దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వ్రాతపూర్వకమైన పునఃసమీక్ష
మే 5 నుండి ఆగస్టు 18, 1997 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలను మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మాత్రం మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. మార్కు 1:41 నందు వర్ణించబడిన యేసు కనికరం యెహోవాకు ప్రజల ఎడలవున్న శ్రద్ధను గురించిన చలింపజేసే వివరణను ఇస్తుంది. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w96 3/1 పేజీ 5 చూడండి.]
2. అంత్యదినాలను గూర్చిన వివరాలను కేవలం మత్తయి 24, మార్కు 13 మరియు లూకా 21 నందే కనుగొనవచ్చు. [kl పేజీ 102 బాక్స్]
3. లూకా 7:19 నందున్న, బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క ప్రశ్న ఆయనకు విశ్వాసం లోపించిందని బయల్పరుస్తోంది. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w87 1/1 పేజీ 16 చూడండి.]
4. యేసు తన శిష్యులతో ఆచరించిన చివరి పస్కాపండుగ సమయంలో ‘నిన్ను ఎరుగనని చెప్పనని’ ఆయనతో అన్నది కేవలం పేతురే. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం]
5. అపొస్తలుడైన పేతురు వివాహితుడని సూచించే బైబిలు సంబంధిత ఏ నిదర్శనం లేదు. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం]
6. పరిశుద్ధాత్మకు లేఖనాలలో ఎక్కడా ఓ వ్యక్తిగత నామం ఇవ్వబడలేదు. [rs పేజీ 407, పేరా 1]
7. యేసు ప్రకటించిన రాజ్యం దేవుని విశ్వ సర్వాధిపత్యానికి ద్వితీయమైనది. [kl పేజీ 91 పేరా 4]
8. యోహాను 20:17 నందు వ్రాయబడివున్నట్లుగా, యేసు యెహోవాను “నా దేవుడు” అని పిలిచినప్పటికీ, లేఖనాలలో ఎక్కడా ఎప్పుడూ యెహోవా యేసును “నా దేవుడు” అని పిలవలేదు, యెహోవా లేక యేసు పరిశుద్ధాత్మను ఎన్నడూ “నా దేవుడు” అని పిలవలేదు. [rs పేజీ 411 పేరా 4]
9. ఇతర మూడు సువార్తలలో కలిపివున్న దానికన్న విస్తృత శబ్దావళి లూకా వృత్తాంతంలోనే ఎందుకు ఉంది అనేదానికి సహేతుకమైన వివరణేమీ లేదు. [si పేజీ 187 పేరా 2]
10. దేవుని రాజ్యం వారి మధ్యనే ఉన్నదని యేసు పరిసయ్యులతో చెప్పినప్పుడు, ఆయన తానే భవిష్యత్ రాజునని సూచిస్తున్నాడు. (లూకా 17:21) [kl పేజీ 91 పేరా 6]
ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి:
11. బైబిలు నుండి ఓ భాగాన్ని ఒకటికన్నా ఎక్కువ విధాల్లో వ్యాకరణరీత్యా అనువదించగల్గినప్పుడు, అనువాదకుడు నడిపింపునిచ్చే ఏ సూత్రాన్ని అనుసరించాలి? [rs పేజీ 416 పేరా 1]
12. గద్దింపును అంగీకరించకుండా ఉండేందుకు కొంతమంది ప్రజలను ఏది అడ్డగిస్తుంది? [uw పేజీ 127 పేరా 4]
13. త్రిత్వాన్ని విశ్వసించడం, అలా చేసేవారిని ఏ స్థానంలో ఉంచుతుంది? [rs పేజీ 424 పేరా 3]
14. “మీలో మీరు ఉప్పుసారము గలవారైయుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని,” యేసు చెప్పినప్పుడు ఆయన భావమేమైయున్నది? (మార్కు 9:50) [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w85 5/15 పేజీ 24 పేరా 12 చూడండి.]
15. బీద విధవరాలి కానుకను గురించిన యేసు ప్రతిస్పందన నుండి మనమే విలువైన పాఠాన్ని నేర్చుకోవచ్చు? (మార్కు 12:42-44) [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w87 12/1 పేజీ 29 పేరా 7-పేజీ 30 పేరా 1 చూడండి.]
16. మార్కు వ్రాత శైలిలో పేతురు యొక్క కొన్ని గుణలక్షణాలు ఎందుకు కనిపిస్తాయి, మరి దీనికి కారణం ఏమిటి? [si పేజీ 182 పేరా 5-6]
17. మనము మత్తయి 6:9, 10 మరియు లూకా 11:2-4 పోల్చినప్పుడు, మాదిరి ప్రార్థన ఉన్నదున్నట్లు ఉచ్చరించడానికి ఇవ్వబడినది కాదని మనమెందుకు తీర్మానించవచ్చు? [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w90 5/15 పేజీ 16 పేరా 6 చూడండి.]
18. మనము లూకా 3:1, 2 వంటి లేఖనాలను చదివినప్పుడు బైబిలు విశ్వసనీయతయందలి మన నమ్మకం ఏ విధంగా బలపర్చబడుతుంది? [si పేజీ 188 పేరా 7]
19. యేసు పరలోకానికి ఆరోహణమైపోయిన వెంటనే పరిపాలించడం ప్రారంభించలేదని కీర్తనలలోని మరియు హెబ్రీయులకు వ్రాసిన పత్రికలోని ఏ లేఖనాలు చూపుతున్నాయి? [kl పేజీ 96 పేరా 15]
20. యేసుకు ఎన్నడూ దేవునియందు విశ్వాసం లోపించలేదని మనకు తెలుసు, మరి “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని” ఆయన ఎందుకు కేకవేశాడు? (మార్కు 15:34) [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w87 6/15 పేజీ 31 చూడండి.]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. జ్ఞాపకార్థ దినాచరణయందు ఉపయోగించే రొట్టె మరియు ద్రాక్షమద్యం కేవలం _____________________ రొట్టె _____________________ సూచిస్తుంది మరియు ద్రాక్షమద్యం ఆయన _____________________ సూచిస్తుంది. [uw పేజీ 115 పేరా 13]
22. వాస్తవంగా జరిగినదానిని మనమాలోచిస్తే సుమారు సా.శ. _____________________ నాటికి సాధారణ పరలోక పిలుపు పూర్తయినట్లుగా రుజువౌతుంది. ఆ సంవత్సరంలోనే _____________________ భూనిరీక్షణ మరి స్పష్టంగా గ్రహించబడింది. [uw పేజీ 111 పేరా 6]
23. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించడం ప్రారంభించినప్పుడు, _____________________ యూదయకు అధిపతిగాను, _____________________ గలిలయకు చతుర్థాధిపతిగాను ఉన్నారు. [ప్రతి వారం చదవవలసిన బైబిలు భాగం; లూకా 3:1 చూడండి.]
24. నిజంగా దేవుని కుమారులైనవారి యొక్క మనస్సును మరి హృదయాన్ని పురికొల్పే శక్తికి సాక్ష్యమిచ్చే ఆత్మ _____________________ [uw పేజీ 113 పేరా 9]
25. లూకా 10:16 నందు సూచించబడినట్లుగా, _____________________ ద్వారా, మరి దాని పరిపాలక సభ ద్వారా వచ్చే ఆత్మీయ ఏర్పాట్లను మనము మెప్పుదలతో అంగీకరించినప్పుడు, మనము _____________________ గౌరవాన్ని చూపేవారమౌతాము. [uw పేజీ 123 పేరా 13]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. మత్తయి 27:52 నందు సూచించబడిన పరిశుద్ధులు (తాత్కాలికంగా శరీరమందు పునరుత్థానం చేయబడిన వారు; వాస్తవానికి భూకంపం ద్వారా సమాధుల్లోనుండి బయటికి నెట్టబడిన నిర్జీవ శరీరాలు; యేసుకు మునుపే పరలోక జీవానికి ఎత్తబడినవారు). [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w90 9/1 పేజీ 7]
27. కొలొస్సయులు 1:15 నందు, యేసు “సర్వసృష్టికి ఆదిసంభూతుడని” పిలువబడ్డాడు, అంటే దాని భావం ఆయన (దేవునివలె ప్రారంభములేనివాడని; భూమి మీది దేవుని కుమారులలో జ్యేష్ఠుడని; యెహోవా కుమారుల కుటుంబంలో అందరికన్నా పెద్దవాడని). [rs పేజీ 408 పేరా 1]
28. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” నియామకం పరిశుద్ధాత్మ ద్వారా (సా.శ. 33; 1918; 1919) సంవత్సరంలో ధృవీకరించబడింది. (మత్త. 24:45) [uw పేజీ 119 పేరా 6]
29. క్రైస్తవులందరూ, అయితే ప్రత్యేకంగా దేవుని సంస్థలో పర్యవేక్షణా స్థానాల్లో ఉన్నవారు అనుసరించవలసిన నియమం: “మీ అందరిలో ఎవడు (గర్విష్టుడై; ప్రముఖుడై; అత్యల్పుడై) యుండునో వాడే గొప్ప వా[డు].” (లూకా 9:48) [uw పేజీ 122 పేరా 12]
30. (మత్తయి 10; మత్తయి 24; లూకా 21) నందు వ్రాయబడి ఉన్నట్లుగా యేసు తాను ప్రకటించడానికి పంపినవారికి నిర్దిష్టమైన సేవా సూచనలను ఇచ్చాడు. [si పేజీ 180 పేరా 31]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జతచేయండి: సామె. 4:13; దాని. 7:9, 10, 13, 14; మార్కు 7:20-23; 13:10; లూకా 8:31
31. మన మనస్సులోకి హృదయంలోకి ఎలాంటి భక్తిహీనతతోకూడిన లేక కలుషితమైన ప్రభావం ప్రవేశించడాన్నైనా మనము గుర్తించడానికి మెలకువగా ఉండాలి, మరి అది వ్రేళ్లూనక ముందే దాన్ని నిర్మూలించాలి. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w89 11/1 పేజీ 14 పేరా 16 చూడండి.]
32. “వెయ్యి సంవత్సరముల” సమయమందు దయ్యములు సాతానుతోపాటు మృత్యువులాంటి క్రియాశూన్యత అవస్థలోనికి వెళతారు. (ప్రక. 20:3) [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం]
33. పరిమిత కాలంలో ప్రపంచవ్యాప్త ప్రకటనాపని సాధించబడేందుకుగాను అత్యవసరతా స్ఫూర్తి అవసరమైయుంది. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w95 10/1 పేజీ 27 చూడండి.]
34. గద్దింపును అంగీకరించడం, తర్వాత విచారించవలసి వచ్చేలాంటి మాటలను అనకుండా, క్రియలను చేయకుండా ఒకరిని కాపాడుతుంది. [uw పేజీ 128 పేరా 6]
35. మనము ఆత్మీయ ప్రాణులను చూడలేకపోయినప్పటికి, తన అదృశ్యమైన పరలోక సంస్థకు సంబంధించి మరియు భూమిపైనున్న తన ఆరాధికులను ప్రభావితంచేసే దాని కొన్ని కార్యకలాపాలకు సంబంధించిన రూపురేఖల్ని యెహోవా వాక్యము మనకు ఇస్తోంది. [uw పేజీ 117 పేరా 1]