అనుభవంలేని వారు గ్రహించేందుకు సహాయపడండి
1 దేవుడు ప్రజలనుండి ఏమి కోరుతున్నాడు అన్న విషయాన్ని శిష్యులను తయారు చేసే పని ద్వారా, మనం ఇతరులకు బోధిస్తాము. (మత్త. 28:19, 20) దాన్ని చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల కంటే ఎక్కువమంది సాక్షులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎన్ని గంటలను వెచ్చించాము, ఎంత సాహిత్యాన్ని అందించాము లేక ఎన్ని బైబిలు పఠనాలను ప్రారంభించామన్న దానితో విజయాన్ని కొలవము. ప్రజలు తాము నేర్చుకున్నవాటిని అర్థంచేసుకుని వాటికనుగుణంగా ప్రవర్తించినప్పుడే మనం మన లక్ష్యాన్ని సాధిస్తాం.
2 ఇతరులకు ఆత్మీయ సహాయాన్ని అందించడంలో “అనుభవంలేనివారికి గ్రహింపును కలిగించ”డం ఇమిడివుంది. (కీర్త. 119:130, NW) ప్రజలు ‘గ్రహించినప్పుడే,’ వారి హృదయాలు ప్రభావితమౌతాయి వారు పురికొల్పబడతారు. (మత్త. 15:10) మన పని విస్తరించి అధికమౌతుండగా, సరళంగా మాట్లాడవలసిన, బోధించవలసిన అవసరతను మనం మరింత ఎక్కువగా గుణగ్రహిస్తాము. అందుచేతనే, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రొషూరును సంస్థ ప్రచురించింది. అందులో, బైబిలులో ఉన్న ప్రాథమిక బోధల సమగ్ర పఠన కోర్సు ఉంది. పాఠాలు చిన్నగా ఉంటాయి, దానిలోని పదాలు సరళంగా ఉంటాయి మరి దానిలోని బోధను అర్థంచేసుకోవడం సులభంగా ఉంటుంది. అలా ఇవన్నీ అనేకులు దాన్ని ఇష్టపడేలా చేస్తాయి.
3 ఏప్రిల్, మే నెలల్లో పత్రిక చందాలను గూర్చి చెప్పేటప్పుడు ఈ బ్రొషూరు గురించి చెప్పవచ్చు. గతంలో ప్రచురణలను వెంటనే అంగీకరించిన వారి దగ్గరికి ఈ బ్రొషూరును తీసువెళ్లండి. ముఖ్యంగా పిల్లలకు బోధించేందుకూ, మీకు అంతగా రాని భాష మాట్లాడే ప్రజలకూ, అంతేకాక చదివే సామర్థ్యం ఎక్కువగాలేని వారికి బోధించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని జ్ఞాపకముంచుకోండి.
4 సరళమైన ఉపోద్ఘాతాన్ని ఉపయోగించండి: దేవుడు కోరుతున్నాడు అనే బ్రొషూరును ప్రతిపాదించేటప్పుడు 2వ పేజీని చూపించండి. “ఈ బ్రొషూరు బైబిలు పఠన కోర్సుగా రూపొందించబడింది” అని అది వివరిస్తుంది. ఆ వ్యక్తి బైబిలును ఎందుకు పఠించాలో చూపించేందుకు 3వ పేజీలోని 3వ పేరాను చూపండి. సరళమైన బైబిలు సత్యాలను బయల్పర్చే కొన్ని పఠన శీర్షకలనుపయోగించి అతని ఆసక్తిని రేకెత్తించండి. ఈ బ్రొషూరు నేర్చుకోవడాన్ని ఎలా ఆహ్లాదకరంగా చేస్తుందో చూపించి, వ్యక్తిగతంగా అతనికి సహాయం చేస్తామని చెప్పండి.
5 అభివృద్ధి చెందే పఠనాన్ని నిర్వహించండి: కేవలం పఠనాలను నిర్వహించడం మాత్రమే మన లక్ష్యం కాదు—సత్యారాధనకు దృఢంగా మద్దతునిచ్చేటటువంటి శిష్యులను మనం తయారుచేయాలి. ఈ బ్రొషూరును కేవలం కొన్ని వారాల్లోనే పూర్తిచేయవచ్చు, అలా అది జ్ఞానము పుస్తకంలో పఠనానికి నడిపించాలి. (31వ పేజీలోని అధఃసూచిని చూడండి.) మొదటినుండే, ఆ విద్యార్థి యెహోవా సంస్థను గుర్తించేందుకు అతనికి సహాయం చేయండి. (తర్కము పుస్తకం [ఆంగ్లం] 283-4 పేజీలను చూడండి.) సంఘ కూటాల విలువను నొక్కి తెలపండి, అంతేకాకుండా వాటికి హాజరవ్వడం వల్ల సత్యారాధన ఎలా చేయాలో చూపించే సంపూర్ణ అవగాహనను అవి ఇస్తాయని వివరించండి.—హెబ్రీ. 10:24, 25.
6 ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రత్యేకమైన పనిలో సంపూర్ణంగా పాల్గొనడం, జీవానికి నడిపే ‘గ్రహింపును పొందేందుకు’ యథార్థమైనవారికి సహాయపడడంవల్ల కలిగే ఆనందాన్ని తప్పకుండా తెస్తుంది.—సామె. 4:5, NW.