కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/97 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1997
మన రాజ్య పరిచర్య—1997
km 8/97 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా రూ. 6.00 చందాకు అందించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరు: కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. అక్టోబరు: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాస పత్రికలకు వార్షిక చందా, పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాస పత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టేందుకు నిరాకరించినట్లైతే, విడిపత్రికలను ఒక్కొక్క దానినీ రూ. 4.00లకు ప్రతిపాదించాలి. చందాలను పొందేటప్పుడు, కావలికోట పత్రిక పంజాబీ ఉర్దూ భాషల్లో (ఈ భాషల్లో ఇది మాసపత్రిక) మినహా మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ నేపాలీ భాషలోనూ పక్షపత్రిక అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. తేజరిల్లు! పత్రిక తమిళం, మలయాళం భాషల్లో పక్షపత్రిక, కానీ కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, మరాఠీ, హిందీ భాషల్లో మాసపత్రిక. పంపిణీదారుల త్రైమాసిక తేజరిల్లు! ప్రతులు ఉర్దూ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి, కానీ ఈ మూడు భాషల్లోనూ వ్యక్తిగత చందాలు లభ్యంకావు. నెల చివరిభాగం మొదలుకొని రాజ్య వార్త నెం. 35 పంపిణీ చేయబడుతుంది. నవంబరు: రాజ్య వార్త నెం. 35 పంపిణీ కొనసాగుతుంది. రాజ్య వార్త నెం. 35 యొక్క ప్రతిని అందిస్తూ ప్రతి ఇంటినీ, నివాసాన్నీ చేరుతూ తమ టెరిటరీని ముగించిన సంఘాలు, జ్ఞానము పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు.

గమనిక: పైన పేర్కొనబడిన ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంతవరకూ రిక్వెస్ట్‌ చేయని సంఘాలు, తమ తరువాతి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14)లో రిక్వెస్ట్‌ చేయాలి.

◼ డిశంబరు 26-28 తేదీల్లో కోట్టయంలో జరుగుతుందని మునుపు షెడ్యూలు వేయబడిన జిల్లా సమావేశం, ఇప్పుడు అదే తేదీల్లో ఎర్నాకులంలో జరుగుతుంది. సమావేశం ముఖ్యకార్యాలయం చిరునామా: c/o Ipe Thomas, C-32/1994 Netaji Road, Edappally P.O., Cochin, KER 682 024.

◼ ప్రతి సమాజంలోనూ సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో లౌకిక సెలవుదినాలు ఉంటాయి, అప్పుడు పిల్లలకు స్కూలుకు హజరవ్వడం నుండి మినహాయింపు దొరుకుతుంది, పెద్దలకు లౌకిక ఉద్యోగాలనుండి కాస్త ఖాళీ దొరుకుతుంది. ఇవి సంఘాలు ప్రాంతీయ పరిచర్యలో మరింత ఎక్కువగా భాగం వహించేందుకు మంచి అవకాశాలను కలుగజేస్తాయి. ఈ సందర్భాలు ఎప్పుడు వస్తుంటాయో పెద్దలు కనిపెడుతూ ఉంటూ, సెలవుదినాల్లో గుంపు సాక్ష్యం ఇచ్చేందుకు ఏర్పాటు చేయడానికి ఎంతో ముందే సంఘానికి తెలియజేస్తూ ఉండాలి.

◼ ప్రతి సంఘానికి మూడు లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫారంలు (S-AB-18) అందుతాయి. ఆగస్టు నెలారంభంలో సంఘ సెక్రటరి లిటరేచర్‌ సర్వెంట్‌ను కలిసి, నెలాఖరులో సంఘంలో స్టాకు ఉన్న సాహిత్య ఇన్వెంటరీని తీసుకోవడానికిగాను ఒక తేదీని నిర్ణయించుకోవాలి. స్టాకులో ఉన్న సాహిత్యాన్నంతటినీ తప్పక లెక్కించి, వాటి మొత్తాల్ని లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫారంలో ఎక్కించాలి. ప్రస్తుతమున్న పత్రికల మొత్తాన్ని మ్యాగజైన్‌ సర్వెంట్‌నుండి పొందవచ్చు. దయచేసి ఒరిజినల్‌ను సొసైటీకి సెప్టెంబరు 6కు లోపలే పోస్టు చేయండి. మీ ఫైళ్ళ నిమిత్తం ఒక కార్బన్‌ కాపీని ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్‌ షీటుగా ఉపయోగించవచ్చు. ఇన్వెంటరీని సెక్రటరీ పర్యవేక్షణలో తీసుకోవాలి, పూర్తి చేయబడిన ఫారాన్ని సంఘ పైవిచారణకర్త చెక్‌ చేయాలి. సెక్రటరీ, సంఘ పైవిచారణకర్తా ఇద్దరూ ఫారంపై సంతకాలు చేస్తారు.

◼ సంఘ సెక్రటరీ కాంగ్రిగేషన్‌ అనాలసిస్‌ రిపోర్ట్‌ ఫారం (S-10)ని కూడా నింపుతాడు. పబ్లిషర్‌ రికార్డ్‌ కార్డులనుండి (S-21) అవసరమయ్యే సమాచారాన్ని జాగ్రత్తగా పట్టికవేసేలా రూఢిపర్చుకోవడానికి ఆ రిపోర్టును నింపడంలో బహుశ ఆయనకు సహాయం చేస్తున్న ఎవరైనా పెద్దకైనా గానీ లేక పరిచర్య సేవకునికైనా గానీ ఆయన జాగ్రత్తగా నిర్దేశనాలనిస్తాడు. కాంగ్రిగేషన్‌ అనాలసిస్‌ రిపోర్ట్‌ ఫారాన్ని కచ్చితంగానూ శుభ్రంగానూ నింపి, సంతకం చేసేముందు సేవా కమిటీ జాగ్రత్తగా చెక్‌ చేయాలి. ఆ ఫారంలోని మొదటి ఐదు బాక్సుల్లో సగటు వారపు కూటాల హాజరును నింపాలని దయచేసి గమనించండి. వీటిని లెక్క కట్టడానికి దయచేసి ఆ బాక్సులపైన ఇవ్వబడిన నిర్దేశనాలను జాగ్రత్తగా అనుసరించండి. ఫారం వెనుక ఆఖరి బాక్సుకు ముందటి బాక్సులో, కేవలం నియుక్త పెద్దల సంఖ్య మాత్రమే వేయాలి; ప్రత్యామ్నాయ పైవిచారణకర్తలు పరిచర్య సేవకులే గనుక, అటువంటివారి సంఖ్యను చివరి బాక్సులో వేయాలి. దయచేసి ఒరిజినల్‌ S-10 ఫారాన్ని సొసైటీకి సెప్టెంబరు 10కి లోపలే పోస్టు చేయండి; ఒక కార్బన్‌ కాపీని మీ ఫైలులో ఉంచండి.

◼ లభ్యమౌతున్న క్రొత్త ప్రచురణలు:

నా బైబిలు కథల పుస్తకము (చిన్న సైజు)—తమిళం

◼ స్టాకులో లేని ప్రచురణలు:

“నీ రాజ్యము వచ్చునుగాక”—మలయాళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి