నవంబరు సేవా కూటాలు
నవంబరు 3తో ప్రారంభమయ్యే వారం
పాట 48
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. దేశంలోని, అలాగే స్థానిక సంఘం యొక్క జూలై నెల ప్రాంతీయ పరిచర్య నివేదికపై వ్యాఖ్యానించండి.
15 నిమి: “క్రియాశీలతకు పెద్ద ద్వారం తెరవబడి ఉంది.” ప్రేక్షకుల చర్చ ఇమిడివున్న ప్రసంగం పెద్ద ఇస్తాడు. ప్రకటనా పనిలో మరింత భాగం కలిగి ఉండగల అందరినీ ప్రోత్సహించండి. ఆగస్టు 15, 1988, కావలికోట (ఆంగ్లం) 22వ పేజీలో ఇవ్వబడిన కొన్ని సలహాలను కూడా చేర్చండి.
20 నిమి: “రాజ్య వార్తలో ఆసక్తి చూపించిన వాళ్ళదగ్గరికి తిరిగి వెళ్ళండి.” ప్రశ్నా జవాబులు. 6వ పేరాలో ఇవ్వబడిన అందింపులను ప్రదర్శింపజేయండి. ఒక ప్రదర్శన బైబిలు పఠనాన్ని ఆరంభించేదై ఉండాలి.
పాట 144 మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 10తో ప్రారంభమయ్యే వారం
పాట 51
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్ట్. రాజ్య వార్త నెం. 35ను అందించవలసిన ప్రాంతం ఇంకా ఎంత ఉందో సంఘానికి తెలపండి. ప్రత్యేక ప్రచార కాలంలోని ఈ చివరి వారంలో పూర్తి భాగం కలిగి ఉండేందుకు అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “సాక్షులు కాని వివాహ భాగస్వాములకు చేరువవ్వండి.” అవిశ్వాసియైన వివాహజతలను గూర్చి వ్యక్తిగతంగా ఎక్కువగా తెలుసుకునేందుకు శ్రద్ధ ఉన్న ఇద్దరు పెద్దల మధ్య చర్చ. వాళ్ళు మే 15, 1989, కావలికోట (ఆంగ్లం) 17-18 పేజీల్లోని 6-9 పేరాల్లో ఇవ్వబడిన సలహాలను కూడా పరిగణిస్తారు. అక్టోబర్ 1, 1995, కావలికోట 10-11 పేజీల్లోని, 11-12 పేరాల్లో ఉన్న అనుభవాలను కూడా చేర్చండి.
పాట 148 మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 17తో ప్రారంభమయ్యే వారం
పాట 53
10 నిమి: స్థానిక ప్రకటనలు. రాజ్య వార్త నెం. 35ను పంచిపెట్టే కార్యక్రమంలో కలిగిన స్థానిక అనుభవాలను కొన్నింటిని పంచుకోండి.
15 నిమి: “ఇంటర్‌నెట్‌లో సువార్త.” ఈ శీర్షికను వివరించేందుకు ఆగస్టు 8, 1997 తేజరిల్లు!లోని సమాచారాన్ని ఉపయోగించండి. ముఖ్యమైన విషయాన్ని—ప్రజలకు సువార్తను చేరవేసేందుకు అందుబాటులో ఉన్న న్యాయసమ్మతమైన ప్రతిదానినీ ఉపయోగించాలన్న మన కోరికను వ్యక్తం చేయండి.
20 నిమి: ఈ అపూర్వ అవకాశాన్ని అందుకోండి! నవంబర్ 15, 1996, కావలికోట, 21-3 పేజీల ఆధారంగా ఒక ప్రసంగం.
పాట 151 మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 24తో ప్రారంభమయ్యే వారం
పాట 56
10 నిమి: స్థానిక ప్రకటనలు. “చతుర్వర్ణ ప్రెస్సులు” అనే బాక్స్‌ను చర్చించండి.
15 నిమి: సంఘ పుస్తక పఠనంలో మంచి మర్యాదలు. తమ ఇంట్లో పుస్తక పఠనాలను నిర్వహించేందుకు అనుమతించే కుటుంబాలు చూపే ఆతిథ్యాన్ని మనం ప్రశంసిస్తాం. ఇందుకు వాళ్ళవైపు నుండి చెప్పుకోదగినంతగా సిద్ధపాటు అవసరమౌతుంది. వాళ్ళకు కొన్ని అసౌకర్యాలు కూడా ఉంటాయి. మనం హాజరైనప్పుడు, మనం మంచి మర్యాద చూపించాలి, గౌరవాన్ని, పరిగణనను చూపించాలి. అలా చూపించడంలో ఈ క్రింది విషయాలు ఇమిడి ఉంటాయి: (1) నేల గానీ, కార్పెట్లు గానీ మురికవ్వకుండా ఉండేందుకు మన పాదాలను జాగ్రత్తగా తుడుచుకోవాలి, లేదా పాదరక్షలను విప్పడమే మీ ప్రాంతంలో అలవాటయితే అలా చేయాలి. (2) తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించాలి. వాళ్ళు మర్యాదగా ప్రవర్తిస్తున్నారా, పుస్తక పఠనం కోసం ఇంట్లో కేటాయించిన స్థలంలోనే ఉంటున్నారా అన్నది నిశ్చయపరచుకోవాలి. (3) గుంపు చిన్నదే కావచ్చు. వాతావరణం సాధారణంగా ఉండవచ్చు. కానీ ఇదీ సంఘ కూటమే. మనం రాజ్య మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ముస్తాబౌతామో అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ముస్తాబవ్వాలి. (4) కూటం తర్వాత అక్కడ కొంచెం సేపే సహవసించాలి. అలా ఆ ఇంటివారు సొంత విషయాలు చూసుకోవడానికి సమయం ఉంటుంది. (5) పఠనం తర్వాత అప్పుడప్పుడు అల్పాహారం అందరికీ ఇవ్వాలని గృహస్థుడు అనుకోవచ్చు. కానీ అలా చేయాలని ఎదురు చూడకూడదు, అలా చేయవలసిన అవసరమూ లేదు అని అందరూ అర్థం చేసుకోవాలి.
20 నిమి: బోధిస్తూ శిష్యులను చేయండి. ముగ్గురో నలుగురో ప్రచారకుల గుంపుతో సంఘ పెద్ద చర్చ జరుపుతూ, ఈ ప్రశ్నలకు మన పరిచర్య పుస్తకం 88-92 పేజీల ఆధారంగా జవాబులనిస్తాడు: (1) ఫలకరమైన పరిచర్యకు పునర్దర్శనాలను చేయడం ఎందుకంత ప్రాముఖ్యమై ఉంది? పునర్దర్శనం చేయడంలో ఉన్న సవాలును ఒకరు ఎలా ఎదుర్కోవచ్చు? (2) బైబిలు పఠనాలను ఆరంభించడాన్ని మనమెందుకంత నొక్కి చెబుతాం? బైబిలు పఠనాలను నిర్వహించడంలో మనమెలా నిపుణులం కాగలం? (3) విద్యార్థులను సంస్థ వైపుకు నడిపించడమెందుకు అంత ప్రాముఖ్యం? మనం దీనినెలా చేయగలం? ఇటీవలి మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌లు, అంటే 1996 జూన్, 1997 మార్చ్, ఏప్రిల్ సంచికల్లోని ఇన్‌సర్ట్‌లు ఈ రంగాల్లో తమకు ఎలా సహాయపడ్డాయో ఆ గుంపులోనివారు చెబుతారు.
పాట 160 మరియు ముగింపు ప్రార్థన.