ఏప్రిల్‌లోని సేవా కూటాలు
ఏప్రిల్ 7తో ప్రారంభమయ్యే వారం
పాట 100 (6)
12 నిమి: స్థానిక ప్రకటనలు. సాహిత్య ప్రతిపాదనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకున్న ప్రకటనలు. ఇటీవలి పత్రికల్లోని సంభాషణాంశాలను ప్రస్తావించండి.
15 నిమి: “ఎంతోమంది విశ్వాసులు చేరుతున్నారు.” ప్రశ్నా జవాబులు. ఆగస్టు 15, 1993 కావలికోటలోని 12-17 పేజీల్లో ఇచ్చిన ముఖ్యమైన సలహాలను పునఃసమీక్షించండి.
18 నిమి: “అనుభవంలేని వారు గ్రహించేందుకు సహాయపడండి.” ప్రశ్నా జవాబులు. దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరులోని ఈ విషయాలను పునఃసమీక్షించండి: సులభతరం చేసిన పఠనా పద్ధతి, సమయానుకూలమైన ప్రశ్నలూ, ఆకర్షణీయమైన చిత్రాలూ, సమృద్ధిగా ఉన్న లేఖన ఉదాహరణ. చివరికి జ్ఞానము పుస్తకంలోకి నడిపించే పఠనాలను ప్రారంభించే లక్ష్యాన్ని కల్గివుండాలనే విషయాన్ని నొక్కి చెప్పండి. సమర్ధుడైన ప్రచారకుడు, 4వ పేరాలో ఇచ్చిన అందింపును ఉపయోగించి పఠనాన్ని ఎలా ప్రారంభించవచ్చో ప్రదర్శించేలా చూడండి. చిన్నవారైన తమ పిల్లలతో ఈ బ్రోషూరును పఠించమని సంఘంలోని తలిదండ్రులందరినీ ప్రోత్సహించండి.
పాట 130 (22), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 14తో ప్రారంభమయ్యే వారం
పాట 107 (4)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. సమయం అనుమతించినట్లైతే, పత్రిక చందాలను ప్రతిపాదించడాన్ని గురించిన లేక దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును అందజేయడాన్ని గురించిన లేక దాన్ని ఉపయోగించి బైబిలు పఠనాలను ప్రారంభించడానికి సంబంధించిన స్థానిక ప్రాంతీయ సేవా అనుభవాలను క్లుప్తంగా చెప్పండి.
15 నిమి: “మన పేరు వెనుకనున్న సంస్థకు విద్యార్థులను నడిపించండి.” (1-6 పేరాలు) ప్రశ్నా జవాబులు. 5-6 పేరాలనూ సూచించిన లేఖనాలను చదవండి. యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ అనే వీడియోను చూసిన బైబిలు విద్యార్థుల ప్రతిస్పందనకు సంబంధించిన స్థానిక అనుభవాలను చెప్పండి.
20 నిమి: “దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడో ఇతరులకు బోధించండి.” 1-4 పేరాలను ప్రేక్షకులతో చర్చించండి. వీధిలో, ఓ ఇంటిలో, వ్యాపార స్థలంలో, పార్కులో ఇలా నాలుగు వివిధ సందర్భాలను ఉపయోగించి 5వ పేరాలోని అందింపులను ప్రదర్శించండి. ఈ రోజు రాజ్యమందిరాన్ని వదలి వెళ్లడానికి ముందే పరిచర్యకొరకు బ్రోషూరులనూ పత్రికలనూ తీసుకోమని అందరికీ జ్ఞాపకం చేయండి.
పాట 126 (3), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 21తో ప్రారంభమయ్యే వారం
పాట 113 (12)
15 నిమి: స్థానిక ప్రకటనలు. మే నెలలో సహాయపయినీరు సేవ చేసేందుకు దరఖాస్తును పెట్టేందుకు సమయం ఇంకా మించిపోలేదని వివరించండి. ప్రశ్నా భాగాన్ని పునఃసమీక్షించి, రాజ్యమందిరంలోని గ్రంథాలయంలో ఏవైనా పుస్తకాలు అవసరముంటే వాటిని గూర్చి సంఘానికి తెలపండి.
15 నిమి: “మన పేరు వెనుకనున్న సంస్థకు విద్యార్థులను నడిపించండి.” (7-14 పేరాలు) ప్రశ్నా జవాబులు. కూటాలకు హాజరుకావలసిన అవసరత గురించి విద్యార్థితో ఏ మోహమాటం లేకుండా దయాపూర్వకంగా చర్చించడం ఎలాగో చూపేందుకు సమర్థుడైన బోధకుణ్ణి ఉపయోగించండి.
15 నిమి: మన ప్రచురణలను పూర్తిగా ఉపయోగించుకోవడం. ఓ పెద్ద ఇచ్చే ప్రసంగం. (జనవరి 1996, మన రాజ్య పరిచర్యలోని 3-5 పేజీలను చూడండి.) నిజానికి సంఘాలు తాము పంచిపెట్టే పత్రికల కన్నా వాటికొరకు ఆర్డరు పెట్టే పత్రికల సంఖ్య ఎక్కువ అని రిపోర్టు చూపుతుంది. సుమారు 50 శాతం అందింపులు ఎన్నడూ రిపోర్టు చేయబడలేదు. (స్థానికంగా లెక్కలు ఏమి తెలియజేస్తున్నాయో చూపించండి.) ఈ పత్రికలు ఏమౌతున్నాయి? అనేకం గూళ్ళలోకి చేరుకుంటాయి లేక వాటిని పారేయడం జరుగుతుంది. దీన్ని ఎలా నివారించవచ్చు? ప్రతి ప్రచారకుడూ తనకు ఎన్ని అవసరమో చూసుకుని తాను అందించగల్గినన్నింటిని మాత్రమే ఆర్డరు చేయాలి. మనం కలిసే వారందరికీ పత్రికలను అందించడాన్ని అలవాటు చేసుకోండి. పాత సంచికలు వ్యర్థమైపోయేందుకు అనుమతించవద్దు. పత్రికా సేవను క్రమంగా చేయండి.
పాట 128 (13), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 28తో ప్రారంభమయ్యే వారం
పాట 121 (21)
15 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్ నెలలోని రిపోర్టులను ఇవ్వమని అందరికీ జ్ఞాపకం చేయండి. మే నెలలో సహాయపయినీరు సేవను చేసే వారి పేర్లను ప్రకటించండి. ప్రాంతీయ సేవా కూటాలకు స్థానికంగా చేసిన అదనపు ఏర్పాట్లను గూర్చి క్లుప్తంగా చెప్పండి. ఆ నెలలోని సెలవు దినాల్లో ప్రాంతీయ సేవను దినమంతా చేసేందుకు పథకం వేసుకోవచ్చు. బ్రొషూరు తీసుకున్న వారితో బైబిలు పఠనాన్ని ప్రారంభించే లక్ష్యంతో పునర్దర్శించేందుకు మే నెలలో ప్రత్యేక ప్రయత్నాన్ని చేయాలి. అనియతంగా మనం సాక్ష్యమిచ్చే ప్రజల పేరునూ చిరునామాను యుక్తిగా అడిగి తెల్సుకునే కొన్ని విధానాలను గూర్చి క్లుప్తంగా సూచించండి. మీరు ముందు మీ పేరునూ చిరునామాను ఇచ్చి వారిని కలిసేందుకు వాళ్ల ఫోన్ నంబరును అడగవచ్చు. తమ విషయంలో ప్రభావవంతంగా ఉండిన ఇతర సలహాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
15 నిమి: “వారు దాన్ని ఎందుకు చేస్తారు?” ఓ పెద్ద ఈ శీర్షికను ఇద్దరు లేక ముగ్గురు క్రమ పయినీర్లతో చర్చిస్తాడు. (వాళ్లు లేకపోయినట్లైతే, సహాయ పయినీరు సేవను తరచూ చేసేవారిని ఉపయోగించండి.) జనవరి 15, 1994 కావలికోటలోని “పయినీర్లు అర్పించి ఆశీర్వాదాలను పొందుతారు” అనే శీర్షికనుండి ఉన్నతాంశాలను చేర్చండి. అతను గానీ ఆమె గానీ పయినీరు సేవను ఎందుకు చేపట్టారో వివరించమని చెప్పండి. అలా చేయడం వల్ల వారు ఎలా ఆశీర్వాదాన్ని పొందారో తెలియజేసే అనుభవాలను వివరించమని కోరండి.
15 నిమి: స్థానిక అవసరతలు. స్థానికంగా ఉన్న ప్రత్యేక అవసరతలపై సమాచారాన్ని అందించేందుకు పెద్దలు ఈ సమయాన్ని ఉపయోగించవచ్చు.
పాట 129 (18), ముగింపు ప్రార్థన.