ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకం రూ. 15.00 చందాకు. ప్రత్యామ్నాయంగా, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు ప్రతిపాదించవచ్చు. సముచితమైన చోట కుటుంబ జీవితము పుస్తకాన్ని రూ. 15 చందాకు ప్రతిపాదించవచ్చు. ఈ రెండు పుస్తకాలలో ఏదైనా ఒకదానితో పాటు కూడా దాన్ని ప్రతిపాదించవచ్చు. జూలై, ఆగస్టు: ఈ క్రింది 32 పేజీల బ్రోషూరులలో దేనినైనా రూ. 5.00 చందాకు ప్రతిపాదించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరు: నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము పుస్తకాన్ని రూ. 15.00 చందాకు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు లేక జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం), ఈ రెండింటిలో ఏదో ఒకటి రూ. 25.00 చందాకు ప్రతిపాదించవచ్చు (పెద్ద సైజు రూ. 45.00).
గమనిక: కుటుంబ జీవితము, నిరంతరము జీవించగలరు పుస్తకాలను చక్కగా ఉపయోగించుకోవాలని మేము సంఘాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నాము. ప్రచారకులు ఈ పుస్తకాల కాపీలను సంవత్సరం అంతటిలో తమవద్ద ఉంచుకోవాలని, ఉచితమైన ప్రతి సందర్భంలో వాటిని ప్రతిపాదించాలని వారిని ప్రోత్సహించవచ్చు. పైన పేర్కొనబడిన ప్రచార సాహిత్యాలలో వేటినైనా ఇంకా రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌పై (S-AB-14) రిక్వెస్ట్ చేయాలి.
◼ 1996, సెప్టెంబరు 9తో ప్రారంభమయ్యే వారం నుండి 1997, సెప్టెంబరు 29వ తేదీతో ప్రారంభమయ్యే వారం వరకు సంఘ పుస్తక పఠనంలో జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం పఠించబడుతుంది.
◼ సంఘాధ్యక్షుడు లేక ఆయనచే నియమించబడిన వేరొకరు సంఘ లెక్కలను జూన్ 1న లేక ఆ తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆడిట్ చేయాలి. ఇది జరిగిన తరువాత సంఘానికి ప్రకటించండి.
◼ ఇకమీదట, సొసైటీ పంపిణీ చేసే అన్ని ప్రాంతీయ భాషా బైబిళ్ల వెల రూ. 60.00.
◼ మళ్లీ లభ్యమౌతున్న ప్రచురణలు:
మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?—నేపాలీ, పంజాబీ, హిందీ.