దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వ్రాతపూర్వకమైన పునఃసమీక్ష
1996, సెప్టెంబరు 2 నుండి డిశంబరు 23 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలను మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మాత్రం మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. ప్రకటన 13:1లో చిత్రీకరించబడిన ఏడు తలలూ పది కొమ్ములున్న “క్రూరమృగము” వేరెవరోకాదు అపవాదియైన సాతానే. [uw 63వ పేజీ 4వ పేరా]
2. ఒక మనిషిని మొత్తంగా మ్రింగగల “గొప్ప మత్స్యము” వాస్తవంగా లేనేలేదు. (యోనా 1:17.) [si 153వ పేజీ 4వ పేరా]
3. లైంగికతను గూర్చిన బైబిలు దృక్పథాన్ని అనేక సంవత్సరాల క్రితం జీవించిన మానవులు వృద్ధిపర్చారు. [rs 370వ పేజీ 1వ పేరా]
4. దానియేలు 9:24, 25 నందున్న ప్రవచనం యేసు పుట్టుకను సూచిస్తుంది. [kl 36వ పేజీ 8వ పేరా]
5. ఓ పరిపూర్ణ మానవుడు తప్పు చేయలేడు. [rs 372వ పేజీ 1వ పేరా]
6. సాతాను తన్ను తాను వెలుగు దూతగా మార్చుకోగల్గుతున్నాడు కనుక, అభిచార మాధ్యమం ద్వారా జరిగే కొన్ని విషయాలు తాత్కాలికంగా ప్రయోజనకరంగా తోచినప్పుడు మనం మోసపోకూడదు. [rs 386వ పేజీ 3వ పేరా]
7. హోషేయ ప్రవచనం ప్రధానంగా రెండు గోత్రాల రాజ్యమైన యూదాను సూచించింది. [si 144వ పేజీ 8వ పేరా]
8. యెహోవా స్నేహమూ రక్షణా కావాలని కోరుకునేవారు అభిచార సంబంధ కూటాల్లో పాల్గొనడం పూర్తిగా మానుకుని, అపొస్తలుల కార్యములు 19:19 నందు ఇవ్వబడిన మాదిరిని అనుసరించాలి. [rs 389వ పేజీ 2వ పేరా]
9. జెఫన్యా 3:9 ప్రకారం, నూతనలోకంలో దేవుని ప్రజలందరూ ఒకే భాషను—హెబ్రీని మాట్లాడుతారు కనుక వారు ఐక్యంగా ఉంటారు. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w89 6/1 30వ పేజీ చూడండి.]
10. దానియేలు 12:1 నెరవేర్పుగా, 1914లో దేవుని పరలోక రాజ్యానికి తాను రాజైనప్పటి నుండి మిఖాయేలు ‘నిలుచుని’ ఉన్నాడు; ఈ దుష్టవిధానం మీదికి నాశనాన్ని తెస్తూ ఆయన యెహోవా నామమున అజేయుడైన యుద్ధయోధ-రాజుగా ‘నిలుచుంటాడు.’ [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w93 11/1 23వ పేజీ 23వ పేరా చూడండి.]
ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి:
11. హగ్గయి 2:7 NW నందు సూచించబడిన “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” ఎవరు, మరి వారు ఏ విధంగా “లోనికి వస్తారు”? [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w89 6/1 30వ పేజీ 4వ పేరా చూడండి.]
12. ముగ్గురు హెబ్రీయులు చేసిన ఏ వ్యాఖ్యానం, దేవునికి వారు కనపర్చే విధేయత దైవిక కాపుదల మరియు విడుదలపై ఆధారపడిలేదని బయల్పరుస్తుంది? (దాని. 3:16-18) [si 141వ పేజీ 19వ పేరా]
13. మెస్సీయా జన్మస్థలం గూర్చి ఏ లేఖనం చెబుతోంది? [si 156వ పేజీ 6వ పేరా]
14. యేసు నామమున చేసిన శక్తివంతమైన కార్యాలు దేవుని అనుగ్రహాన్ని లేక అదరణను కల్గివున్నాయనేందుకు ఎందుకు నిదర్శనం కాదు? [kl 46వ పేజీ 6-7 పేరాలు]
15. ప్రాణమును గూర్చి హెబ్రీ లేఖనాలు చెప్పిన దానికి 1 కొరింథీయులు 15:45, NW ఎలా మద్దతునిస్తుంది? [rs 376వ పేజీ 1వ పేరా]
16. యేసు తన తండ్రితో “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” అని అన్నప్పుడు ఆయన దేన్ని సూచిస్తున్నాడు? (లూకా 23:46) [rs 383వ పేజీ 2వ పేరా]
17. మరణించినప్పుడు ఒక వ్యక్తిలోని జీవశక్తి చేతనంగా ఉండదు అని సూచించేందుకు కీర్తన 146:4, NW ఏ వాక్యాన్ని ఉపయోగించింది? [rs 385వ పేజీ 2వ పేరా]
18. మానవులు నిజంగా మరణించరనే ఆలోచనను ఎవరు కల్పించారు, మరి ఈ అబద్ధ బోధకు సంబంధించిన మొదటి అబద్ధం బైబిలునందు ఎక్కడ ఉంది? [rs 385వ పేజీ 5వ పేరా]
19. హగ్గయి 2:9 నందలి “కడవరి మందిరము” అన్న ఆలయం ఏది, “మునుపటి మందిరము” ఏది, మరియు “మునుపటి మందిరము” కంటే “కడవరి మందిరము” యొక్క మహిమ ఎందుకు మించినది? [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w89 6/1 30వ పేజీ చూడండి.]
20. హోషేయ 14:2 ఏమి చేయమని ఇశ్రాయేలీయులను ఉద్బోధించింది, మరియు యెహోవాసాక్షులు ఆ ప్రవచనాన్ని నేడు ఎలా నెరవేరుస్తున్నారు? (హెబ్రీ. 13:15) [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w94 9/15 10వ పేజీ 1-2 పేరాలు చూడండి.]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. తనకు దేవుడిచ్చిన పనిని _____________________ పూర్తి చేసిన సుమారు 200 సంవత్సరాల తర్వాత, ప్రవక్తయైన _____________________ ఆ _____________________ పట్టణాన్ని రక్తపాతం గల పట్టణం అని పిలిచాడు. [si 154వ పేజీ 10వ పేరా, 160వ పేజీ 10వ పేరా]
22. విశ్వాసం మరియు ప్రేమలతో నిండివున్న హృదయాలవల్ల కదలించబడిన వారిగా మనం దేవున్ని _____________________ తో ఆరాధించవలసిన అవసరం ఉంది; అలాగే ఆయన వాక్యాన్ని పఠించడం ద్వారా మనం ఆయన్ను _____________________ తో ఆరాధించాలి. [kl 45వ పేజీ 4వ పేరా]
23. ఆత్మీయంగా కాపాడబడేందుకుగాను దేవునినుండి వచ్చిన _____________________ _____________________ యనే మైమరువు,” “సమాధాన _____________________ వలననైన . . . జోడు,” _____________________ మను డాలు,” _____________________ యను శిరస్త్రాణము,” మరియు “ఆత్మ _____________________ ఉన్న కవచంలోని ఏ ఒక్క భాగాన్నైనా వేసుకోవడాన్ని నిర్లక్ష్యంచేయకూడదు. [uw 68వ పేజీ 14వ పేరా]
24. యేసే మెస్సీయా అని రుజువు చేసేందుకుగల సాక్ష్యాలేవంటే, (1) _____________________ (2) _____________________ మరియు (3) _____________________ . [kl 34-8 పేజీలు 6-10 పేరాలు]
25. _____________________లో యెరూషలేము రోమీయులచేతిలో నాశనమైన తదనంతరం, సరిగ్గా ఓబద్యా ప్రవచించినట్లుగానే _____________________ ఓ ప్రత్యేక ప్రజలుగా చరిత్రలో లేకుండా కనుమరుగయ్యారు. [si 152వ పేజీ 12వ పేరా]
క్రింది వాక్యాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. క్రైస్తవ సంఘంలోకి ఇశ్రాయేలీయులుకానివారు సమకూర్చబడడం దేవుని చిత్తమని మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ గ్రహించేందుకుగాను ఆమోసు (8:11; 9:2, 3; 9:11, 12) యొక్క అవగాహన సహాయపడింది. (అపొస్తలుల కార్యములు 15:13-19) [si 150వ పేజీ 16వ పేరా]
27. (ఆమోసు; యోవేలు; హబక్కూకు)ను యెహోవా పిలిచినప్పుడు, అతను ప్రవక్త కాడు, ప్రవక్త శిష్యుడూ (కుమారుడూ) కాడు కానీ పశువులను (గొఱ్ఱెలు) మేపేవాడు (ఖర్జూరాలు; మేడిపండ్లు; ఒలీవ పండ్లు) ఏరుకునేవాడు. [si 148వ పేజీ 1వ పేరా]
28. పరిశుద్ధాత్మ యొక్క సరైన గుర్తింపు, ఆ ఆత్మను సూచించే (మత సిద్ధాంతాలకు; క్రైస్తవమత సామ్రాజ్యపు పారంపర్యాచారాలకు; లేఖనాలన్నింటికీ) సరిపోవాలి మరియు, అది పరిశుద్ధాత్మ (ఓ వ్యక్తి; త్రిత్వంలో ఓ భాగం; దేవుని చురుకైన శక్తి) అన్న సహేతుకమైన ముగింపుకు నడిపిస్తుంది. [rs 381వ పేజీ 1వ పేరా]
29. యోవేలు 2:32 ను (అపొస్తలుల కార్యములు 2:40; రోమీయులు 10:13; 1 తిమోతి 2:4) నందు (పేతురు; యోహాను; పౌలు) ఎత్తివ్రాశాడు, మరి అందులో యెహోవా నామాన్ని ఉచ్చరించడాన్ని గూర్చిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w96 4/1 20వ పేజీ 16వ పేరా చూడండి.]
30. (మతపరమైన అత్యుత్సాహం వ్యక్తపర్చడం; వణకడం దొర్లడం; ఉత్సాహంగా సాక్ష్యమివ్వడం) మరియు (ఐదు; ఏడు; తొమ్మిది) ఆత్మఫలాలను కనపర్చడం ద్వారా మనకు దేవుని ఆత్మ ఉంది అనేందుకు నిదర్శనమిస్తాము. [rs 381వ పేజీ 5వ పేరా-382వ పేజీ 1వ పేరా]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జతచేయండి: ద్వితీ. 18:10-12; హోషే. 10:12; జెఫ. 2:3; యాకో. 1:26, 27; 1 యోహా. 3:4, 8
31. మన ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమయ్యేందుకుగాను, అది లోక ఆచారాలతో కలుషితమవ్వకుండా ఉండడమేకాకుండా దేవుడు ప్రాముఖ్యమని ఎంచేవన్నీ కూడా ఇమిడి ఉండాలి. [kl 51వ పేజీ 20వ పేరా]
32. మన అనుదిన జీవితంలో సరైన దాన్ని చేయడం ద్వారా యెహోవా కనికరాన్ని పొందుతాము. [వారంలో చదవలసిన బైబిలు భాగం; w96 3/15 23వ పేజీ 2-3 పేరాలు చూడండి.]
33. అన్ని విధములైన శకునపరీక్షలూ అపవిత్రాత్మలతో సంబంధానికి లేక వాటి ఆధీనంలో ఉండడానికి ఆహ్వానం పలకడమే మరియు అలాంటి వాటిలో పాల్గొనడం యెహోవా ఎడల పూర్తి విశ్వాసఘాతుకమే. [rs 387వ పేజీ 4వ పేరా]
34. బుద్ధిపూర్వకంగా పాపపు మార్గాన్ని ఎన్నుకుని దాన్ని క్రమంగా చేపట్టేవారిని దేవుడు నేరస్థులుగా దృష్టిస్తాడు. [rs 374వ పేజీ 2వ పేరా]
35. దేవుని కరుణను తేలికగా తీసుకోలేము. [si 165వ పేజీ 11వ పేరా]