క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమము
“దేవుని ఆజ్ఞలను గైకొని, జీవించండి” అనేది 1999 జనవరిలో ఆరంభమయ్యే రెండురోజుల ప్రాంతీయ సమావేశ కార్యక్రమ ముఖ్యాంశం. (సామె. 4:4) దేవుని ఆజ్ఞలకు లోబడడం ఎందుకు భారమైన విషయంకాదో అది నొక్కి చెబుతుంది. అంతేగాక, దేవుని చిత్తాన్ని చేయడం ఉత్తేజాన్నీ, నిజమైన సంతోషాన్నీ, అలాగే భవిష్యత్తు కొరకైన నిరీక్షణనూ ఎలా తెస్తుందో అది చూపిస్తుంది.—మత్త. 11:28-30; యోహా. 13:17.
క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపించి సమావేశంలో బాప్తిస్మం తీసుకోవాలనుకొనే వాళ్లు సంఘ పైవిచారణకర్తతో మాట్లాడాలి, ఆయన అవసరమైన ఏర్పాట్లను చేస్తాడు.—మత్త. 28:19, 20.
మనం దేవుని ఎడలా, మన సహోదరుల ఎడలా ప్రేమను చూపించగల్గే ఆచరణీయమైన మార్గాల్ని ఒక గోష్ఠి వివరిస్తుంది. (యోహా. 13:34, 35; 1 యోహా. 5:3) కీర్తన 19, 119 అధ్యాయాలలో నుండి హృదయాల్ని ఉత్తేజపర్చే సలహా ఆ కార్యక్రమంలో చేర్చబడుతుంది. ఈ కీర్తనల్లో ఉన్న ప్రేరేపిత ఉద్బోధ వేలాది సంవత్సరాల క్రిందట రాయబడినప్పటికీ, అది నేడు మనకు వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనాన్ని చేకూరుస్తుందో చూస్తాం.
జిల్లా పైవిచారణకర్త ఇచ్చే బహిరంగ ప్రసంగం పేరు: “దేవునియందు భయభక్తులు కలిగి, ఆయన ఆజ్ఞలను అనుసరించండి.” (ప్రస. 12:13) యౌవనులు ఇప్పుడు శ్రేష్ఠమైన జీవితాన్ని ఎలా గడపవచ్చు, నిత్య భవిష్యత్తునందు వాళ్లెందుకు నమ్మకాన్ని కల్గివుండవచ్చు అనే విషయాల్ని ప్రాంతీయ పైవిచారణకర్త ఇచ్చే చివరి ప్రసంగం తెలియజేస్తుంది. ప్రేమించమనే ‘ప్రాముఖ్యమైన ఆజ్ఞ’కు అనుగుణంగా జీవించడం మూలంగా వచ్చే అనేక ప్రయోజనాల్ని జిల్లా పైవిచారణకర్త పేర్కొంటూ సమావేశ కార్యక్రమాన్ని ముగిస్తాడు. (యాకో. 2:8) నిజం చెప్పాలంటే, ఇది ప్రతి ఒక్కరూ తప్పిపోకుండా హాజరవ్వాలని కోరుకునే ప్రాంతీయ సమావేశ కార్యక్రమం!