దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వ్రాతపూర్వకమైన పునఃసమీక్ష
పుస్తకాలను మూసివేసి, జనవరి 1 నుండి ఏప్రిల్ 22, 1996 మధ్యవారాల్లోని ప్రసంగాల సమాచారాన్ని పునఃసమీక్షించడం. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయడానికి వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మాత్రం మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. ఒక క్రైస్తవుడు తాను సరైనది చేస్తున్నాడని భావించినంత వరకు ఆయన నిర్ణయాలు సరైనవే. (సామె. 14:12) [uw పేజీ 8 పేరా 8 (2)]
2. త్రిత్వ బోధ క్రైస్తవమత సామ్రాజ్యంతో ఆరంభమైంది. [uw పేజీ 15, పేరా 8]
3. మోషే ధర్మశాస్త్రం గతించిపోయినప్పటికీ, అలా సమాప్తమైన దానిలో పది ఆజ్ఞలు కూడా ఉన్నాయనే ఏ సూచననూ బైబిలు ఇవ్వడం లేదు. [rs పేజీ 348 పేరా 2]
4. రోమీయులు 1:2-7 తో రోమీయులు 8:16ను పోల్చడంద్వారా, మొత్తం మానవజాతిని ‘దేవుని పిల్లలు’గా పౌలు సూచిస్తున్నాడని అర్థంచేసుకోవచ్చు. [uw పేజీ 26 పేరా 12(3)]
5. యిర్మీయా 31:31, 33లో చెప్పబడిన నిబంధన, రాజ్యం కొరకు యేసు తన అభిషిక్త అనుచరులతో చేసిన నిబంధనను సూచిస్తుంది. [si పేజీ 129 పేరా 38]
6. విలాపవాక్యముల గ్రంథం ఐదు పద్యకావ్యాలతో కూర్చబడింది, వాటిలో నాలుగు అక్షరమాలానుక్రమ పద్యకావ్యాలుగా ఉన్నాయి. [si పేజీ 130 పేరా 6]
7. యేసు తన మరణం తరువాత అనేకసార్లు ప్రత్యక్షమయ్యాడు—కానీ తన శిష్యుల సమక్షంలో మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. [rs పేజీ 334 పేరా 2]
8. నిజ క్రైస్తవులు క్రీస్తు బలియందు విశ్వాసముంచడం ద్వారా మరియు తమను తాము సమర్థించుకునేందుకు ప్రయత్నించడం నుండి దూరంగా ఉండడం ద్వారా దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. (హెబ్రీ. 4:10) [rs పేజీ 350 పేరా 1]
9. “కడమ మృతులు” జీవానికి వచ్చుటను గూర్చి ప్రకటన 20:5లో ఉన్న మాటలు వేరే గొఱ్ఱెల భూ పునరుత్థానాన్ని సూచిస్తున్నాయి. [rs పేజీ 338 పేరా 2-పేజీ 339 పేరా 2]
10. ధర్మశాస్త్రంలో అతిముఖ్యమైన ఆజ్ఞ ఏదన్న దాన్ని గూర్చిన ప్రశ్నకు యేసు ప్రత్యుత్తరమిచ్చినప్పుడు ఆయన పది ఆజ్ఞల్లో దేనినీ ఉదాహరించలేదు. (మత్త. 22:35-40) [rs పేజీ 348 పేరా 1]
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులనివ్వండి:
11. మనకు జీవాన్నిచ్చేందుకుగాను తన కుమారున్ని పంపించేలా యెహోవా యొక్క గొప్ప ప్రేమ ఆయనను కదిలించింది గనుక దేవుని ఎడల మనకున్న ప్రేమ ఏమి చేయడానికి మనల్ని కదిలించాలి? (2 కొరిం. 5:14, 15) [uw పేజీ 14 పేరా 6]
12. యెహోవా నామమందు నడుచుకొనుటలోని భావమేమిటి? [uw పేజీ 18, పేరా 14]
13. విలాపవాక్యములు అనే గ్రంథాన్ని చదవడం ద్వారా యెహోవా లక్షణాలను గురించి మనం ఏమి నేర్చుకుంటాము? (విలా. 3:22, 23, 32) [si పేజీ 132 పేరాలు 13, 15]
14. యెహెజ్కేలును మరియు యేసు క్రీస్తును సూచిస్తూ ఏ పదం పదేపదే ఉపయోగించబడింది? [si పేజీ 133 పేరా 2]
15. భూమిపై జీవించడానికి పునరుత్థానం చేయబడేవారు, వారి భవిష్యత్తు క్రియల ఆధారంగా తీర్పు తీర్చబడతారని విశ్వసించడం ఎందుకు కారణ సహితమైయుంది. (రోమా. 6:7) [rs పేజీ 338 పేరా 1]
16. యెహోవా ప్రజలు నేడు ఆనందించే ఐక్యతకు దోహదపడే నాలుగు ముఖ్యమైన అంశాలేమిటి? [uw పేజీలు 8-9 పేరాలు 8, 9]
17. క్రీస్తు ప్రత్యక్షతతో సంబంధం కలిగివున్న సంఘటనలు కొన్ని సంవత్సరాల కాలంలో జరుగుతాయని మనం సరైన విధంగా ఎందుకు చెప్పవచ్చు? (మత్త. 24:37-39) [rs పేజీ 341 పేరా 1]
18. యెహోవా యొక్క ప్రేమ, న్యాయం, బుద్ధి మరియు శక్తి అనే విశిష్ట లక్షణాలకు తోడు, నిర్గమకాండము 34:6, కీర్తనలు 86:5 మరియు అపొస్తలుల కార్యములు 10:34, 35ల నుండి ఆయన చెప్పుకోదగిన వ్యక్తిత్వాన్ని గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? [uw పేజీ 13 పేరా 3]
19. లూకా 5:12, 13తో యోహాను 14:9, 10ని పోల్చిన తరువాత, యెహోవా బాధపడుతున్న మానవజాతి ఎడల వాత్సల్యంతో కూడిన కనికరంగల వాడనే నిర్ణయానికి ఎందుకు రాగలం? [uw పేజీ 25 పేరా 12(1)]
20. క్రైస్తవులు వారపు సబ్బాతు దినాన్ని ఎందుకు ఆచరించబద్ధులు కారు? (రోమా. 10:4) [rs పేజీ 345 పేరాలు 2, 3]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక మాటలను చేర్చండి:
21. తాము _____________________________క్రీస్తు సహోదరులను స్నేహితులనుగా చేసికొని వారికి సహకరించడంవల్ల, _____________________________నందు కాపాడబడే _____________________________ను ఎబెద్మెలెకు ముందుగా సూచించాడు. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w82 10/1 పేజీ 27 పేరా 11 (ఆంగ్లం) చూడండి.]
22. యేసు “ఒక దేవుడు” (NW) అని చెప్పబడిననూ ఆయన యోహాను 17:3 నందు యెహోవాను “_____________________ సత్యదేవుడ”ని మరియు యోహాను 20:17నందు యెహోవాను “_____________________ దేవుడును _____________________ దేవుడు”ను అని సూచించాడు. [uw పేజీ 18 పేరా 12]
23. యిర్మీయా 52:5-11 నందు వివరించబడిన సంఘటనలు సా.శ.పూ. _____________________లో జరిగాయి. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w88 4/1 పేజీ 14 పేరా 18 (ఆంగ్లం) చూడండి.]
24. క్రీస్తు రాకడ తరువాత, “ప్రతి నేత్రము ఆయనను చూచును,” అని ప్రకటన 1:7 చెప్పినప్పుడు, _____________________ నేత్రాలతో చూడడాన్ని సూచించడం లేదు గానీ మానసిక _____________________ను సూచిస్తుంది. [rs పేజీ 343 పేరా 2]
25. తన పునరుత్థానం తరువాత యేసు అదే _____________________తో కనిపించలేదు, బహుశ శిష్యుల మనస్సులలో తానప్పుడు ఒక _____________________ అన్న వాస్తవాన్ని దృఢపర్చడానికి అయ్యుండవచ్చు, అందువలననే ఆయన తన సన్నిహిత సహవాసులచేత కూడా _____________________బడలేదు. [rs పేజీ 334 పేరా 5]
ఈ క్రింది వాక్యాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. బైబిలు దేవుని వాక్యము ఎందుకంటే (అనువాదకులు దానికి ఆ పేరు పెట్టారు; భక్తిగల మనుష్యులు దానిని వ్రాశారు; దేవుడు దాని వ్రాతను చురుకుగా నిర్దేశించాడు). [uw పేజీ 20 పేరా 2]
27. మీరు ప్రతిరోజు బైబిలులోని కేవలం (ఒకటి; రెండు; నాలుగు) పేజీలు చదివితే మీరు దాన్ని (ఆరు నెలల్లో; తొమ్మిది నెలల్లో; ఒక సంవత్సరంలో) పూర్తిచేయవచ్చు. [uw పేజీ 24 పేరా 9]
28. పది ఆజ్ఞలు చేరివున్న మోషే ధర్మశాస్త్రం సమాప్తమవ్వడంతో నైతిక కట్టుబాట్లు గతించిపోలేదు, ఎందుకంటే క్రైస్తవ ఏర్పాటులో, (ఒక్కొక్క సమాజం తన స్వంత నైతిక ప్రమాణాల పట్టికను పెంపొందింపజేసుకుంటుంది; మనుష్యులు వారి మనస్సాక్షి ద్వారా మాత్రమే నడిపింపబడాలి; పది ఆజ్ఞల్లోని అనేక నైతిక ప్రమాణాలు క్రైస్తవ గ్రీకు లేఖనాలలో మరల చెప్పబడ్డాయి). [rs పేజీ 349 పేరా 1]
29. యెహోవా యిర్మీయాను “మోసగించాడు,” అంటే (దండనా సమాచారాన్ని ప్రకటించమని చెప్పడం ద్వారా వంచించాడు; తన స్వశక్తితో చేయలేనిదానిని సాధించడానికి ఆయనను ఉపయోగించుకున్నాడు; యిర్మీయా ప్రవచించిన నాశనాన్ని వారిపై తేలేదు). (యిర్మీ. 20:7) [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w89 5/1 పేజీ 31 (ఆంగ్లం) చూడండి.]
30. యోహాను 5:28నందు కనుగొనబడే “జ్ఞాపకార్థ సమాధులు” (NW) అన్న వ్యక్తీకరణ (వ్యక్తిగత సమాధులను; మానవజాతియొక్క సామాన్య సమాధిని; చనిపోయిన వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడాన్ని) సూచిస్తుంది. [rs పేజీ 339 పేరా 3]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో లేఖనాలను జతచేయండి: సామె. 3:5, 6; యిర్మీ. 23:33; 32:9, 10; విలా. 3:44; ప్రక. 15:3, 4
31. యెహోవాను తెలుసుకొని, ఆయన నీతిమార్గాలకు అనుగుణ్యంగా జీవించడమే ఆరాధనలో నిజమైన ఐక్యతకు ఆధారం. [uw పేజీ 5 పేరా 1]
32. మనమెక్కడున్నా, మనమేమి చేస్తున్నా మన ఆలోచనాసరళి, మన ఉద్దేశాలు దైవానుగుణ్యంగా ఉన్నాయని మన యావత్ జీవిత విధానం రుజువుచెయ్యాలి. [uw పేజీ 10 పేరా 11]
33. దుష్టుల ప్రార్థనలను యెహోవా వినడు. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w87 7/15 పేజీ 15 (ఆంగ్లం) చూడండి.]
34. దేవుని వాక్యంనుండి వచ్చిన గంభీరమైన ప్రవచన సందేశం హఠాత్తుగా రానైయున్న క్రైస్తవమత సామ్రాజ్య నాశనాన్ని ప్రకటిస్తున్న శిక్షావిధులతో నిండివుంది. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w94 3/1 పేజీ 12 పేరాలు 18, 20.]
35. తోటి యెహోవా ఆరాధికులతో వ్యాపార వ్యవహారాలలోకి ప్రవేశించేటప్పుడు ఒక వ్రాతపూర్వక ఒప్పందం చేయడం, తర్వాత కలిగే అపార్థాలకు దారితీయడాన్ని నివారించగలదు. [ప్రతివారం చదవవలసిన బైబిలు భాగం; w95 5/1 పేజీ 30 చూడండి.]