కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/97 పేజీ 1
  • మీరు లేని లోటు కనిపించింది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు లేని లోటు కనిపించింది!
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు మీరు తోడ్పడుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • నీ అలవాటు ఏమి?
    మన రాజ్య పరిచర్య—1990
  • కుటుంబ కార్యక్రమ పట్టిక—సంఘ కూటాలు
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 12/97 పేజీ 1

మీరు లేని లోటు కనిపించింది!

1 ‘నేను రాకపోతే ఎవరు పట్టించుకుంటారులే; నేను రాలేదన్న సంగతిని కూడా గుర్తించరులే’ అని తలస్తూ మనం అప్పుడప్పుడు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సంఘ కూటాలకు వెళ్లడం మానేస్తుండవచ్చు. అదెంతమాత్రం నిజం కాదు! మన భౌతిక శరీరంలోని ప్రతి అవయవానికీ కీలక పాత్ర ఉన్నట్లే, మనలో ప్రతి ఒక్కరమూ సంఘం పనిచేయడంలో ఒక కీలకమైన పాత్రను కలిగివున్నాము. (1 కొరిం. 12:12) ప్రతివారం జరిగే కూటాలకు మనం హాజరుకాకపోతే, అది హాజరయ్యే ఇతరుల ఆధ్యాత్మిక సంక్షేమంపైన ప్రభావం చూపగలదు. మీరు కూటాలకు గనుక రాకపోయినట్లైతే, ఇది నమ్మండి—మీరు లేని లోటును ఇతరులు అనుభవిస్తారు!

2 మీరు వహించే కీలకమైన పాత్ర: పౌలు తన సహోదరుల సహవాసాన్ని ఎంతో అపేక్షించాడు. కారణం? “మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు” అని చెబుతూ రోమీయులు 1:11, 12 వివరిస్తుంది. అదేవిధంగా, మన వ్యాఖ్యానాల ద్వారా, కూటాల్లో మనం నిర్వహించే భాగాల ద్వారా, చివరికి కేవలం మన ఉనికి ద్వారా మనం ఒకరినొకరము క్షేమాభివృద్ధి కలుగజేసుకోవడంలో ఎంతో చేయగలము.—1 థెస్స. 5:11.

3 సంఘ కూటాల్లో అందరినీ కలవాలని మీరు ఎదురుచూడరూ? మీరు వారు చేసే వ్యాఖ్యానాలను జాగ్రత్తగా గమనిస్తూ, వారి విశ్వాస వ్యక్తీకరణల్ని మెప్పుదలతో వింటారు. వారి ఆధ్యాత్మిక కృపావరములు మీ క్షేమాభివృద్ధికి తోడ్పడతాయి. కూటాలకు కొంతమంది హజరుకాకపోతే ఏదో లోటున్నట్లు మీరు భావిస్తారు. మీరు హాజరుకాకపోతే మీ సహోదరులు, సహోదరీలు కూడా అలాగే భావిస్తారు.

4 కూటాలు పోషించే కీలకమైన పాత్ర: మన ఆధ్యాత్మిక మనుగడకు కూటాలు ఎంతో కీలకమైనవన్న విషయంపై కావలికోట ఒకసారి ఇలా వ్యాఖ్యానించింది: “కలహాలతో చీల్చబడిన ఈ అవినీతి లోకంలో, క్రైస్తవ సంఘం నిజంగా ఒక [ఆధ్యాత్మిక] ఆశ్రయ దుర్గం. . . , అది ప్రశాంతతకు, ప్రేమకు నిలయమైయుంది. కాబట్టి, మీరు అన్ని కూటాలకు హాజరగువారైయుండండి.” (w93 8/15 11) మనలోని ఆధ్యాత్మిక శక్తిని తోడేసే పరిస్థితులను మనం ప్రతి రోజు ఎదుర్కొంటాము. మనం జాగ్రత్తగా లేకపోతే, మన చింతల్లో ఎంతగా మునిగిపోగలమంటే, మరి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాల్ని మర్చేపోగలము. దేవుని సేవలో ఐక్యంగానూ, ఉత్సాహంగానూ ఉండడానికి అవసరమయ్యే ప్రోత్సాహం కొరకు మనమందరం ఒకరిపై ఒకరం ఆధారపడతాము.—హెబ్రీ. 10:24, 25.

5 కూటాలకు మనం హాజరవ్వడం ఎంతో ప్రాముఖ్యం. అనారోగ్యము లేదా అనూహ్య సంఘటనలు మనల్ని అప్పుడప్పుడూ కూటాలకు హజరుకాకుండా చేయవచ్చు. అలాంటివేమీ లేనప్పుడు, ఎల్లప్పుడు కలిసి యెహోవాను స్తుతించే సమూహంలో ఒకరిగా చేరివుండాలని తీర్మానించుకుందాము!—కీర్త. 26:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి