కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/97 పేజీలు 4-6
  • పత్రికచందాల విషయంలో ఎలా వ్యవహరించాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికచందాల విషయంలో ఎలా వ్యవహరించాలి
  • మన రాజ్య పరిచర్య—1997
మన రాజ్య పరిచర్య—1997
km 5/97 పేజీలు 4-6

పత్రికచందాల విషయంలో ఎలా వ్యవహరించాలి

1 ఇండియా బ్రాంచ్‌ భారతీయ భాషల్లోని పత్రికలను ప్రపంచవ్యాప్తంగా 40 కన్నా ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తుందని పేర్కోవడానికి చాలా ఆనందంగా ఉంది. అంతే కాక, భారతీయ భాషల్లోని పత్రికలను ఇతర దేశాలకు పంపిస్తున్నట్లే, విదేశ భాషల్లోని పత్రికలను మిగిలిన బ్రాంచ్‌లు మనకు పంపిస్తున్నాయి. కనుక, ఇండియాలోనూ బంగ్లాదేశ్‌లోనూ నేపాల్‌లోనూ ఉన్న విదేశీయులు తమ స్వంత భాషలో పత్రికలను పొందేందుకు సహాయపడే ఆధిక్యత మనకుంది. మీరు పత్రిక చందాలను సేకరించేందుకు చేసే ప్రయత్నాలకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ విషయంలో అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.

2 అయితే, పోస్టల్‌ సర్వీస్‌ ద్వారా పత్రికలను సరఫరా చేసే విషయంలో దేశవ్యాప్తంగా మాకు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. పత్రిక చందాదారులకు, పత్రిక పంపకందారులకు పంపుతున్న అనేక పత్రికలు అందజేయబడడం లేదు; అందజేయలేనివని అంటూ సొసైటీకి కొన్ని పత్రికలు తిరిగి పంపబడుతున్నాయి. ప్రచారకులు మరింత అప్రమత్తంగా ఉండి ఉంటే, ఈ విషయాలను పూర్తి చేయడంలో త్వరపడేవారైతే ఈ సమస్యలలో అనేకమును నివారించగలిగి ఉండేవాళ్ళమని ఒక విశ్లేషణ వెల్లడిచేసింది. కనుక, మంచి సేవను నిశ్చయపరచుకునేందుకూ చందా కట్టిన పత్రికల విషయంలో అనవసరమైన సమస్యలనూ ఆలస్యాలనూ నివారించేందుకు సహాయపడేందుకూ ఈ క్రింది అంశాలను పరిశీలించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.

3 ముందుగా పథకం వేయడం వల్ల మంచి సేవలను అందజేయవచ్చు. (ఆది. 41:33-36; లూకా 14:28-30) ఉదాహరణకు, సహాయ పయినీర్లు ఉన్నప్పుడు సంఘాలు పత్రికల కొరకు ప్రత్యేక ఆర్డర్లు చేయవలసి ఉండవచ్చు. ఎంతమంది సహాయ పయినీర్ల జాబితాలో పేర్లు చేర్చుకుంటారో తెలుసుకునేందుకు చివరి నిమిషం వరకూ వేచి ఉండే బదులు, ఆ సేవలో ఎంతమంది పాల్గొంటారనే దానిని గూర్చిన అంచనా ఆధారంగా ముందుగానే ప్రత్యేక ఆర్డర్లను చేయడం జ్ఞానయుక్తంగా ఉంటుంది. మీరు కోరినన్ని పత్రికలను సరఫరా చేయాలని మేము అనుకుంటున్నప్పటికీ, కోరబడిన సంచికను ముద్రించిన తర్వాత ఆ సంచిక కొరకు అందే ప్రత్యేక ఆర్డర్లకు పత్రికలను సరఫరా చేయడమనేది సాధ్యం కాదు. ఏ తేదీ సంచిక కావాలని మీరనుకుంటారో ఆ తేదీకి 60 రోజుల ముందే మీ ప్రత్యేక ఆర్డర్లు సొసైటీకి అందాలని దయచేసి గమనించండి. ఉన్న ఆర్డరులోని మార్పుల ప్రకారం లేదా తపాలా చిరునామాలోని మార్పుల ప్రకారం పత్రికలను సరఫరా చేయనారంభించడం 45 రోజుల్లో సాధ్యమౌతుంది.

4 తప్పులు లేకుండావ్రాయడం, చదవగల్గేలా వ్రాయడం, పూర్తిగా వ్రాయడం అనేవి ఏ తపాలానైనా సరైన విధంగా అందజేసేందుకు కీలకాలు. సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్‌ను నింపేటప్పుడు లేదా పంపకందారులకు పత్రికలను పంపవలసిన చిరునామాను వ్రాసేటప్పుడు, మీ ప్రాంతంలోని స్థలాల పేర్లతో పరిచయంలేని ఒక వ్యక్తి దానిని చదివి సరిగ్గా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని దయచేసి జ్ఞాపకముంచుకోండి. కనుక, అవసరమైన సమాచారమంతా సరైన వరుసక్రమంలో, చదువగలిగే విధంగా, సరిగ్గా ఉచ్చరించే విధంగా ఉందా అని దయచేసి నిశ్చయపరచుకోండి. ఒక నగరం పేరు గానీ, పోస్టాఫీసు పేరు గానీ పిన్‌కోడ్‌ గానీ సంక్షిప్త రూపంలో వ్రాయకూడదు. ఒక్కో సమాచారం ప్రక్కన కామా పెట్టి ఒక్కో సమాచారాన్ని విడి విడిగా వ్రాయాలి. ప్రతి పదం తర్వాత కొంచెం స్థలం వదిలేయాలి. కచ్చితంగాలేని లేదా పూర్తిగాలేని సమాచారం వల్ల తపాలా పంపడం ఆలస్యమౌతుంది, లేదా అసలు తపాలా పంపడమే జరుగదు. పత్రిక చందాల విషయమైతే, మీరు వ్రాసింది సరిగ్గానే ఉందేమో చూడమని చందాదారున్ని కోరడం ఎల్లప్పుడూ జ్ఞానయుక్తంగా ఉంటుంది. పంపకందారులకు పత్రికలను పంపే చిరునామా పత్రికలను అందజేసేందుకు పోస్ట్‌మ్యాన్‌కు అనుకూలంగా ఉండే స్థలమై ఉండాలి.

5 అతి క్రొత్త సర్వీస్‌ ఫారమ్‌లను ఉపయోగించండి. పనిని తొందరగా చేయడానికి, సులభంగా చేయడానికి ఫారమ్‌లను రూపొందించారు. ఉదాహరణకు, మీరు డిస్ట్రిబ్యూటర్స్‌ ఆర్డర్‌ (M-AB-202) ఫారమ్‌ను ఉపయోగిస్తూ పంపకందారుల పత్రికల కొరకైన క్రొత్త ఆర్డరును పంపగలరు, లేదా ఉన్న పత్రికా ఆర్డరును పెంచుకోగలరు, తగ్గించుకోగలరు, లేదా రద్దుచేసుకోగలరు, లేదా ప్రత్యేక ఆర్డర్లు చేయగలరు. కనుక, సొసైటీకి ఉత్తరాలు వ్రాసే బదులు, ఆ ఉద్దేశం కొరకు ఇవ్వబడిన సర్వీస్‌ ఫారమ్‌ను దయచేసి ఉపయోగించండి. పత్రిక చందా రిన్యూవల్‌ల కొరకు, దయచేసి, ఎక్స్‌పైరింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌ (M-91/M-191) స్లిప్పులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. అవి లభ్యం కానట్లైతే, చందాదారుని చిరునామా ఉన్న లేబల్‌ను (పత్రిక ఉన్న కవరు మీది నుండి) తీసుకుని క్రొత్త సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పుకు లేదా రిన్యూవల్‌ ఫారమ్‌ (M-5/M-105)కు జోడించి, సొసైటీకి పంపాలి. సబ్‌స్క్రిప్షన్‌ చేంజెస్‌ ఆఫ్‌ అడ్రెస్‌ (M-205) ఫారమ్‌ను ఉపయోగించి, చందాదారుల చిరునామాల్లోని మార్పులను ఆరు వారాలు ముందుగానే తెలపాలి. అలాంటి మార్పులున్నప్పుడెల్లా, పాత చిరునామాను అలాగే క్రొత్త చిరునామాను పంపండి. పత్రికలు వచ్చే కవరు మీది పాత చిరునామా లేబల్‌ను జోడించి పంపగలిగితే సహాయకరంగా ఉంటుంది. చిరునామా మారినట్లయితే స్థానిక పోస్టాఫీసులో తెలియజేయమని లేదా మారిన చిరునామాకు పత్రికలు వచ్చే వరకు పోస్టాఫీసు నుండి పత్రికలను తీసుకునే నిర్దిష్ట ఏర్పాట్లను చేసుకొమ్మని చందాదారున్ని కోరండి. అలాగే, పంపకందారులకు పత్రికలు పంపవలసిన చిరునామాలో ఏదైనా మార్పు ఉన్నట్లయితే, మారిన చిరునామా ప్రకారం పత్రికలు వచ్చేంతవరకు, తమ పాత చిరునామా ఉన్న స్థలం దగ్గరకు వెళ్ళిగానీ లేదా పోస్టాఫీసు నుండి గానీ సంఘాలు పత్రికలను తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆశించబడుతుంది.

6 పత్రిక చందాలను పంపడంలోను, సొసైటీ నుండి వచ్చే ఎన్‌క్వైరీలకు సమాచారాన్ని తెలపడంలోను త్వరపడేవారై ఉండండి. పత్రిక చందాలను సేకరించిన తరువాతి కూటంలోనే సంఘంలో పత్రిక చందాల విషయాన్ని చూసుకునేందుకు నియమించబడిన వ్యక్తికి వాటిని ఇవ్వాలి. ప్రతివారం, అందిన పత్రిక చందాలనన్నింటినీ, ఒకవేళ అందినది ఒక పత్రిక చందానే అయినప్పటికీ, వీక్‌లీ సబ్‌స్క్రిప్షన్స్‌ (M-AB-203) ఫారాన్ని సరిగ్గా పూరించి దానితోపాటు సొసైటీకి సెక్రెటరీ ఆ వారమే పంపించాలి. ప్రతి నెల పంపించే డబ్బుతోపాటు పంపించేందుకు గాను పత్రిక చందాలను ఉంచకూడదు. మీరు సొసైటీకి పంపించేవాటి ప్రతిని మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోండి. చందాదారులకు పత్రికలు అందుతున్నాయని నిశ్చయపరచుకునేందుకు ప్రచారకులు వారిని మళ్ళీ సందర్శించాలి. సాధారణంగా, చందాదారుడు చందా కట్టిన తర్వాత, సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పులు సొసైటీకి అందిన తేదీ మొదలుకొని ఆరు వారాల్లోగా అతడు తన మొదటి సంచికను అందుకుంటాడు. వేరిఫికేషన్‌ నోటీస్‌ (M-232), ఎక్స్‌పైరింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌ (M-91 లేదా M-191) ఫారమ్‌, అన్‌డెలివరబుల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫాలోఅప్‌ (M-210) ఫారమ్‌ వంటి ఏవైనా నోటీసులు సొసైటీ నుండి వచ్చినట్లయితే, దయచేసి వెంటనే చర్య తీసుకోండి. ఏదైనా ఒక చందాదారునికి పత్రికలు అందజేయడం అసాధ్యమన్న నోటీసు వచ్చినట్లయితే, పత్రికలను పంపడంలో కలిగే అంతరాయాలను గూర్చి ఆ చందాదారునికి తెలియజేయాలి. అయినప్పటికీ, మీ వ్యాఖ్యానాలతో సహా అన్‌డెలివరబుల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫాలోఅప్‌ స్లిప్పులు సొసైటీకి అందిన వెంటనే మళ్ళీ ఆ చందాదారునికి పత్రికలను పంపించడం మొదలుపెడతారు.

7 పంపకందారుల పత్రికలను లేదా చందాదారుల పత్రికలను రవాణా చేయడంలో క్రమం లేకపోతే ఆలస్యం చేయకుండా తెలియజేయండి. పంపకందారులకు అందవలసిన పత్రికల్లో ఏదైనా ఒక సంచిక ఆ సంచిక తేదీ వరకూ అందనట్లయితే, అన్ని వివరాలను తెలుపుతూ దయచేసి సొసైటీకి వ్రాయండి. మీరు త్వరగా తెలియజేస్తే మీకు ఏ సంచిక దొరకలేదో ఆ సంచిక ప్రతులను ఇవ్వగలుగుతుంది. చందా కట్టాక పత్రికలు అందనట్లయితే, చందాను సొసైటీకి పంపి ఎనిమిది వారాల కన్నా ఎక్కువగా గడిచినట్లయితే, సంఘం ద్వారా దానిని సొసైటీకి తెలపాలి. గత రెండు నెలల స్టేట్‌మెంట్‌లలో దానిని చార్జ్‌ చేయనట్లైతే, ఆ చందా లభించని వారంలోని వీక్‌లీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఫారమ్‌ యొక్క ఒక ప్రతిని అలాగే, ఆ ఫారమ్‌లో చేర్చబడిన మరితర సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పుల డూప్లికేట్‌ ప్రతులను, వాటిని వివరంగా తెలియజేసే ఒక ఉత్తరాన్ని సొసైటీకి సెక్రటరీ పంపాలి. కానీ, అది నెలసరి స్టేట్‌మెంట్‌ మీద చార్జ్‌ చేసినట్లయితే, పత్రికలు అందని సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పుల ప్రతిని మాత్రమే పంపండి. దానితో పాటు పత్రిక చందాలు చార్జ్‌ చేయబడ్డాయి కానీ, పత్రికలు అందలేదని వివరిస్తూ ఒక ఉత్తరాన్ని పంపండి. స్టేట్‌మెంట్‌లో అప్పటికే చార్జ్‌ చేయబడినట్లయితే, వీక్‌లీ సబ్‌స్క్రిప్షన్స్‌ (M-AB-203) ఫారమ్‌ ప్రతులను దయచేసి పంపకండి.

8 స్థానిక పోస్టల్‌ అధికారులతో మంచి సంబంధం కలిగి ఉండడం పత్రికలు సరిగ్గా అందజేయబడడంలో ముఖ్య పాత్రను వహిస్తుంది. వారు మన గురించి ఎక్కువగా తెలుసుకోగలగడం మన గురించి మన పత్రికల గురించి వారికి ఏదైనా చెడు అభిప్రాయముంటే దానిని తీసివేయగలదు. మన కొరకు వారు చేస్తున్న ప్రాముఖ్యమైన సేవ ఎడల మనకు గల మెప్పును వ్యక్తం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. (న్యాయా. 8:1-3) సంఘంలోని అనుభవజ్ఞులైన సహోదరులు (అలాగే సహోదరీలు) అప్పుడప్పుడు స్థానిక పోస్టల్‌ అధికారులను స్నేహపురస్సరంగా సందర్శిస్తూ ఉండడం మంచిది. పోస్ట్‌మ్యాన్‌ల మరితర అధికారుల ఇండ్లలో స్నేహపురస్సరంగా చర్చలు జరపడం వారితో మంచి సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. సహకరించేవారిగా ఉండడం, ఎంపిక చేసిన పోస్టాఫీసులకు బహుమతి పత్రిక చందాలను కట్టడం, టిప్స్‌ ఇవ్వడం అనేవి సంబంధాలను మెరుగుపరచుకునేందుకు చేయగల మరికొన్ని విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోగలరు.

9 వాదించేవారై ఉండకండి. మీ పోస్ట్‌మ్యాన్‌ ఎన్నో సమస్యలను అసౌకర్యాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలుసుకుని, ఆయన మీ తపాలాను సమయానికి అందజేయనప్పుడు కూడా, ఆయనతో దయగా వ్యవహరించండి. (యాకో. 3:13) మీ తపాలాను తీసుకునేటప్పుడు, ముఖ్యంగా బరువైన వస్తువులు తపాలాలో ఉన్నప్పుడూ స్థానిక పోస్టాఫీసుతో సహకరించండి. అలా బరువైన వస్తువులున్న తపాలా ఉన్నప్పుడు, మీ తపాలాను, ముఖ్యంగా పత్రికల బండిళ్ళను పోస్ట్‌మ్యానే మీ గుమ్మం వరకూ తెచ్చిస్తాడని ఆశించే బదులు, ఎవరైనా ఒకరు పోస్టాఫీసు నుండి తపాలాను క్రమంగా తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేయడమే మంచిది కావచ్చు. అయితే, తపాలా వచ్చినప్పుడు మీకు తెలియజేయాలని పోస్ట్‌మ్యాన్‌ను మీరు కోరవచ్చు.

10 పోస్టల్‌ అధికారులతో సహా ప్రభుత్వ అధికారులతో మనం వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగానూ చతురతతోను ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. (మత్త. 10:16) చందా కట్టిన పత్రికలకు ఏమి జరుగుతుందన్నది స్థానిక సంఘం యొక్క పేరు మీద, అలాగే సొసైటీ పేరు మీద ప్రభావం చూపుతుంది. మరెక్కువగా దేవుని నామ ఘనత మీద ప్రభావం చూపుతుంది. (1 సమూ. 16:7) కనుక, పోస్టాఫీసు ద్వారా మంచి సేవలను పొందేందుకు స్థానికంగా మీరేమి చేయగలరనే దాని గురించి ధ్యానించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. సొసైటీ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తున్న కొలదీ, స్థానిక పోస్టల్‌ అధికారులతో సహకరిస్తున్న కొలదీ మీరు మంచి పోస్టల్‌ సర్వీస్‌ను పొందడాన్ని నిశ్చయపరచుకోగలరని మాకు నమ్మకం ఉంది.

[6వ పేజీలోని బాక్సు]

మంచి సేవను నిశ్చయపరచుకునేందుకు మీరేమి చేయగలరు

(ఎ) సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పులను పూరించేటప్పుడు అవసరమైన సమాచారం అంతా కచ్చితంగా, చదవగలిగేలా, సరైన వరుసక్రమంలో వ్రాయబడిందని దయచేసి నిశ్చయపరచుకోండి. చిరునామాలో ఒక్కో సమాచారాన్ని వేర్వేరుగా గుర్తించేందుకు ఆ సమాచారం తర్వాత కామా పెట్టండి. మీరు పూరించినది సరిగ్గానే ఉందేమో చూడమని చందాదారుడ్ని కోరడం జ్ఞానయుక్తంగా ఉంటుంది.

(బి) చందాదారుని పేరు ముందు Mr., Mrs., Miss, లేదా Dr., మరేదైన అటువంటిది ఉపయోగించవచ్చు. కాని పేరు చివర వేరే ఏదైన బిరుదులను వ్రాయవలసిన అవసరం సాధారణంగా లేదు.

(సి) పోస్టాఫీస్‌ పేరూ, నగరం పేరూ, మహానగరాల పేర్లను కూడా పూర్తిగా వ్రాయాలే కానీ సంక్షిప్త రూపంలో వ్రాయకూడదు. పిన్‌కోడ్‌ ఏదో మీకు తెలియకపోతే, దాని కోసం కేటాయించబడిన స్థలంలో దయచేసి గీత గీయండి.

(డి) కాంగ్రిగేషన్‌ నెం. అని ఉన్నచోట చందాదారుడు ఏ సంఘం ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ సంఘం యొక్క నెంబరును వ్రాయాలి. మీ సంఘప్రాంతానికి వెలుపల ఆయన నివసిస్తున్నట్లయితే, ఆయన ఏ సంఘం ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ సంఘం యొక్క నెంబర్‌ తెలియకపోతే, సంఘం యొక్క నెంబర్‌ కోసం కేటాయించబడిన స్థలంలో దయచేసి గీత గీసి వదిలేయండి.

(ఇ) బహుమతి చందాలు సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పు యొక్క కుడివైపు పై భాగాన వాటి కోసం కేటాయించబడిన టిక్‌ మార్క్‌ పెట్టవలసిన బాక్స్‌లో టిక్‌ పెట్టాలి. బహుమతిగా ఇస్తున్న వ్యక్తి పేరూ, స్థలమూ చందా సేకరించే వ్యక్తిని గూర్చిన సమాచారం కోసం కేటాయించబడిన స్థలంలో వ్రాయబడ్డాయని నిశ్చయపరచుకోండి.

(ఎఫ్‌) ఏ భాష కావాలో ఆ భాష పేరు పూర్తిగా వ్రాయాలి. ఇంగ్లీష్‌ పత్రికల విషయమైనా కూడా అంతే. బ్రెయిలీ పత్రికల కొరకైతే, భాషతో పాటు బ్రెయిలీ అని కూడా పేర్కొనాలి. (ఉదాహరణ: “బ్రెయిలీ-ఇంగ్లీష్‌.”) ప్రస్తుతం, ఏ భారతీయ భాషలోను బ్రెయిలీ పత్రికలు లభించడం లేదు.

(జీ) ఎంత కాలావధి వరకు చందాకట్టవచ్చు అంటే స్థానిక పత్రిక చందాల కనిష్ఠ కాలం 12 సంచికలు, గరిష్ఠ కాలం 5 సంవత్సరాలు. అయితే ఎయిర్‌ మెయిల్‌ చందాలను ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కట్టలేరు.

(హెచ్‌) రిన్యూవల్స్‌: రిన్యూవల్‌ చేసేందుకు దయచేసి ఎక్స్పైరింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పులను (M-91 మరియు M-191) ఉపయోగించండి. అవి లభ్యం కానట్లైతే, రిన్యూవల్‌ ఫారమ్‌ (M-5/M-105) లేదా క్రొత్త స్లిప్పులను ఉపయోగించండి. అలాంటప్పుడు, చందాదారుడు పత్రికలను పొందిన కవరు మీద అతని చిరునామా ఉన్న లేబల్‌ను జోడిస్తే బాగుంటుంది.

(ఐ) పెద్ద అచ్చు సంపుటి (భారతీయ భాషల్లో లభించదు) కావలికోట 2వ పేజీలో చూపబడినట్లు కొన్ని భాషల్లో మాత్రమే లభిస్తుంది. అందులో పఠన శీర్షికలు మాత్రమే ఉంటాయి.

(జె) రేట్లు: ప్రస్తుత పత్రికచందా రేట్లు పత్రికల్లో చూపించబడ్డాయి. పయినీర్‌ రేటును, బ్రెయిలీ చందా రేటును అతి క్రొత్త వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ కాస్ట్‌ లిస్ట్‌లో కనుగొనవచ్చు. మన రాజ్య పరిచర్యలో ప్రకటన ద్వారా రేటు మారినట్లైతే, ఆ మారినవే క్రొత్త రేట్లన్నమాట. సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్‌ మీద చూపించిన మొత్తం వీక్‌లీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఫారమ్‌పై చూపించిన మొత్తంతో సమానంగా ఉందా అని సెక్రెటరీ నిశ్చయపరచుకోవాలి.

(కె) ఇండియా నుండి అరబ్‌ గల్ఫ్‌ దేశాలకు తప్ప మరే దేశానికైన పంపే పత్రికల ఎయిర్‌ మెయిల్‌ చందా రేటు ప్రస్తుతం ఎంతంటే, సాధారణ పత్రిక చందా రేటుకు అదనంగా ప్రతి తపాలాకు రూ. 9.00. గల్ఫ్‌ దేశాలకు పంపే పత్రికలను ఫస్ట్‌ క్లాస్‌ మెయిల్‌ ద్వారా పంపిస్తారు. ఒక్కో పత్రిక తపాలాకు అయ్యే మెయిలింగ్‌ రేటు రూ. 11.00. ఇతర దేశాల్లో ముద్రించే పత్రికల క్రొత్త ఎయిర్‌మెయిల్‌ రేటు ఎంతనో దయచేసి సొసైటీని అడిగి తెలుసుకోండి.

(ఎల్‌) పత్రిక చందాలన్నింటినీ, ప్రచారకుల వ్యక్తిగత పత్రిక చందాలతో సహా స్థానిక సంఘం ద్వారా పంపండి. అలాగే, సొసైటీనీ ఏమైనా వాకబు చేయవలసిన అవసరమున్నప్పుడు, దయచేసి సంఘం ద్వారా వాకబు చేయండి. సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పులన్నింటి డూప్లికేట్‌లను తాము సబ్‌స్క్రిప్షన్‌లను పొందిన తరువాతి కూటంలో సబ్‌స్క్రిప్షన్‌లను చూసుకునే వ్యక్తికి ఇచ్చేయాలి. ప్రతివారం, అందిన సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పులన్నింటినీ, ఒకవేళ అందినది కేవలం ఒక్కటే అయినా సరే, సరిగా పూరించిన వీక్‌లీ సబ్‌స్క్రిప్షన్స్‌ (M-AB-203) ఫారమ్‌తోపాటు సొసైటీకి సెక్రెటరీ పంపాలి. ప్రతినెల చెల్లించేదానితోపాటు పంపించేందుకుగాను ఏ పత్రిక చందాను ఉంచకూడదు.

(ఎమ్‌) చందాదారులకు పత్రికలు అందుతున్నాయని నిశ్చయపరచుకునేందుకు వారిని మళ్ళీ సందర్శించండి. చందాదారుడు తన మొదటి పత్రికా ప్రతిని అందుకునేందుకు సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్‌(లు) సొసైటీకి చేరుకున్నప్పటి నుండి ఆరు వారాల వరకు పట్టగలదు.

(ఎన్‌) సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పులను సొసైటీకి పంపించి ఎనిమిది వారాల కన్నా ఎక్కువే గడిచిన తర్వాత కూడా పత్రికలు అందకపోతే సంఘం ద్వారా ఆ విషయాన్ని సొసైటీకి తెలపాలి. గత రెండు నెలల స్టేట్‌మెంట్లలో అది చార్జ్‌ చేయబడనట్లయితే, సెక్రెటరీ వీక్‌లీ సబ్‌స్క్రిప్షన్స్‌ యొక్క ఒక ప్రతినీ, అలాగే అందులో చేర్చబడిన ఇతర సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్పులన్నింటి డూప్లికేట్‌ ప్రతులను, అన్నీ వివరంగా తెలిపే ఉత్తరంతోపాటు సెక్రెటరీ మళ్ళీ పంపాలి. నెలసరి స్టేట్‌మెంట్‌ మీద చార్జ్‌ చేయబడినట్లయితే, పత్రికలు అందని చందాదారుని సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్‌ల ప్రతులను మాత్రమే పంపండి. దానితో పాటు సబ్‌స్క్రిప్షన్‌లు చార్జ్‌ చేయబడ్డాయి కానీ, ఇంత వరకూ పత్రికలు అందలేదని వివరిస్తూ ఉత్తరం వ్రాయండి. అప్పటికే స్టేట్‌మెంట్‌ మీద చార్జ్‌ చేయడం జరిగిన పత్రిక చందాల వీక్‌లీ సబ్‌స్క్రిప్షన్‌ల ప్రతులను దయచేసి పంపకండి.

(ఓ) మారిన చిరునామాలను తెలియజేయాలి, సాధ్యమైతే, సబ్‌స్క్రిప్షన్‌ చేంజెస్‌ ఆఫ్‌ అడ్రెస్‌ ఫారమ్‌ (M-205) ఉపయోగిస్తూ ఆరు వారాలు ముందుగానే తెలపాలి. క్రొత్త చిరునామాను పాత చిరునామాను ఇవ్వాలి. సాధ్యమైతే, చందాదారుని పాత చిరునామాను తెలియజేసే అడ్రస్‌ లేబల్‌ను దయచేసి జోడించండి. చిరునామా మారిన విషయం పోస్టల్‌ అధికారులకు తెలపమనీ/లేదా పత్రికలు క్రొత్త చిరునామాకు వచ్చే వరకూ తన పాత చిరునామాలోనే పత్రికలను తీసుకోమని చందాదారులను కోరండి.

(పి) “అన్‌డెలివరబుల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫాలో-అప్‌” స్లిప్పులను పత్రికచందాను సేకరించిన వ్యక్తికి ఇవ్వాలి. అలా ఆయన ఆ చందాదారుని దగ్గరకు వెళ్ళి విషయాలను సరిదిద్దవచ్చు. సొసైటీ నుండి వచ్చే అలాంటి ఏ ఎన్‌క్వైరీలకైనా బదులివ్వడంలో త్వరపడండి.

(క్యూ) పోస్టల్‌ అధికారులు మీ తపాలాను సమయానికి అందించలేకపోయినప్పుడు కూడా, మీరు వారి ఎడల దయగలవారిగానూ సహకరించేవారిగానూ ఉండండి. అది వాళ్ళను మంచి మూడ్‌లో ఉంచవచ్చు. వారికి ఏవైన చెడు అభిప్రాయాలుంటే అవి తొలగిపోతాయి.

మీరు ఈ ఉపదేశాలను జాగ్రత్తగా అనుసరిస్తుండగా, పత్రిక చందాల వ్యవహారంలో జరిగే ఆలస్యానికి కారణమయ్యే అనేక సమస్యలు తీసివేయబడతాయని మాకు నమ్మకం ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి