో మనల్ని ప్రోత్సహించే అనుభవాలు; (3) సువార్తను ప్రభావవంతంగా అందించేందుకు మనకు సహాయపడే సూచనలు; (4) స్థానిక ప్రాంతంలో ప్రయోజనకరంగా ఉండే క్రొత్త ప్రచురణలు లభ్యమౌతున్నాయనే ప్రకటనలు; (5) రాజ్య కార్యకలాపం యొక్క వేగాన్ని చూపించే సేవా నివేదికలు; (6) ప్రపంచవ్యాప్తంగా జరిగే పనిని గూర్చిన పురోభివృద్ధిని నివేదించే దైవపరిపాలనా వార్తలు; (7) జరగనైవున్న సంఘటనల్ని గురించి మనకు తెలియజేసే ప్రకటనలూ, షెడ్యూళ్లూ; (8) గంభీరమైన అవధానాన్ని నిలపాల్సిన విషయాలకు సంబంధించి జవాబుల్నిచ్చే ప్రశ్నా భాగాలు; (9) సమావేశాల్ని గురించీ, ప్రత్యేక అందింపుల్ని గురించీ, మన ఆధ్యాత్మిక అవసరాల ఎడల మనల్ని శ్రద్ధనిలిపేలా చేసే మరితర విషయాల్ని గురించీ మనకు తెలియజేసే ఇన్‌సెర్ట్‌లు. ప్రతీ సంచికనూ చదవమనీ, దానిలో ఉన్న సలహాల్ని అన్వయించుకోమనీ, దాన్ని సేవా కూటాలకూ, క్షేత్రసేవ కొరకైన కూటాలకూ తీసుకు రమ్మనమనీ, భవిష్యత్తు రిఫెరెన్సు కోసం దాన్ని వ్యక్తిగత ఫైలులో భద్రపర్చుకోమనీ అందర్నీ ప్రోత్సహించండి.
పాట 210 (15), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 31తో ప్రారంభమయ్యే వారం
పాట 65 (28)
12 నిమి: స్థానిక ప్రకటనలు. సెప్టెంబరులో ప్రతిపాదించే సాహిత్యాల్ని పరిశీలించండి. “దేవుని నామాన్ని ఎందుకు ఉపయోగించాలి?” అనే ప్రశ్నను రేకెత్తించే అందింపును క్లుప్తంగా ప్రదర్శించండి. జ్ఞానము పుస్తకము, 3వ అధ్యాయంలో, 6వ పేరాను ఉపయోగిస్తూ, దానికి జవాబివ్వండి.
15 నిమి: “పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—సంఘ పైవిచారణకర్త.” సంఘ పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. తన కర్తవ్యాల్ని పునఃసమీక్షించిన తర్వాత, పెద్దలు మందను కాస్తుండగా వారితో సహకరిస్తున్నందుకు ఆయన సంఘాన్ని మెచ్చుకుంటాడు.
18 నిమి: పాఠశాలలో మీ పిల్లలకున్న సమస్యలను ఎదుర్కోడానికి సహాయపడండి. పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలున్న ఇద్దరు, ముగ్గురు తల్లిదండ్రులతో ఒక పెద్దచేసే చర్చ. తేజరిల్లు! ఆగస్టు 8, 1994, 5-7 పేజీల్లో ఉన్నట్టుగా, పిల్లలు ఎదుర్కొనే అతి సామాన్యమైన కొన్ని సమస్యలపై క్లుప్తంగా వ్యాఖ్యానించండి. ఆపై, 8-10 పేజీలవైపు త్రిప్పి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడవచ్చో, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాల్ని ఎలా కాపాడుకోవచ్చో చర్చించండి.
పాట 24 (13), ముగింపు ప్రార్థన.