కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/97 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1997
మన రాజ్య పరిచర్య—1997
km 12/97 పేజీలు 5-6

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

సెప్టెంబరు 1 నుండి డిసెంబరు 22, 1997 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలను మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్‌ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్‌ నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. జ్ఞానవంతులైన ప్రాణులకు దేవుడు స్వేచ్ఛాచిత్తాన్ని అనుగ్రహించి ఉండకపోయినట్లయితే దుష్టత్వం ఉండేదికాదు. [rs పేజీ 428 పేరా 2]

2. లూకా 22:29 వద్ద, యేసు యొక్క ఆత్మ-జనిత ఉపయాజకులే కాకుండ మానవజాతిలోని ఇతరులందర్ని చేర్చే విస్తృత అన్వయింపు గల మత్తయి 19:28లో, “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి” ఉన్న ప్రాముఖ్యతే ఉంది. [వారపు బైబిలు పఠనం; w87 3/1 పేజీ 27 పేరా 10; పేజీ 28 పేరా 12 చూడండి.]

3. యేసు సమరయ స్త్రీతో మాట్లాడడం గురించి ఆయన శిష్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచటానికి కారణం ఆ స్త్రీ యొక్క అవినీతికరమైన జీవన విధానమే. (యోహాను 4:27) [వారపు బైబిలు పఠనం; w95 7/15 పేజీ 15 పేరాలు 1-2 చూడండి.]

4. తనను అప్పగించేది యూదాయేనని అతనిని అపొస్తలునిగా ఎన్నుకునేటప్పుడే యేసుకు తెలుసని యోహాను 6:64 నందలి “మొదటినుండి” అనే పదబంధం సూచిస్తుంది. [వారపు బైబిలు పఠనం; it-2 పేజీ 129 పేరాలు 4-6 చూడండి.]

5. గర్భస్థ మానవ శిశువును దేవుడు అమూల్యమైన జీవంగా దృష్టిస్తాడని గుణగ్రహించడానికి నిర్గమకాండము 21:22, 23 మనకు సహాయం చేస్తుంది. [kl పేజీ 128 పేరా 21]

6. మొదటి పేతురు 3:3, 4 పైవస్త్రాలు ధరించడాన్ని ఎలాగైతే నిషేధించడంలేదో అలాగే ఆభరణాలనూ, సౌందర్య వర్ధక వస్తువులనూ నిరాడంబరమైన మరియు సహేతుకమైన విధంగా ఉపయోగించడాన్ని నిషేధించడం లేదు. [rs పేజీ 435 పేరా 1]

7. యోహాను 5:1లో ప్రస్తావించబడిన “యూదుల పండుగ” సా.శ. 31 నాటి పస్కాను సూచిస్తుంది. [si పేజీ 194 పేరా 8]

8. మన తోటి ఆరాధికుడు మనకు అభ్యంతరం కలిగిస్తే, అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా, అతన్ని మన జీవితంలో నుండి వెలివేయడం తప్పు. [uw పేజీ 134 పేరా 7]

9. పౌర అధికారులు నీతిమంతులుగా దృష్టించబడినా లేక అవినీతిపరులుగా దృష్టించబడినా నిజ క్రైస్తవులు తమ వివాహాన్ని వారిచేత సరిగా రిజిస్టరు చేయించుకోవాలి. [kl పేజీ 122 పేరా 11]

10. లూకా ఎఫెసులో ఉన్నప్పుడు అపొస్తలుల కార్యములు వ్రాశాడు. [si పేజీ 199 పేరా 3]

ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి:

11. ఎఫెసునందలి మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరికనుగుణ్యంగా, దుష్టాత్మలను ఎదిరించడానికి తీసుకోవల్సిన ఒక ఆవశ్యక చర్య ఏమిటి? (అపొస్తలుల కార్యములు 19:19) [kl పేజీ 114 పేరా 14]

12. నోవహు కాలంలో కొంతమంది దూతలు ఎలా పాపం చేశారు? [kl పేజీ 109 పేరా 4]

13. పిత్రార్జిత వివాదంలో జోక్యం చేసుకోవడానికి యేసు ఎందుకు నిరాకరించాడు? (లూకా 12:13, 14) [వారపు బైబిలు పఠనం; w97 4/1 పేజీ 28.]

14. అపొస్తలుల కార్యములు 1:6లో తెలియజేయబడినట్లుగా, ఇశ్రాయేలుకు రాజ్యం మరల అనుగ్రహించెదవా అని శిష్యులు యేసును అడిగినప్పుడు వారికి ఏ విషయం గురించి తెలియదు? [వారపు బైబిలు పఠనం; w90 12/1 పేజీ 25 పేరా 4 చూడండి.]

15. వివాహ జీవితం నిలిచి ఉండడానికి దోహదపడగల రెండు కారణాలు తెలియజేయండి. [uw పేజీ 140 పేరా 4]

16. కొన్ని సందర్భాల్లో క్రైస్తవ స్త్రీ తలపై ముసుకు ఎందుకు వేసుకుంటుంది? [rs పేజీ 433 పేరా 2]

17. యోహాను 1:1 నందు నూతన లోక అనువాదము “వాక్యము ఒక దేవతయై ఉండెను” అని చెబుతుండగా ఇతర అనువాదాలు “వాక్యము దేవుడై యుండెను” అని ఎందుకు చెబుతున్నాయి? [వారపు బైబిలు పఠనం; rs పేజీ 212 పేరా 5 చూడండి.]

18. ప్రకటన గ్రంథం ప్రకారం, “మాంత్రికులు” పశ్చాత్తాపపడి వారి మార్గాలను మార్చుకొనకపోతే వారికి ఎలాంటి అంతం ఉంటుంది? [kl పేజీ 111 పేరా 8]

19. యేసు ఒక పరిపూర్ణ మానవుడైయుండి, బోధకునిగా తన పాత్రను గుర్తించినప్పటికీ, “సద్బోధకుడా” అని పిలువబడడానికి ఎందుకు నిరాకరించాడు. (లూకా 18:18, 19) [వారపు బైబిలు పఠనం; w95 3/1 పేజీ 15 పేరా 7 చూడండి.]

20. యోహాను 13:34 నందు చెప్పబడిన ఆజ్ఞలో ఉన్న క్రొత్తదనమేమిటి? [వారపు బైబిలు పఠనం; w90 9/1 పేజీ 23 పేరా 5-6 చూడండి.]

క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:

21. మన సహోదరునికి మనయెడల విరోధం ఉందని తెలిసినట్లయితే, _____________________ నెలకొల్పుకోవడానికి చొరవతీసుకొని కృషిచేసేందుకు _____________________తో పాటు _____________________ కూడా అవసరం. [uw పేజీ 135 పేరా 10]

22. “పది మినాలు” పరలోక రాజ్యానికి ఎక్కువమంది _____________________ను ఉత్పన్నము చేయడంలో ఆత్మ-జనిత శిష్యులు ఉపయోగించగల _____________________ను సూచిస్తున్నాయి. (లూకా 19:13) [వారపు బైబిలు పఠనం; w89 10/1 పేజీ 8 చూడండి.]

23. _____________________ను తిరుగుబాటు చేసేందుకు ప్రేరేపిస్తున్నాడనీ, _____________________ చెల్లించ వద్దన్నాడనీ, తానే _____________________ అని చెప్తున్నాడనీ యూదులు యేసుకు వ్యతిరేకంగా యూదయ ప్రాంతపు రోమా అధిపతియైన పిలాతు ఎదుట మూడు నిందారోపణలు చేశారు. (లూకా 23:2) [వారపు బైబిలు పఠనం; w90 12/1 పేజీ 9 పేరా 1 చూడండి.]

24. నిజ క్రైస్తవులు క్రిస్టమస్‌ను లేక అబద్ధ మత నమ్మకాలపై ఆధారపడిన ఇతర సెలవు దినాలను ఆచరించరు ఎందుకంటే వారు యెహోవాకు _____________________ని చెల్లిస్తారు; పాపభరితులైన మానవులను _____________________ సెలవు దినాలను కూడా వారు ఆచరించరు. [kl పేజీ 126 పేరా 16]

25. బైబిలు విద్యార్థులుగా మనం సమాచారాన్ని పరిశోధించడానికి అందుబాటులోవున్న ఇన్‌డెక్సులను ఉపయోగించడం నేర్చుకోవాలి, ప్రతి ప్రశ్నకు _____________________ లేక _____________________ అనే సమాధానాల్ని ఆశించకూడదు, _____________________ ఎడల, మన కుటుంబ సభ్యుల ఎడల మనకున్న ప్రేమను ప్రతిబింబించే _____________________ తీసుకోవాలి. [uw పేజీ 144 పేరా 13]

క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

26. అపొస్తలుడైన పేతురు చెప్పినదాని ప్రకారం, మనం (పశ్చాత్తాపం; నమ్మకం; విధేయత) చూపడానికి అవకాశమిస్తూ యెహోవా (దయ; ప్రేమ; సహనం) మన కాలం వరకు పొడిగించబడింది. (2 పేతు. 3:9) [rs పేజీ 429 పేరా 2]

27. ప్రజలను స్వతంత్రులనుగా చేసే సత్యం (విజ్ఞానశాస్త్రం; అబద్ధ మతం; యేసుక్రీస్తు)ను గూర్చిన సత్యమే, ఎందుకంటే దాని ద్వారానే మనం (అబద్ధ బోధలు; లోకసంబంధమైన ప్రచారం; మరణకరమగు పాపము) నుండి స్వతంత్రులం కాగలం. (యోహాను 8:12-36) [వారపు బైబిలు పఠనం; w88 5/1 పేజీ 9 పేరా 5 చూడండి.]

28. మనం దైవభక్తిగల జీవితాన్ని గడపడం (ఇతరులు మనతో ఎల్లప్పుడూ మంచిగానే వ్యవహరిస్తారని; ఇప్పుడు మనం వస్తుసంపదను సమృద్ధిగా కలిగి ఉంటామని; మనం సరైనది చేస్తున్నాము గనుక మనకు దేవుని అంగీకారం లభిస్తుందని) హామీ ఇస్తుంది. [kl పేజీ 118 పేరా 2]

29. “నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” అని యేసు అపొస్తలుడైన పేతురును అడిగినప్పుడు, (ఇతర శిష్యులను ప్రేమించడంకంటే; ఇతర శిష్యులు యేసును ప్రేమించడంకంటే; చేపలను ప్రేమించడంకంటే) ఎక్కువగా తనను ప్రేమిస్తున్నాడా అని ఆయన పేతురును అడిగాడు. (యోహాను 21:15) [వారపు బైబిలు పఠనం; w88 11/1 పేజీ 31 పేరా 9 చూడండి.]

30. యోహాను 10:16 నందు ప్రస్తావించబడిన “వేరే గొఱ్ఱెలు” (యూదయేతర క్రైస్తవులను; యూదులైన క్రైస్తవులను; భూపరదైసులో జీవించే ఉత్తరాపేక్ష ఉన్న వారందరిని) సూచిస్తాయి. [వారపు బైబిలు పఠనం; w95 4/15 పేజీ 31 పేరా 4 చూడండి.]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింద లేఖనాలను జత చేయండి: నిర్గ. 31:12, 13; సామె. 3:9, 10; మత్త. 5:14-16; లూకా 9:60, 62; 13:4, 5

31. తన శ్రోతలకు బాగా తెలిసిన ఒక దుస్సంఘటనను సూచిస్తూ యేసు విధివాద తర్కానికి వ్యతిరేకంగా వాదించాడు. ఆ దుస్సంఘటనకు కారణం కాలవశము, అనూహ్యమైన సంఘటన అని ఆయన తెలియజేశాడని స్పష్టమౌతుంది. [వారపు బైబిలు పఠనం; w96 9/1 పేజీ 5 పేరా 5 చూడండి.]

32. మోషే ధర్మశాస్త్రానికి మానవజాతియంతా కట్టుబడి ఉండాలని ఉద్దేశించబడలేదు. [uw పేజీ 147 పేరా 5]

33. రాజ్యములోకి ప్రవేశించాలంటే నిశ్చలమైన భక్తి అవసరం. [si పేజీ 192 పేరా 32]

34. సత్యారాధనకు తోడ్పడేందుకు మన సమయాన్ని, శక్తిని, మన విరాళాలతో పాటు ఇతర వనరులను ఉపయోగిస్తుండగా యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. [kl పేజీ 120 పేరా 8]

35. క్రైస్తవులైనవారు దేవుని నామానికి మరియు సంకల్పాలకు సంబంధించి లోకానికి క్రియాశీలులైన సాక్షులుగా ఉండాలి. [rs పేజీ 438 పేరా 4]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి