కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/96 పేజీలు 3-6
  • అందరికీ అన్నివిధముల వారిగా కావడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అందరికీ అన్నివిధముల వారిగా కావడం
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఉపశీర్షికలు
  • 7 హిందువుతో మాట్లాడడం:
  • 8 ఒక హిందువుతో లేదా ముస్లిమ్‌తో మాట్లాడడం:
  • 9 ఒక ముస్లిమ్‌తో మాట్లాడడం:
  • ‘మీరు వెళ్ళి రాజకీయనాయకులకు ప్రకటించాలి, మాకు కాదు.’
  • ‘ఇండియా మతనిష్ఠగల దేశం, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రకటించండి.’
  • ‘మీరు మమ్మల్ని క్రైస్తవ మతంలోకి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు’
  • ‘నేను మా పవిత్ర గ్రంథాలను మాత్రమే చదువుతాను’
మన రాజ్య పరిచర్య—1996
km 5/96 పేజీలు 3-6

అందరికీ అన్నివిధముల వారిగా కావడం

1 ఇటీవలి నెలల్లో దైవపరిపాలనా కార్యక్రమం యొక్క అనేక రంగాల్లోను కలిగిన పెరుగుదలను గూర్చి వినడం భారత ఉపఖండంలోని యెహోవాసాక్షులకు గొప్ప ప్రోత్సాహానికి మూలంగా ఉంది. అన్ని పూర్వరంగాల్లోని మరెక్కువ మంది ప్రజలు సత్యాన్ని అంగీకరించినప్పుడు, ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లోలాగే, మహాశ్రమలు రాకముందు ఇండియా సేవా ప్రాంతంలోనూ గొర్రెలవంటి వారిని సమకూర్చే పనిని యెహోవా ‘త్వరితపరుస్తున్నాడు’ అని మనం గ్రహిస్తాము. అయినప్పటికీ, మన ప్రాంతంలో ఇంకా లక్షలాదిమంది ప్రజలను సువార్త చేరవలసి ఉంది కనుక, స్పష్టంగా చాలాపని చేయవలసి ఉంది.—యెష. 60:22.

2 ఇండియాలోని విభిన్న మత విశ్వాసాలను గూర్చి మనమాలోచించినప్పుడు మనమీ విధంగా అడగవచ్చు: మనం సత్యాన్ని అందించడంలో మరింత ప్రభావవంతంగా ఉండేందుకు మనం చేయగలిగినది ఏమైనా ఉందా? అయితే గృహస్థుడు హిందూ అయినా, ముస్లిమ్‌ అయినా పార్సీ అయినా లేదా నామమాత్రపు క్రైస్తవుడైనా ఉపోద్ఘాతం లేక సంభాషణా విషయం ఒకటే అయితే సరిపోతుందా? 1 కొరిం. 9:19-23నందు మనం చదువుతున్నట్లు, తనను వినేవారికి తగిన విధంగా తన విధానాన్ని సవరించుకోవడంలో అపొస్తలుడైన పౌలు చాలా అప్రమత్తంగా ఉండేవాడు. ‘అందరికి అన్నివిధముల వాడు కావడం’లో ఆయన లక్ష్యమేమిటి? “నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను” అని ఆయన అంటున్నాడు.

3 రాజ్య సందేశాన్ని తెలియజేసేందుకు, తరువాతి చర్చకు ఆటంకం కలిగించే అభ్యంతరాలతో వ్యవహరించేందుకు కూడా సహాయపడే సమాచార భాండాగారాన్ని లేఖనముల నుండి తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకం ఇస్తుంది. ఉపోద్ఘాతాల్లో చాలావరకు సాధారణ రకమైనవే, ఒక వ్యక్తి అవలంబించేది ఏ మతమైనా, లేక వాళ్ళు మత విశ్వాసులే కాకపోయినా వాటిని ఉపయోగించవచ్చు. మన సేవా ప్రాంతంలో ఇవి ఫలవంతమైనవని కనుగొనబడింది. అయినప్పటికీ, మనం కలిసే ప్రజలతో మరింత విశేషమైన సమాచారాన్ని ఉపయోగించాలని మనం తరచూ కోరబడుతూనే ఉన్నాం. ఈ అవసరాన్ని తీర్చేందుకు మేము ఇక్కడ కొన్ని సలహాలనిస్తున్నాం, వాటిని ఉపయోగించాలని మీరు ఆశించవచ్చు. తర్కించుట అనే పుస్తకాన్ని మన ప్రాంతీయ సేవా బ్యాగుల్లో మనతో పాటు ఉంచుకోవాలని మనం ప్రోత్సహించబడుతున్నాం; మీ ఉపకరణాల్లో శాశ్వత భాగంగా ఈ ఇన్‌సర్ట్‌ను ఈ పుస్తకంలో ఉంచుకోవడం మంచిది కావచ్చు.

4 మనం ఒక మతానికి సంబంధించిన వ్యక్తికొరకు ఒక ఉపోద్ఘాతాన్ని కుదుర్చుకునేటప్పుడు, ఆ వ్యక్తి నిజానికి మనం మాట్లాడుతున్న మతానికి చెందినవాడేనా అని రూఢిచేసుకోవాలన్నదే మనం మనస్సులో పెట్టుకోవలసిన ముఖ్య విషయం. ఉదాహరణకు, ద్వారంపై హిందూ సూక్తులు, స్వస్తిక్‌ లేదా హిందూ దేవతా ఫలకం ఉన్న ఇంటిని మీరు దర్శించవచ్చు. అయినప్పటికీ, తలుపు దగ్గరికి వచ్చే వ్యక్తి ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న రోమన్‌ కాథోలిక్‌ కావచ్చు. కనుక, నిర్దిష్ట పదాలను లేదా ప్రత్యేక మతానికి సంబంధించిన పదాలను ఉపయోగించేటప్పుడు మనం తప్పక వివేచన గలవారమై ఉండాలి. ఇండియాలోని సేవా ప్రాంతంలో పనిచేయడం వలన కలిగే లాభమేమిటంటే, మిగిలిన దేశాల్లోలాగా ప్రజలు అంత తొందరలో ఉండరు, ఆ వ్యక్తి ఏ మతానికి లేదా ఏ సమాజానికి చెందినవాడో నిర్ణయించుకునే ప్రయత్నంలో మనల్ని మనం పరిచయం చేసుకునేందుకు, పరస్పరం స్నేహపూర్వకంగా పలకరించుకునేందుకు మనం సమయాన్ని తీసుకోవచ్చు.

5 రాజైన సొలొమోను “యింపైన మాటలు చెప్పుటకు . . . సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.” (ప్రసం. 12:10) “సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో” మాట్లాడడం అంటే ఏది చెప్పినా మనమెల్లప్పుడూ కచ్చితంగా ఉండాలి. కొన్నిసార్లు సహోదరులు, తాము యుక్తిగా ఉండాలని భావిస్తూ అసత్యమైన రీతిలో మాట్లాడడమో, వ్యాఖ్యానాలకు జవాబివ్వడమో చేస్తారు. ఉదాహరణకు, ‘నేను క్రైస్తవుడిగా మారాలని మీరంటున్నారు’ అని తరచూ వ్యాఖ్యానం చేయబడుతుంది. ‘అలా కానే కాదు!’ అన్నది మామూలుగా సహోదరులిచ్చే జవాబు. అది నిజమా? లేదా తాను రామరాజ్యం కోసం ఎదురు చూస్తున్నానని ఒక హిందూ చెప్పవచ్చు. ‘మేము దాని గురించి మాట్లాడడానికే వచ్చాము’ అనే వ్యాఖ్యానంతో మనం జవాబిస్తామా? ‘నేను మా పరిశుద్ధ గ్రంథాలను మాత్రమే చదువుతాను’ అని మరొకరు అంటారు. ‘అది మంచిదే’ లేదా ‘అలా విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మనం జవాబివ్వగలమా. మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండడం, స్వచ్ఛమైన సరళమైన రాజ్య సందేశాన్ని పురాణ కథల నుండి, మానవ తత్త్వశాస్త్రాల నుండి భిన్నంగా ఉంచడం మనం ‘సత్యమునుగూర్చిన సరైన మాటలు’ మాట్లాడేలా చేస్తుంది.

6 మనలను వినేవారికి పరిచయమున్న మాటలను తలంపులను గూర్చి మనం మాట్లాడమని దీని భావం కాదు. ఒక హిందువును కలిసినప్పుడు, ఇంట్లో చిత్రాలు లేదా విగ్రహాలు కనిపిస్తున్నట్లయితే, లేదా వ్యక్తి పేరు లేదా అలంకరణ రీతి హిందువులదైనట్లయితే ఇక్కడ ఇవ్వబడిన ఉపోద్ఘాతాల్లో ఒక దాన్ని మీరు ఉపయోగించవచ్చు:

7 హిందువుతో మాట్లాడడం:

◼ ‘ప్రపంచవ్యాప్త సేవలో భాగంగా ఒక మంచి వార్తను తెలియజేసేందుకు వస్తున్నాము. రోజుకు రోజుకు లోక పరిస్థితులు విషమిస్తున్నాయన్న విషయంలో మీరు మాతో ఏకీభవిస్తారని మాకు తెలుసు . . . బలాత్కారము, నేరము, పూర్తి నైతిక పతనం అనేవి జరుగుతాయని ఎదురు చూసే ‘కలియుగం’ అని మీరు పిలిచే కాలంలో జీవిస్తున్నామని బహుశ మీరు భావిస్తూ ఉండవచ్చు. ఒక ప్రాచీన పవిత్ర గ్రంథం ఈ పరిస్థితులను ఎలా వర్ణిస్తుందో, మంచి విషయాలు ముందున్నాయని ఎలా చూపిస్తుందో మీకు చూపించడానికి నేను ఇష్టపడతాను.  . . (2 తిమో. 3:1-5; కీర్త. 37:10, 11)’

◼ ‘మీతో ఒక మంచి వార్తను పంచుకుందామని మేము వస్తున్నాము. మనం నేడు వినే వార్తలు ఎక్కువగా చెడు వార్తలే, కాదంటారా? బలాత్కారం, నేరం, నిరుద్యోగం, రోగం, బీదరికం అనేవాటిని గూర్చి మనమెల్లప్పుడూ వింటున్నాము . . . ఇది మీకు తెలిసిన ‘కలియుగం’ అని మీరు బహుశ నమ్ముతుండవచ్చు. మన జీవిత కాలంలో మీరనే ‘సత్యయుగం’ వస్తుందని మీరనుకుంటారా? . . . మేము ప్రాచీన పవిత్ర వ్రాతలను పఠించడం లోక కార్యాల్లో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఈ చెడు పరిస్థితులు త్వరలోనే తీసివేయబడతాయనే నమ్మకాన్ని మాకు కలిగించింది. ఒక రచయిత దీనిని ఈ విధంగా వర్ణించాడు. (సామె. 2:21, 22) ఈ నిరీక్షణకు మంచి ఆధారం ఉంది, మరి మార్పు సమీపించిందని మాకు నమ్మకం కలిగించిన కొంత సమాచారాన్ని మీతో పంచుకోవడానికి మేము ఇష్టపడతాము.’

8 ఒక హిందువుతో లేదా ముస్లిమ్‌తో మాట్లాడడం:

ఇరుగుపొరుగువారి మధ్య సమాధానకరమైన బంధాలుండడాన్ని గూర్చిన వ్యాఖ్యానానికి ఒక హిందూ లేదా ఒక ముస్లిమ్‌ ప్రతిస్పందించవచ్చు. మనమీ విధంగా చెప్పవచ్చు:

◼ ‘మునుపు ఒకరికొకరు స్నేహితులుగా ఉన్న వ్యక్తుల మధ్య బలాత్కారం పెరగడం వల్ల కలిగే సమస్యలను గూర్చి మీ పొరుగువారితో మాట్లాడుతున్నాం. ‘మనమందరం సహోదరులం’ అనే మాటను మనం తరచూ వింటుంటాం, కాని సహోదర భావం నేడు కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారా లేక అది లేకుండాపోతుందా? . . . నేటి పరిస్థితులు చాలాకాలం క్రితం చెప్పబడిన ఈ ప్రవచనాన్ని పోలి ఉన్నాయని మీరనుకోవడంలేదా? (2 తిమో. 3:1-5, [కొంత భాగం]) . . . కాని “అంత్య దినముల”లో ఇలాంటి పరిస్థితులుంటాయని ఈ లేఖనం చెబుతుందని గమనించండి. ఈ “అంత్య దినముల” తరువాత ఏమి వస్తుందనే దానిని గూర్చిన వాగ్దానాన్ని మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను.’

◼ ‘ప్రపంచవ్యాప్త విద్యా పనిలో భాగంగా మేము సందర్శిస్తున్నాము; దీనిలో భాగం వహించేవారు ప్రపంచ శాంతిని చూడడంలో ఆసక్తి కలిగివున్నారు. భయము, బలాత్కారం లేదా నేరం లేకుండా ఈ లోకం ఎన్నడైనా పరిపూర్ణ శాంతితో ఉంటుందని మీరనుకుంటున్నారా? . . . (అది దేవునిపై ఆధారపడి ఉంటుందని అనేకులు అంటారు; వాళ్ళు అలా అంటే మనమింకా ఇలా చెప్పవచ్చు . . .) మేము మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాము. దీనిని గూర్చి దైవభక్తి గల ఒక వ్యక్తి ఏమని చెప్పాడో గమనించండి. (యెష. 2:4) (వారు దేవుని గూర్చి ప్రస్తావించకపోతే మనమిలా చెప్పవచ్చు . . .) జ్ఞానియైన ఈ ప్రాచీన వ్యక్తి నమ్మినట్లు లోక వ్యవహారాల్లో దేవుడు ఎప్పుడైనా సహాయం చేస్తాడని మీరనుకుంటున్నారా? . . . (యెష. 2:4)’

9 ఒక ముస్లిమ్‌తో మాట్లాడడం:

ముస్లిమ్‌లు హెబ్రీ లేఖనాలను గౌరవిస్తారని గుర్తుంచుకుని, మనం వారికి పరిచయమున్న పేర్లను పేర్కొంటూ, ఆ లేఖనాల్లోని పాఠ్యాంశాలను మనం ఉపయోగించుకోవచ్చు. మనమీ విధంగా చెప్పవచ్చు:

◼ ‘సకల జాతుల ప్రజలు సమాధానంగా జీవించడాన్ని చూడడంలో ఆసక్తిగల ప్రజలతో 50 లక్షలకన్నా ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులు మాట్లాడుతున్న అంతర్జాతీయ పనిలో భాగంగా మేము ఈ రోజు సందర్శిస్తున్నాము. అది అద్భుతంగా ఉంటుంది, కాదంటారా? . . . భవిష్యత్తు కొరకు దేవుడు అబ్రాహాముకు ఏమని వాగ్దానం చేశాడో మీరెన్నడైనా చదివారా? (ఆది. 22:18) సమస్త జనులకు కలుగనున్న ఆశీర్వాదాన్ని గూర్చి అనేక మంది ప్రవక్తలు చెప్పినదాని గురించి మేము బాగా పఠించాము, ఇది త్వరలోనే రానుందని మాకు నమ్మకముంది. ఇది శుభవార్త, మరి మేము దీనిని మన పొరుగువారితో పంచుకోవాలనుకుంటున్నాం.’

◼ మిమ్మల్ని ఇంట్లో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక ముస్లిమ్‌ కనుక, మానవునియందు ఆసక్తిగల, భూమిపైని దుష్ట ప్రజలను ఒకరోజు తీర్పు తీర్చనున్న సర్వశక్తిమంతుడైన దేవున్ని మీరు నమ్ముతారని మాకు తెలుసు. ఇదంతా ఎలా జరుగుతుందనే దానిని గూర్చిన ఈ వివరణ చాలా ఆసక్తికరమని మేము కనుగొన్నాం. (యెష. 2:4) ఇది జరిగిన తరువాత భూమిపైని పరిస్థితి ఏమై ఉంటుందనే దానిని గూర్చిన ఈ ప్రవక్త వివరణను మీరు చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను . . . (యెష. 35:5, 6 లేదా 65:21, 22)’

10 సంభాషణను ఆటంకపర్చేవారు:

మన సంభాషణను ఆటంకపర్చే అభ్యంతరాలతో వ్యవహరించేందుకు తర్కించుట అనే పుస్తకం అనేక మార్గాలను మనకు చూపిస్తుంది. ఇండియాలోని మన పరిచర్యలో మనం వినే కొన్ని సర్వసాధారణమైన అభ్యంతరాలతో వ్యవహరించేందుకు మేము కొన్ని సలహాలను ఇస్తున్నాము.

‘మీరు వెళ్ళి రాజకీయనాయకులకు ప్రకటించాలి, మాకు కాదు.’

◼ ‘చెప్పండి, తన దేశంలో తనకెంతో అధికారంగల ఏ రాజకీయనాయకుడైనా ప్రపంచమంతటా ఉన్న సమస్యలను పరిష్కరించగలడని మీరు నిజంగా అనుకుంటున్నారా? . . . కనుక, మనకు ఎదురౌతున్న సమస్యలను నేను మీరు పరిష్కరించలేనట్లే, రాజకీయనాయకులు కూడా వారెంత యథార్థంగా ప్రయత్నించినా పరిష్కరించలేరు. కాని, మానవుల సమస్యలన్నింటినీ నిజంగా పరిష్కరించగల వ్యక్తి ఒకరున్నారు . . . (యెష. 2:4; 65:17, 20, 21)’

◼ ‘మేము వాళ్ళను కలిసినప్పుడల్లా వాళ్ళతో మేము చెబుతుంటాం. మనకందరికీ—నాయకుడికీ లేదా సామాన్యునికీ—ఎదురయ్యే తీవ్రమైన సమస్యలు తొలగించబడబోతున్నాయనే సువార్తను జీవితంలోని అన్ని రంగాల్లోని ప్రజలకు అందజేసేందుకు వారిని కలవాలన్నది మా బాధ్యత. యథార్థవంతులైన రాజకీయనాయకులు ఈ వాగ్దానాలను నమ్మగలిగితే వారు సంతోషిస్తారని మీరనుకోవడం లేదా? . . . (కీర్త. 46:8, 9; మీకా 4:3, 4)’

◼ ‘లోకమంతటా ఉన్న రాజకీయనాయకులు తమకు ఓట్లువేసి తమను అధికారంలోనికి తెచ్చినవారికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఈ కాలంలో చాలా కష్టమన్నది నిజమే, కాదంటారా? . . . పరిస్థితి చాలా వరకు శతాబ్దాల క్రితం ఒక గ్రంథకర్త వర్ణించినట్లుగానే ఉంది. (కీర్త. 146:3, 4) ఒక నాయకుడు కొంత మంచి చేసినప్పటికీ, తరచూ ఎన్నికల్లో గెలవడం లేదు, లేదా ఆయన చనిపోతాడు, మరి ఆయన తరువాత వచ్చే వ్యక్తి ఆయన చేసిన పనిని పూర్తి చేయడు. మేము నిజానికి వచ్చింది, సమస్యలన్నింటినీ పరిష్కరించే అధికారమున్న శాశ్వతమైన పరిపాలకుడుగల ప్రపంచ ప్రభుత్వాన్ని గూర్చి చెప్పడానికే. అది అద్భుతంగా ఉండదా? . . . (కీర్త. 72:7, 8, 13, 14)’

‘ఇండియా మతనిష్ఠగల దేశం, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రకటించండి.’

◼ ‘ఈ 20వ శతాబ్దంలో అనేక దేశాలు మతం యొక్క నైతిక ప్రమాణాలను తాము అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, వారు మత సంబంధ నియమాలను తిరస్కరిస్తున్నారన్నది నిజం. మనకు ఇక్కడ ఇండియాలో ఉన్న సమస్యలనన్నింటినీ మతం పరిష్కరిస్తుందని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఈ దేశంలో ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న దౌర్జన్యం ఎక్కువగా మతం మూలంగానేనన్నది నిజం కాదా? . . . అన్ని దేశాల్లోని ప్రజలు ఏకమై సత్యమతం యొక్క సూత్రాలను అనుసరించగలిగితే ఎంత బాగుంటుంది . . . (కీర్త. 133:1)’

◼ ‘నిజానికి ఇక్కడ ఇండియాలో కన్నా పాశ్చాత్య దేశాల్లోనే ఇంకా ఎక్కువగా లక్షల కొలది యెహోవాసాక్షులు బోధిస్తున్నారు. కాని, మేము తెచ్చే సందేశం బాధ, బలాత్కారం, అసంతోషం అనేవాటి అంతాన్ని చూడాలని ఎదురుచూసే సకల ప్రజల కొరకే. మనమెక్కడ నివసించినా, ఇలాంటి పరిస్థితులను చూడాలని మనమిష్టపడతామని మీరు ఒప్పుకోరా? . . . (ప్రకటన 21:4)’

◼ ‘పాశ్చాత్య దేశాల్లోని చాలామందికి కేవలం ధనాపేక్షతో కూడిన దృక్పథమే ఉందన్నది నిజమే. కాని ఇండియాలోని మతవిశ్వాసులైన ప్రజలు కూడా బలాత్కారాన్ని, ఆహార కొరతను, నిరుద్యోగాన్ని, వ్యాధులను మరియు మరణాన్ని అనుభవిస్తున్నారన్నది నిజం కాదా? . . . తూర్పు దేశాల్లోను పాశ్చాత్య దేశాల్లోను ఆసక్తిగల దేవుడు త్వరలోనే ఈ సమస్యల నుండి భూమిని విడుదల చేస్తాడని మేము నమ్ముతున్నాం, మరి మేము ఈ సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాం . . . (కీర్త. 37:10, 11, 29)’

‘మీరు మమ్మల్ని క్రైస్తవ మతంలోకి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు’

◼ ‘ప్రజలు తమ మతాన్ని మార్చుకునేలా బలవంతం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చరిత్రంతటా జరిగాయి. మేము దానితో ఏకీభవించమని నేను మీకు హామీ ఇస్తున్నాను. రాజకీయం, లేదా ఏదైనా వ్యక్తిగత ప్రయోజనాన్ని పొందాలన్నదే సాధారణంగా దానికి కారణం. అయితే మీకు, మీ కుటుంబానికి, ఈ ప్రపంచంలో మనకు కనిపించే అసంతోషకరమైన పరిస్థితుల నుండి ఒక మార్పును చూడాలని కోరుకునే అన్ని మతాల ప్రజలకు ప్రయోజనాన్నిచ్చే సందేశంతో మేము సందర్శిస్తున్నాం. ఒక ప్రాచీన పరిశుద్ధ గ్రంథం ఈ మార్పును గూర్చి ఇలా వర్ణిస్తుంది. (కీర్త. 37:10, 11)’

◼ ‘ప్రజలు తమ మతాన్ని మార్చుకునేందుకు డబ్బివ్వడంలో లేక ఒత్తిడి చేయడంలో పేరుమోసిన చర్చి సంస్థలతో మాకు సంబంధముందని కొందరు ప్రజలు భావిస్తారు. నిజంగా మేము అలాంటి చర్యలను అంగీకరించము, మరి మాకు చర్చీలతో ఏ సంబంధమూ లేదు. త్వరలో ఇక యుద్ధాలుండవు అనే సువార్తతో తమ పొరుగువారిని సందర్శించే 50 లక్షల కన్నా ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు గల అంతర్జాతీయ సంఘంలో మేము భాగమైయున్నాము. మాకు ఈ అభయాన్ని ఇచ్చినదేమిటో నేను మీకు చూపించవచ్చా? . . . (కీర్త. 46:8, 9)’

‘నేను మా పవిత్ర గ్రంథాలను మాత్రమే చదువుతాను’

◼ ‘ఇప్పటికీ మతంలో ఆసక్తివున్న ఒకరిని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేడు చాలామంది ప్రజలు వినోదంలోను, వస్తు సంపదలోను ఎక్కువ ఆసక్తి కలిగివున్నట్లు అనిపిస్తుందనడంలో మీరు నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు . . . మీకు కొన్ని మత గ్రంథాలు తెలుసు కనుక, బైబిలు అనే పరిశుద్ధ గ్రంథంలో నాకు పరిచయమున్న ఈ వచనాన్ని గూర్చి మీ అభిప్రాయమేమై ఉండవచ్చని నేను ఆలోచిస్తున్నాను? (సామె. 2:20-22) . . . దేవుడు దుష్టులనందరినీ ఒకరోజు నిర్మూలం చేస్తాడని అనేక పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయి, కాని ఇప్పుడు మేము మా పొరుగువారిని సందర్శిస్తున్న దానికి కారణమేమిటంటే, ఈ నాశనం ఎప్పుడు జరుగుతుంది అనేదానిని గురించి బైబిలు చాలా నిర్దిష్టమైన సూచనలనిస్తుందని, మనం భూమిపై సంతోషంగా జీవించేందుకు దానినెలా తప్పించుకోవచ్చు అని కూడా మనకు చెబుతుందని చూపించడానికే. ఆ సమాచారాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతాను.’

◼ ‘నిజమే, చాలామంది ప్రజలు తమకు చిన్నప్పుడు నేర్పించిన మత గ్రంథాలను మాత్రమే చదవడంలో సంతృప్తినొందుతారు. వ్యక్తిగతంగా, ఇతర ప్రజలు దేవుని గూర్చి ఏమని విశ్వసిస్తారు, వారు ఆయనను ఏ రీతిగా ఆరాధిస్తున్నారు అని తెలుసుకోవడం చాలా ఆసక్తికరమని నేను కనుగొన్నాను. లోకమంతా బలాత్కారంతోను, కష్టాలతోను నిండి ఉండగా, మన కాలాన్ని గూర్చిన కొన్ని విశిష్టమైన ప్రవచనాలను కనుగొనడానికి అది నన్ను నడిపింది. నేటి ప్రపంచాన్ని గూర్చిన ఒక వివరణను నేను మీకు చూపిస్తాను, అది చాలా కచ్చితమని మీరు కనుగొంటారని నేననుకుంటున్నాను . . . (2 తిమో. 3:1-5, [కొంత భాగం])’

11 “మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు చేయలేదు” అని అపొస్తలుడైన పౌలు దృఢనమ్మకంతో చెప్పాడు. (అపొ. 20:26, 27) ‘సకల జనులకు’ అద్భుతమైన సందేశాన్ని మనం అందిస్తుండగా, ‘నిర్మలమైన ఆలోచనా సామర్థ్యాలను’ ఉపయోగించడం ద్వారా పౌలు చూపించిన అంతే శ్రద్ధను చూపించేందుకు ప్రతి ప్రయత్నాన్ని మనం చేద్దాం.—2 పేతు. 3:1.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి