కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/96 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1996
మన రాజ్య పరిచర్య—1996
km 11/96 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని రూ. 20.00 చందాకు. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించే లక్ష్యంతో, దానిని అందించిన ప్రతిచోటికి తిరిగి వెళ్లడానికి విశేష ప్రయత్నం చేయబడుతుంది. డిశంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు. ప్రత్యామ్నాయంగా, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రూ 45.00 చందాకు ప్రతిపాదించవచ్చు. జనవరి: 192 పేజీల పాత పుస్తకాల ప్రత్యేక ప్రతిపాదన ఒక్కొక్కటి రూ. 10.00 చందాకు. ఈ కోవకు చెందిన ఈ క్రింది పుస్తకాలు ఇప్పటికీ మా దగ్గర లభ్యమే: ఆంగ్లం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, మానవుడు పరిణామం ద్వారా వచ్చాడా లేక సృష్టి ద్వారా వచ్చాడా?; కన్నడ: “దేవుడు అబద్ధమాడలేని విషయాలు,” “నీ రాజ్యము వచ్చుగాక;” గుజరాతీ: నిత్యజీవమునకు నడుపు సత్యము, నిన్ను సంతోషపరచు సువార్త, “నీ రాజ్యము వచ్చుగాక;” తమిళం మరియు హిందీ: “నీ రాజ్యము వచ్చుగాక;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?; మరాఠీ: గొప్ప బోధకుని వినడం, “నీ రాజ్యము వచ్చుగాక;” ఎక్కువగా నేపాలీ లేదా బెంగాలీ చదవాలని ఇష్టపడేవారికి 32 పేజీల బ్రోషూర్‌లలో దేనినైనా ప్రతిపాదించవచ్చు. పంజాబీ ఎక్కువగా ఇష్టపడేవారికి నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని, మలయాళం ఇష్టపడేవారికి నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. చివరి ఈ రెండు పుస్తకాలు ప్రత్యేక వెలకు ఇవ్వవలసినవి కావని దయచేసి గమనించండి. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) లేదా నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము రూ. 20.00 చందాకు. పంజాబీ చదవడానికి ఇష్టపడేవారికి నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా, 192 పేజీల ప్రత్యేక ప్రతిపాదనా పాత పుస్తకాలలో దేనినైనా రూ. 10.00 చందాకు ప్రతిపాదించవచ్చు.

◼ రాజ్య సువార్త నెం. 34 సరఫరా ఇప్పటికీ ఉన్న సంఘాలు, ఇంటింటా అయినా లేక మరెక్కడైనా సరే ఇతర కరపత్రాలను ఉపయోగించినట్లే వాటిని ఉపయోగించమని ప్రచారకులను ప్రోత్సహించవచ్చు. అనుమతింపబడినట్లైతే, నివాసులు కలవని ప్రతి ఇంటా ప్రచారకులు ఒక కరపత్రాన్ని వేయవచ్చు, అలా వేసేటప్పుడు బయటనుండి వెళ్ళే వారికి పూర్తిగా కనిపించని విధంగా వేస్తున్నారని నిశ్చయపరచుకోవచ్చు. ఈ అమూల్యమైన సందేశం గల మిగిలిపోయిన ఈ ప్రతులనన్నింటినీ పంపకం చేసేందుకు ప్రయత్నం చేయబడాలి.

◼ 1951 నుండి 1959 సంవత్సరాల వరకున్న వాచ్‌టవర్‌ ఆంగ్ల బౌండ్‌ వాల్యూమ్‌లను ఆర్డర్‌ చేసిన సంఘాలకు వెంటనే పంపిస్తున్నాము. ప్రచారకులకైనా పయినీర్లకైనా ఈ వాల్యూమ్‌లు ఒక్కొక్కటి రూ. 90.00, తొమ్మిదింటి ఒక సెట్టుకు రూ. 810.00. వాల్యూమ్‌లను నిల్వ ఉంచకుండా, వాటిని ఆర్డర్‌ చేసిన వారికి త్వరగా ఇచ్చి, సొసైటీకి వెంటనే డబ్బు చెల్లించాలి. బౌండ్‌ వాల్యూమ్‌లు స్పెషల్‌ రిక్వెస్ట్‌ కోవకు చెందినవని, మీకు ప్రత్యేక రిక్వెస్ట్‌ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఆర్డర్‌ చేయాలని జ్ఞాపకముంచుకోండి. స్పెషల్‌ రిక్వెస్ట్‌ కోవకు చెందినవాటన్నింటిలాగే, వాటి మూల్యాన్ని తరువాతి చెల్లింపుతో సొసైటీకి పంపాలి.

ఈ వాల్యూమ్‌లను పంపించేశాక, పాత వాల్యూమ్‌ల పెండింగ్‌ ఆర్డర్‌ ఏదీ ఉండదు.—ఇంతవరకు పాత వాల్యూమ్‌ల కొరకు ఆర్డరు చేసిన సంఘాలన్నీ వాటన్నింటినీ పొంది ఉంటాయి. అయినప్పటికీ ఈ వాల్యూమ్‌ల మిగిలిన కొంత స్టాకు మా దగ్గర ఉంటుంది. కనుక, ఎవరైనా ఈ వాల్యూమ్‌లను కావాలనుకుంటే, తమ సంఘం ద్వారా వాటి కొరకు వెంటనే ఆర్డరు చేయాలి. ఒకసారి ఈ స్టాకు అయిపోయిన తర్వాత, పాత వాల్యూమ్‌ల కొరకు తరువాతి ఆర్డర్లను మేము అంగీకరించము—భవిష్యత్‌ వాల్యూమ్‌ల కొరకై ఇప్పుడున్న స్థాయీ ఆర్డర్లను కొనసాగిస్తూ, క్రొత్త వాల్యూమ్‌ల కొరకైన స్థాయీ ఆర్డర్లను అంగీకరిస్తాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి