కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/96 పేజీ 2
  • డిశంబరులోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిశంబరులోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఉపశీర్షికలు
  • డిశంబరు 2తో ప్రారంభమయ్యే వారం
  • డిశంబరు 9తో ప్రారంభమయ్యే వారం
  • డిశంబరు 16తో ప్రారంభమయ్యే వారం
  • డిశంబరు 23తో ప్రారంభమయ్యే వారం
  • డిశంబరు 30తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1996
km 12/96 పేజీ 2

డిశంబరులోని సేవా కూటాలు

డిశంబరు 2తో ప్రారంభమయ్యే వారం

పాట 134 (33)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకోబడిన ప్రకటనలు. సాహిత్య ప్రతిపాదనలను ప్రస్తావించండి.

15 నిమి: “మన వర్తమానాన్ని ఎవరు వింటారు?” ప్రశ్నాజవాబులు. మార్చి 22, 1987 తేజరిల్లు!లోని (ఆంగ్లం) 5వ పేజీలోని మన వర్తమానం ఎందుకు ఆకర్షణీయమైందో అనే దానిని గూర్చిన సమాచారంనుండి కొన్ని విషయాలను చేర్చండి.

20 నిమి: “బైబిలు నిరీక్షణను నడిపింపును ఇస్తుంది.” (1-6 పేరాలు) ఆ భాగాన్ని 1-2 పేరాల సహాయంతో పరిచయం చేయండి. (తర్కించుట [ఆంగ్లం] పుస్తకంలోని 58-60 పేజీల్లో ఉన్న “బైబిలును పరిశీలించేందుకుగల కారణాలు” నాలుగింటిని గూర్చి క్లుప్తంగా చెప్పండి.) 3-6 పేరాల్లో ఇవ్వబడిన అందింపులను అర్హతగల ప్రచారకులచేత ప్రదర్శనను జరిపించండి. (1) అక్కడ వేయబడిన ప్రశ్నలు ఆసక్తిని ఎలా రేకెత్తించాయి, (2) చర్చించిన విషయానికి లేఖనాలు ఎలా సరిపోయాయి, (3) మొదట చేసిన చర్చ పునర్దర్శనానికి ఎలా నడిపింది, (4) పఠనం చేస్తామనే ప్రతిపాదన ఎలా చేయడం జరిగింది అనేవాటిపై వ్యాఖ్యానించమని సభికులనాహ్వానించండి.

పాట 75 (21), ముగింపు ప్రార్థన.

డిశంబరు 9తో ప్రారంభమయ్యే వారం

పాట 100 (59)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: సేవలో పాల్గొనేందుకు వృద్ధులకు సహాయం చేయడం. అనేకమంది నమ్మకమైన వృద్ధ ప్రచారకులకు సంఘంతో కలిసి ప్రకటించాలని ఉంటుంది, కానీ వారికి వృద్ధాప్యం, క్షీణించిన ఆరోగ్యం వంటి శారీరక పరిమితులున్నాయి. వారిని సేవా గుంపులో ఇమిడ్చేందుకుగాను మనం శ్రద్ధను చూపించే మార్గాలున్నాయి: రవాణా ఏర్పాటు చేస్తామని చెప్పండి; మెట్లు ఎక్కువగా లేని ఇళ్లలో మాట్లాడేందుకు ఏర్పాటు చేయండి; వారి పునర్దర్శనాలకు వారితో వస్తామని చెప్పండి; వారు ఇక చేయలేరు అని అనుకున్నప్పుడు వారిని ఇంటికి తీసుకువెళ్తామని చెప్పండి. తమకిస్తున్న సహాయానికి వృద్ధాప్యంలో ఉన్నవారు కృతజ్ఞతను కల్గివున్నారు. స్థానికంగా మీరు శ్రద్ధను చూపించగల ఇతర మార్గాలను ప్రస్తావించండి. ఫిబ్రవరి 1, 1986 కావలికోటలో (ఆంగ్లం) 28-9 పేజీల్లోవున్న “మేము వృద్ధులను మెచ్చుకుంటున్నాము!” అనే శీర్షికలోని ముఖ్యాంశాలను పునఃసమీక్షించండి.

20 నిమి: “బైబిలు నిరీక్షణను నడిపింపును ఇస్తుంది.” (7-9 పేరాలు) మే 1, 1993 కావలికోట (ఆంగ్లం) 3వ పేజీలోని “నడిపింపు అవసరం” అన్న శీర్షికపై వ్యాఖ్యానించండి. మన అందింపుల్లో ఉన్నత మూలంనుండి అంటే దేవుని నుండి సహాయాన్ని కోరడం ఎందుకు ప్రాముఖ్యమో నొక్కి చెప్పండి. 7-8 పేరాల్లోని అందింపులను ప్రచారకుడు ప్రదర్శించనివ్వండి. ఎల్లప్పుడూ బైబిలు పఠనాన్ని ప్రారంభించడమే మన గమ్యం అని జ్ఞాపకముంచుకోండి.

పాట 197 (57), ముగింపు ప్రార్థన.

డిశంబరు 16తో ప్రారంభమయ్యే వారం

పాట 209 (11)

10 నిమి: స్థానిక ప్రకటనలు. పండుగ శుభాకాంక్షలకు తెలివిగా ఎలా జవాబు చెప్పాలి అన్న విషయంపై కొన్ని సలహాలను ఇవ్వండి. డిశంబరు 25 కొరకు చేసిన ప్రత్యేక ప్రాంతీయ సేవా ఏర్పాట్లను గూర్చి తెలియజేయండి.

15 నిమి: “మనలను మనం ఇష్టపూర్వకంగా అర్పించుకోవడం.” ప్రశ్నా జవాబులు. మే 1, 1984 కావలికోటలోని (ఆంగ్లం) 22వ పేజీలో ఉన్న వ్యాఖ్యానాలను కూడా చేర్చండి.

20 నిమి: “దేవుడనుగ్రహించే అభివృద్ధినిబట్టి ఉల్లసించండి.” ఓ పెద్ద ఇచ్చే ఉత్సాహభరితమైన ప్రసంగం. ఈ శీర్షికలో పేర్కొన్న దేశాల అనుభవాలనుగానీ లేక వాటిలో పెరుగుదలకు సంబంధించిన రుజువులనుగానీ ఇటీవలి వార్షికపుస్తకాలు (ఆంగ్లం) నుండి తీసి చెప్పండి.

పాట 41 (22), ముగింపు ప్రార్థన.

డిశంబరు 23తో ప్రారంభమయ్యే వారం

పాట 93 (48)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారం సేవలో ఉపయోగించగల పత్రికల్లోని కొన్ని చర్చనీయాంశాలను ఎత్తిచూపండి. జనవరి 1 కొరకు చేసిన ప్రత్యేక ప్రాంతీయ పరిచర్య ఏర్పాట్లను తెలియజేయండి.

15 నిమి: స్థానికావసరతలు. లేక జూలై 15, 1996 కావలికోటలోని 24-5 పేజీల్లో ఉన్న “ఉద్యోగవిరమణ దైవపరిపాలనా కార్యానికి తెరచిన ద్వారమేనా?” అన్న విషయంమీద ఒక పెద్ద ప్రసంగిస్తారు.—అంతర్దృష్టి, సంపుటి 2, 794వ పేజీలోని 2-3 పేరాలను చూడండి.

20 నిమి: “దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పేరు నమోదు చేయించుకోవడం.” పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. ఎందరి పేర్లు నమోదయ్యాయో చూపించి, చేరగలవారినందరినీ అందులో చేరమని ప్రోత్సహించండి. “1997 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక”లో ఇవ్వబడిన విద్యార్థి నియామకాలను గూర్చిన సూచనలను పునఃసమీక్షించండి.

పాట 166 (90), ముగింపు ప్రార్థన.

డిశంబరు 30తో ప్రారంభమయ్యే వారం

పాట 223 (81)

10 నిమి: స్థానిక ప్రకటనలు. రాబోయే సంవత్సరంలో మీ సంఘ కూటాల సమయం మార్చవలసివుంటే, దానికి తగిన సర్దుబాట్లు చేసుకుని ఆ మారిన సమయాల్లో సంఘంతో క్రమంగా కూటాలకు హాజరు కమ్మని అందరికీ మంచి ప్రోత్సాహాన్నివ్వండి. అలాంటిదేమీ లేనట్లైతే, సంఘ పుస్తక పఠనంతో సహా అన్ని కూటాలకూ క్రమంగా హాజరు కమ్మని ప్రోత్సహించండి.

15 నిమి: సాక్ష్యమిచ్చేందుకు అవకాశాలను కల్గించుకోవడం. పాఠశాల నిర్దేశక పుస్తకం (ఆంగ్లం) 80-2 పేజీల్లో ఉన్న 11-16 పేరాలను ఉపయోగిస్తూ, అపరిచితులతో సంభాషణను ఎలా ప్రారంభించవచ్చనే విషయంలో సలహాలను పునఃసమీక్షించండి. ముందుగా సిద్ధపడడం శ్రేష్ఠమైన ఫలితాలను ఎలా తెస్తుందో చూపించండి. ఆసక్తి కనపర్చినవారిని గూర్చిన వివరాలు రాసుకుని ఆ తర్వాత ఎవరోకరు వారిని కలిసేందుకు ఏర్పాట్లు చేయమని ప్రచారకులకు గుర్తుచేయండి.

20 నిమి: జనవరి కొరకైన సాహిత్య ప్రతిపాదనలను పునఃపరిశీలించండి. ప్రత్యేక ధరకు అందించవచ్చని సంస్థ చెప్పిన 192 పేజీల పుస్తకాలు ఏవైనా ఉన్నాయేమో చూడండి. మీవద్ద అవి స్టాకులో లేకపోతే, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాన్ని ఉపయోగించండి. సంఘంలో ఏ పుస్తకాలు ఉన్నాయో చూపించండి. మీ ప్రాంతంలో ఉపయోగించదగిన రెండు మూడు పుస్తకాలను ఎన్నుకోండి. తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకంలోని 9-14 పేజీలను ఉపయోగిస్తూ, ప్రతి పుస్తకానికీ సరిపోయే ఉపోద్ఘాతాలను పునఃసమీక్షించండి. ఒకటి రెండు అందింపులను ప్రదర్శించండి.

పాట 137 (105), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి