1998 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
నిర్దేశాలు
1998లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు ఈ క్రింది ఏర్పాట్లుంటాయి.
పాఠ్యపుస్తకాలు: పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము [bi12] (ఆంగ్లం), కావలికోట [w], “ప్రతి లేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం) (1990వ సంపుటి) [si], “చర్చనీయ బైబిలు అంశములు” [td], నిత్యజీవానికి నడిపించే జ్ఞానము [kl], కుటుంబ సంతోషానికి గల రహస్యము [fy] అనే పుస్తకాలపై అసైన్‌మెంట్లు ఆధారపడి ఉంటాయి.
పాట, ప్రార్థన, మరియు ఆహ్వానపు మాటలతో పాఠశాల సరిగ్గా సమయానికి ప్రారంభమవ్వాలి. ఆ తర్వాత ఈ క్రింది విధంగా కొనసాగుతుంది:
అసైన్‌మెంట్ నెం. 1: 15 నిమిషాలు. దీనిని ఓ సంఘ పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహించాలి. ఇది కావలికోట లేదా “ప్రతిలేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై యున్నది”పై ఆధారపడి ఉంటుంది. కావలికోటపై ఆధారపడినప్పుడు, ఈ అసైన్‌మెంట్‌ను మౌఖిక పునఃసమీక్ష చేయకుండానే 15 నిమిషాల ఉపదేశ ప్రసంగంగా నిర్వహించాలి. “ప్రతిలేఖనము” పుస్తకం ఆధారంగానైతే, 10-12 నిమిషాల ఉపదేశ ప్రసంగాన్నిచ్చి, ప్రచురణలోని ముద్రిత ప్రశ్నలను ఉపయోగిస్తూ 3-5 నిమిషాల మౌఖిక పునఃసమీక్ష చేయాలి. సమాచారమంతా చెప్పాలన్నదే లక్ష్యమై ఉండక, చర్చించే సమాచారంలోని ఆచరణాత్మక విలువపై శ్రద్ధ నిలపాలన్నది లక్ష్యమై ఉండాలి. చూపించబడిన మూలాంశాన్ని ఉపయోగించాలి.
ఈ ప్రసంగం నియమించబడిన సహోదరులు దీనిని నిర్ణీత సమయంలోనే ముగించడానికి జాగ్రత్తపడాలి. అవసరమైతే లేదా ప్రసంగీకుడు కోరినట్లైతే ఒంటరిగా ఉన్నప్పుడు సలహా ఇవ్వవచ్చు.
చదవవలసిన బైబిలు భాగంలోని ఉన్నతాంశాలు: 6 నిమిషాలు. సమాచారాన్ని ప్రాంతీయ అవసరతలకు తగినట్లు ఫలవంతముగా అన్వయించగల సంఘపెద్ద లేదా పరిచర్య సేవకుడు దీన్ని నిర్వహించాలి. ఇది కేవలం నియమిత పాఠ్యభాగ సారాంశమై ఉండకూడదు. 30 నుండి 60 సెకండ్లు నియమిత అధ్యాయాల సంగ్రహ పునఃసమీక్షను ఇమడ్చవచ్చు. అయితే, ఆ సమాచారం మనకు ఎందుకు, ఎలా విలువైనదో గుణగ్రహించేందుకు ప్రేక్షకులకు సహాయపడాలన్నదే దాని ముఖ్యోద్దేశం. తర్వాత పాఠశాల అధ్యక్షుడు విద్యార్థులను వారి వేర్వేరు తరగతి గదులకు పంపిస్తాడు.
అసైన్‌మెంట్ నెం. 2. 5 నిమిషాలు. చదవడానికి ఒక సహోదరునికి ఇవ్వవలసిన నియమిత బైబిలు భాగమిది. ముఖ్య పాఠశాలలోనూ అలాగే సహాయ గుంపుల్లోనూ ఇది వర్తిస్తుంది. విద్యార్థి ప్రారంభ ముగింపు మాటల్లో క్లుప్త వివరణాత్మక సమాచారాన్ని అందించేందుకు వీలయ్యేలా చదవవలసిన ఈ నియమిత భాగాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. పూర్వ చరిత్రను ప్రవచనార్థక లేదా సిద్ధాంత సంబంధమైన భావాలను సూత్రాల అన్వయింపులను కూడా చేర్చవచ్చు. నియమిత వచనాలను అన్నింటిని ఆపకుండా చదవాలి. అయితే, చదవాల్సిన వచనాలు వరుసగా లేనప్పుడు, చదవడం మరలా ఎక్కడినుండి కొనసాగుతుందో విద్యార్థి పేర్కొనవచ్చు.
అసైన్‌మెంట్ నెం. 3: 5 నిమిషాలు. ఇది సహోదరీలకు నియమించబడుతుంది. ఈ అందింపు అంశం నూతనలోక అనువాదములోని “చర్చనీయ బైబిలు అంశములు”పై లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము, కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాలపై ఆధారపడి ఉంటుంది. నియమించబడే విద్యార్థినికి చదవడం వచ్చి ఉండాలి. మూలాంశాన్ని, సమాచారాన్ని ఆచరణాత్మకమైన ఒక సన్నివేశంలోనికి మలచడానికి ఆమె ప్రయత్నించాలి. ప్రాంతీయ పరిచర్య లేక అనియత సాక్ష్యం ఇమిడి ఉన్న సన్నివేశమే ఉత్తమం. ఈ సమాచారాన్ని అందించేటప్పుడు విద్యార్థిని కూర్చోవడమో, నిలబడడమో చేయవచ్చు. పాఠశాల అధ్యక్షుడు ఒక సహాయకురాలిని నియమిస్తాడు, అయితే మరొక సహాయకురాలిని కూడ తీసుకోవచ్చు. గృహస్థురాలు సమాచారాన్ని హేతుబద్ధంగా ఆలోచించేందుకూ, అర్థం చేసుకునేందుకూ విద్యార్థిని ఎలా సహాయపడుతుంది, లేఖనాలను ఎలా అన్వయిస్తుంది అనే విషయాల్లో పాఠశాల పైవిచారణకర్త ముఖ్యంగా ఆసక్తి కలిగి ఉంటాడు. జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను పరిశీలిస్తున్నప్పుడు పుస్తకంలోని పేరాలను గృహస్థురాలితో చదివించాలా వద్దా అన్నది విద్యార్థిని నిర్ణయించుకోవచ్చు. సన్నివేశానికి కాదుగాని సమాచారాన్ని ఫలవంతంగా ఉపయోగించేందుకే ప్రాముఖ్యతనివ్వాలి.
అసైన్‌మెంట్ నెం. 4: 5 నిమిషాలు. ఇదొక సహోదరునికి లేదా సహోదరికి నియమించబడుతుంది. ఇది “చర్చనీయ బైబిలు అంశములు” మీద లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యముపై ఆధారపడివుంటుంది. ప్రతి అసైన్‌మెంట్‌కు మూలాంశం పట్టికలో ఇవ్వబడుతుంది. ఇది సహోదరునికి నియమించబడినప్పుడు, ఇది ప్రేక్షకులందరినీ చూస్తూ చేసే ప్రసంగమై ఉండాలి. రాజ్య మందిర ప్రేక్షకులను మనస్సులో పెట్టుకుని ఆయన తన ప్రసంగాన్ని సిద్ధపడడం ఉత్తమం, అప్పుడు దానిని వాస్తవంగా వినేవారికి అది నిజంగా జ్ఞానాన్నందించేదిగాను, ప్రయోజనకరమైనదిగాను ఉంటుంది. ఈ భాగం ఒక సహోదరికి నియమించబడినప్పుడు, అసైన్‌మెంట్ నెం. 3 కొరకు సంక్షిప్తపరచబడినట్లుగానే చేయాలి.
*చదవవలసిన బైబిలు భాగం అదనపు పట్టిక: ప్రతి వారం కొరకు ఇవ్వబడిన పాట నెంబర్ తరువాత ఇది బ్రాకెట్లలో ఇవ్వబడుతుంది. ఈ పట్టికను అనుసరిస్తూ వారానికి పది పేజీలను చదవడం ద్వారా మూడు సంవత్సరాల్లో బైబిలు మొత్తం చదవవచ్చు. పాఠశాల కార్యక్రమంలోని లేదా వ్రాతపూర్వక పునఃసమీక్షలోని ఏ భాగమూ అదనపు భాగ పట్టికపై ఆధారపడి ఉండవు.
గమనిక: అదనపు సమాచారం కోసమూ, సలహా, సమయం, వ్రాతపూర్వక పునఃసమీక్షలూ, అసైన్‌మెంట్‌ల కొరకు సిద్ధపడడం వంటి వాటిని గూర్చిన నిర్దేశం కోసమూ దయచేసి అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్య 3వ పేజీ చూడండి.
పట్టిక
జన. 5 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 7-8
పాట నెం. 162 (18) [*ఆదికాండము 1-9]
నెం. 1: ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట’ (w96 1/1 పే. 29-31)
నెం. 2: అపొస్తలుల కార్యములు 7:44-60
నెం. 3: సర్వోన్నత అధికారానికి సదా విధేయులవ్వండి (kl పే. 130-1 పేరాలు 1-6)
నెం. 4: td 31డి మనం యేసుక్రీస్తులో విశ్వసించడం ఎందుకు తప్పనిసరి
జన. 12 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 9-10
పాట నెం. 14 (8) [*ఆదికాండము 10-18]
నెం. 1: ధైర్యశాలియైన దేవునివాక్య ప్రచారకుని(రాలి)గా ఉండండి (w96 1/15 పే. 24-5)
నెం. 2: అపొస్తలుల కార్యములు 9:1-16
నెం. 3: పై అధికారులకు లోబడి ఉండండి (kl పే. 132-3 పేరాలు 7-10)
నెం. 4: td 33బి దేవుని రాజ్యం మానవజాతి కొరకు ఏమి చేస్తుంది
జన. 19 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 11-13
పాట నెం. 187 (17) [*ఆదికాండము 19-24]
నెం. 1: మీకు కనిపించేవాటికి మించినవి చూడండి! (w96 2/15 27-9)
నెం. 2: అపొస్తలుల కార్యములు 13:1-12
నెం. 3: కుటుంబంలోని అధికారం విషయంలో దేవుని ఏర్పాటును గుణగ్రహించండి (kl పే. 134-6 పేరాలు 11-18)
నెం. 4: td 33ఇ దేవుని రాజ్యం మానవ ప్రయత్నాల వల్ల రాదు
జన. 26 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 14-16
పాట నెం. 163 (23) [*ఆదికాండము 25-30]
నెం. 1: మీ వివాహ ప్రమాణానికి తగినట్లు జీవించడం (w96 3/1 పే. 19-22)
నెం. 2: అపొస్తలుల కార్యములు 16:1-15
నెం. 3: సంఘంలో అధికారం—యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటు (kl పే. 137-9 పేరాలు 19-25)
నెం. 4: td 34బి అంత్యదినముల రుజువు విషయమై మెలకువగా ఉండండి
ఫిబ్ర. 2 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 17-19
పాట నెం. 97 (6) [*ఆదికాండము 31-36]
నెం. 1: యెహోవా—నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు (w96 3/15 పే. 21-3)
నెం. 2: అపొస్తలుల కార్యములు 18:1-11
నెం. 3: సంతోషకరమైన కుటుంబానికి యథార్థత ఎలా దోహదపడుతుంది (kl పే. 140-1 పేరాలు 1-6)
నెం. 4: td 36డి పరలోకానికి ప్రతి ఒక్కరూ వెళ్ళరు
ఫిబ్ర. 9 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 20-21
పాట నెం. 103 (11) [*ఆదికాండము 37-42]
నెం. 1: ఎల్లప్పుడూ మీ భారాన్ని యెహోవా మీద మోపండి (w96 4/1 పే. 27-30)
నెం. 2: అపొస్తలుల కార్యములు 21:1-14
నెం. 3: వివాహం జీవితంలో సమాచార వినిమయం యొక్క ముఖ్య పాత్ర (kl పే. 142-3 పేరాలు 7-9)
నెం. 4: td 38బి వివాహ ఐక్యతను ఘనమైనదిగా ఎంచడం తప్పనిసరి
ఫిబ్ర. 16 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 22-24
పాట నెం. 107 (4) [*ఆదికాండము 43-49]
నెం. 1: ‘మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయము కలదు’ (w96 5/15 పే. 21-3)
నెం. 2: అపొస్తలుల కార్యములు 22:1-16
నెం. 3: మీ వివాహ జతకు ఘనతనూ గౌరవాన్నీ ఇవ్వండి (kl పే. 143-4 పేరాలు 10-14)
నెం. 4: td 38డి పిల్లల ఎడల క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత
ఫిబ్ర. 23 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 25-26
పాట నెం. 89 (23) [*ఆదికాండము 50-నిర్గమకాండము 7]
నెం. 1: దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి? (w96 6/15 పే. 4-7)
నెం. 2: అపొస్తలుల కార్యములు 25:1-12
నెం. 3: మంచి మాదిరినుంచి మీ పిల్లల ఎడల ప్రేమను చూపండి (kl పే. 145-6 పేరాలు 15-18)
నెం. 4: td 38ఎఫ్ నిజ క్రైస్తవులు బహుభార్య/భర్తలు గలవారు కాదు
మార్చి 2 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 27-28
పాట నెం. 193 (18) [*నిర్గమకాండము 8-13]
నెం. 1: అపొస్తలుల కార్యములు—ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 204-5 పేరాలు 32-40)
నెం. 2: అపొస్తలుల కార్యములు 27:33-44
నెం. 3: ప్రేమపూర్వకమైన క్రమశిక్షణా నిపుణమైన నడిపింపూ దేనిని సాధించగలవు (kl పే. 148-9 పేరాలు 19-23)
నెం. 4: td 39సి మరియ “నిత్య కన్యక” కాదని బైబిలు చూపిస్తుంది
మార్చి 9 చదవవలసిన బైబిలు భాగం: రోమీయులు 1-3
పాట నెం. 92 (4) [*నిర్గమకాండము 14-20]
నెం. 1: రోమీయులకు ఉపోద్ఘాతం (si పే. 205-6 పేరాలు 1-7)
నెం. 2: రోమీయులు 1:18-32
నెం. 3: మనం దేవునికి సన్నిహితులమవ్వాలని ఎందుకు కోరుకుంటాం (kl పే. 150-1 పేరాలు 1-5)
నెం. 4: td 40బి మాస్ ఆచరణ లేఖన రహితం
మార్చి 16 చదవవలసిన బైబిలు భాగం: రోమీయులు 4-6
పాట నెం. 36 (9) [*నిర్గమకాండము 21-27]
నెం. 1: “అట్టివారిని సన్మానించుడి” (w96 6/15 పే. 28-30)
నెం. 2: రోమీయులు 4:1-15
నెం. 3: దేవునికి సన్నిహితులమయ్యేందుకు అవసరమైనవి (kl పే. 152-3 పేరాలు 6-9)
నెం. 4: td 42ఎ క్రైస్తవుల ఎడల గల వ్యతిరేకతకు కారణం
మార్చి 23 చదవవలసిన బైబిలు భాగం: రోమీయులు 7-9
పాట నెం. 84 (6) [*నిర్గమకాండము 28-33]
నెం. 1: “సహజ జ్ఞానముగల” జీవులు మనకు ఏమి నేర్పించగలవు (w96 7/15 పే. 21-3)
నెం. 2: రోమీయులు 9:1-18
నెం. 3: దేవునితో మాట్లాడండి ఆయన ఆలకించేలా ఉండండి (kl పే. 153-5 పేరాలు 10-14)
నెం. 4: td 42సి తనను దేవుడి నుండి వేరు చేసేందుకు భార్య తన భర్తను అనుమతించకూడదు
మార్చి 30 చదవవలసిన బైబిలు భాగం: రోమీయులు 10-12
పాట నెం. 165 (20) [*నిర్గమకాండము 34-39]
నెం. 1: వాగ్దాన దేశం నుండి ఆచరణాత్మకమైన పాఠాలు (w96 8/15 పే. 4-8)
నెం. 2: రోమీయులు 10:1-15
నెం. 3: ప్రార్థనలోనూ ఆలకించడంలోనూ పట్టుదల కలిగివుండండి (kl పే. 156-9 పేరాలు 15-20)
నెం. 4: td 43ఎ దేవుడు ఆలకించే ప్రార్థనలు
ఏప్రి. 6 చదవవలసిన బైబిలు భాగం: రోమీయులు 13-16
పాట నెం. 175 (5) [*నిర్గమకాండము 40-లేవీయకాండము 7]
నెం. 1: రోమీయులు—ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 208-9 పేరాలు 20-5)
నెం. 2: రోమీయులు13:1-10
నెం. 3: దేవుని ప్రజల మధ్య నిజమైన భద్రతను కనుగొనండి (kl పే. 160-1 పేరాలు 1-4)
నెం. 4: td 44ఎ మానవుని విధి వ్రాయబడలేదు
ఏప్రి. 13 చదవవలసిన బైబిలు భాగం: 1 కొరింథీయులు 1-3
పాట నెం. 86 (23) [*లేవీయకాండము 8-13]
నెం. 1: 1 కొరింథీయులకు ఉపోద్ఘాతం (si పే. 210-11 పేరాలు 1-7)
నెం. 2: 1 కొరింథీయులు 1:10-25
నెం. 3: యెహోవా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎలా అందిస్తున్నాడు (kl పే. 161-3 పేరాలు 5-8)
నెం. 4: td 46బి యేసు ఎందుకు క్రయధనాన్ని చెల్లించగలిగాడు
ఏప్రి. 20 చదవవలసిన బైబిలు భాగం: 1 కొరింథీయులు 4-6
పాట నెం. 170 (21) [*లేవీయకాండము 14-19]
నెం. 1: బైబిలు విధి యందు నమ్మకాన్ని బోధిస్తుందా? (w96 9/1 పే. 4-7)
నెం. 2: 1 కొరింథీయులు 4:1-13
నెం. 3: ప్రేమను ధరించుకొనియుండడమంటే ఏమిటి (kl పే. 163-6 పేరాలు 9-14)
నెం. 4: td 47సి అబద్ధ బోధలను ఖండించడం తప్పా?
ఏప్రి. 27 వ్రాతపూర్వక పున:సమీక్ష. అపొస్తలుల కార్యములు 7-1 కొరింథీయులు 6
పాట నెం. 26 (3) [*లేవీయకాండము 20-25]
మే 4 చదవవలసిన బైబిలు భాగం: 1 కొరింథీయులు 7-9
పాట నెం. 152 (6) [*లేవీయకాండము 26-సంఖ్యాకాండము 3]
నెం. 1: మీరు నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముందా? (w96 9/15 పే. 22-4)
నెం. 2: 1 కొరింథీయులు 7:10-24
నెం. 3 సంఘం—భద్రతగల ఒక స్థలం (kl పే. 167-9 పేరాలు 15-20)
నెం. 4: td 47జి దేవుడు అన్ని మతాల్లోనూ మంచిని చూస్తాడా?
మే 11 చదవవలసిన బైబిలు భాగం: 1 కొరింథీయులు 10-12
పాట నెం. 185 (24) [*సంఖ్యాకాండము 4-9]
నెం. 1: తిరిగి మంటికి చేరడం—ఎలా? (w96 9/15 పే. 29-31)
నెం. 2: 1 కొరింథీయులు 11:1-16
నెం. 3: యేసును అనుకరించండి—దేవుడ్ని నిరంతరం సేవించండి (kl పే. 170-1 పేరాలు 1-6)
నెం. 4: td 48బి మృతులు ఎక్కడికి పునరుత్థానం చేయబడతారు?
మే 18 చదవవలసిన బైబిలు భాగం: 1 కొరింథీయులు 13-14
పాట నెం. 55 (1) [*సంఖ్యాకాండము 10-15]
నెం. 1: ఒకరు తన ఇంటివారిని పోషించడంలో ఉన్న సవాలు (w96 10/1 పే. 29-31)
నెం. 2: 1 కొరింథీయులు 14:1-12
నెం. 3: నిత్యజీవానికి నడిపే ముఖ్యమైన చర్యలు (kl పే. 173-5 పేరాలు 7-9)
నెం. 4 td 49బి క్రీస్తు మరలా రావడం భౌతిక వాస్తవాలను బట్టి గుర్తించబడుతుంది
మే 25 చదవవలసిన బైబిలు భాగం: 1 కొరింథీయులు 15-16
పాట నెం. 158 (23) [*సంఖ్యాకాండము 16-22]
నెం. 1: 1 కొరింథీయులు—ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 213-14 పేరాలు 23-6)
నెం. 2: 1 కొరింథీయులు 16:1-13
నెం. 3: బాప్తిస్మం ఎందుకు అవసరం (kl పే. 175-6 పేరాలు 10-12)
నెం. 4: td 50బి సబ్బాతు నియమం క్రైస్తవులకు ఇవ్వబడలేదు
జూన్ 1 చదవవలసిన బైబిలు భాగం: 2 కొరింథీయులు 1-4
పాట నెం. 63 (22) [*సంఖ్యాకాండము 23-29]
నెం. 1: 2 కొరింథీయులకు ఉపోద్ఘాతం (si పే. 214 పేరాలు 1-4)
నెం. 2: 2 కొరింథీయులు 4:1-12
నెం. 3: బాప్తిస్మం—మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన మైలురాయి (kl పే. 177 పేరాలు 13-16)
నెం. 4: td 51బి దేవుడు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణనిస్తాడు
జూన్ 8 చదవవలసిన బైబిలు భాగం: 2 కొరింథీయులు 5-8
పాట నెం. 102 (24) [*సంఖ్యాకాండము 30-35]
నెం. 1: మరణం తరువాత జీవితం—ఎలా, ఎక్కడ, ఎప్పుడు? (w96 10/15 పే. 4-7)
నెం. 2: 2 కొరింథీయులు 7:1-13
నెం. 3: మీ సమర్పణకూ బాప్తిస్మానికి తగినట్లుగా జీవించడమంటే ఏమిటి? (kl పే. 178-80 పేరాలు 17-22)
నెం. 4: td 51ఇ “సర్వ జన రక్షణ” లేఖన రహితము
జూన్ 15 చదవవలసిన బైబిలు భాగం: 2 కొరింథీయులు 9-13
పాట నెం. 129 (18) [*సంఖ్యాకాండము 36-ద్వితీయోపదేశకాండము 4]
నెం. 1: 2 కొరింథీయులు—ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 216-17 పేరాలు 18-20)
నెం. 2: 2 కొరింథీయులు 10:1-12
నెం. 3: “వాస్తవమైన జీవము” కొరకు ఇప్పుడు సిద్ధపడడం (kl పే. 181-2 పేరాలు 1-5)
నెం. 4: td 53బి ఆదాము పాపం వల్ల అందరూ ఎందుకు కష్టాలననుభవిస్తున్నారు
జూన్ 22 చదవవలసిన బైబిలు భాగం: గలతీయులు 1-3
పాట నెం. 127 (15) [*ద్వితీయోపదేశకాండము 5-11]
నెం. 1: గలతీయులకు ఉపోద్ఘాతం (si పే. 217-18 పేరాలు 1-6)
నెం. 2: గలతీయులు 1:1-12
నెం. 3: అర్మగిద్దోను తర్వాత—ఒక పరదైసు భూమి (kl పే. 182-4 పేరాలు 6-11)
నెం. 4: td 53ఎఫ్ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపమంటే ఏంటి?
జూన్ 29 చదవవలసిన బైబిలు భాగం: గలతీయులు 4-6
పాట నెం. 98 (16) [*ద్వితీయోపదేశకాండము 12-19]
నెం. 1: గలతీయులు—ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 219-20 పేరాలు 14-18)
నెం. 2: గలతీయులు 6:1-18
నెం. 3: అంతటా సమాధానం మరియు మృతుల పునరుత్థానం (kl పే. 184-7 పేరాలు 12-18)
నెం. 4: td 54బి ఆత్మకు ప్రాణమునకు మధ్య తేడా ఏమిటి?
జూలై 6 చదవవలసిన బైబిలు భాగం: ఎఫెసీయులు 1-3
పాట నెం. 106 (7) [*ద్వితీయోపదేశకాండము 20-27]
నెం. 1: ఎఫెసీయులకు ఉపోద్ఘాతం (si పే. 220-1 పేరాలు 1-8)
నెం. 2: ఎఫెసీయులు 1:1-14
నెం. 3: పరిపూర్ణత అంటే ఏమిటి, మనం దానినెలా అనుభవించవచ్చు (kl పే. 187-91 పేరాలు 19-25)
నెం. 4: td 55బి జీవశక్తి మానవునిదైనా జంతువుదైనా ఆత్మ అనే పిలువబడుతుంది
జూలై 13 చదవవలసిన బైబిలు భాగం: ఎఫెసీయులు 4-6
పాట నెం. 138 (21) [*ద్వితీయోపదేశకాండము 28-32]
నెం. 1: ఎఫెసీయులు—ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 222-3 పేరాలు 16-19)
నెం. 2: ఎఫెసీయులు 6:1-13
నెం. 3: td 55సి నిజ క్రైస్తవులు అన్ని రకముల అభిచారమును ఎందుకు విడనాడాలి
నెం. 4: కుటుంబం సంకట పరిస్థితిలో ఉంది (fy పే. 1-9 పేరాలు 1-14)
జూలై 20 చదవవలసిన బైబిలు భాగం: ఫిలిప్పీయులు 1-4
పాట నెం. 123 (4) [*ద్వితీయోపదేశకాండము 33-యెహోషువా 6]
నెం. 1: ఫిలిప్పీయులకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 223-4 పేరాలు 1-7; పే. 225 పేరాలు 12-14)
నెం. 2: ఫిలిప్పీయులు 1:1-14
నెం. 3: కుటుంబ సంతోషానికి గల రహస్యం (fy పే. 9-12 పేరాలు 15-23)
నెం. 4: td 58డి దేవుడూ క్రీస్తూ ఎలా ఒకటై ఉన్నారు
జూలై 27 చదవవలసిన బైబిలు భాగం: కొలొస్సయులు 1-4
పాట నెం. 64 (7) [*యెహోషువా 7-12]
నెం. 1: కొలొస్సయులకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 226 పేరాలు 1-5; పే. 228 పేరాలు 12-14)
నెం. 2: కొలొస్సయులు 4:1-13
నెం. 3: td 58ఇ పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి
నెం. 4: మీరు వివాహానికి సిద్ధంగా ఉన్నారా? (fy పే. 13-15 పేరాలు 1-6)
ఆగ. 3 చదవవలసిన బైబిలు భాగం: 1 థెస్సలొనీకయులు 1-5
పాట నెం. 35 (23) [*యెహోషువా 13-19]
నెం. 1: 1 థెస్సలొనీకయులకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 229 పేరాలు 1-5; పే. 231 పేరాలు 13-15)
నెం. 2: 1 థెస్సలొనీకయులు 2:1-12
నెం. 3: మీరు ఎందుకు మిమ్మల్ని గురించి తెలుసుకుని, వాస్తవికంగా ఉండాలి (fy పే. 16-18 పేరాలు 7-10)
నెం. 4: td 59ఇ దేవుని కనికరము నుండి ప్రయోజనం పొందండి
ఆగ. 10 చదవవలసిన బైబిలు భాగం: 2 థెస్సలొనీకయులు 1-3
పాట నెం. 132 (21) [*యెహోషవా 20-న్యాయాధిపతులు 1]
నెం. 1: 2 థెస్సలొనీకయులకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 232 పేరాలు 1-4; పే. 233 పేరాలు 10-11)
నెం. 2: 2 థెస్సలొనీకయులు1:1-12
నెం. 3: td 59ఎఫ్ దేవుని రాజ్యమే మానవుని ఏకైక నిరీక్షణ
నెం. 4: వివాహజతలో దేనిని వెదకాలి (fy పే. 18-22 పేరాలు 11-15)
ఆగ. 17 చదవవలసిన బైబిలు భాగం: 1 తిమోతి 1-3
పాట నెం. 38 (16) [*న్యాయాధిపతులు 2-7]
నెం. 1: 1 తిమోతికి ఉపోద్ఘాతం (si పే. 234 పేరాలు 1-6)
నెం. 2: 1 తిమోతి 1:3-16
నెం. 3: శాశ్వతంగా నిలిచే ఒప్పందాన్ని చేసుకునే ముందు పరిగణించవలసిన విషయాలు (fy పే. 22-3 పేరాలు 16-19)
నెం. 4: td 60జి సర్వ మానవుల రక్తం విషయంలో నిరపరాధులుగా ఉండండి
ఆగ. 24 చదవవలసిన బైబిలు భాగం: 1 తిమోతి 4-6
పాట నెం. 39 (4) [*న్యాయాధిపతులు 8-13]
నెం. 1: 1 తిమోతి—ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 236-7 పేరాలు 15-19)
నెం. 2: 1 తిమోతి 4:1-16
నెం. 3: td 1ఎ పూర్వికుల ఆరాధనను దేవుడు ఎందుకు నిరాకరిస్తాడు
నెం. 4: మీ ప్రేమయాచనను ఘనంగా ఉంచుకోండి, వివాహ దినానంతర కాలాన్ని చూడండి (fy పే. 24-6 పేరాలు 20-3)
ఆగ. 31 వ్రాతపూర్వక పునఃసమీక్ష. 1 కొరింథీయులు 7-1 తిమోతి 6
పాట నెం. 59 (29) [*న్యాయాధిపతులు 14-19]
సెప్టెం. 7 చదవవలసిన బైబిలు భాగం: 2 తిమోతి 1-4
పాట నెం. 46 (5) [*న్యాయాధిపతులు 20-రూతు 4]
నెం. 1: 2 తిమోతికి ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 237-8 పేరాలు 1-4; పే. 238-9 పేరాలు 10-12)
నెం. 2: 2 తిమోతి 3:1-13
నెం. 3: విజయవంతమయ్యే వివాహం కొరకు సిద్ధపడేందుకు మీకు సహాయపడగల బైబిలు సూత్రాలు (fy పే. 26 పునఃసమీక్ష బాక్స్)
నెం. 4: td 2సి హర్‌మెగిద్దోను దేవుని ప్రేమను ఉల్లంఘించదు
సెప్టెం. 14 చదవవలసిన బైబిలు భాగం: తీతుకు 1-ఫిలేమోను
పాట నెం. 200 (23) [*1 సమూయేలు 1-8]
నెం. 1: తీతుకు మరియు ఫిలేమోనుకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 239-41 పేరాలు 1-4, 8-10; పే. 241-3 పేరాలు 1-4, 7-10)
నెం. 2: తీతుకు 3:1-14
నెం. 3: td 3ఎ బాప్తిస్మం ఒక క్రైస్తవ అవసరత
నెం. 4: నిరంతరం నిలిచే వివాహానికి మొదటి కీలకం (fy పే. 27-9 పేరాలు 1-6)
సెప్టెం. 21 చదవవలసిన బైబిలు భాగం: హెబ్రీయులు 1-3
పాట నెం. 149 (2) [*1 సమూయేలు 9-14]
నెం. 1: హెబ్రీయులకు ఉపోద్ఘాతం (si పే. 243-4 పేరాలు 1-9)
నెం. 2: హెబ్రీయులు 3:1-15
నెం. 3: నిరంతరం నిలిచే వివాహానికి రెండవ కీలకం (fy పే. 30-1 పేరాలు 7-10)
నెం. 4: td 4సి బైబిలు మన కాలానికి ఆచరణాత్మకమైనది
సెప్టెం. 28 చదవవలసిన బైబిలు భాగం: హెబ్రీయులు 4-7
పాట నెం. 51 (7) [*1 సమూయేలు 15-19]
నెం. 1: యెహోవాకు ఎందుకివ్వాలి? (w96 11/1 పే. 28-30)
నెం. 2: హెబ్రీయులు 6:1-12
నెం. 3: td 4ఎఫ్ బైబిలు సమస్త మానవజాతి కొరకైన గ్రంథం
నెం. 4: పురుషుని శిరస్సత్వం క్రీస్తువంటిదై ఉండాలి (fy పే. 31-3 పేరాలు 11-15)
అక్టో. 5 చదవవలసిన బైబిలు భాగం: హెబ్రీయులు 8-10
పాట నెం. 143 (16) [*1 సమూయేలు 20-25]
నెం. 1: యెహోవా నిష్పక్షపాతాన్ని అనుకరించండి (w96 11/15 పే. 25-7)
నెం. 2: హెబ్రీయులు 8:1-12
నెం. 3: భార్య తన భర్తకు ఎలా పూరకమౌతుంది (fy పే. 34-5 పేరాలు 16-19)
నెం. 4: td 6ఎ అన్యజనుల కాలములు 1914లో ముగిశాయి
అక్టో. 12 చదవవలసిన బైబిలు భాగం: హెబ్రీయులు 11-13
పాట నెం. 205 (28) [*1 సమూయేలు 26-2 సమూయేలు 2]
నెం. 1: హెబ్రీయులు—ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 247 పేరాలు 23-7)
నెం. 2: హెబ్రీయులు 11:1-10
నెం. 3: td 7ఎ క్రీస్తు యొక్క నిజమైన చర్చి
నెం. 4: నిజానికి మంచి సంభాషణ అంటే ఏమిటి (fy పే. 35-8 పేరాలు 20-6)
అక్టో. 19 చదవవలసిన బైబిలు భాగం: యాకోబు 1-5
పాట నెం. 144 (4) [*2 సమూయేలు 3-10]
నెం. 1: యాకోబుకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 248-9 పేరాలు 1-7; పే. 250 పేరాలు 15-17)
నెం. 2: యాకోబు 5:1-12
నెం. 3: చిరకాలం నిలిచే ఆనందమయ వివాహాన్ని ఆస్వాదించేందుకు మీకు సహాయపడగల బైబిలు సూత్రాలు (fy పే. 38 పునఃసమీక్ష బాక్స్)
నెం. 4: td 9బి సృష్టి దినాలు 24 గంటల నిడివి కలవేనా?
అక్టో. 26 చదవవలసిన బైబిలు భాగం: 1 పేతురు 1-5
పాట నెం. 145 (13) [*2 సమూయేలు 11-15]
నెం. 1: 1 పేతురుకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 251-2 పేరాలు 1-5; పే. 253 పేరాలు11-13)
నెం. 2: 1 పేతురు 4:1-11
నెం. 3: td 10ఎ యేసు సిలువపై మరణించాడా?
నెం. 4: మీకు ఉన్నంతలోనే జీవించండి (fy పే. 39-41 పేరాలు 1-6)
నవం. 2 చదవవలసిన బైబిలు భాగం: 2 పేతురు 1-3
పాట నెం. 27 (8) [*2 సమూయేలు 16-20]
నెం. 1: 2 పేతురుకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 254 పేరాలు 1-3; పే. 255 పేరాలు 8-10)
నెం. 2: 2 పేతురు 3:1-13
నెం. 3: ఇంటి విషయాల్లో శ్రద్ధతీసుకోవడం కుటుంబ సభ్యులందరి బాధ్యత (fy పే. 42-5 పేరాలు 7-11)
నెం. 4: td 11బి మృతుల స్థితి ఏమిటి?
నవం. 9 చదవవలసిన బైబిలు భాగం: 1 యోహాను 1-5
పాట నెం. 114 (23) [*2 సమూయేలు 21-1 రాజులు 1]
నెం. 1: 1 యోహానుకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరమైంది (si పే. 256-7 పేరాలు 1-5; పే. 258 పేరాలు 11-13)
నెం. 2: 1 యోహాను 5:1-12
నెం. 3: td 11సి మృతులతో మాట్లాడడం ఎందుకు అసాధ్యం
నెం. 4: మనం శుభ్రంగా ఉండాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు (fy పే. 45-9 పేరాలు 12-20)
నవం. 16 చదవవలసిన బైబిలు భాగం: 2 యోహాను—యూదా
పాట నెం. 50 (6) [*1 రాజులు 2-6]
నెం. 1: 2 యోహానుకు, 3 యోహానుకు, యూదా వ్రాసిన పత్రికకూ ఉపోద్ఘాతాలు, మరియు ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 259 పేరాలు 1-3, 5; పే. 260-1 పేరాలు 1-3, 5; పే. 261-3 పేరాలు 1-4, 8-10)
నెం. 2: 2 యోహాను 1:1-13
నెం. 3: యథార్థంగా మెచ్చుకోవడమూ కృతజ్ఞత తెలపడమూ కుటుంబానికి ఏమి చేయగలవు (fy పే. 49-50 పేరాలు 21-2)
నెం. 4: td 14డి దయ్యములు ఎవరు?
నవం. 23 చదవవలసిన బైబిలు భాగం: ప్రకటన 1-3
పాట నెం. 195 (29) [*1 రాజులు 7-10]
నెం. 1: ప్రకటనకు ఉపోద్ఘాతం (si పే. 263-4 పేరాలు 1-6)
నెం. 2: ప్రకటన 3:1-11
నెం. 3: td 17ఎ భూమి విషయంలో దేవుని సంకల్పం ఏమిటి?
నెం. 4: పిల్లల బాధ్యతను మరియు కుటుంబ బాధ్యతలను గురించిన బైబిలు దృక్కోణం (fy పే. 51-2 పేరాలు 1-5)
నవం. 30 చదవవలసిన బైబిలు భాగం: ప్రకటన 4-6
పాట నెం. 168 (17) [*1 రాజులు 11-15]
నెం. 1: మీరు మెస్సీయను గుర్తించి ఉండేవారా? (w96 11/15 పే. 28-31)
నెం. 2: ప్రకటన 5:1-12
నెం. 3: మీ పిల్లవాని అవసరతలను తీర్చడం అంటే (fy పే. 53-5 పేరాలు 6-9)
నెం. 4: td 22ఎ ఆధ్యాత్మిక స్వస్థత ఎందుకంత ప్రాముఖ్యమైనదంటే
డిసెం. 7 చదవవలసిన బైబిలు భాగం: ప్రకటన 7-9
పాట నెం. 53 (8) [*1 రాజులు 16-20]
నెం. 1: “పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి”—ఎందుకు? (w96 12/1 పే. 29-31)
నెం. 2: ప్రకటన 8:1-13
నెం. 3: td 22బి దేవుని రాజ్యం శాశ్వతమైన భౌతిక స్వస్థతలను తెస్తుంది
నెం. 4: మీ బిడ్డ హృదయంలో సత్యాన్ని నాటండి (fy పే. 55-7 పేరాలు 10-15)
డిసెం. 14 చదవవలసిన బైబిలు భాగం: ప్రకటన 10-12
పాట నెం. 34 (9) [*1 రాజులు 21-2 రాజులు 3]
నెం. 1: మద్యపానీయాలను గూర్చిన దైవిక దృక్కోణం (w96 12/15 పే. 25-29)
నెం. 2: ప్రకటన 10:1-11
నెం. 3: మీ బిడ్డకు యెహోవా మార్గాలను బోధించండి (fy పే. 58-9 పేరాలు 16-19)
నెం. 4: td 23బి 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు
డిసెం. 21 చదవవలసిన బైబిలు భాగం: ప్రకటన 13-15
పాట నెం. 21 (4) [*2 రాజులు 4-9]
నెం. 1: ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ (w96 8/1 పే. 4-8)
నెం. 2: ప్రకటన 13:1-15
నెం. 3: td 24బి నరకం అగ్నిబాధగల స్థలం కాదు
నెం. 4: వివిధ రీతుల్లో క్రమశిక్షణనివ్వడం అత్యవసరం (fy పే. 59-61 పేరాలు 20-3)
డిసెం. 28 వ్రాతపూర్వక పునఃసమీక్ష. 2 తిమోతి 1—ప్రకటన 15 వరకు
పాట నెం. 212 (26) [*2 రాజులు 10-15]