కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/96 పేజీ 2
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—2002
  • ఉత్తరాల ద్వారా సందేశాన్ని అందజేయడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఉత్తరం ఇలా రాయవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠చక్కగా ఉత్తరాలు రాయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1996
km 11/96 పేజీ 2

ప్రశ్నాభాగం

◼ ఇండ్లకు వెళ్ళినప్పుడు మనం కలవలేకపోయిన గృహస్థులకు ఉత్తరాలు వ్రాసేటప్పుడు మనం ఏ విషయాలను మనస్సులో ఉంచుకోవాలి?

మనం ప్రజల ఇండ్లకు వెళ్ళినప్పుడు అనేక కారణాల వల్ల, వాళ్ళను కలవడం చాలా కష్టమవుతుందని మనం కనుగొంటాం. వారిని చేరుకోవడానికి, ఉత్తరాలను వ్రాయడం ఆచరణాత్మక మార్గమని కొందరు ప్రచారకులు కనుగొన్నారు. ఇది మంచి ఫలితాలను ఉత్పన్నం చేయగలిగినప్పటికీ, కొన్ని ఇబ్బందులను నివారించేందుకు కొన్ని జ్ఞాపికలను మనం పరిగణించవలసిన అవసరం ఉంది:

తిరిగి వ్రాయవలసిన చిరునామాగా సొసైటీ చిరునామాను ఉపయోగించవద్దు. అది ఆ ఉత్తరం మన కార్యాలయాల నుండి పంపబడిందనే తప్పుడు సూచననిచ్చి, అనవసర సమస్యలను సృష్టించి, ఒక్కోసారి అదనపు ఖర్చుకు కారణమౌతుంది.

మీ దగ్గరున్నది సరైన చిరునామాయేనని, అవసరమైన స్టాంపులు అంటించారని రూఢిచేసుకోండి.

“నివాసికి” అని చిరునామాలో వ్రాయకూడదు; వారి పేరును కచ్చితంగా వ్రాయండి.

ఇంట్లో ఎవరూ లేనప్పుడు తలుపు దగ్గర ఉత్తరాలను వేయకండి.

క్లుప్త లేఖలే శ్రేష్ఠం. చాలా ఎక్కువ సమాచారం వ్రాసే బదులు ఒక కరపత్రాన్ని గానీ, ఒక పాత పత్రికను గానీ జతచేసి పంపండి.

టైప్‌ చేసిన ఉత్తరాలు చదవడానికి మరింత సులభంగా ఉండి, మరింత అనుకూల అభిప్రాయాన్ని కలిగిస్తాయి.

మీరు వ్యక్తిని ముందు వ్యక్తిగతంగా కలవనట్లైతే ఉత్తరాలు పునర్దర్శనాలుగా ఎంచబడవు.

క్రితం ఆసక్తి చూపించిన వ్యక్తికి మీరు వ్రాస్తున్నట్లైతే మీరు చిరునామాను లేదా ఫోన్‌ నంబర్‌ను వ్రాయండి. అలాగైతే వారు మిమ్మల్ని సంప్రదించగలరు. మన బైబిలు పఠన కార్యక్రమాన్ని వివరించండి.

స్థానిక సంఘ కూటాలకు ఆహ్వానాన్నివ్వండి. కూటాలు జరిగే స్థలం యొక్క చిరునామాను, కూటాలు జరిగే సమయాలను తెలపండి.

మీకు నియమించబడిన ప్రాంతాన్ని మీరు తిరిగి ఇచ్చిన తర్వాత ఇండ్ల దగ్గర లేనివారికి ఉత్తరాలను వ్రాయడం కొనసాగించకండి; ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎవరు చేస్తున్నారో ఆ ప్రచారకునిదే అక్కడ చేసే బాధ్యత.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి