కాలాలు మారాయి
1 “ఈ లోకపు నటన గతించుచున్నది” అని బైబిలు మనకు చెబుతోంది. (1 కొరిం. 7:31) అది నేడు ఎంత నిజం! మన జీవిత కాలంలో సహితం, మానవ సమాజంలోని ప్రతి స్థాయిలోని ప్రజల ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ మనం తీవ్రమైన మార్పులను చూశాము.మనం రాజ్య సువార్తతో వారిని చేరడంలో విజయవంతులం కావాలనుకుంటే మన అందింపు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలి. ప్రజలకు ఆసక్తి కలిగించి వారి హృదయాలను చేరేట్లుగా సువార్తను అందించాలని మనం కోరుకుంటాము.
2 సంవత్సరాల క్రితం, అనేక దేశాల్లో సాక్ష్యపుపని వేరుగా ఉండేది, ఎందుకంటే ఎక్కువగా ప్రజలు ప్రశాంతమైన జీవితాలను జీవించేవారు, మరి వారు సురక్షిత భావాన్ని కల్గివుండేవారు. వారి జీవితాల్లో మతం పరిశుద్ధమైన స్థానాన్ని కలిగివుండేది. క్రైస్తవులని చెప్పుకోనివారి మధ్య కూడా బైబిలు ఎంతో ఉన్నతంగా భావించబడేది. ఆ రోజుల్లోని సాక్ష్యపు పనిలో సిద్ధాంతపరమైన విషయాలపై ఖండితంగా వాదించడం ఉండేది. నేడు, ప్రజల జీవితాలు గందరగోళ పరిస్థితిలో ఉన్నాయి. మతం తరచూ వెక్కిరించబడుతుంది. చాలా తక్కువమందికి బైబిలులో విశ్వాసముంది. అనేకులు మన వర్తమానాన్ని వ్యతిరేకిస్తారు. మరికొందరిలో, పరిణామ సిద్ధాంతం దేవుని యందలి నమ్మకాన్నే పూర్తిగా తొలగించింది.
3 ఓ ప్రయాణ కాపరి ఇలా చెప్పాడు: “ఇప్పుడు, ప్రజల జీవితాల్లో ఎన్ని సమస్యలూ కష్టాలూ ఉన్నాయంటే ఎలా జీవించాలో మనం వారికి నేర్పించాలన్నట్లుగా ఉంది.” ప్రజల అవసరతలు, సహజంగా తమ చుట్టూ తమ కుటుంబాలచుట్టూ మరి జీవిత చింతల చుట్టూ పరిభ్రమిస్తాయి. వారు ఒక చోటికి చేరినప్పుడు మాట్లాడుకునేది ఈ విషయాలను గూర్చే. మన సాక్ష్యపు పనిలో మనం ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలి.
4 దేవుని రాజ్యము మాత్రమే భవిష్యత్తు కొరకైన కచ్చితమైన నిరీక్షణ: మానవ ప్రభుత్వంపై అనేక మంది ప్రజలకు అంతగా నమ్మకం లేదు. తమ జీవితకాలంలో ఓ శ్రేష్ఠమైన లోకాన్ని చూసే ఉత్తరాపేక్ష లేదని వారు భావిస్తుంటారు. అబద్ధమతం నిరీక్షణకు గల ఆధారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. అందుకనే దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను వినడమే మానవజాతి యొక్క అతి గొప్ప అవసరత. మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని అది చివరికి ఎలా అందిస్తుందో చెప్పండి.
5 నడిపింపునిచ్చేందుకు బైబిలు మాత్రమే విశ్వసనీయమైన మూలం: నేటి ప్రజలనేకమంది, మానవ వివేకంపై మరియు లోక సిద్ధాంతాలపై ఆధారపడే నాయకుల చేత తప్పుదోవ పట్టించబడ్డారు. “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదని” ప్రజలు ఇంకా గ్రహించాల్సివుంది. (యిర్మీ. 10:23) వారు నేర్చుకోగల అతి విలువైన పాఠమేమంటే వారు ‘స్వబుద్ధిని ఆధారము చేసికొనక, పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచాలన్నదే.’ (సామె. 3:5) కాలాలు మారినప్పటికీ బైబిలు మారలేదు. కనుక, దేవుని వాక్యపు ప్రేరేపిత, దైవిక నడిపింపును ఇతరులు గుణగ్రహించేందుకు వారికి బోధిస్తూ దాన్ని మనం సాధ్యమైనప్పుడల్లా చూపించాలి. (2 తిమో. 3:16, 17) ఆ సంకల్పం నెరవేర్చేందుకుగాను—అయితే యుక్తిగా—మన అందింపుల్లో దాన్ని సూచిస్తూ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు దానిని ఉపయోగించుకుంటూ దాన్ని పఠించి మరియు దాని ఆచరణాత్మక వివేకాన్ని అన్వయించే అవసరతను బోధించడం ద్వారా బైబిలు ప్రాముఖ్యతను ప్రజలముందు మనం ఉంచాలి.
6 నేటి మారుతున్న కాలంతో కూడా, పరిచర్యలోని మన ఉద్దేశాలు మారవు. మనం రాజ్య సువార్తను ప్రకటించాలి, దేవుని వాక్యంలో నమ్మకాన్ని పెంచుకోవాలి మరియు మనతో బైబిలును పఠించాల్సిన అవసరతను ఇతరులు గమనించేలా చేయాలి. మనం చెప్పేది సాక్ష్యం పొందుతున్నవారి వర్తమానావసరతలకు తగినట్లుగా ఉండాలి. దీన్ని చేయడం ద్వారా, మనం ఇతరులతో సువార్తను పంచుకునేవారమౌతాము మరి ఆ విధంగా అనేకులను మనం సంపాదించుకోగలము.—1 కొరిం. 9:19, 23.