కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/96 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1996
మన రాజ్య పరిచర్య—1996
km 4/96 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్‌, మే: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికల ప్రచురణలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాసపత్రికల ప్రచురణలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రిక ప్రచురణలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాసపత్రికల ప్రచురణలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లయితే, విడి పత్రికలను ఒక్కొక్కదాన్ని రూ. 4.00కు ప్రతిపాదించాలి. సముచితమైన చోట, కుటుంబ జీవితము అనే పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు. చందాలను పొందేటప్పుడు, కావలికోట పంజాబీ మరియు ఉర్దూ భాషల్లో మాత్రమే మాసపత్రికయని, ఇండియాలోని మిగిలిన అన్ని భాషల్లోనూ నేపాలీలోను పక్షపత్రికయని దయచేసి గుర్తుంచుకోండి. తేజరిల్లు! మలయాళంలోను తమిళంలోను పక్షపత్రిక, కాని, గుజరాతీ, కన్నడ మరియు తెలుగు భాషల్లో మాసపత్రిక. బెంగాలీ, హిందీ, మరాఠీ, లేదా నేపాలీలో తేజరిల్లు!కు వ్యక్తిగత చందాలు లేవు, అయితే ఈ నాలుగు భాషల్లోని త్రైమాస పత్రికల పంపకందారుల ప్రతులు సంఘాలకు లభ్యమౌతాయి. జూన్‌: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 15 చందాకు. ప్రత్యామ్నాయంగా, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు ప్రతిపాదించవచ్చు. సముచితమైన చోట ఈ రెండు పుస్తకాలలో ఏదైనా ఒకదానితోపాటు కుటుంబ జీవితము అనే పుస్తకాన్ని కూడా ప్రతిపాదించవచ్చు. జూలై, ఆగష్టు: రూ. 5.00 చందాకు ఈ క్రింది 32 పేజీల బ్రోషూరులలో దేనినైనా ప్రతిపాదించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవనామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? మరియు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.

గమనిక: నిరంతరము జీవించగలరు మరియు కుటుంబ జీవితము అనే పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సంఘాలన్నింటినీ మేము ప్రోత్సహిస్తున్నాము. ప్రచారకులు ఈ పుస్తక ప్రతుల్ని సంవత్సరమంతా అన్నివేళల్లో తమతో ఉంచుకుని, సముచితమైన ప్రతి సందర్భంలోను వాటిని ప్రతిపాదించేందుకు ప్రోత్సహించబడగలరు. పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంతవరకూ రిక్వెస్ట్‌ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14)నందు రిక్వెస్ట్‌ చేయాలి.

◼ ఆచరణాత్మకంగా ఉన్న చోట, పగటి గంటలు ఎక్కువవుతున్న కొలది, సంఘం సాయంకాల సాక్ష్యంలో మరింత సమయాన్ని వెచ్చించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేయాలి.

◼ పయినీరు సేవా గుర్తింపు కార్డులను మార్చే పద్ధతిలో చిన్న సవరింపు చేయబడింది. ఇప్పటినుండి, ఊరు మారే, తమ పేర్లను మార్చుకునే, తమ కార్డును పొగొట్టుకున్న, లేదా నియామకాన్ని మార్చమని అభ్యర్థించే పయినీర్లకు బదులుగా ఇచ్చే కార్డులు నెలసరి వివరణ పట్టికతోపాటు ఇవ్వబడతాయి. క్రమ పయినీర్లను గూర్చిన అవసరమైన సమాచారంలో ఏవైనా మార్పులుంటే సొసైటీకి వెంటనే పంపాలి, అలా, మా ఫైళ్లను కచ్చితమైనవిగాను, క్రొత్తవిగాను మేము ఉంచుకోగలుగుతాము. క్రమ పయినీర్ల పేర్ల మార్పులను సాధారణ రీతిలోనే చేస్తారు, అంటే సెక్రటరీ ఆ నెల కొరకైన సంఘ రిపోర్టు (S-1) వెనుక సమాచారాన్ని సరైన విధంగా వ్రాస్తాడు. ఒక క్రమ పయినీరు మరో సంఘానికి తరలి వెళ్ళినప్పుడు, ఆ క్రమ పయినీరు ఉండివెళ్ళిన సంఘ కార్యదర్శి కాదు కాని, పయినీరు వెళ్ళిన సంఘంలోని కార్యదర్శే తరువాయి S-1పై వ్రాసి సొసైటీకి తెలపాలి. అలాగే, ఒక క్రమ పయినీరు అలాంటి సేవను ఆపివేసినప్పుడు లేదా అందులో నుండి తీసివేయబడినప్పుడు, S-206 ఫారమ్‌ ప్రతిని నింపి, ఆలస్యం చేయకుండా సొసైటీకి పంపాలి.

◼ ఫిబ్రవరి వివరణ పట్టికలతోపాటు సంవత్సర ఐటెమ్‌ల కోసం రెండు ప్రత్యేక రిక్వెస్ట్‌ ఫారాలు ప్రతి సంఘానికి పంపడం జరిగింది. దయచేసి, సంఘంలోని వ్యక్తుల నుండి వచ్చిన ప్రత్యేక ఆర్డర్ల పట్టికను ఫారమ్‌లోని ప్రతి ఐటెమ్‌తోను సరిపోల్చి, ఆ ఫారాలను పూర్తిగా నింపండి. ఒక ప్రతిని 1996, ఏప్రిల్‌ 1వ తేదీన సొసైటీకి పంపి, మరో ప్రతిని మీ ఫైళ్ల కోసం ఉంచుకోండి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

మే 1996 నుండి మన రాజ్య పరిచర్య పంజాబీలో లభ్యమౌతుందని ప్రకటించడంలో మేం సంతోషిస్తున్నాం. సంఘాలు తమ అభ్యర్థనలను మాకు వెంటనే పంపనారంభించవచ్చు.

బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను (తర్కించుట పుస్తకం నుండి 9-24 పేజీలు)—పంజాబీ

పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము—పంజాబీ

మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే—పంజాబీ

◼ మళ్ళీ లభ్యమౌతున్న ప్రచురణలు:

“ఈ రాజ్య సువార్త”—ఉర్దూ

నా బైబిలు కథల పుస్తకము—మిజో (లుషాయి)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి