ఏప్రిల్‌లోని సేవా కూటాలు
ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యేవారం
పాట 132 (70)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. గత నెల నుండి పెరిగిన పత్రికల వెలను మరియు చందాను ప్రచారకులకు గుర్తు చేయండి. మీ జ్ఞాపకార్థ దిన ఆచరణను గూర్చిన ఏవైనా విశిష్టమైన నివేదికలుంటే పేర్కొనండి.
20 నిమి: “ఏప్రిల్‌లో ‘సత్‌క్రియలయందాసక్తి’ గలవారై ఉండండి!” 1-10 పేరాల ప్రశ్నా జవాబుల చర్చను సేవాధ్యక్షుడు నిర్వహిస్తాడు. (1) ఏప్రిల్‌లో విస్తృతం చేయబడిన ప్రాంతీయ పరిచర్య కార్యక్రమానికి స్థానికంగా ఏ పథకం వేయబడిందో, (2) భాగం వహించేందుకు అందరికీ ఎలా సహాయం చేయబడుతుందో, (3) క్రొత్తవారు, పిల్లలు ఎలా చేరవచ్చో వివరించండి.
15 నిమి: “సరైన అభిముఖం గలవారికొరకు వెతకండి.” ఇవ్వబడిన సలహాలను పునఃసమీక్షించి, వాటిని ఎలా ఉపయోగించవచ్చో చూపించే రెండు ప్రదర్శనలను చేయించాలి. సమయం అనుమతించే దానినిబట్టి, జనవరి 1996 మన రాజ్య పరిచర్య, 5వ పేజీలో పత్రికలను ప్రతిపాదించేందుకు ఇవ్వబడిన సలహాలలో కొన్నింటిని చెప్పండి.
పాట 20 (55) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 8తో ప్రారంభమయ్యే వారం
పాట 72 (58)
15 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్ట్; సొసైటీ నుండి అందిన విరాళాల రసీదులను పేర్కొనండి. మరెక్కువగా ఆత్మీయాభివృద్ధిని చేసుకునేందుకు జ్ఞాపకార్థ దినాన హాజరైన క్రొత్తవారికి సహాయపడేందుకు ఆచరణాత్మక మార్గాలను చర్చించండి. ఏప్రిల్ 1, 1991, కావలికోట (ఆంగ్లం), 9-12 పేజీలను పునఃసమీక్షించండి.
15 నిమి: “రాత్రింబగళ్లు పరిశుద్ధ సేవను చెల్లించండి.” ప్రశ్నా జవాబులు. 5, 6 పేరాలను చదవండి.
15 నిమి: “ఏప్రిల్‌లో ‘సత్‌క్రియలయందాసక్తి’ గలవారై ఉండండి!” 11-15 పేరాల ప్రశ్నా జవాబుల చర్చ. తమ వ్యక్తిగత పరిస్థితులను విశ్లేషించుకుని, ప్రాంతీయ పరిచర్యలో తమ మద్దతును పెంచే మార్గాలను వెదకాలని అందరినీ ప్రోత్సహించండి.
పాట 113 (62) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 15తో ప్రారంభమయ్యే వారం
పాట 133 (68)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్ 21న ఇవ్వబడే “వక్ర జనాంగం మధ్య నిందారహితులుగా ఉండడం” అనే ప్రత్యేక బహిరంగ ప్రసంగాన్ని గూర్చి శ్రోతలకు గుర్తు చేయండి. ప్రతివొక్కరు హాజరయ్యేందుకు సహాయపడేలా అదనపు ప్రయత్నాలను చేయాలని ప్రోత్సహించండి.
15 నిమి: “కాలాలు మారాయి.” ప్రశ్నా జవాబులు. ప్రజలకు అత్యంత అవసరమైన వాటిని తీర్చే విధంగా రాజ్య వర్తమానాన్ని అందించాలని నొక్కి చెప్పండి. జనవరి 1, 1994, 22-3 పేజీల్లో పేర్కొనబడినట్లుగా, చాలా మంది ప్రజల మనస్సులోవున్న కుటుంబ మరియు సామాజిక సంబంధమైన కొన్ని వివాదాలను గూర్చి చెప్పండి.
20 నిమి: “వినుటవలన విశ్వాసం కలుగును.” జ్ఞానము పుస్తకంతో బైబిలు పఠనాలను నిర్వహించగల్గేలా ఆసక్తిని రేకెత్తించేందుకు అందించిన పత్రికలను ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. రెండు లేదా మూడు ప్రదర్శనలను చేయించాలి.
పాట 204 (109) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 22తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (4)
15 నిమి: స్థానిక ప్రకటనలు. గత వారాంతంలో ఇవ్వబడిన ప్రత్యేక ప్రసంగంలోని ఉన్నతాంశాలను పునఃసమీక్షించండి. సత్యారాధన విషయంలో దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ ఉద్బోధ ఆసక్తిగలవారిని ఎలా పురికొల్పాలో చర్చించండి. అలాగే, “కచ్చితమైన జ్ఞానంలో అభివృద్ధిపొందుతూ ఉండండి” వైపుకు శ్రద్ధను మళ్ళించి, సంఘ పుస్తక పఠనానికి క్రమంగా హాజరు కావలసిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పండి.
12 నిమి: ప్రశ్నా భాగం. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. కూటాలను నిర్వహించే సహోదరులు వ్యక్తులను అయుక్తంగా అనుచితంగా వారి మొదటి పేర్లను మాత్రమే ఉపయోగించి ఎందుకు పిలువకూడదో వివరించండి.
18 నిమి: కావలికోట, సెప్టెంబరు 15, 1995 సంచిక, 20-23 పేజీల్లోవున్న “ప్రాచీనకాలంనాటి దైవభక్తిగల కుటుంబాలు—మన కాలానికి ఒక మాదిరి” అనే శీర్షికను గూర్చి ఒక పెద్ద మరియు ఒక పరిచర్య సేవకుని మధ్య జరిగే చర్చ. స్థానిక కుటుంబాలకు ప్రయోజనం కలిగేందుకు ఆచరణాత్మక అన్వయింపును చేయండి.
పాట 143 (76) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 29తో ప్రారంభమయ్యే వారం
పాట 144 (78)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన కార్యక్రమాలను ఉద్దేశాలను గూర్చి ఇతరులకు తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తూ, యెహోవాసాక్షులను ఒక “తెగ”గా లేదా “మతశాఖ”గా కొందరు వర్ణిస్తారు. తర్కించుట పుస్తకంలోని 202వ పేజీని ఉపయోగిస్తూ, ఈ అపనిందను ఎలా ఖండించవచ్చో క్లుప్తంగా వివరించండి.
15 నిమి: మన ప్రాంతానికంతటికీ సమానంగా శ్రద్ధనివ్వడం. సేవాధ్యక్షుని ప్రసంగం. చెల్లాచెదురుగావున్న, సుదూరంగా ఉన్న ప్రాంతాల్లో అరుదుగా పనిచేసి ఉండవచ్చు. ధనవంతులు, గట్టి మత విశ్వాసులు నివసించే ప్రదేశాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా పనిచేయకపోవచ్చు. వ్యాపార స్థలాలు నిర్లక్ష్యం చేయబడివుండవచ్చు. చేయవలసిన అవసరమున్న ప్రదేశాలు కాకుండా, తమకు వ్యక్తిగతంగా ఇష్టమైన ప్రదేశాలను కొందరు ప్రచారకులు తరచూ అడుగుతుండవచ్చు. చేయని ప్రదేశాలను పూర్తిచేయడానికి సహకరించాలని అందరినీ ప్రోత్సహించండి. దూరంగానున్న పల్లెప్రాంతాల్లో పరిచర్య చేయడానికి వేసవి నెలలు సాధారణంగా మంచి అవకాశాన్నిస్తాయి; బహుశ దానికొరకు కారులను ఏర్పాటు చేయవచ్చు. ప్రదేశ పటాన్ని తిరిగి ఇచ్చేముందు, ఇండ్లలో ఎవరూ లేని వాటితో సహా ఆ ప్రాంతం బాగా చేయబడిందని రూఢి చేసుకోండి. మీ ప్రాంతాన్ని చాలా చక్కగా పూర్తిచేసేందుకు అందరూ ఎలా సహాయపడగలరో చూపించే ఇతర ఆచరణాత్మక సలహాలను ప్రతిపాదించండి.
18 నిమి: మే నెలలో కావలికోట మరియు తేజరిల్లు!ల చందాలను ప్రతిపాదించండి. మొదటి సందర్శనంలో చందా ప్రతిపాదనను నిరాకరించినప్పుడు, విడి పత్రికలను ప్రతిపాదించి, సముచితమైతే పునర్దర్శనంలో చందాను మళ్ళీ ప్రతిపాదించండి. గృహస్థునికి పత్రికల్లో ఆసక్తి ఉండీ కూడా ఏదో కారణాన చందా కట్టనట్లయితే, పత్రికా మార్గాన్ని స్థాపించాలనే లక్ష్యంతో అందించిన దానిని గురించి వ్రాసిపెట్టుకోండి. ప్రజలకు రాజ్య వర్తమానాన్ని చేరవేసే ఫలవంతమైన మార్గాల్లో ఒకటిగా పత్రికలను పంచిపెట్టడంలోని గొప్ప ప్రయోజనాలను నొక్కిచెప్పండి. మీరు ప్రాంతీయ పరిచర్యకు వెళ్ళేటప్పుడు మీకు కావలసినన్ని పత్రికలు ఉండేలా చూసుకోండి; వాటిని ప్రతి అవకాశంలోను ప్రతిపాదించండి. ఎక్కువగా ఇచ్చేందుకు, వ్యక్తిగతంగా ప్రతివారం పత్రికా దినాన్ని ఏర్పాటు చేసుకోవడం ఫలవంతమైన మార్గం. పత్రికలతో చేసే అంగడంగడి పని మరియు వీధి సాక్ష్యం కూడా ఫలవంతంగా ఉంటాయి. జ్ఞానము అనే పుస్తకాన్ని ఉపయోగించి పఠనాలను ఆరంభించాలని పథకం వేసుకుని పునర్దర్శనాలను చేసి ఆసక్తిని పెంచండి. బహుశ జనవరి 1996 మన రాజ్య పరిచర్య 3వ పేజీలోని 3-5 పేరాలలో ఉన్న అందింపులను ఉపయోగిస్తూ ప్రస్తుత సంచికల ఒకటి లేక రెండు క్లుప్త ప్రతిపాదనల ప్రదర్శనలను చేయించండి.
పాట 195 (105) మరియు ముగింపు ప్రార్థన.