ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరు: ఈ క్రింది మూడు పుస్తకాల్లో దేన్నైనా ఒక్కొక్కటీ రూ. 45.00కు అందజేయాలి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (చిన్న సైజు రూ. 25.00), నా బైబిలు కథల పుస్తకం (చిన్న సైజు రూ. 30.00) లేదా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా, జూలై మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ధరకని చెప్పబడిన ఏ పుస్తకాన్నైనా రూ. 2.50కు ప్రతిపాదించవచ్చు. జనవరి: సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ లిస్ట్ చేసిన 192 పేజీల పాత పుస్తకాల్లో ఏదైనా. స్థానిక భాషల్లో అలాంటి పుస్తకాలు లభ్యం కానప్పుడు, జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను ఒక్కొక్కదానికి రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) లేదా సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ లిస్ట్ చేసిన 192 పేజీల పుస్తకాల్లో దేనినైనా ప్రతిపాదించవచ్చు. స్థానిక భాషల్లో ఆ పుస్తకాలు లభించనప్పుడు జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను ఒక్కొక్కదానికి రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని రూ. 20.00 చందాకు. గృహ బైబిలు పఠనాలను ప్రారంభించడంలో దృష్టి కేంద్రీకరించండి.
గమనిక: పైన పేర్కొనబడిన ప్రచార సాహిత్యాలలో వేటినైనా ఇంకా రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారంపై (S-AB-14) రిక్వెస్ట్ చేయాలి. ఇప్పటికీ మా దగ్గర లభ్యమౌతున్న స్పెషల్-రేట్ పుస్తకాలు (ప్రచారకులకు, పయినీర్లకు, ప్రజలకు రూ. 2.50): అద్వితీయ సత్య దేవుని ఆరాధనలో ఐక్యమయ్యారు—తమిళం, నేపాలీ, మరాఠీ; గొప్ప బోధకుడు చెప్పేది వినడం—మరాఠీ; జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?—ఇంగ్లీష్; దేవుడు అబద్ధమాడజాలని సంగతులు—కన్నడ; నిత్య జీవమునకు నడుపు సత్యము—గుజరాతీ; “నీ రాజ్యము వచ్చుగాక”—గుజరాతీ, మరాఠీ, హిందీ; బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా—ఇంగ్లీష్; నిన్ను సంతోషపర్చు సువార్త—గుజరాతీ; “సమాధానకర్తయగు అధిపతి” ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్త భద్రత—ఇంగ్లీష్.
◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వేరొకరు సంఘ లెక్కలను డిసెంబరు 1న లేక సాధ్యమైనంత త్వరగా ఆడిట్ చేయాలి. ఇది జరిగిన తరువాత సంఘానికి తెలపండి.
◼ 1997, డిసెంబరు 26-28 తేదీల్లో కలకత్తాలో జరగాల్సిన జిల్లా సమావేశము, అవే తేదీల్లో Rabindra Sarobar Stadium Hall, Southern Avenue, Opposite Menoka Cinema, Calcuttaలో జరుగుతుంది.
◼ 1997, డిసెంబరు 12-14 తేదీల్లో సిలిగురిలో జరగాల్సిన జిల్లా సమావేశం క్రొత్త ప్రధాన కార్యాలయం అడ్రసు: Mr. Pradip Mondal, c/o G.N. Sarkar, Vidya Nilay, South Deshbondhu Para, Near Himachal Sangha, Siliguri Town P.O., WB 734 404.
◼ 1998లో ఉపయోగించడానికి సరిపడినన్ని ఫారములు ప్రతి సంఘానికి పంపించబడుతున్నాయి. దయచేసి ఈ ఫారాలను జాగ్రత్తగా ఉపయోగించండి. అవి దేనికోసం ఇవ్వబడ్డాయో అందుకే వాటిని ఉపయోగించాలి.
ఫారమ్‌లతోపాటు నాలుగు క్రొత్త వాచ్‌టవర్ పబ్లికేషన్ లిస్ట్ ప్రతులు పంపించబడతాయి. ఒకటి సెక్రటరీవద్ద, మిగతా మూడు లిటరేచర్, మ్యాగజిన్‌లు, అకౌంట్స్ చూసుకుంటున్న సహోదరులకు ఇవ్వాలి.
◼ 1998 కొరకైన వార్షిక వచనం: “యెహోవా నామమునుబట్టి ప్రార్థించే ప్రతి ఒక్కరు రక్షించబడతారు.”—రోమా. 10:13, NW. సంఘాలు క్రొత్త వార్షిక వచనంతో బోర్డును సిద్ధం చేసుకుని 1998, జనవరి 1న గాని ఆ తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని ప్రదర్శిస్తే బాగుంటుంది.
◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 1996—ఇంగ్లీష్
ఈ ఒక్క సంవత్సరపు ఇండెక్స్ పయినీర్లకు రూ. 8.00కు, ప్రచారకులకూ ప్రజలకూ రూ. 12.00కు లభ్యమౌతుంది.