కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/97 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1997
మన రాజ్య పరిచర్య—1997
km 6/97 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్‌: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించేందుకు ప్రయత్నించడంలో శ్రద్ధను కనపర్చండి. జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా రూ. 6.00 చందాకు అందించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . సెప్టెంబరు: కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి.

◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసుకొన్న రిక్వెస్ట్‌లను సంస్థ స్వీకరించదు. సాహిత్యాల కొరకు సంఘంచేసే నెలసరి రిక్వెస్ట్‌ సొసైటీకి పంపించడానికి ముందు ప్రతి నెలా దాన్ని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావాల్సిన సాహిత్యాల్ని రప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ, సాహిత్యాల్ని పర్యవేక్షిస్తున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ సాహిత్యాలో దయచేసి గుర్తుంచుకోండి.

◼ జూలై నెలారంభం నుండీ ప్రయాణ పైవిచారణకర్తలు “యెహోవాను స్తుతించేందుకు విద్యను ఉపయోగించండి” అనే బహిరంగ ప్రసంగాన్ని, ముగింపు ప్రసంగంగా “దృశ్యమైన సంస్థతోపాటూ నడవండి” అనే ప్రసంగాన్నీ తమ సందర్శనాలలో ఇస్తారు. గురువారంనాడు (లేక శుక్రవారంనాడు) వారిచ్చే మొదటి సేవా ప్రసంగం: “నిర్భయంగా ఉండండి, ప్రకటించండి!”

◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయనచే నియమించబడిన వేరొకరు, సంఘ లెక్కలను జూన్‌ 1న లేక ఆ తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆడిట్‌ చేయాలి. ఇది జరిగిన తరువాత సంఘానికి ప్రకటించండి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవాసాక్షులు మరియు విద్య—తమిళం, మలయాళం

1995లో ఆంగ్లభాషలో విడుదలైన ఈ బ్రోషూరు, మొదటిసారిగా భారతీయ భాషల్లో లభ్యమౌతోంది. తల్లిదండ్రులందరూ తమపిల్లలతోపాటు దీన్ని అధ్యయనం చేయాలనీ, తమ పిల్లలకు విద్యనుచెప్పే ఉపాధ్యాయులకు అందించమనీ మేము ప్రోత్సహిస్తున్నాం. పిల్లలు తమతోపాటు వాటిని స్కూలుకు క్రమంగా తీసుకెళ్తూ, తమ ఉపాధ్యాయుల్లో ఎంతమందికి వీలైతే అంతమందికి వాటిని ప్రతిపాదించవచ్చు.

మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము (రివైజ్డ్‌ 1997)—మలయాళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి