అక్టోబరు సేవా కూటాలు
గమనిక: మన రాజ్య పరిచర్య రానున్న నెలల్లోని ప్రతివారం కోసం సేవా కూటాన్ని పట్టిక వేస్తుంది. అయితే, “దేవుని వాక్యంలో విశ్వాసం” జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు, ఆ తర్వాతి వారపు సేవా కూటంలో 30 నిమిషాలు సమావేశ కార్యక్రమం యొక్క పునఃసమీక్ష చేసేందుకు సంఘాలు కూటాల పట్టికలో అవసరమైన సవరింపులు చేసుకోవచ్చు. యోగ్యతగల, ముఖ్యాంశాలపై శ్రద్ధ కేంద్రీకరించగల ఇద్దరు ముగ్గురు సహోదరులకు సమావేశ కార్యక్రమంలోని ఒక్కో రోజు పునఃసమీక్షను ముందుగానే నియమించాలి. ఇలా బాగా సిద్ధపడిన పునఃసమీక్ష వ్యక్తిగతంగా అన్వయించుకునేలా, ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించేలా కీలక అంశాలను గుర్తుంచుకునేందుకు సంఘానికి సహాయపడుతుంది. ప్రేక్షకుల వ్యాఖ్యానాలూ, వివరించబడిన అనుభవాలూ క్లుప్తంగాను విషయానికి సంబంధించినవిగాను ఉండాలి.
అక్టోబరు 6తో ప్రారంభమయ్యే వారం
పాట 39 (4)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?” ప్రశ్నా జవాబులు. రాజ్య వార్త నెం. 35లోని ఉన్నతాంశాలను పునఃసమీక్షించండి. మీ ప్రాంతంలోని ప్రజలు ఈ సమాచారం నుండి ప్రయోజనం పొందగల కారణాలను చూపండి. దానిని పంచిపెట్టడంలో పూర్తి భాగాన్ని కలిగి ఉండేందుకు ఇప్పుడు పథకాలు వేసుకోవలసిన అవసరాన్నీ, ఆసక్తి కనబడిన ప్రతి చోటకు తిరిగి వెళ్ళే విషయంలో శ్రద్ధ చూపవలసిన అవసరాన్నీ నొక్కి చెప్పండి.
20 నిమి: “రాజ్య వార్త నెం. 35ను విస్తృతంగా పంచిపెట్టండి.” సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రారంభ ప్రసంగం. ప్రశ్నాజవాబులతో 5-8 పేరాల చర్చ. విపులమైన కార్యక్రమం కొరకైన స్థానిక ఏర్పాట్ల పునఃసమీక్ష. ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు పూర్తి చేశామని నిశ్చయపరచుకునే మార్గాలను చర్చించండి. బస్‌స్టాప్‌లలోనూ, చిన్న వ్యాపార స్థలాల్లోనూ, వాహనాలను పార్క్ చేసే స్థలాల్లోను, మరెక్కడైనా సరే ప్రజలకు సాక్ష్యమిచ్చేటప్పుడు ప్రచారకులు రాజ్య వార్త నెం. 35 ఉపయోగించవచ్చు. ప్రకటనా పనిని ఆరంభించేందుకు క్రొత్తవాళ్ళకు ఎలా సహాయపడవచ్చో సలహా ఇవ్వండి. ఏప్రిల్ 1995 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌లోని 11వ పేరాలోని సమాచారాన్ని ఇమడ్చండి. కొన్ని ప్రాంతాల్లో రాజ్య వార్తను పంచిపెట్టేటప్పుడు ఒంటరిగా చేయడమూ, బ్రీఫ్‌కేస్ తీసుకోకుండా ఉండడమూ ప్రయోజనకరంగా ఉండవచ్చు. డో మూడో క్లుప్త అందింపులను ప్రదర్శించండి.
పాట 126 (3) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 13తో ప్రారంభమయ్యే వారం
పాట 41 (6)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్ట్. కావలికోట, తేజరిల్లు!ల సరిక్రొత్త పత్రికల్లోవున్న మాట్లాడగల అంశాలను పునఃసమీక్షించండి. వారాంతపు కార్యక్రమంలో రాజ్య వార్త నెం. 35తో పాటు పత్రికలనూ చందాలనూ ప్రతిపాదిస్తామని అందరికీ జ్ఞాపకం చేయండి. ఆసక్తి చూపించిన వారందరి దగ్గరికీ మనం మళ్ళీ వెళ్ళాలి.
15 నిమి: స్థానిక అవసరతలు.
18 నిమి: “మీరు నిర్వికారం ఎడల ఎలా ప్రతిస్పందిస్తారు?” ఇద్దరు పెద్దల మధ్య చర్చ. జూలై 15, 1974, కావలికోట (ఆంగ్లం) 445-6 పేజీల్లో “మీరు నిర్వికారంపై ఎలా దాడి చేయగలరు” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారంపై వ్యాఖ్యనాలను ఇమడ్చండి.
పాట 130 (22) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 20తో ప్రారంభమయ్యే వారం
పాట 42 (21)
15 నిమి: స్థానిక ప్రకటనలు. 1996 వార్షికపుస్తకం (ఆంగ్లం) 6-8 పేజీల్లో “రాజ్య వార్తను భూగోళమంతటా పంచిపెట్టడం”లోని కొన్ని అనుభవాలను పునఃసమీక్షించండి. గత రాజ్య వార్త పంపకంలో ప్రచారకులు వ్యక్తిగతంగా చేసిన గట్టి ప్రయత్నాలను ఉన్నతపర్చండి. రాజ్య వార్త నెం. 35 పంపకంలో పూర్తి భాగాన్ని కలిగి ఉండేందుకు అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “నేను బాప్తిస్మం పొందాలా?” బాప్తిస్మం పొందని ప్రచారకులందరూ బాప్తిస్మం పొందేలా పురోగతిని సాధించాలని ప్రోత్సహిస్తూ అక్టోబరు 1, 1992 కావలికోట (ఆంగ్లం) 20-3 పేజీల ఆధారంగా ఉత్సాహకరమైన ప్రసంగాన్ని పెద్ద ఇస్తాడు. తమ పిల్లలు చిన్న వయస్సులోనే ప్రచారకులయ్యేందుకూ, తర్వాత బాప్తిస్మం పొందేందుకు క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా సహాయపడగలరో చూపిస్తూ అక్టోబరు 1, 1994 కావలికోట 26-30 పేజీల్లోని వ్యాఖ్యానాలను జతచేయండి.
15 నిమి: “మీరు పూర్తికాల సాక్షియేనా?” పెద్ద ప్రసంగమిస్తాడు.
పాట 133 (3) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 27తో ప్రారంభమయ్యే వారం
పాట 43 (4)
12 నిమి: స్థానిక ప్రకటనలు. రాజ్య వార్త నెం. 35 పంపకంలోని పురోగతిపై పునఃసమీక్షించండి. ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. మీ ప్రాంతంలో ఎంతమేరకు పనిపూర్తి చేయబడిందో, నవంబరు 16కెల్లా ఇంకా ఎంత ఎక్కువగా పూర్తి చేయగలరో తెలపండి. రాజ్య వార్త సరఫరా అయిపోయిన తర్వాత, ఆ నెలలోని మిగిలిన రోజుల్లో మనం జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదిస్తాం. రాజ్య వార్తకు మంచి ప్రతిస్పందన లభించిన చోట పునర్దర్శనాలు చేసి పఠనాలను ఆరంభించే లక్ష్యాన్ని నొక్కి చెప్పండి.
15 నిమి: నిరాశ మధ్యన నిరీక్షణను కనుగొనే విధానం. మే 15, 1997, కావలికోట 22-5 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
18 నిమి: మీ వెలుగును ప్రకాశించనివ్వండి. మన పరిచర్య పుస్తకం 84-8 పేజీల ఆధారంగా ప్రసంగమూ మరియు చర్చ. (1) యెహోవాసాక్షులు ఇంటింటా ఎందుకు ప్రకటిస్తారు? (2) మొదటి శతాబ్దంలో ఈ పద్ధతి ఎంత మేరకు ఉపయోగించబడింది? (3) నేడు ఇంటింటా ప్రకటించవలసిన అత్యవసరం ఎందుకుంది? (4) మనం క్రమంగా పాల్గొనడాన్ని ఏ పరిస్థితులు కష్టతరం చేయవచ్చు? (5) మనం పట్టువిడువకుండా ఉండేందుకు ఎలా సహాయం పొందగలం? (6) మన వెలుగును ప్రకాశించనివ్వడం ద్వారా మనమెలా ఆశీర్వదించబడ్డాం? (7) ప్రజలను కలవడంలో మరింత సఫలీకృతులమయ్యేందుకు మనమేమి చేయగలం? అనే ప్రశ్నలపై నిర్దిష్ట వ్యాఖ్యానాలను చేసేందుకు ప్రచారకులను ముందుగానే ఏర్పాటు చేయండి. దుకాణాల్లో పని చేసినప్పడు లేదా వీధి సాక్ష్యమిచ్చినప్పుడు తమకు కలిగిన ప్రోత్సాహకరమైన అనుభవాలను ముగ్గురు లేదా నలుగురు ప్రచారకులతో చెప్పించి విశదీకరించండి.
పాట 136 (26) మరియు ముగింపు ప్రార్థన.