కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/95 పేజీ 2
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీటింగ్స్‌లో ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • సంఘంలో యెహోవాను స్తుతించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “సమాజమధ్యమున” యెహోవాను స్తుతించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కూటాల్లో వ్యాఖ్యానాలు చేస్తూ ఒకరినొకరు అభివృద్ధిపర్చుకోండి
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 6/95 పేజీ 2

ప్రశ్నాభాగం

◼ కూటాల్లో మనం మరింత ఫలవంతంగా ఎలా వ్యాఖ్యానించగలం?

వారపు సంఘ కూటాల్లో కూడుకోవడానికి మనం ఆతురతతో ఎదురు చూస్తుంటాము. అక్కడ మన విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి, మనం వ్యాఖ్యానించడం ద్వారా ఇతరులను ప్రోత్సహించడానికి మనకు అవకాశం లభిస్తుంది. (సామె. 20:15; హెబ్రీ. 10:23, 24) వ్యాఖ్యానించడాన్ని ఒక ఆధిక్యతగా దృష్టించి, క్రమంగా భాగం వహించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం దీనిని మరింత ఫలవంతంగా ఎలా చేయగలము?

సిద్ధపడడం మొదటి మెట్టు. విషయాన్ని ముందుగా చదవడం, దానిని గురించి ఆలోచించడం ప్రాముఖ్యం. ఇవ్వబడిన సమాచార సారాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఆ విషయం గతంలో చర్చించబడినదైనప్పటికీ, అందించబడిన మరింత విపులమైన లేక మరెక్కువ అంశాల కొరకు వెదకండి. విషయం యొక్క మొత్తం మీది అంశాన్ని మనస్సులో ఉంచుకోండి. ప్రకటన ముగింపు అనే పుస్తకం వంటి బైబిలులోని ఏదైన ఒక పుస్తకం యొక్క లోతైన పఠనాన్ని గూర్చిన ప్రచురణ నుండి వ్యాఖ్యానాలను సిద్ధపడేటప్పుడు, ఒక ప్రత్యేక లేఖనం, దాని చుట్టూవున్న లేఖనాలతో ఎలా ముడిపడి ఉందో గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఈ సలహాలను పాటించడం మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు మంచి వ్యాఖ్యానాలను సిద్ధం చేసుకోవడానికి, భాగం వహించడంలో సంతోషాన్ని కనుగొనేందుకు అది మీకు సహాయపడుతుంది.

మంచి వ్యాఖ్యానాలు క్లుప్తంగాను, సరళంగా చెప్పబడినవిగాను, పఠించబడుతున్న ప్రచురణ ఆధారితమైనవిగాను ఉంటాయి. మొదటి వ్యాఖ్యాత అదనపు వ్యాఖ్యానాల కొరకు పాయింట్లను వదిలపెడుతూ ఆ ప్రశ్నకు సూటైన జవాబునివ్వాలి. ఎక్కువ సమయాన్ని తీసుకునేవి మరియు ఇతరులు జవాబివ్వడానికి అనుమతించని సుదీర్ఘమైన, అనవసరమైన జవాబులివ్వకండి. మీ వ్యాఖ్యానంలో ఒక్కో పదాన్ని ప్రచురణ నుండి చదివే బదులు, మీ స్వంత మాటల్లో చెప్పండి. అదనపు వ్యాఖ్యానాల్లో ఎత్తి వ్రాయబడిన లేఖనాలను, వివరాలను కూడా ఇమిడ్చవచ్చు. అనవసరమైన ఏ పునరావృత్తి చేయకుండా ఉండేందుకు ఇతరులు చెప్పేదానిని జాగ్రత్తగా వినండి.

అనేక మార్లు చెయ్యి ఎత్తడం మంచిదే గాని, ప్రతి పేరాకు ఎత్తడం మంచిది కాదు. వ్యాఖ్యానంలో పాలుపొందేందుకు మేము యౌవనస్థులను ఆహ్వానిస్తాము. మీరు వ్యాఖ్యానించడానికి సంకోచిస్తున్నట్లయితే, ఏ పేరాలోని జవాబును ఇవ్వడానికి మీరు ఇష్టపడతారో మీ నిర్వాహకునికి తెలియజేసినట్లయితే, మీరు వ్యాఖ్యానించే అవకాశాన్ని ఆయన మీకివ్వగలుగుతాడు.

సంఘ కూటాల్లో ప్రేక్షకులు భాగం వహించవలసిన వాటిలో మనం పాలుపంచుకోగల్గేలా మనమందరం గట్టి ప్రయత్నం చేయాలి. అలాంటి కూటాల విజయం అనేది చాలామట్టుకు వ్యాఖ్యానించడంలో మన సంసిద్ధత మరియు సఫలతపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.—కీర్త. 26:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి