స్నేహపూర్వకమైన సంభాషణలు హృదయాన్ని చేరుకోగలవు
1 “తలంపులను మౌఖికంగా పరస్పరం పంచుకోవడం” అని సంభాషణను నిర్వచించవచ్చు. ఇతరులను వ్యాకులపరచే ఒక విషయంపై స్నేహపూర్వక సంభాషణలను ఆరంభించడం వారి ఆసక్తిని రేకెత్తించవచ్చు, అలా రాజ్య వార్తతో వారి హృదయాలను చేరుకోవడంలో అది మనకు సహాయపడగలదు. ప్రజలకు ప్రసంగం ఇవ్వడం కన్నా స్నేహపూర్వకంగా, నెమ్మదిగా వారిని సంభాషణలో ఇమడ్చడం చాలా ఫలవంతంగా ఉంటుందని అనుభవం చూపించింది.
2 స్నేహపూర్వక సంభాషణను ఎలా ప్రారంభించాలి: ఇతరులతో మనం సంభాషించగలగడం అంటే, ఆలోచనలను, లేఖనాలను ఆకర్షణీయమైన విధంగా పేర్కొనాలని భావం కాదు. ఇతరులు మనతో మాట్లాడేలా చేయడమే అందులో ఇమిడి ఉంది. ఉదాహరణకు, మనం పక్కింటివారితో స్నేహపూర్వకంగా మాట్లాడేటప్పుడు నిష్కర్షగా ఉండకుండా, నెమ్మదిగా ఉండాలి. మనం తరువాత మాట్లాడబోయే మాటలను గూర్చి ఆలోచించం కాని, ఆయన వ్యక్తం చేసే తలంపులకు సహజంగా ప్రతిస్పందిస్తాం. ఆయన చెప్పేదానిలో యథార్థమైన ఆసక్తిని చూపించడం మనతో సంభాషణను కొనసాగించేందుకు అతనిని ప్రోత్సహించవచ్చు. ఇతరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు కూడా అదే నిజం.
3 నేరం, యౌవనస్థుల సమస్యలు, స్థానిక వివాదాలు, లోక పరిస్థితులు, లేదా వాతావరణం వంటి విషయాలను కూడా స్నేహపూర్వక సంభాషణలను ఆరంభించేందుకు ఉపయోగించవచ్చు. ప్రజల జీవితాలను నేరుగా బాధించే విషయాలు వారి ఆసక్తిని రేకెత్తించడంలో మరింత ఫలవంతంగా ఉంటాయి. ఒకసారి సంభాషణను ఆరంభించిన తరువాత, మనం దానిని నెమ్మదిగా రాజ్య సువార్త వైపుకు మళ్ళించగలుగుతాము.
4 సంభాషణను ప్రశాంతంగా జరుపుకోవడం అంటే, ముందుగా సిద్ధపడడం అవసరం లేదని భావం కాదు. అది అవసరమే. అయినప్పటికీ, నిష్కర్షగా ఒకటే విషయాన్ని మనస్సులో రూపుదిద్దుకోవడం లేదా ప్రసంగాన్ని కంఠస్థం చేయడం గానీ అవసరం లేదు. అలా చేస్తే, పరిస్థితులకు తగినట్లు మార్చుకోలేని సవరింపులు చేసుకోలేని సంభాషణకు అది దారితీస్తుంది. (1 కొరింథీయులు 9:20-23 పోల్చండి.) సిద్ధపడేందుకు శ్రేష్ఠమైన మార్గం ఏమిటంటే, లేఖనాల ఆధారితమైన సంభాషణలను నిర్మించే దృష్టితో ఒకటో రెండో లేఖనాధార అంశాలను ఎన్నుకోవడమే. తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకంలో ఉన్న విషయాలను పునఃసమీక్షించడం అందుకు సహాయకరంగా ఉంటుంది.
5 స్నేహపూర్వక సంభాషణకు ముఖ్యమైన గుణాలు: మనం ఇతరులతో సంభాషించేటప్పుడు ఆప్యాయంగాను యథార్థంగానూ ఉండాలి. మందహాసం, ఉత్సాహంగా కనిపించడం ఈ గుణాలను ప్రతిబింబించడానికి సహాయపడతాయి. లోకంలో అతి శ్రేష్ఠమైన సందేశం మనదగ్గరుంది; అది యథార్థ హృదయులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వారితో ఏదో ఒక మంచి వార్తను పంచుకోవాలనే నిజమైన కోరిక వారిపై మనకు శ్రద్ధ ఉండేందుకు మనలను ప్రేరేపించింది అని వారు భావించినప్పుడు వారు వినడానికి పురికొల్పబడవచ్చు.—2 కొరిం. 2:17.
6 సంభాషణ చేయడం ఏర్పడడం ఆహ్లాదకరమైన అనుభవమై ఉండాలి. కనుక, మనం దయగలవారమై, రాజ్య సువార్తను అందించడంలో యుక్తిగలవారమై ఉండాలి. (గల. 5:22; కొలొ. 4:6) ఎదుటి వ్యక్తికి మంచి అభిప్రాయం ఏర్పడడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా, మనం మొదటిసారి ఆతని హృదయాన్ని చేరుకోవడంలో సఫలులం కాకపోయినప్పటికీ, ఇంకొకసారి మరో సాక్షి ఆయనతో సంభాషించేటప్పుడు ఆయన మరింత శ్రద్ధగా వినవచ్చు.
7 స్నేహపూర్వకమైన సంభాషణను ఆరంభించడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రసంగాన్ని నేర్చుకోవడం వల్ల వచ్చేది కాదు. ఒక వ్యక్తిని వ్యాకులపరచే విషయంలో ఆసక్తిని రేకెత్తించడమే చేయవలసిన పని. మనం ఒక్కసారి ముందుగా సిద్ధపడితే, మనం ప్రజలతో స్నేహపూర్వకమైన సంభాషణలను జరపడానికి సిద్ధంగా ఉన్నవారమౌతాము. కనుగొనగల శ్రేష్ఠమైన సువార్తను అంటే రాజ్య ఆశీర్వాదాలను గూర్చిన సువార్తను మనం కలిసే వ్యక్తులతో పంచుకోవడం ద్వారా వారి హృదయాలను చేరుకోవడానికి మనం ప్రయత్నించుదాం.—2 పేతు. 3:13.