ప్రకటనలు
◼ అందించవలసిన సాహిత్యాలు ఆగష్టు: ముప్పై రెండు పేజీల ఈ క్రింది బ్రోషూర్‌లలో దేనినైనా రూ. 5.00 చందాకు అందించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరము నిలిచే దైవనామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? మరియు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) ఇవ్వాలి. గృహ బైబిలు పఠనాలను ఆరంభించేందుకు ప్రయత్నాలు జరగాలి. అక్టోబరు: తేజరిల్లు! లేక కావలికోట కొరకు చందాలు. పక్షపత్రిక సంచిక యొక్క ఒక సంవత్సర చందా రూ 70.00. మాసపత్రిక యొక్క ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రిక యొక్క ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికకు ఆరునెలల చందా లేదు. నవంబరు: సాధ్యమైన చోటెల్లా, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంతోపాటు పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదమును (ఆంగ్లం) రూ. 75.00కు అందించాలి. లేకపోతే దేవుని కొరకైన మానవుని అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రూ. 45.00కు అందించవచ్చు. గృహస్థులకు ఆంగ్లం తెలియనిచోట, క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక అందింపుగా ఇవ్వబడిన పుస్తకాల్లో ఏదైన ఒక 192 పేజీల పుస్తకాన్ని రూ. 8.00కు అందించవచ్చు. ఈ కోవకు చెందిన క్రింది పుస్తకాలు ఇప్పటికీ మా దగ్గర లభ్యమే: ఆంగ్లం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు మానవుడు పరిణామం ద్వారా వచ్చాడా లేక సృష్టిద్వారా వచ్చాడా? కన్నడ: “దేవుడు అబద్ధమాడలేని విషయాలు;” “నీ రాజ్యము వచ్చుగాక;” గుజరాతి: నిత్యజీవమునకు నడుపు సత్యము, నిన్ను సంతోషపరచు సువార్త, “నీ రాజ్యము వచ్చుగాక,” తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము, మరాఠి: గొప్ప బోధకుని వినడం మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” హింది: నిన్ను సంతోషపరచు సువార్త, “నీ రాజ్యము వచ్చుగాక.” నేపాలి తెలిసినవారికి జీవితమును అనుభవించుము! అనే బ్రోషూర్‌లను, పంజాబి లేదా బెంగాలి తెలిసినవారికి మన సమస్యలు లేదా ఇదిగో! . . . సమస్తము అనే బ్రోషూర్‌లను అందించాలి. మలయాళం ఇష్టపడేవారికి మీ యౌవనమును పరిపూర్ణముగా—ఆస్వాదించుము! అనే పుస్తకాన్ని రూ. 15.00కు ఇవ్వవచ్చు. ఈ పుస్తకం ప్రత్యేక వెలకు ఇవ్వవలసింది కాదని దయచేసి గమనించండి.
గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాల కొరకు ఇంతవరకు రిక్వెస్ట్ చేయని సంఘాలు, తమ తరువాయి లిటరేచర్ ఫారమ్ (S-AB-14)లో రిక్వెస్ట్ చేయాలి.
◼ ప్రతి సంఘానికి మూడు సాహిత్య ఇన్వెంటరీ ఫారాలు (S-AB-18) అందుతాయి. సంఘ సెక్రెటరీ ఆగష్టు ఆరంభంలోనే సాహిత్య పరిచారకుని కలుసుకుని, నెల చివరలో సంఘ సాహిత్య స్టాకు ఇన్వెంటరీ తీసుకునేందుకు తేదీని తీర్మానించాలి. స్టాకులో ఉన్న సాహిత్యాలన్నింటి లెక్కను తీసుకొని, లిటరేచర్ ఇన్వెంటరీ ఫారమ్‌లో వాటి మొత్తాలను ఎక్కించాలి. స్టాకులో ఉన్న మొత్తం ప్రతుల సంఖ్యను పత్రికల పరిచారకుని నుండి పొందుతాడు. దయచేసి సెప్టెంబరు 6కు ముందుగా ఒరిజినల్‌ను సొసైటీకి పంపించండి. మీ ఫైళ్లకోసం ఒక కార్బన్ కాపీని ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్ షీట్‌గా ఉపయోగించుకోవచ్చు. సెక్రటరీ చేత ఇన్వెంటరీ పర్యవేక్షించబడాలి, పూర్తయిన ఫారమ్‌ను సంఘాధ్యక్షుడు తనిఖీ చేయాలి. సెక్రెటరీ మరియు సంఘాధ్యక్షుడు ఆ ఫారమ్‌పై సంతకం చేయాలి.
◼ కాన్‌గ్రిగేషన్ అనాలిసిస్ రిపోర్టు ఫారమ్ (S-10)లో ఎక్కించేందుకు సంఘ సెక్రటరీ సేవా రిపోర్టులను సేకరిస్తాడు కూడా. సంఘ ప్రచారకుల రికార్డు కార్డుల (S-21) నుండి అవసరమైన వివరాల సరైన పట్టీని నిశ్చయపరచేలా, రిపోర్టులను సేకరించడానికి సహాయపడే ఏ పెద్దకైనా, లేదా పరిచారకునికైనా ఆయన జాగ్రత్తగా మార్గనిర్దేశమిస్తాడు. సేవా కమిటీ సంతకం పెట్టే ముందు కాన్‌గ్రిగేషన్ అనాలిసిస్ రిపోర్టు ఫారమ్ కచ్చితంగా, శుభ్రంగా ఎక్కించబడి, జాగ్రత్తగా తనిఖీ చేయబడాలి. దయచేసి సెప్టెంబరు 10 దాటకముందే ఒరిజినల్ S-10 ఫారమ్‌ను సొసైటీకి పంపండి; మీ ఫెల్‌లో కార్బన్ కాపీని ఉంచుకోండి.
◼ సెప్టెంబరు 1, 1995 నుండి క్రమ పయినీరింగ్ ఆరంభించాలనుకునే ప్రచారకులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు పెట్టాలి.
◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:
యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు—ఆగ్లం, నేపాలి
◼ స్టాకులోలేని ప్రచురణలు:
ఆంగ్లంలో 1965-69, 1975-79, మరియు 1993 సంవత్సరాల బైండున్న కావలికోట సంపుటులు. ఈ సంపుటుల కొరకు మేము మళ్ళీ ఆర్డర్లు తీసుకోవడం లేదు గనుక, మళ్ళీ నోటీసు వచ్చేదాక దయచేసి రిక్వెస్ట్ చేయకండి.