‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి’
1 ప్రాముఖ్యమైన విషయాలకున్న విశిష్టతను కాలంతోపాటూ అంతకంతకూ తగ్గిపోవడానికి మానవులు అనుమతిస్తారు. “ప్రభువు రాత్రి భోజనము”ను ఏర్పాటు చేసినప్పుడు, యేసు తన శిష్యులతో “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చే[స్తూ ఉండండని]” చెప్పడానికి ఇది ఒక కారణమైవుంది. అప్పటి నుండి, యేసు మరణ వార్షిక దినాన క్రైస్తవులు విధేయతతో ‘ప్రభువు వచ్చువరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారు.’—1 కొరిం. 11:20, 23-26.
2 ఇప్పుడు అతి త్వరలోనే, సంఖ్యలో తగ్గిపోతున్న శేషించబడిన ‘చిన్న మందలోని’ చివరి వ్యక్తులను యేసు పరలోక నివాసంలోనికి తీసుకుంటాడు. (లూకా 12:32; యోహా. 14:2, 3) ఈ సంవత్సరం ఏప్రిల్ 11న, అభిషిక్త శేషం నిరంతరం పెరిగే “వేరే గొఱ్ఱెల”కు చెందిన “గొప్పసమూహము”తో పాటూ ప్రభువు రాత్రి భోజనాన్ని మరొకసారి ఆచరించే ఆధిక్యతను కల్గివుంది. (యోహా. 10:16; ప్రక. 7:9, 10) మానవజాతి కోసం తన జనితైక కుమారుడ్ని పంపించడంలో యెహోవా చూపించిన గొప్ప ప్రేమ ఎడల గల మన ప్రశంస పటిష్టపర్చబడుతుంది. యేసు మాదిరీ, ఆయన ప్రేమా, విమోచన క్రయధనాన్ని అందించడంలో మరణం వరకూ ఆయన చూపిన నమ్మకమూ, స్థాపించబడిన దేవుని రాజ్యానికి ఇప్పుడు రాజుగా ఆయన పరిపాలించడమూ, అలాగే ఆ రాజ్యం మానవాళికి తేబోయే ఆశీర్వాదాలూ ఉన్నతపర్చబడతాయి. నిజంగా జ్ఞాపకం చేసుకోదగిన సందర్భమే!
3 ఇప్పుడే సిద్దపడండి: ఈ జ్ఞాపకార్థ కాలం మనకూ, మనతోపాటూ సహవసించే వారందరికీ గొప్ప ఆనందమయమైన, కృతజ్ఞతాపూర్వకంగా ఉండవలసిన సందర్భంగా ఉండేందుకు మనందరం కృషి చేద్దాం. యేసు పరిచర్యలోని చివరి కొద్ది దినాలను గూర్చిన, ఆయన మరణానికి నడిపించిన సంఘటనలను గూర్చిన బైబిలు వృత్తాంతాలను మరొకసారి చదవడం ద్వారా మన మెప్పుదలను అధికం చేసుకోగలం. మన కుటుంబ పఠనంలో జ్ఞాపకార్థ దినానికి ముందున్న అనేక వారాలను మహాగొప్ప మనిషి పుస్తకంలోని 112-16 అధ్యాయాల్ని పునఃసమీక్షించడానికి కేటాయించుకోవచ్చు.
4 ఈ ఆచరణ ఎడల మీకు తెలిసిన వ్యక్తులు కల్గివున్న మెప్పుదలను వారిలో పెంపొందించేందుకు మీరు చొరవ తీసుకొని వారిని ఆహ్వానిస్తే, తాము కూడా ఆహ్వానితులమేనని వాళ్ళు భావించేలా చేస్తే వారిలో ఎంతమంది జ్ఞాపకార్థ దినానికి హాజరౌతుండవచ్చు? ఇప్పుడే ఒక లిస్టును తయారుచేసుకోండి, వాళ్లు రావడానికి మీరు చేయగల సహాయం చేయండి. తర్వాత, క్రమంగా కూటాలకు హాజరవ్వడానికి వారిని ప్రోత్సహించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతూండడంలో వారికి సహాయపడండి.
5 జ్ఞాపకార్థ కాలంలో, ప్రతి ఒక్కరూ ప్రకటించడానికున్న అవకాశాలను పెంచుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడతాయి. తగిన షెడ్యూలు వేసుకోవడంతో, మీరు సహాయ పయినీరుసేవ ఏప్రిల్లో లేక మేలో చేయగలరా? యేసు బల్యర్పణయంటే మనకు భావమేమైవున్నదో అనే విషయాన్ని మనం ప్రశంసాత్మకంగా జ్ఞాపకముంచుకుంటున్నామని చూపించడానికున్న శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటేమిటంటే మన దేవుడైన యెహోవాను గురించీ, ఆయన కుమారుని ద్వారా రాజ్యపరిపాలన తెచ్చే ఆశీర్వాదాల్ని గురించీ మాట్లాడడమే.—కీర్త. 79:13; 147:1.