కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/97 పేజీ 2
  • జూన్‌లోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌లోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 2తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 9తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 16తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 23తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 30తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1997
km 6/97 పేజీ 2

జూన్‌లోని సేవా కూటాలు

జూన్‌ 2తో ప్రారంభమయ్యే వారం

పాట 181 (17)

8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్యనుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. దేశవ్యాప్త సేవా నివేదికపై, స్థానికసంఘ ప్రాంతీయ సేవా నివేదికపై వ్యాఖ్యానించండి.

15 నిమి: “మీ శక్తిమేరకు చేయండి.” ప్రశ్నాజవాబులు—ఏప్రిల్‌ 15, 1993, కావలికోట, (ఆంగ్లం) పేజీలు 28-30 కూడా చూడండి.

22 నిమి: “దేవునినుండి వచ్చిన జ్ఞానం అనేక ప్రశ్నలకు జవాబుల్నిస్తోంది.” ఓ యౌవనస్థునితోపాటు ఇద్దరు ముగ్గురు ప్రచారకులతో ఈ శీర్షికను చైర్మన్‌ చర్చిస్తాడు. ప్రశ్నలకు జవాబుల్నిచ్చేలా మనకు సహాయపడ్డంలో జ్ఞానము పుస్తకము ఎందుకు అంత ప్రతిభావవంతంగావుందో నొక్కిచూపిస్తూ, మొదటిపేరాపై వ్యాఖ్యానిస్తాడు. ఒక అభ్యాసకార్యక్రమాన్ని ప్రదర్శించి చూపి, ప్రతి ప్రదర్శన తర్వాత మెరుగుపర్చుకోవడానికి సలహా ఇస్తాడు.

పాట 200 (23), ముగింపు ప్రార్థన.

జూన్‌ 9తో ప్రారంభమయ్యే వారం

పాట 189 (4)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: వర్షాకాల జ్ఞాపికలు. ప్రసంగమూ, ప్రేక్షకులతో చర్చా. దేశంలోని అనేక ప్రాంతాల్లో పడే ఉద్ధృతమైన వర్షాలు తరచూ మామూలు జీవనవిధానానికి విఘాతం కల్గిస్తాయి. దైవపరిపాలనా కార్యక్రమాల్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేలా మనమెలా సంస్థీకరించుకోగలం? క్రింది వాటిని చర్చించండి: (1) సంఘకూటాలకు క్రమంగా హాజరవుతూవుండడాన్ని కొనసాగించండి. (2) పరిచర్యలో క్రమంగా భాగం వహించేందుకు ఏర్పాట్లు చేసుకోండి, నెలలో అటుతర్వాత రాబోయే వాతావరణ మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని నెలారంభంలోనే పరిచర్యను ప్రారంభించండి. (3) సౌకర్యవంతంగావున్న రెయిన్‌కోట్లనూ, మన బైబిళ్లూ ప్రచురణలూ పత్రికలూ వర్షంలో తడవకుండా కాపాడే అనువైన బాగ్‌లనూ కల్గివుండండి. (4) సాధ్యమైతే, అపార్ట్‌మెంట్‌లు లేక ముంపుకుగురికాబోని ప్రాంతాలు వంటి తగిన టెరిటరీని ఎంపికచేసుకోండి. (5) అనియత సాక్ష్యం ఇచ్చేందుకు, వర్షాన్నుండి కొంత కాపుదల ఇవ్వగలిగే షెల్టర్‌వున్న బహిరంగస్థలాల్ని చూడండి. (6) నివేదించబడే సేవలో ఏ విధమైన తగ్గుదలా లేకుండేలా పెద్దలు సంఘకార్యక్రమాల్ని బాగా సంస్థీకరించాలి.

20 నిమి: ఇతరులకు బోధించడం—అత్యంతావశ్యకం. పెద్ద ఇచ్చే ప్రసంగం. 1997 వార్షికపుస్తకంలో (ఆంగ్లం) 33వ పేజీలోవున్న 1996వ సంవత్సరపు ప్రపంచవ్యాప్త సేవా రిపోర్టును సమీక్షించండి. తాము ప్రజల్ని కనుగొన్న ప్రతిచోటా వారికి సాక్ష్యమిచ్చేందుకు చేసిన తీవ్రమైన ప్రయత్నాలు, ఫలాల్ని ఉత్పన్నం చేశాయి. ప్రచురణల్ని ఇచ్చినచోట పునర్దర్శనాల్నిచేసి, ప్రజలకు సత్యాన్ని బోధించడమే ఇప్పుడు అత్యంతావశ్యకం. మనం వారిని బహిరంగ స్థలాల్లో కల్సుకున్నప్పుడు వారి పేరూ, చిరునామాల్ని నేర్పుగా అడగండి, ఆ విధంగా మనమొక పునర్దర్శనాన్ని చేయవచ్చు. రాజ్య విత్తనాన్ని కేవలం విత్తడంకన్నా మనమెంతో చేయాల్సివుంది; మనం నీళ్లుకూడా పోయాలి. (1 కొరిం. 3:6-8) విత్తనం మంచి నేలలో విత్తబడితే, ఆ వ్యక్తి దాని భావాన్ని గ్రహించేందుకు ప్రతిభావవంతంగా బోధించడం సహాయపడగలదు. (మత్త. 13:23) బోధించేపనిలో మనకు సాధ్యమైనంత పూర్తిగానూ, నైపుణ్యవంతంగానూ భాగం వహించాలి. (హెబ్రీ. 5:12ఎ) మన రాజ్య పరిచర్య జూన్‌ 1996 ఇన్సర్ట్‌లోని 25-6 పేరాల్లోనుండి విషయాల్ని చేర్చండి. దేవుడు . . . కోరుతున్నాడు బ్రోషూరునుండి లేక జ్ఞానము పుస్తకమునుండి బైబిలు పఠనాల్ని ప్రారంభించడానికి ప్రయత్నించాలని నొక్కిచెప్పండి.

పాట 204 (25), ముగింపు ప్రార్థన.

జూన్‌ 16తో ప్రారంభమయ్యే వారం

పాట 192 (21)

10 నిమి: స్థానిక ప్రకటనలు. తాజా పత్రికల్లోనుండి మాట్లాడదగు అంశాల్ని చెప్పండి.

15 నిమి: స్థానికావసరతలు.

20 నిమి: మీ మతం సత్యమైనదో అసత్యమైనదో గుర్తించడం. డిశంబరు 22, 1989, తేజరిల్లు!లోని (ఆంగ్లం) 18వ పేజీపై ఆధారపడి ఓ పెద్ద ఇద్దరు ముగ్గురు సమర్థనీయులైన ప్రచారకులతో చర్చను చేస్తాడు. నిష్కపటులైన ప్రజలుగా కన్పించే అనేకమందిని పదేపదే పునర్దర్శించడమైంది. అయితే, వాళ్లు బైబిలు పఠనాన్ని అంగీకరించలేదు. కచ్చితమైన జ్ఞానానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరతను వాళ్లెరిగేలా చేయడానికి తేజరిల్లు!లోని ఈ శీర్షికనందలి అంశాల్ని ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. జ్ఞానము పుస్తకంలోని “ఎవరి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు?” అనే 5వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన విషయాల్ని పేర్కొనండి. 20వ పేరాను చదవండి. అలాంటి వ్యక్తులు బైబిలు పఠనాన్ని అంగీకరించేందుకూ, కూటాలకు హాజరయ్యేందుకూ వారిని దయాపూర్వకంగానూ, యుక్తిగానూ ప్రోత్సహించేలా పునర్దర్శనాల్ని చేయవచ్చు.

పాట 201 (8), ముగింపు ప్రార్థన.

జూన్‌ 23తో ప్రారంభమయ్యే వారం

పాట 193 (18)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: వాళ్లు మనగురించేం చెబుతున్నారు? వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 1986-1995, 341-3 పేజీలలో (లేక 1986-90 ఇండెక్స్‌ 268-9 పేజీలలో) ఉన్న సమాచారంపై ఆధారపడిన ఓ ప్రసంగం. యెహోవాసాక్షుల్ని గురించి అంటే మన ప్రవర్తనను గురించీ, మన పనిని గురించీ “ఇతరులు చేసిన వ్యాఖ్యానాలు”లో విశిష్టమైనవాటిని ఎంపిక చేసుకోండి. ఇతరులు మనలో చూసిన దానినిబట్టి వాళ్లెంత అనుకూలంగా ప్రభావితులయ్యారో చూపించండి. మనం తగినవిధంగా ప్రవర్తించేందుకూ, మన పనిలో పట్టుదల కల్గివుండేందుకూ మనల్నిది ఎల్లవేళలా ఎందుకు ప్రేరేపించాలో వివరించండి. మనల్ని గురించి ఎక్కువగా తెల్సుకోవాలని అనుకుంటున్న పరిచయస్థులతోనూ, ఆసక్తికల్గిన వ్యక్తులతోనూ మాట్లాడుతున్నప్పుడు అలాంటి అనుకూలమైన వ్యాఖ్యానాల్ని ఎలా ఉపయోగించాలో సూచించండి.

20 నిమి: “తల్లిదండ్రులారా—ప్రకటించేందుకు మీ పిల్లలకు శిక్షణనివ్వండి.” ప్రశ్నాజవాబులు. మన పరిచర్య పుస్తకంలోని 100వ పేజీలోని “చిన్నవారికి సహాయపడుట” అనే ఉపశీర్షిక క్రిందనున్న నడిపింపును చేర్చండి.

పాట 211 (22), ముగింపు ప్రార్థన.

జూన్‌ 30తో ప్రారంభమయ్యే వారం

పాట 197 (6)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్‌ నెల ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇవ్వాలని అందరికీ గుర్తుచెయ్యండి.

20 నిమి: “యౌవనులారా—మీ ఆత్మీయ గమ్యాలు ఏమిటి?” ఇద్దరు తండ్రులు కలిసి ఈ శీర్షికను చర్చిస్తారు. వస్తుసంబంధమైన ఆసక్తుల్ని వెంబడించడానికి బదులు, ఆత్మీయ ఆశీర్వాదాల్ని తెచ్చే దైవపరిపాలనా గమ్యాల్ని ఏర్పర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో తమ పిల్లలు గుణగ్రహించేందుకు వారికి సహాయపడడమెలా అని మాట్లాడుకుంటారు.—మన పరిచర్య పుస్తకంలో, 116-18 పేజీలను కూడా చూడండి.

15 నిమి: జూలై నెల ప్రతిపాదనల కొరకు సిద్ధపడడం. స్థానిక ప్రాంతంలో బాగా ఆసక్తిని రేకెత్తించిన ఒకటో రెండో బ్రోషూర్లను ఎంపికచేసుకొని, వాటిలోనుండి కొన్ని విశిష్టమైన అంశాల్ని పునఃసమీక్షించండి. వీటిని మన అందింపుల్లో చేర్చగలిగే మార్గాల్ని చెప్పండి. ప్లేస్‌మెంట్‌ చేసినవాటిని గూర్చిన వివరాల్ని రాసుకోమనీ పునర్దర్శనం చేసి, ఆసక్తిని పెంపొందించమనీ అందరికీ గుర్తుచేయండి.

పాట 109 (2), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి