డిసెంబరు సేవా కూటాలు
డిసెంబరు 1తో ప్రారంభమయ్యే వారం
పాట 57 (9)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు.
15 నిమి: “ప్రతి రోజు యెహోవా గురించి మాట్లాడండి.” ప్రశ్నా జవాబులు. 4వ పేరాను చర్చిస్తున్నప్పుడు పాఠశాల నిర్దేశక పుస్తకము, (ఆంగ్లం) పాఠ్యభాగం 16, పేరాలు 14-16 నుండి వ్యాఖ్యానాలు చేర్చండి.
20 నిమి: “బైబిలు—సర్వమానవాళికి దేవుడిచ్చిన మార్గదర్శిని.” ఒక పెద్ద ఈ శీర్షికను చర్చిస్తాడు, బైబిలును పరిశీలించడానికి ప్రతి ఒక్కరు ఎందుకు ప్రేరేపించబడాలనేదానికి కారణాలను ఇస్తాడు. 3-8 పేరాల్లో సూచించబడిన అందింపులను ఉపయోగించడానికి వారు ఎలా సిద్ధపడ్డారో చెప్పమని ఇద్దరు ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఈ అందింపుల్లో ఒకటి మొదటి సందర్శనానికీ మరొకటి పురర్దర్శనానికీ ప్రదర్శించండి.
పాట 165 (20), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 8తో ప్రారంభమయ్యే వారం
పాట 58 (26)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
20 నిమి: చెడును ఎందుకు నివేదించాలి? ఆగస్టు 15, 1997, కావలికోట, పేజీలు 26-30 ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
15 నిమి: “మీరు లేని లోటు కనిపించింది!” ప్రేక్షకులతో ఒక పెద్ద చేసే చర్చ. సంఘ కూటాల సగటు హాజరును పేర్కొనండి. కూటాల్లో సమకూడడం తమకు సేదదీర్పుగా ఎందుకు ఉందో చెప్పమని కొంతమందిని ఆహ్వానించండి.
పాట 172 (4), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 15తో ప్రాంభమయ్యే వారం
పాట 63 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు. లౌకిక పండుగ దినాల శుభాకాంక్షలకు ఎలా ప్రతిస్పందించాలో కొన్ని సూచనలను అందించండి. డిసెంబరు 25, జనవరి 1 రోజుల్లో ప్రత్యేక ప్రాంతీయ సేవకు చేయబడిన ఏర్పాట్లను గురించి చెప్పండి.
10 నిమి: స్థానిక అవసరతలు.
25 నిమి: “మనం బోధకులుగా ఉండవలసిన వారమై ఉన్నాము, కేవలం ప్రకటించువారమే కాదు.” ప్రశ్నా జవాబులు. 11వ పేరాను చర్చిస్తున్నప్పుడు, పాఠశాల నిర్దేశక పుస్తకము, (ఆంగ్లం) పాఠ్యభాగం 15, పేరా 11 చదవండి.
పాట 174 (18), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 22తో ప్రారంభమయ్యే వారం
పాట 138 (21)
8 నిమి: స్థానిక ప్రకటనలు.
17 నిమి: “1998 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల.” పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగము. రాబోయే సంవత్సరంలోని పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందే మార్గాలను పునస్సమీక్షించండి. “చదవవలసిన బైబిలు భాగం అదనపు పట్టిక”ను ప్రతివారం పాటించమని ప్రోత్సహించండి.
20 నిమి: ప్రతిచోట సువార్తను ప్రకటించండి. ఈ క్రింది ప్రశ్నలను ఉపయోగిస్తూ మన పరిచర్య పుస్తకంలోని 92-7 పేజీలను ప్రేక్షకులతో చర్చించండి: (1) సువార్తను విస్తరించడంలో మన సాహిత్యాన్ని ఉపయోగించడం ఎందుకు ప్రభావవంతంగా ఉంది? అవకాశం దొరికిన ప్రతిసారీ మనం సాహిత్యాన్ని ఎందుకు అందించాలి? (2) అనియత సాక్ష్యపు పని చేయడానికి మనం ఎందుకు సంసిద్ధంగా ఉండాలి? అనియతంగా సాక్ష్యం ఇవ్వడానికి కొన్ని మార్గాలేమిటి? (అనియతంగా సాక్ష్యమివ్వడంలో కొన్ని అనుభవాలను చెప్పమని కొందరిని ఆహ్వానించండి.) (3) సంఘానికి నియమించబడిన ప్రాంతాన్ని చక్కగా పూర్తి చేయడానికి ఎందుకు ప్రయత్నించాలి? సరిపడినంత ప్రాంతం ఉన్నచోట, వ్యక్తిగతంగా కొంత ప్రాంతాన్ని ఉంచుకోవడంలోని ప్రయోజనాలు ఏమిటి? (4) గుంపు సాక్ష్యం కొరకు చేసిన ఏర్పాట్ల నుండి మనం ఎలా ప్రయోజనం పొందుతాము? మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మన సాక్ష్యపు పని కొరకు ఎలా ప్రణాళిక వేసుకోవచ్చు?
పాట 222 (29), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 29తో ప్రారంభమయ్యే వారం
పాట 181 (17)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రాంతీయ పరిచర్య రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. క్రొత్త సంవత్సరంలో సంఘ కూటాల సమయాలు మార్చుకుంటున్నట్లైతే, ఆ ఏర్పాటుకు అనుగుణంగా సంఘ కూటాలకు క్రమంగా హాజరవ్వమని అందరికీ ప్రేమపూర్వకంగా ప్రోత్సాహాన్ని ఇవ్వండి.
10 నిమి: “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమము.” ఈ శీర్షికను ప్రేక్షకులతోపాటు పునఃసమీక్షించి, అందర్నీ హాజరవ్వమని ప్రోత్సహించండి. ఒకవేళ మీ సమావేశం జరిగే తేదీలు, ప్రాంతము తెలిసినట్లైతే వాటిని పేర్కొనండి. కుటుంబంలోని ప్రతి సభ్యుడు/సభ్యురాలు సమావేశానికి హాజరవ్వడానికి తమ ఇంటి వ్యవహారాల్లో ఎలా సర్దుబాట్లు చేసుకోవచ్చో సలహాలివ్వండి. సమావేశానికి హాజరయ్యేందుకు బైబిలు విద్యార్థులను ఎలా ప్రోత్సహించవచ్చో, ఎలా సహాయం చేయవచ్చో చర్చించండి. ఇది వారికి ఆధ్యాత్మికంగా చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది.
25 నిమి: జనవరి కొరకైన సాహిత్య ప్రతిపాదనను సమీక్షించండి. సంఘంలో సమృద్ధిగా ఉన్న పాత పుస్తకాలను చూపించి, అందింపులను సిద్ధపడడానికి సహాయకరంగా ఉండే కొన్ని చర్చనీయాంశాలను పేర్కొనండి. స్థానికంగా అందుబాటులో ఉన్న పుస్తకాలను ఎలా అందించవచ్చో కొన్ని ప్రదర్శలను కూడా చేర్చండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులోనో లేక జ్ఞానము పుస్తకంలోనో బైబిలు పఠనాలను ప్రారంభించడానికి మనం మన ప్రయత్నాలను కొనసాగించాలి.
పాట 215 (22), ముగింపు ప్రార్థన.