దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
పుస్తకాలను మూసివేసి, మే 1 నుండి ఆగష్టు 21, 1995 మధ్యవారాల్లోని ప్రసంగాల సమాచారాన్ని పునఃసమీక్షించడం. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయడానికి వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోవున్న రెఫరెన్సులు మాత్రము మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చును.]
ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. దేవుని ఆరాధించడమనేది వ్యక్తిగత విషయం, అది ఇతరులతో గల మన సంబంధంపై ఏవిధంగాను ఆధారపడదు. (1 యోహాను 4:20) [uw పే. 134 పేరా 7]
2. విగ్రహారాధనను, రక్తాన్ని, జారత్వాన్ని విసర్జించాలని పరిపాలక సభ అన్యులైన క్రైస్తవులకు ఇచ్చిన ఉపదేశం మోషే ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉండెను. (అపొస్తలుల కార్యములు 15:28, 29) [uw పే. 149 పేరా 8]
3. మొదట్లో, మోషే ధర్మశాస్త్రం మానవజాతికంతటికి వర్తించవలసి ఉండెను. (కీర్త. 147:19, 20) [uw పే. 147 పేరా 5]
4. క్రీస్తు జననానికి దాదాపు 700 సంవత్సరాల క్రితం వ్రాయబడిన యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయం, యేసు క్రీస్తును మరియు ఆయనతో వ్యవహరించబడిన విధాన్ని వివరించే స్పష్టమైన ప్రత్యక్ష వివరణ వలె ఉంది. [12, si పే. 119 పేరా 8]
5. ప్రసంగి 3:1, 2 నందలి సొలొమోను మాటలు కొనసాగే జీవన్మరణ చక్రాన్ని సూచిస్తుందే గాని, వ్యక్తి విధి నిర్ణయాన్ని గూర్చి కాదు. [వారపు బైబిలు పఠనం; w91 10/15 పే. 5 చూడండి.]
6. కుటుంబ విషయాల్లో బైబిలిచ్చే సదుపదేశానికి సమానమైన ఉపదేశాన్నిచ్చే లోక సంబంధమైన మరే మూలం లేదు. [uw పే. 144, పేరా 11]
7. మనం దేవునియందు పూర్ణ విశ్వాసము కలిగి ఉండాలని ఉపదేశించడంలో సామెతల గ్రంథం మన సమస్యల కారణాలపై శ్రద్ధ నిలుపుతుంది. [si పే. 111 పేరా 35]
8. దూరదర్శినిలో ఏ కార్యక్రమాన్నైనా చూడడానికి తమ పిల్లలను అనుమతించే తలిదండ్రులు నిజానికి వారిని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. (సామె. 29:15) [వారపు బైబిలు పఠనం; w88 8/1 పే. 12 పేరా 8 చూడండి.]
9. వివాహ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు, ఒక నిజమైన క్రైస్తవుడు తన బాధ్యతల నుండి తప్పుకోవడానికి, స్వార్థంతో తన జతలోని లోపాలను సాకుగా తీసుకోడు. [uw పే. 140-1 పేరాలు 4, 5]
10. ప్రసంగి గ్రంథంనందలి అంతా వ్యర్థమనే సొలొమోను ప్రకటన దేనినీ మినహాయించకుండా అన్నింటికీ వర్తిస్తుంది. [si పే. 114 పేరా 15]
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులనివ్వండి:
11. నిర్గమకాండం 20:7 లోని ప్రాథమిక సూత్రమేది? [uw పే. 152]
12. యెషయా ప్రవక్తగా సేవ చేస్తున్నప్పుడు యూదాను పరిపాలించిన నలుగురు రాజుల్లో ఇద్దరు ఎవరు? [si పే. 118 పేరా 3]
13. యెషయా 14:4, 12-14లో వర్ణించబడినట్లు, బబులోను రాజు ఎవరి దృక్పథాన్ని ప్రతిబింబించాడు? [వారపు బైబిలు పఠనం; w85 3/15 పే. 16 పేరా 2 చూడండి.]
14. నిర్గమకాండం 19:10, 11 ప్రకారం యెహోవా తన ఆరాధికులను ఏమి కోరుతున్నాడు? [uw పే. 152]
15. ఆధునిక దిన కావలివాడు ఎవరు, అతడు ఏమి ప్రకటిస్తున్నాడు? (యెష. 21:8, 12) [వారపు బైబిలు పఠనం; w87 3/1 పే. 12 పేరా 10 చూడండి.]
16. పుస్తకాల గురించి, ప్రసంగి 12:12 అలాంటి ప్రతికూల అభిప్రాయాన్ని తెలుపుతుందెందుకని? [వారపు బైబిలు పఠనం; w87 9/15 పే. 25 చూడండి.]
17. సామెతలు 1:2-4 కు అనుగుణ్యంగా, సామెతల గ్రంథం దేనిని ఉన్నతపరుస్తుంది? [si పే. 109 పేరా 19]
18. “హృదయములను విశాలపరచుకొనుడి” అని పౌలు కొరింథీయులను ఉద్బోధించినప్పుడు ఆయన భావమేమిటి? (2 కొరిం. 6:13) [uw పే. 137 పేరా 14]
19. ప్రేమ “మరణమంత బలమైనది” ఎలా అవుతుంది? (పరమగీతము 8:6, 7) [వారపు బైబిలు పఠనం; కా88 1/1 పే. 29 చూడండి.]
20. చక్కని పరమగీతాల్లో ఆచరణయోగ్యమైన ఏ పాఠాలు నేర్పించబడ్డాయి? [si పే. 117 పేరా. 16]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక మాటలను చేర్చండి:
21. మనం మోషే ధర్మశాస్త్రం క్రింద లేకున్ననూ, అది ఆధారపడిన _____________________ను, అందలి _____________________ మాదిరులను గూర్చిన కచ్చితమైన జ్ఞానంతో మనం ప్రయోజనం పొందుతాము. [uw పే. 153 పేరా 14]
22. నిర్గమకాండము 20:4-6 _______________ను నిషేధిస్తుంది, యెహోవా ___________________ని కోరుతాడు అనే సూత్రంపై ఈ నియమం ఆధారపడి ఉందని లేఖనం నిరూపిస్తుంది. [uw పే. 152]
23. దేవుని సేవకుడు _______________________________ను సేవించని ఒకరితో ________________________________ ఒప్పందం చేయకూడదని ద్వితీయోపదేశకాండము 7:1-4 నందలి సూత్రం స్పష్టంగా చూపిస్తుంది. [uw పే. 152]
24. పరమగీతము 2:1-3 నందలి అలంకారికమైన మాటలు _________________ యొక్క వినయాన్ని మరియు నమ్రతను అలాగే ఆమె ప్రియుడైన _________________ యొక్క కోరదగిన లక్షణాలను మరియు సామర్థ్యాలను బయల్పరుస్తున్నాయి. [వారపు బైబిలు పఠనం; కా88 1/1 పే. 28 చూడండి.]
25. యెహోవా యొక్క నమ్మకస్థులైన సేవకులు _____________________ కొరకు ________________ని విచారించే అభ్యాసాన్ని తిరస్కరిస్తారు, ఎందుకంటే అలాంటి సంభాషణ నిజానికి _________________లతో జరిపే సంభాషణయైయున్నది. (యెష. 8:19) [వారపు బైబిలు పఠనం; w89 3/15 పే. 20 పేరా 11 చూడండి.]
ఈ క్రింది వాక్యాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. సామెతలు 26:20, 21 ప్రకారం, మనం ‘అగ్నికి కట్టెలను పేర్చి,’ ఇతరులకు కోపం రేపే బదులు (తొందరపడి జవాబిస్తే; నిర్మొహమాటంగా మాట్లాడితే; నెమ్మదిగా ఉంటే), మనం వారితో (వ్యక్తిగత సమస్యలు; సరైనా సంభాషణ లేకుండా; సత్సంబంధం) కలిగి ఉండవచ్చు. [వారపు బైబిలు పఠనం; w91 10/15 పే. 13 పేరా 16 చూడండి.]
27. సామెతలు 27:6 ప్రకారం, మిమ్మల్ని ప్రేమించే ఒక వ్యక్తి (మిమ్మల్ని బాధపెట్టే దేనినీ పలకడు; మీ గురించిన సత్యాన్ని చెప్పడానికి భయపడతాడు; మీకవసరమైనప్పుడు మీకు సలహానిస్తాడు). [వారపు బైబిలు పఠనం; w90 9/15 పే. 28 చూడండి.]
28. ప్రసంగి గ్రంథకర్త సొలొమోనేనని చూపించే రుజువు (పుస్తకమంతటా కనిపిస్తుంది; ఇతర బైబిలు పుస్తకాల రచయితలు దాని రచయితగా ఆయన పేరే చెబుతున్నారు; అతని పేరును పేర్కొనకున్నా సొలొమోనే దాని రచయితయని ఆ పుస్తకమే రుజువు చేస్తోంది). [si పే. 112 పేరా 4]
29. ఏమీ పట్టించుకోకుండా, అన్నింటినీ అంగీకరించే నేటి మనస్తత్వం జ్ఞానయుక్తమని తలంచే ప్రజలు నిజానికి (హానికరమైనవారు కారు; కేవలం సహనం గలవారు; ఆత్మీయ అంధకారంలో ఉన్నారు). (యెషయా 5:20) [వారపు బైబిలు పఠనం; w93 3/1 పే. 11 చూడండి.]
30. పరమగీతం (రాజుగా సొలొమోను పాత్రను; సొలొమోను గొప్ప సంపదను; గొర్రెలకాపరి ఎడల ఒక గ్రామీణ యువతి యొక్క యథార్థతను) ఉన్నతపరుస్తుంది. [si పే. 115 పేరా. 2]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో లేఖనాలను జతచేయండి: సామె. 22:3; ప్రసం. 7:21, 22; యెష. 13:19, 20; మత్త. 5:23, 24; కొలొ. 3:18-20, 23, 24
31. యెహోవా తన ప్రజలను ప్రమాదాలనుండి, అంతర్గత పోరాటాల నుండి, లేదా నేరాల నుండి స్వయంగా రక్షించడు కాని, బైబిలు ఆధారిత ఆచరణాత్మక జ్ఞానాన్ని కనబరచడం ప్రయోజనకరంగా ఉండగలదు. [వారపు బైబిలు పఠనం; w92 1/1 పే. 17 పేరా 23 చూడండి.]
32. ప్రేరేపిత ప్రవచన నెరవేర్పును గురించి సందేహించకుండా ఉండేందుకు కావలసినంత రుజువు ఉంది. [వారపు బైబిలు పఠనం; w93 5/15 పే. 6 చూడండి.]
33. ఒక నిజమైన క్రైస్తవుడు తన సహోదరులతో సమాధానకరమైన సంబంధాలను వృద్ధిచేసుకునేందుకు తానే చొరవ తీసుకుంటాడు. [uw పే. 135 పేరా 10]
34. గృహమందు దైవభక్తిని అభ్యసించేవారని చూపిస్తూ, వేరే వ్యక్తి ఏదైనా చేస్తాడని వేచియుండడం ద్వారా కాదుగాని, ప్రతి ఒక్కరు తన వంతును నిర్వహించడం ద్వారానే కుటుంబ బంధాలలో అభివృద్ధి సాధించబడుతుంది. [uw పే. 143 పేరా 10]
35. మీలో లేదా ఇతర అపరిపూర్ణ మానవులతో ఉన్న మీ సంబంధాల్లో అవాస్తవమైన పరిపూర్ణతను అపేక్షించకండి. [వారపు బైబిలు పఠనం; w90 3/1 పే 8 చూడండి.]