ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు మే: కావలికోట లేక తేజరిల్లు!లకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాస పత్రికలకు వార్షిక చందా, పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాస పత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టేందుకు నిరాకరించినట్లైతే, విడిపత్రికలను ఒక్కొక్క దానినీ రూ. 4.00లకు ప్రతిపాదించాలి. యుక్తమైనచోట దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును రూ. 6.00లకు ప్రతిపాదించవచ్చు. కావలికోట పత్రిక పంజాబీ ఉర్దూ భాషల్లో (ఈ భాషల్లో ఇది మాసపత్రిక) మినహా మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ నేపాలీ భాషలోనూ పక్షపత్రిక అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. తేజరిల్లు! పత్రిక మలయాళం, తమిళ భాషల్లో పక్షపత్రిక, కానీ కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, మరాఠీ, హిందీ భాషల్లో మాసపత్రిక. పంపిణీదారుల త్రైమాసిక తేజరిల్లు! ప్రతులు ఉర్దూ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి, కానీ ఈ మూడు భాషల్లోనూ వ్యక్తిగత చందాలు లభ్యంకావు. జూన్: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించేందుకు ప్రయత్నించడంలో శ్రద్ధను కనపర్చండి. జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా రూ. 6.00 చందాకు అందించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . .
◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:
ప్రాథమిక బైబిలు బోధలు—హిందీ
మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము—మరాఠీ
◼ అందుబాటులో ఉన్న క్రొత్త ఆడియోక్యాసెట్లు:
రాజ్య గీతాలను పాడడం—ఆంగ్లం
◼ 76 నిమిషాల నిడివిగల ఈ రికార్డింగులో ఆర్కెస్ట్రాతో జతచేయబడిన స్వరాల కూర్పు ఉంటుంది. కొన్ని పాటలు ఆర్కెస్ట్రాతోపాటు అనుభవంగల సహోదరుల సోలోలు కాగా, వేరేవి అమెరికాలోని బేతేలు కుటుంబ సభ్యులతో కూడిన కోరస్‌చే పాడబడ్డాయి, ఒకటేమో బేతేలులోని సహోదరీల గుంపొకటి కల్సి పాడినది. ఇవి మన రాజ్య గీతాల్లో కొన్నింటిని పాడడానికి మాదిరిగా పనిచేస్తాయి. ఆహ్లాదకరమైనవిగానూ, పురోభివృద్ధికరమైనవిగానూ ఉండడమేగాక, శ్రోతలు పదాలను విని, వాటిపై ధ్యానముంచి, బహుశ వాటిని కంఠతపట్టడానికి కూడా అవకాశాన్నిస్తాయి. ఒక్కొక్క క్యాసెట్టు పయినీర్లకు రూ. 55.00, ప్రచారకులకూ, ప్రజలకూ రూ. 65.00కు లభ్యమౌతుంది.
◼ అందుబాటులో ఉన్న క్రొత్త వీడియోక్యాసెట్లు:
భూదిగంతముల వరకు—ఆంగ్లం
◼ వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌యొక్క 50వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేయబడింది. 42 నిమిషాల ఈ వీడియో గిలియడ్‌యొక్క మొట్టమొదటి సభ్యులను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది, 95వ తరగతిలోని దృశ్యాలను చూపిస్తుంది, మిషనరీ జీవితం ఎలాగుంటుందో చూపిస్తుంది, ఆ స్కూలు సాధించిన విజయాలనూ, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అనే విషయాన్నీ చర్చిస్తుంది. ఒక్కొక్క క్యాసెట్టు పయినీర్లకు రూ. 150.00, ప్రచారకులకూ, ప్రజలకూ రూ. 200.00 లభ్యమౌతుంది.