“దైవిక జీవిత మార్గము” 1998 యెహోవాసాక్షుల జిల్లాసమావేశాలు
1 ప్రతీ సంవత్సరమూ ఆధునికదిన యెహోవా ఆరాధకులు అత్యంతాసక్తితో భూవ్యాప్తంగా విస్తృతసంఖ్యలో జిల్లాసమావేశాల వద్ద సమకూడుతున్నారు. ఆ విధమైన ఆసక్తిలో, ప్రాచీన ఇశ్రాయేలులో యెహోవా దేవుని నమ్మకమైన సేవకులు యెహోవాను ఆరాధించేందుకు యెరూషలేముకు వెళుతుండగా మార్గమందంతటా 122వ కీర్తనను ఆనందంగా పాడుకుంటూ వారు చూపించిన స్ఫూర్తినే వీళ్లూ ప్రతిబింబిస్తున్నారు. ఆ కీర్తన మొదటి వచనం ఇలా చదువబడుతోంది: “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.” అలాంటి సందర్భాలలో యెషయా 2:2, 3లోని ప్రేరేపిత మాటల నెరవేర్పుకు విస్తృత రుజువును కూడా మనం చూస్తాం.
2 సామెతలు 10:29లో “యెహోవా యేర్పాటు ఆశ్రయ దుర్గము” అని మనకు గుర్తుచేయబడింది. ఈ సంవత్సరం జరుగబోయే జిల్లా సమావేశానికి “దైవిక జీవిత మార్గము” అన్న అంశం ఎంత సముచితమైనదై ఉన్నదో కదా! ఆ కార్యక్రమం జరిగే మూడు రోజుల్లోనూ ఆ సమావేశ అంశం ఎలా వివరించబడుతుంది? మనకోసం సిద్ధపర్చబడిన ఆ సమావేశ కార్యక్రమం కోసం మనమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూద్దాం. ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నతపర్చబడతాయి.
3 హాజరయ్యేందుకు చేసే కృషికి తగ్గఫలితం లభిస్తుంది: ఆఫ్రికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల మూలంగా, సంభవిస్తున్న అల్లకల్లోలాల మూలంగా ఆ ఖండంలో ఉన్న మన సహోదరుల్లో అనేకులు కష్టాల్ని అనుభవించారు. యెహోవా ప్రజల సమావేశాల్ని వాళ్లు తమ జీవమార్గంగా దృష్టిస్తారు. ఒక సమావేశానికి హాజరయ్యేందుకు కొందరు ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది, అయినా పోనీలే ఈసారికి మానేద్దాం అన్న ఆలోచనే వాళ్లకు రాదు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (మునపటి జైరో)లో ఉంటున్న 73 ఏళ్ల సహోదరుడు, ఒక సమావేశానికి హాజరయ్యేందుకు 450 కిలోమీటర్లు నడిచాడు. ఆయన 16 రోజులపాటు నడిచి సమావేశానికి చేరుకున్నాడు, కాళ్లు వాచిపోయినా ఆ సమావేశానికి హాజరైనందుకు సంతోషించాడు. సమావేశం అయిపోయిన తర్వాత, ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయి, ఆధ్యాత్మికంగా బలపర్చబడినవాడై, తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు. సంవత్సరాల తరబడి ఆయనకిదే వాడుక.
4 మొజాంబిక్‌లో ప్రాంతీయ సమావేశానికి హాజరయ్యేందుకు ఒక జిల్లా కాపరీ, ఆయన భార్యా పెద్ద పర్వతాన్ని దాటి, ఎడారిలాంటి పెద్ద ప్రాంతం గుండా కాలినడకన ప్రయాణించారు. 90 కిలోమీటర్ల దూరాన్ని 45 గంటలపాటు ప్రయాణించారు. ఈ దంపతులు చూపించిన చక్కని మాదిరినుండి హాజరైనవారందరూ ఎంతగానో ప్రోత్సహించబడ్డారు. అక్కడ హాజరైనవారిలో అనేకమంది అలాంటి ప్రయత్నాలే చేసి ఆ సమావేశానికి హాజరయ్యారు. కొంతమంది సహోదరులూ, 60 ఏళ్ల వృద్ధ సహోదరుడూ కాలినడకన 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హాజరయ్యారని జిల్లా కాపరి నివేదించాడు!
5 ఈ సంవత్సరం జరగబోయే జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు మీరు నిర్దిష్టమైన ప్రణాళికల్ని వేసుకున్నారా? మీరు బహుశా అంతంత దూరాలు కాలినడకన ప్రయాణించాల్సిన అవసరం ఉండకపోవచ్చుగానీ, మీరూ మీ కుటుంబ సభ్యులూ సమావేశానికి హాజరయ్యేందుకు కొంత కృషీ, త్యాగమూ అవసరమౌతుంది. సమావేశారంభం నుండీ చివరవరకూ మొత్తం కార్యక్రమం అంతటికీ హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోండి. సమర్పించుకునే దిశగా అనేకమంది బైబిలు విద్యార్థులు పురోభివృద్ధి చెందుతున్నారు. సమావేశానికి వాళ్లు హాజరవ్వడం, సరియైన నిర్ణయాన్ని తీసుకునేలా వారికి తోడ్పడుతుంది. మీతోపాటు మీ బైబిలు విద్యార్థుల్నీ, ఆసక్తివున్న మరితర వ్యక్తుల్నీ రమ్మని ఆహ్వానించారా?
6 మూడు రోజుల కార్యక్రమం: ఈ సంవత్సరం సమావేశ కార్యక్రమం ఇండియాలో 20 సమావేశాల్లో అందించబడుతుంది. ఇంగ్లీషుతోపాటుగా, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాళీ, మలయాళం, హిందీ భాషల్లో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశాలు జరగబోయే ప్రాంతాలనూ, తారీఖులనూ తెలియజేసే జాబితా ఈ ఇన్సెర్టునందు 6వ పేజీలో ఉన్నాయి.
7 ప్రత్యేక గమనిక: శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయకాల కార్యక్రమం 9:30 నిమిషాలకు ఆరంభమౌతుంది. శుక్ర శనివారాల్లో కార్యక్రమం సాయంత్రం 5:00 గంటలకూ, ఆదివారం సాయంత్రం 4:00 గంటలకూ ముగుస్తుంది. సమావేశ తలుపులు ప్రతీరోజూ ఉదయం 8:00 గంటలకు తెరవబడతాయి. అంతకన్నా ముందు సమావేశ ఆవరణలోనికి ప్రవేశించడానికి సమావేశ పనులను నిర్వహించేందుకు నియమించబడినవారికి మాత్రమే ప్రవేశం ఉంది. అయితే, సీట్లను రిజర్వుచేసుకోవడానికి ఉదయం 8:00 గంటలకు ముందు ఎవ్వరూ ప్రవేశించకూడదు.
8 సమావేశం జరిగే ప్రాంతానికి చేసే ప్రయాణంలోనూ, తిరుగు ప్రయాణంలోనూ అనియత సాక్ష్యమిచ్చేందుకు మనం అవకాశాల కోసం వెదకాలి. పెట్రోల్ బంకుల్లో పనిచేసే అటెండెంట్లకూ, షాప్ కీపర్లకూ, హోటల్ సిబ్బందికీ, వెయిటర్లకూ రాజ్య సందేశమందు ఆసక్తి ఉండవచ్చు. కరపత్రాల్నీ, తాజా పత్రికల్నీ, బ్రోషూర్లనూ లేదా ఇతర సాహిత్యాల్నీ మీతోపాటు తీసుకురావడం ద్వారా రాజ్య సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధపడవచ్చు. అలా చేయడం ద్వారా బహుశా ఇతరత్రా ఏవిధంగానూ సాక్ష్యమివ్వడానికి అవకాశంలేని ప్రజలకు సాక్ష్యమివ్వడానికి మీకున్న అవకాశాలను బాగుగా ఉపయోగించుకోవచ్చు.—2 తిమో. 3:17.
9 ‘మీరు ఎలా వింటున్నారో గమనించుకోండి’: సమావేశ ప్రతినిధులు లూకా 8:18వ వచనంలో ఉన్న సలహాను లక్ష్యపెట్టడం జ్ఞానయుక్తం. బైబిల్నీ అలాగే పాటల పుస్తకాన్నీ, నోటు పుస్తకాన్నీ తెచ్చుకోవాలని అందరూ ప్రోత్సహించబడుతున్నారు. ప్రతీ ప్రసంగంలోనూ కీలకమైన విషయాల్ని జాగ్రత్తగా విని, క్లుప్తమైన నోట్సును రాసుకోండి. సమాచారాన్ని వ్యక్తిగతంగా మీరెలా అన్వయించుకోగలరో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమావేశం జరిగిన ప్రతీరోజూ ఆ రాత్రి మీరు నిద్రపోవడానికి ముందు, మీ నోట్సును పునఃసమీక్షించుకొని, యెహోవా దేవుని జీవిత మార్గానికి మీరెంత సన్నిహితంగా ఉన్నారనే విషయాన్ని మీరెందుకు విశ్లేషించుకోకూడదు?—సామె. 4:10-13.
10 సమావేశ కార్యక్రమాలు జరుగుతుండగా కొందరు ఆడిటోరియమ్‌ను విడిచి తమ వాహనాల్లో కూర్చుంటున్నట్టు గుర్తించడం జరిగింది, అలా చేయడం ద్వారా వాళ్లు కార్యక్రమంలో అందించే ప్రసంగాల్ని వినే అవకాశాల్ని కోల్పోతున్నారు. మరి కొంతమంది ఆడిటోరియంలో కూర్చొని వినాల్సిందిపోయి ఓ గమ్యమంటూలేనట్టుగా కారిడార్లలో తిరుగుతున్నట్టు గమనించడం జరిగింది. మధ్యాహ్నంపూట కార్యక్రమం మధ్యలో పిల్లలు గుంపులు గుంపులుగా సమావేశ స్థలాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు గమనించడం జరిగింది. గత కాలాల్లోని యెహోవా సేవకులు యెహోవా దేవుని జ్ఞాపికల్ని జాగ్రత్తగా విననందున తమ జీవితాల్లో గంభీరమైన తప్పిదాల్ని చేశారు. మనమూ అలాంటి తప్పునే చేయకుండా ఉండడానికి జాగ్రత్తవహించాలని నిశ్చయంగా కోరుకుంటాం. (2 రాజు. 17:13-15) మనందరికీ అవసరమైన ఉపదేశాన్ని ‘నమ్మకమునూ బుద్ధిమంతుడైన దాసుడు’ సిద్ధపర్చాడు. మూడు రోజులపాటు జరిగే సమావేశంలోని ప్రతీ కార్యక్రమంలో మనం ‘విన్న విషయాలపై విశేష అవధానాన్ని నిలపడం’ ఎంతో ప్రాముఖ్యం. భవిష్యత్తులో మన జీవిత మార్గంపై క్షేమాభివృద్ధికరమైన ప్రభావాన్ని ఖచ్చితంగా చూపించబోయే సమాచారంతోపాటుగా మనకు ప్రత్యేకంగా ఆసక్తిని కల్గించేవి ప్రతీరోజూ ఉన్నతపర్చబడతాయి. రాబోయే సమావేశాల పరంపరలలో యెహోవా ఆధ్యాత్మికంగా అందించబోయే వాటిపై మనం శ్రద్ధగా అవధానాన్ని నిలిపి, వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా, మనం దైవిక జీవిత మార్గం నుండి “విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు” మన నిరీక్షణ స్థిరంగా లంగరు వేయబడుతుంది.—మత్త. 24:45; హెబ్రీ. 2:1.
11 యెహోవాకు గౌరవాన్ని తెచ్చే అలంకరణ: ఈ క్లిష్టకాలాల్లో, లౌకికాత్మ ప్రభావానికి గురికాకుండా ఉండేలా మనం విశేషమైన అవధానాన్ని నిలపాల్సిన అవసరముంది. (1 కొరిం. 2:12) మనం ధరించే దుస్తులూ, కన్పించే తీరూ పొందికగా ఉండి, మనం ఆరాధిస్తున్న దేవుని ఘనతను ప్రతిబింబించాలి. (1 తిమో. 2:9, 10) “రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించు” వారి మధ్య ఉండడానికి ఖరీదైన దుస్తులే కావాల్సిన అవసరమేమీలేదు. (తీతు 2:9) కావలికోట జూన్ 15, 1997 17, 18 పేజీల్లో ఉన్న 14-18 పేరాలయందు ఇవ్వబడిన ఆచరణీయమైన, లేఖనాధారమైన చక్కని సలహాను గుర్తించండి. యెహోవాను ఘనపర్చేరీతిలో దుస్తుల్ని ధరించడం ద్వారా మనం ఇవ్వగలిగే శక్తిమంతమైన సాక్ష్యాన్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి.
12 సమావేశ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓ సాయంకాలం తానూ తన సహోదరుడూ ఒక రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు, తాము కొంతమంది సహోదర సహోదరీలు సమావేశంలో వేసుకున్న దుస్తులుగాక సముచితంకాని దుస్తులను వేసుకొని అక్కడున్నట్టు చూశామని 16 ఏళ్ల సాక్షి తెలియజేసింది. అయితే, నీటుగానూ, తగిన విధంగానూ దుస్తుల్ని ధరించి తమ బ్యాడ్జ్ కార్డుల్ని పెట్టుకున్న సాక్షుల్ని చూసి ఆ రెస్టారెంటుకి క్రమంగా వచ్చే కస్టమర్లలో అనేకమంది అనుకూలంగా ప్రతిస్పందించారు. ఇది, కొంతమంది కస్టమర్లకు సాక్ష్యమివ్వడానికి దారిని సుగమం చేసింది.
13 యెహోవాకు స్తుతుల్ని తెచ్చే ప్రవర్తన: సత్యారాధనను ఇతరులు దృష్టించే విధానాన్ని మన క్రైస్తవ ప్రవర్తన ప్రభావితం చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి, సువార్తకు తగిన విధంగానూ, యెహోవాకు స్తుతుల్ని తెచ్చే విధంగానూ మనం అన్నివేళలా ప్రవర్తించాలని కోరుకుంటాం.—ఫిలి. 1:27.
14 గత సంవత్సరం, ఉత్తర అంగోలాలో మొట్టమొదటిసారిగా జిల్లా సమావేశం నిర్వహించబడింది. సమావేశం జరిగే రెండో రోజున, సమావేశ ఆవరణలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో రూఢిపర్చుకునేందుకు ఇద్దరు స్థానిక పోలీసు అధికారులు అక్కడకు వచ్చారు. వాళ్లు ఆ రోజంతా అక్కడే ఉన్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత, వాళ్లు తాము విన్నదాన్నిబట్టీ, తాము చూసిన క్రమబద్ధమైన ప్రవర్తననుబట్టీ తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. వారిలో ఒకరు ఇలా వ్యాఖ్యానించారు: “మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు? యెహోవాసాక్షులు వాళ్ల సమావేశాల్లో శాంతి భద్రతల్ని కాపాడతారని మాకు తెలుసు.”
15 ఆఫ్రికా ఖండంలోని ఒక దేశమందున్న ఒకానొక రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు తన రాజకీయ పార్టీకి చెందిన సభ్యులందరూ హత్యకు గురైనందున ఐరోపా ఖండానికి పారిపోయి తలదాచుకున్నాడు. ఆయన అనేక వ్యక్తిగత సమస్యల్ని ఎదుర్కొని, ఎంతో నిరుత్సాహానికి గురయ్యాడు. చివరకు బైబిలు పఠనాన్ని అంగీకరించాడు. అతడు మొట్టమొదటిసారిగా జిల్లా సమావేశానికి హాజరైనప్పుడు, వేర్వేరు నేపథ్యాలకు చెందిన ప్రజలు శాంతి సమైక్యతలతో కలుసుకోవడాన్ని చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు. తాను సత్యాన్ని కనుగొన్నానని ఆయన ఒప్పించబడ్డాడు, ఆ సమావేశం జరిగే సమయంలోనే రాజకీయాలతో తనకున్న సంబంధాలన్నింటినీ త్రెంచివేసుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అటు తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, ఇప్పుడు ఆయనా, ఆయన పిల్లలూ యెహోవా సేవ చేస్తున్నారు.
16 బహుశా మొట్ట మొదటిసారిగా సమావేశాలకు హాజరౌతున్నవారిపై మన ప్రవర్తన ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది? స్వచ్ఛందసేవకులుగా మనం కలిసిమెలసి పనిచేసేటప్పుడు సహకారస్ఫూర్తిని వాళ్లు గుర్తిస్తారా? సమావేశ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లకముందే మనం కూర్చునే సీట్ల దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మనమూ మన పిల్లలూ కలిసి తీసివేయడాన్ని చూసీ, సమావేశ ఆవరణ చుట్టు ప్రక్కల ఉన్న పరిశుభ్రతనుబట్టీ వాళ్లు ముగ్ధులౌతారా? మనముండే వసతి స్థలాలనుండి సమావేశ స్థలాలకు రానుపోను ప్రయాణంచేస్తుండగా వాళ్లు మన చక్కని ప్రవర్తనను గమనిస్తారా? తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని వాళ్లు గుర్తిస్తారా? మనల్ని గమనిస్తున్న వారందరిపైనా అనుకూలమైన ముద్రను వేయడానికి మనం చేయగల్గినంతా చేద్దామని మనం నిశ్చయించుకుందాం.
17 సమావేశ నిర్వహణకు అయ్యే ఖర్చుల్ని భర్తీచేయడం: స్టేడియంలోగానీ, సమావేశ హాలులోగానీ జరిగే ఒక క్రీడను తిలకించడానికి ప్రవేశార్హతను పొందే టికెట్ ధరే ఈ లౌకిక ప్రపంచంలో ఎంతో ఖరీదైనది. మెట్రోపాలిటిన్ ఏరియాల్లో సమావేశాలకు ఉపయోగించే హాళ్ల అద్దె ఆకాశానికి అంటుకోవడమే పాక్షికంగా దీనికి కారణం. సమావేశాల్లో “సీట్లు ఉచితం, చందాలు వసూలు చేయబడవు” అన్న పాలసీని సొసైటీ ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటుంది. అయితే, సమావేశానికి ఉపయోగించే హాళ్లకు చెల్లించే అద్దెల్నీ, మరితర ఖర్చుల్నీ సొసైటీ ఎలా సమకూర్చుకుంటుంది? సమావేశానికి హాజరైనవారు ఉదారంగా ఇచ్చే చందాల ద్వారానే. యెహోవా దేవుణ్ణీ, యేసుక్రీస్తునీ అనుకరించడంలో గత కాలంలోని దేవుని సేవకులు చూపించిన ఉదార స్వభావాన్నే మీరూ చూపిస్తారనే నిశ్చయత మాకుంది. (2 కొరిం. 8:7) ఇవ్వబడిన అన్ని చందాలూ భద్రపర్చబడ్డాయనీ, నమోదుచేయబడ్డాయనీ, అవి ఏ ఉద్దేశంకోసమైతే ఇవ్వబడ్డాయో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో సక్రమంగా ఉపయోగించబడతాయనీ రూఢిపర్చుకునేందుకు ఎంతో జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. చెక్కుల రూపంలో ఇచ్చే చందాలేవైనా సరే వాటిని “payable to Watchtower” అనే పేరుపై బ్యాంకునుండి తీసుకోవాలి.
18 సీటింగ్: మీ సొంత కుటుంబ సభ్యుల కోసమూ, మీతో ప్రయాణించే వారి కోసమూ మాత్రమే సీట్లను రిజర్వు చేసుకోవచ్చు అని సంవత్సరాలుగా ఇవ్వబడుతున్న నిర్దేశకాలు ఇప్పటికీ వర్తిస్తాయి. ఈ విషయంలో చక్కని పురోభివృద్ధి కన్పించడం ఎంతో ప్రోత్సాహకరమైన విషయం, ఇది సమావేశాల్లో కనిపించే ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని అధికం చేసింది. చాలా స్థలాల్లో కొన్ని సీట్లు మిగిలినవాటికన్నా కూర్చోవడానికి ఎక్కువ అనువుగా ఉంటాయి. దయచేసి ఎక్కువ అనుకూలంగా ఉండే సీట్లను వృద్ధుల కోసమూ, రోగగ్రస్థులూ అంగవైకల్యులూ మొదలైన వారి కోసమూ ఉంచినట్లైతే వారిపట్ల శ్రద్ధచూపించినట్టౌతుంది. “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు” అని గుర్తుంచుకోండి.—1 కొరిం. 13:4, 5; ఫిలి. 2:4.
19 కెమెరాలు, వీడియో కెమెరాలు, టేప్ రికార్డర్లు: సమావేశాల్లో కెమెరాలనూ, రికార్డింగ్ పరికరాలనూ ఉపయోగించవచ్చు. అయితే, వాటిని మీరు ఉపయోగించడం మూలంగా ఇతరులకు అవరోధం కలగకూడదు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫోటోలు తీస్తూ చుట్టూ తిరగడం, కార్యక్రమంపై ధ్యానముంచడానికి ప్రయత్నించే ఇతరులను డిస్ట్రర్బ్ చేస్తుంది. ఏ విధమైన రికార్డింగ్ పరికరాలను ఎలక్ట్రికల్ లేదా సౌండ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయకూడదు, లేదా ఆ రికార్డింగ్ పరికరం దారికి, నడవాకు లేదా ఇతరులు చూడడానికి ఆటంకం కలిగించకూడదు.
20 ప్రథమ చికిత్స: ప్రథమ చికిత్స విభాగము అత్యవసర పరిస్థితులకు మాత్రమే. దయచేసి మీ సొంత ఆస్ప్రిన్లనూ, జీర్ణసంబంధ మందులనూ, బాండేజ్లనూ, సేప్టీ పిన్నులనూ, మరలాంటి ఇతర వస్తువులనూ తెచ్చుకోండి, అవి సమావేశం వద్ద లభించవు. మూర్చరోగం ఉన్నవారు, ఇన్సులిన్ షాక్, హృద్రోగ సమస్యలూ మొదలైన అనారోగ్యాలున్న వారు అవసరమైన మందులను వెంట ఉంచుకోవాలి. వారి పరిస్థితిని అర్థం చేసుకొనే కుటుంబ సభ్యులెవరైనా లేక సంఘంలోని వారెవరైనా అవసరమైన సహాయం అందించటానికి ఎల్లవేళలా వారి దగ్గర ఉండాలి. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి తోడు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండి, వాళ్లు అస్వస్థతకు గురైనప్పుడు సమస్యలు తలెత్తాయి. ప్రత్యేక ఆరోగ్యావసరతలున్న కొంతమందికి తమకు సహాయం చేయగల కుటుంబ సభ్యులులేనప్పుడు, సంఘ పెద్దలు పరిస్థితిని గమనించి సహాయం కోసం అవసరమైన ఏర్పాట్లను చేయవలసిన అవసరం ఉంది. పర్యావరణ సంబంధమైన రోగాలూ లేదా ఎలర్జీలూ ఉన్న వారికోసం ప్రత్యేక వసతులున్న గదులను సమావేశాల్లో ఏర్పాటు చేయడానికి సాధ్యంకాదు.
21 మావేశం వద్ద ఆహారం: మధ్యాహ్న విరామ సమయంలో బయటకువెళ్లి తినడానికి ఏదొకటి కొనుక్కోవడానికి సమావేశ ఆవరణను విడిచిపెట్టి బయటకు వెళ్లడానికి బదులు ప్రతీ ఒక్కరూ తన తన సొంత ఆహారాన్ని తెచ్చుకోవాలి. సులభంగా తయారుచేసుకునే, ప్రయాణంలో సులభంగా తీసుకెళ్లగల్గే పోషకాహారం బహుశా సరిపోతుంది. 1995 జూలై మన రాజ్య పరిచర్య ఎటువంటి పోషకాహార పదార్థాలను తెచ్చుకోవచ్చో అనే విషయంలో కొన్ని సలహాల్ని ఇస్తోంది. గాజు సీసాలను లేదా మద్యపానీయాలను సమావేశ స్థలానికి తీసుకురాకూడదు. టిఫిన్ కేరియర్లూ, సంచులూ సీటు క్రింద పట్టేటంత చిన్నవిగా ఉండాలి. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల్లో కొంతమంది తింటూ, తాగుతూ ఉన్నట్లు గమనించడం జరిగింది. ఇలా చేయటం మర్యాదకరమైనది కాదు.
22 1998 “దైవిక జీవిత మార్గము” అనే జిల్లా సమావేశం త్వరలో ప్రారంభమౌతున్నందుకు మనకు ఎంత ఆనందంగా ఉందో కదా! దానికి హాజరయ్యేందుకు మీరు ఏర్పాట్లన్నింటినీ చేసుకోవడం పూర్తి అయిందా? సమావేశానికి క్షేమంగా వెళ్లి, సేదపొంది సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లాలనీ, యెహోవా దేవుని అమూల్యమైన సేవలో ముందుకు సాగాలని నిశ్చయించుకొని మీ నిత్య ఆశీర్వాదం నిమిత్తం దైవిక జీవిత మార్గాన్ని వెంబడిస్తూ ఉండాలనీ మేం కోరుకుంటున్నాం.
[6వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశ జ్ఞాపికలు
▪ బాప్తిస్మం: బాప్తిస్మ అభ్యర్థులు శనివారం ఉదయం కార్యక్రమం ఆరంభమయ్యే ముందు నియమించబడిన సెక్షన్లో కూర్చోవాలి. బాప్తిస్మం పొందాలని పథకం వేసుకుంటున్న ప్రతి ఒక్కరు పొందికైన వస్త్రాలనూ, టవల్నూ తెచ్చుకోవాలి. గతంలో కొందరు సముచితంకాని విధంగా ఆ సందర్భానికి గౌరవం తీసుకురాని విధంగా వస్త్రాల్ని ధరించారు. బాప్తిస్మ అభ్యర్థులతో మన పరిచర్య పుస్తకంలోని ప్రశ్నలను పునఃసమీక్షించే సంఘ పెద్దలు, ప్రతి ఒక్కరూ ఈ అంశాలను అర్థం చేసుకున్నారని నిశ్చయపరచుకోవాలి. ఒకరి సమర్పణకు సూచనయైన బాప్తిస్మం అనేది ఆ వ్యక్తికీ యెహోవాకూ మధ్యనుండే అంతరంగికమైన, వ్యక్తిగతమైన విషయం. కాబట్టి, అభ్యర్థులు బాప్తిస్మం తీసుకొనేటప్పుడు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేక చేతులు పట్టుకోవడం యుక్తము కాదు.
▪ బ్యాడ్జ్ కార్డులు: దయచేసి సమావేశ సమయంలోనూ, సమావేశ స్థలానికి వచ్చేటప్పుడూ వెళ్లేటప్పుడూ 1998 బ్యాడ్జ్ కార్డు ధరించండి. ఇది చక్కని సాక్ష్యమివ్వడానికి తరచూ మనకు అవకాశాలను కల్పిస్తుంది. బ్యాడ్జ్ కార్డులూ, వాటి హోల్డర్లనూ మీ సంఘం ద్వారా పొందవచ్చు, ఎందుకంటే అవి సమావేశంలో లభ్యం కావు. మీ కోసమూ మీ కుటుంబం కోసమూ బ్యాడ్జ్ కార్డులను కోరేందుకు సమావేశానికి కొన్ని రోజుల ముందు వరకు వేచి ఉండకండి. మీ నవీకరించబడిన అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీస్ కార్డ్‌ను మీతోపాటు ఉంచుకోవడాన్ని గుర్తుంచుకోండి.
▪ వసతి: ఈ విషయంలో మీకు సమస్య ఎదురైనట్లైతే, మీరు ఇంకా సమావేశ స్థలంలో ఉండగానే ఆ సమస్యను గురించి సమావేశ రూమింగ్ డిపార్ట్మెంట్కు తెలియజేయడానికి సందేహించకండి. అలా వాళ్లు మీ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడానికి మీకు సహాయపడగలుగుతారు. సంఘ కార్యదర్శులు రూమ్ రిక్వెస్ట్ ఫారాలను సరైన ప్రధాన సమావేశ చిరునామాలకు సత్వరమే పంపించేలా నిశ్చయపరచుకోవాలి. మీరు ఒక వసతిని క్యాన్సిల్ చేయాలనుకుంటే, మీరు వెంటనే రూమింగ్ డిపార్ట్మెంట్కు తెలపాలి, అలాగైతే వారు దానిని మరొకరికి నియమించగల్గుతారు.
▪ స్వచ్ఛంద సేవ: సమావేశమందు ఒక విభాగంలో సహాయపడేందుకు మీరు కొంత సమయం కేటాయించగలరా? మన సహోదరులకు సేవచేయడం కేవలం కొన్ని గంటలే అయినప్పటికీ ఎంతో సహాయకరంగా ఉండి, మరింత సంతృప్తినివ్వగలదు. మీరు సహాయపడగలిగితే, దయచేసి సమావేశంలోని స్వచ్ఛంద సేవా విభాగానికి తెలియజేయండి. 16 ఏండ్ల కన్నా తక్కువ వయస్సుగల పిల్లలు, తలిదండ్రుల లేదా బాధ్యతగల వేరెవరైనా పెద్దవారి పర్యవేక్షణలో పనిచేయడం చక్కని తోడ్పాటు కాగలదు.
▪ హెచ్చరికా మాటలు: అన్ని వేళల్లో మీ వాహనం లాక్ చేయబడి ఉందని నిశ్చయపర్చుకోండి, వస్తువులు బయటకు కన్పించేలా విడిచిపెట్టకండి, అలా చేయడం వాటిని దొంగిలించేందుకు తాళాల్ని బద్దలుకొట్టేలా ఎవరైనా శోధించబడేలా చేస్తుంది. దొంగలూ, జేబు దొంగలూ పెద్ద సమావేశాలపై తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. మీ సీట్లో విలువైనవాటిని వదిలిపెట్టి వెళ్లడం జ్ఞానయుక్తమైన పనికాదు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు క్రైస్తవులే అన్న హామీ మీకు లేదు. ఎందుకు శోధించాలి? కొందరు బయటి వ్యక్తులు పిల్లలను దూరంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లు నివేదికలు అందాయి. మీ పిల్లలపై మీ దృష్టిని ఎల్లప్పుడూ ఉంచండి.
అనేక హోటళ్ళలో లభ్యమయ్యే దూరదర్శిని లేదా వీడియో సర్వీసులు తరచూ అశ్లీలమైన కార్యక్రమాలను చూపిస్తాయి. పర్యవేక్షణ లేకుండా పిల్లలను గదిలోని దూరదర్శిని దగ్గరకు వెళ్ళనివ్వకండి.
దయచేసి, సమావేశ విషయాల గురించి సమావేశ హాలు కార్యనిర్వాహక వర్గానికి ఫోను చేయడంగానీ లేక రాయడంగానీ చేయకండి. పెద్దల నుండి సమాచారం లభించనట్లైతే, మే 1998 మన రాజ్య పరిచర్యలో 5వ పేజీలో ఉన్న సమావేశ స్థల చిరునామాల్లో మీకు కావాల్సిన దానికి రాయవచ్చు. మీరు కోయంబత్తూరులోగానీ, మధురైలోగానీ జరగబోయే సమావేశాలకు హాజరవ్వాలని ప్రణాళికలు వేసుకుంటుంటే, సమావేశ ప్రధాన కార్యాలయాల చిరునామాలు ఈ నెల మన రాజ్య పరిచర్యలో 7వ పేజీనందు ఉన్నాయి.