కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/96 పేజీ 2
  • మే నెలలోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే నెలలోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఉపశీర్షికలు
  • మే 6తో ప్రారంభమయ్యే వారం
  • మే 13తో ప్రారంభమయ్యే వారం
  • మే 20తో ప్రారంభమయ్యే వారం
  • మే 27తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1996
km 5/96 పేజీ 2

మే నెలలోని సేవా కూటాలు

మే 6తో ప్రారంభమయ్యే వారం

పాట 153 (44)

10 నిమి: స్థానిక ప్రకటనలు. “వేసవి కొరకైన మీ పథకాలేమిటి?” పునఃసమీక్ష.

15 నిమి: “పూర్ణప్రాణంతో చేయండి!” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించే దానినిబట్టి, అక్టోబరు 15, 1981, కావలికోట (ఆంగ్లం), 25వ పేజీలోని “కుటుంబం చర్చించవలసిన అంశాలు” అనే దానిని పరిశీలించండి.

20 నిమి: “మీ పొరుగువానితో సత్యమును మాట్లాడండి.” ప్రశ్నా జవాబులు. ఇవ్వబడిన అందింపులను పునఃసమీక్షించండి. మొదలు పెట్టేందుకు క్లుప్త అందింపులను ఉపయోగిస్తూ పత్రికలను పంచిపెట్టడంలో పాల్గొనేందుకు క్రొత్తవారిని ప్రోత్సహించండి. చందాలను ప్రతిపాదించే రెండు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. చందా ప్రతిపాదన నిరాకరించబడినట్లయితే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ విడి ప్రతులను ప్రతిపాదించవలసిన అవసరతను నొక్కిచెప్పండి.

పాట 148 (81) మరియు ముగింపు ప్రార్థన.

మే 13తో ప్రారంభమయ్యే వారం

పాట 63 (32)

7 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్ట్‌.

18 నిమి: “మునుపెన్నడూ లేనంత ఆత్మీయ సమృద్ధి మనకుంది!” ప్రశ్నా జవాబులు. యౌవనారంభంలోని ఒకరితో సహా, ఇద్దరు ముగ్గురు ప్రచారకులు తమకు లభించిన ఆశీర్వాదాలను పేర్కొనాలి. పెరిగిన మెప్పుదల పరిశుద్ధ సేవను మనం ఆసక్తిగా చేసేందుకు ఎలా పురికొల్పాలో చూపిస్తూ ముగించండి.

20 నిమి: “అందరికీ అన్నివిధముల వారిగా కావడం.” 1-9 వరకున్న పేరాల నుండి ప్రశ్నా జవాబుల చర్చ. 5, 6 పేరాలను చదవండి. యుక్తిగా ఉండడమంటే రాజీపడడమని కాదు కనుక, మనమేమి చెబతున్నామనే దానిని గూర్చి జాగ్రత్తపడవలసిన అవసరాన్ని నొక్కిచెప్పండి. అలాగే, మత సిద్ధాంతాలు తెలిసివుంటే మనం ప్రాంతీయ పరిచర్యకు వెళ్ళినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది, యెహోవా నామాన్ని స్తుతించాలనే, రాజ్య సువార్తను ప్రకటించాలనే మన లక్ష్యంపై దృష్టిని కోల్పోకూడదు. దానిని గుర్తించడం మనం మానవ తత్త్వశాస్త్రాలపై పెద్ద వాదనలకు దిగడాన్ని నివారిస్తుంది, తరచూ అవి నిష్ఫలమని నిరూపించబడ్డాయి.

పాట 193 (103) మరియు ముగింపు ప్రార్థన.

మే 20తో ప్రారంభమయ్యే వారం

పాట 126 (58)

10 నిమి: స్థానిక ప్రకటనలు. పత్రికలను అందించడంలో పాల్గొనాలని అందరినీ ప్రోత్సహించండి.

15 నిమి: “సత్యాన్ని గూర్చి మాట్లాడుతూనే ఉండండి.” ప్రత్యేక ప్రచారంలో చందాలను కట్టినచోట లేదా పత్రికలను తీసుకున్నచోట పఠనాలను ఆరంభించాలనే లక్ష్యంతో పునర్దర్శనాలను చేయవలసిన అవసరతను నొక్కిచెప్పండి. మొదటి దర్శనంలో పత్రికలను మాత్రమే తీసుకున్నట్లయితే, పునర్దర్శనంలో చందాను ప్రతిపాదించవచ్చు, లేదా పత్రికా మార్గాన్ని ఆరంభించవచ్చు. రెండు క్లుప్త ప్రదర్శనలను ఏర్పాటు చేయండి.

20 నిమి: “అందరికీ అన్నివిధముల వారిగా కావడం.” 10వ పేరా నుండి చివరి పేరా వరకు ప్రేక్షకులతో చర్చ. విడివిడిగా సంభాషణను ఆటంకపర్చే నలుగురితో ప్రతిస్పందించే కొన్ని మార్గాలపై క్లుప్త ప్రదర్శనలను చూపండి. ప్రచారకులు పరిచర్యలో పాల్గొనేటప్పుడెల్లా నాలుగు పేజీల ఈ ఇన్‌సర్ట్‌ను తమతోపాటు ఉంచుకోవాలని, బహుశ తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకపు వ్యక్తిగత ప్రతిలో దీనిని ఉంచుకోవచ్చని ప్రోత్సహించండి.

పాట 28 (5) మరియు ముగింపు ప్రార్థన.

మే 27తో ప్రారంభమయ్యే వారం

పాట 121 (20)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: జూన్‌ నెలలో నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తక ప్రతిపాదన. జ్ఞానము అనే పుస్తకం ఎందుకు ప్రచురించబడిందో సేవాధ్యక్షుడు మొదట చర్చిస్తాడు. సామర్థ్యము గల ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులతో దాని ముఖ్యాంశాల్లో కొన్నింటిని ఆయన పునఃసమీక్షిస్తాడు. మన భవిష్యత్తు, మానవుల బాధ, దేవుని రాజ్యము, దైవిక ప్రవర్తన, కుటుంబ జీవితము మరియు ప్రార్థనా ప్రయోజనాలను గూర్చిన ప్రశ్నలకు పుస్తకం జవాబిస్తుంది. మొదటి దర్శనంలోనే లేక పునర్దర్శనంలో పఠనాన్ని ఆరంభించడానికి ఉపయోగించగల రెండు విధానాలను గుంపులోని ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ప్రదర్శిస్తారు. తర్వాత సేవాధ్యక్షుడు క్రింది అంశాలను చర్చిస్తాడు. అతి కొద్ది కాలంలోనే మరిన్ని ఫలవంతమైన బైబిలు పఠనాలను నిర్వహించవలసిన అవసరముంది. ఈ పుస్తకం ప్రత్యేకంగా ఆ లక్ష్యం కోసమే తయారు చేయబడింది. అది నిశ్చితమైన, క్లుప్తమైన రీతిలో సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రతి పేరాకు, అలాగే ప్రతి అధ్యాయానికి చివరన ఉన్న ప్రశ్న ముఖ్యమైన అంశాలపై శ్రద్ధ కేంద్రీకరించడానికి మనకు సహాయపడతాయి. బాప్తిస్మం పొందడానికి ఇష్టపడే క్రొత్తగా సమర్పించుకున్న వారిని అడిగే ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలో ఇమడ్చబడ్డాయి. జూన్‌ నెలలో పఠనాలను ఆరంభించాలనే లక్ష్యంతో సేవ చేయాలని అందరినీ ప్రోత్సహించండి.

10 నిమి: ప్రశ్నాభాగం. ప్రేక్షకులతో చదివి, చర్చించండి.

15 నిమి: “మీరు మరీ బిజీగా ఉన్నారా?” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించేదానినిబట్టి, జూన్‌ 8, 1990 తేజరిల్లు! (ఆంగ్లం), 14-16 పేజీల్లోని వ్యాఖ్యానాలను ఇమడ్చండి. సోత్సాహ దైవపరిపాలనా పట్టికను విజయవంతంగా అనుసరించడానికి చేరుకునేందుకు తాము ఏమి చేశారో ఒకరిద్దరు ప్రచారకులను క్లుప్తంగా చెప్పనివ్వండి.

పాట 155 (36) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి