మునుపెన్నడూ లేనంత ఆత్మీయ సమృద్ధి మనకుంది!
1 “మాకెప్పుడూ ఇంత సమృద్ధిగా లభించలేదు!” అని చెప్పగలిగే రోజు కొరకు చాలా మంది ప్రజలు ఎదురుచూస్తారు. వాళ్ళ దృష్టిలో, ‘తాము సుఖించడానికి, తినడానికి, త్రాగడానికి, సంతోషించడానికి’ తమను అనుమతించే వస్తుసంపద వాళ్ళకున్నప్పుడే ఆ రోజు వస్తుంది. (లూకా 12:19) దానికి భిన్నంగా, ఇప్పుడే ఆత్మీయ భావంలో మనకు మంచి వస్తువుల కొదువ ఏమీ లేదని చెప్పగలము. (కీర్త. 34:10) అదెలా సాధ్యమౌతుంది?
2 “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును” అని సామెతలు 10:22 ప్రకటిస్తుంది. అలాంటి దైవిక అనుగ్రహాన్ని అనుభవిస్తున్న మనం “సుఖముగా అనుభవించుటకు” దేవుడు ‘సమస్తమును మనకు ధారాళముగ దయ చేస్తున్నాడు’ అని నిజంగా చెప్పగలం. (1 తిమో. 6:17) ఇది మనలను భూమిపైన అత్యంత సంపన్నులైన ప్రజలనుగా చేస్తుంది!
3 మన ఆశీర్వాదాలను గుర్తించడం: మనలో చాలా కొద్దిమందికి మాత్రమే ఎక్కువ వస్తుసంపద ఉంది. అయినప్పటికీ, మన దైనందిన అవసరాలను గూర్చి అమితంగా విచారపడం కనుక మనం ఆశీర్వదించబడినవాళ్ళమే. మనకు ఏమి కావాలో యెహోవాకు తెలుసు, వాటిని అందిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (మత్త. 6:31-33) ఆయన అభయం నిజంగా వెలకట్టలేనంతటి మనశ్శాంతిని మనకిస్తుంది.
4 అయినప్పటికీ, మన ఆత్మీయ ఆశీర్వాదాలు ఇంకా గొప్పవి. మన జీవితాలు యెహోవా నుండి వచ్చే ఆత్మీయ ఆహారంపై ఆధారపడి ఉంటాయి. (మత్త. 4:4) మనం తిని త్రాగి తృప్తి చెందుతుండగా ఆత్మీయ పోషణ కొరకు లౌకిక మూలాల వైపుకు చూసేవారు ఆకలితో అలమటిస్తున్నారు. (యెష. 65:13) నిత్యజీవానికి నడిపించే అక్షయమైన జ్ఞానాన్ని ‘నమ్మకస్థుడైన దాసుడు’ మనకు అందిస్తున్నాడు.—మత్త. 24:45; యోహా. 17:3.
5 మన ప్రశస్తమైన ప్రపంచవ్యాప్త సహోదరత్వం భూమిపైని అన్ని ప్రాంతాల్లోను ఉన్న స్నేహపూర్వకంగా ఉండే సహోదర సహోదరీల ఆప్యాయతతో కూడిన సహవాసాన్నిస్తుంది. (యోహా. 13:35) స్థానిక సంఘమనేది మనం ఓదార్పును నూతనోత్తేజాన్ని కనుగొనగల శాంతి నివాసము. పెద్దలు మన ప్రాణాలను కాయుచు, అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడానికి మనకు సహాయపడుతున్నారు. (హెబ్రీ. 13:17) మన సహోదరులకు మనం దగ్గరవ్వడంవల్ల స్థిరపడడానికి మనల్ని బలపరచే ప్రోత్సాహాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.—రోమా. 1:11, 12.
6 మన పని కూడా ఓ ఆశీర్వాదమే. అనేక లౌకిక ఉద్యోగాలు విసుగెత్తించేవిగాను ఎంతకీ తీరనివిగాను ఉంటాయి. సువార్తను పంచుకోవడం ఇతరులకు ఆనందాన్ని, మనకు సంతోషాన్ని తెచ్చిపెడతాయి. (అపొ. 20:35) మన శ్రమంతటికీ మనం నిజంగా ప్రయోజనాన్ని చూడగలము.—ప్రసం. 2:24.
7 మరి ముఖ్యంగా, భవిష్యత్తు కొరకైన మంచి నిరీక్షణ మనకుంది. (రోమా. 12:12) మన ప్రియమైనవారితో సంతోషంతో, సమాధానంతో ఎప్పటికీ జీవించగలిగే నీతియుక్తమైన పరిపూర్ణమైన నూతన లోకం కొరకు మనం ఎదురు చూస్తాం! ఈ లోకం అందించే దేనికన్నా కూడా ఈ నిరీక్షణ చాలా విలువైన నిధి వంటిది.—1 తిమో. 6:19.
8 మనం మన మెప్పును ఎలా చూపించగలం? యెహోవా మన కొరకు చేసినదానికి బదులుగా మనము ఆయనకు ఎన్నటికీ తిరిగి చెల్లించలేము. (1) ఆయన అనర్హ దయనుబట్టి ఆయనకు ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం ద్వారా (ఎఫె. 5:20), (2) విధేయులుగా ఉంటూ మన ప్రేమను ప్రదర్శించడం ద్వారా (1 యోహా. 5:3), (3) సువార్తను ప్రకటిస్తూ ఆయన నామాన్ని పవిత్రపరచడం ద్వారా (కీర్త. 83:18), మరియు (4) మన హృదయపూర్వక సహకారంతో క్రైస్తవ సంఘానికి మద్దతునివ్వడం ద్వారా మాత్రమే మనం మన మెప్పును చూపించవచ్చు.—1 తిమో. 3:15.
9 భూమిపైన ఎక్కువ సంతోషము గల ప్రజలై ఉండేందుకు మనకు ప్రతి కారణముంది. (కీర్త. 144:15 బి) మన దృక్పథం, నడవడి, మరియు సేవ మన ఆత్మీయ పరదైసులో మనం అనుభవించే ఆనందాన్ని ప్రతిబింబిద్దాం. మనకు మునుపెన్నడూ లేనంత సమృద్ధి మనకుంది!