పంజాబీలో కావలికోట
సొసైటీ ఆగష్టు 1, 1995 నుండి పంజాబీలో కావలికోటను ప్రచురిస్తుందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము.
కావలికోట పంజాబీ భాషలో, పెహరాబుర్జ్ అనే పేరుతో మాసపత్రికగా ప్రచురించబడుతుంది. సంఘాలు పత్రికల కొరకు పంపకందారుల ఆర్డరులను వెంటనే పంపవచ్చు, ప్రచారకులు ఇప్పటి నుండే పత్రికలకు చందాలను సేకరించనారంభించవచ్చు. అన్ని మాసపత్రికల్లాగే, ఒక సంవత్సర చందా రూ. 35, అయితే ఆరునెలల చందా ఉండదు. ఒక్కో ప్రతికి రూ. 3.00.
ఆగష్టు 1 సంచిక, నమూనా సంచికలాంటిది, దానిలోని పఠన శీర్షికలు ఆంగ్ల భాష మరియు ఇండియా భాషల్లోని కావలికోట సంపుటుల్లో నెలల క్రితమే ప్రచురించబడినవే కనుక, అవి మునుపే పఠించబడ్డాయి. సెప్టెంబరు 1, 1995 నుండి పెహరాబుర్జ్‌లోని పఠన శీర్షికలు ఇతర సంపుటుల్లో పట్టికవేయబడిన అవే శీర్షికలై ఉంటాయి (ప్రతి పెహరాబుర్జ్‌లోను నాలుగు లేదా ఐదు పఠన శీర్షికలు ఉంటాయి). కాబట్టి, తమ సంఘ కావలికోట పఠనంలో పెహరాబుర్జ్‌ను ఉపయోగించుకోవాలని ఇష్టపడే సంఘాలు మరియు వ్యక్తులు అక్టోబరు 9, 1995తో ఆరంభమయ్యే వారం నుండి అలా చేయగలుగుతారు.
ఈ మధ్య కాలంలో, మీ పంపకందారుల ఆర్డర్లను పంపడంలోను, పెహరాబుర్జ్ కొరకు చందాలను సేకరించడంలోను అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. యెహోవా రాజ్యం ద్వారా త్వరలో మానవుని రక్షణ సాధ్యమవుతుందనే సందేశాన్ని కావలికోట తెస్తుంది గనుక, అది జీవాన్నిచ్చే పత్రిక. ఇది, ఇండియాలో కావలికోట తర్జుమా చేయబడే పదవ భాష. ఈ అద్భుతమైన ఏర్పాటు చేసినందుకు మనం యెహోవాకు కృతజ్ఞతలు చెబుతాము. ఇది ప్రాంతీయ పరిచర్యలోను, సహోదరులను బలపరచి, పరిపక్వతకు ఎదగడానికి వారికి సహాయపడడంలోను ఇది శక్తివంతమైన ఉపకరణంగా ఉండాలని మేము ప్రార్థిస్తాము. మీరు దీనిని పూర్తిగా ఉపయోగించడంలో సంతోషిస్తారని, మీరు అలా చేస్తుండగా మీరు సమృద్ధిగా ఆశీర్వాదాలను పొందుతారనే నిశ్చయాన్ని మేము కలిగి ఉన్నాము.