జూన్‌లోని సేవా కూటాలు
జూన్ 5తో ప్రారంభమయ్యే వారం
పాట 7 (19)
12 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. “వర్షాకాలం మళ్ళీ వచ్చింది!” అనే శీర్షికను చర్చించండి.
15 నిమి: “యెహోవా శక్తినిస్తాడు.” ప్రశ్నా-జవాబులు. ఫిబ్రవరి 1, 1992, కావలికోట (ఆంగ్లం), 32వ పేజీలోని అనుభవాన్ని చెప్పండి.
18 నిమి: “యెహోవా మన సృష్టికర్త.” ప్రేక్షకులతో చర్చ. సృష్టి అనే పుస్తకం కొరకు సలహా ఇవ్వబడిన అందింపును ఎలా ఉపయోగించాలో చూపించే ఒక ప్రదర్శనను మరియు స్థానికంగా అందించే 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందిస్తున్న మరో ప్రదర్శనను చూపించాలి. ఏప్రిల్, మే నెలల్లో పంచిపెట్టిన రాజ్య వార్తలను అందించిన చోట ఎలా పునర్దర్శనం చేయవచ్చనే దానిపై కొన్ని క్లుప్త సలహాలను చేర్చండి.
పాట 17 (12) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 12తో ప్రారంభమయ్యే వారం
పాట 221 (73)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
17 నిమి: “యౌవనస్థులకు ఓ మాదిరికర్తగా క్రీస్తు.” ప్రశ్నా-జవాబులు. సెప్టెంబరు 1, 1986, కావలికోట (ఆంగ్లం), 4-6 పేజీల నుండి వ్యాఖ్యానాలను చేర్చండి.
18 నిమి: “విశ్వాసంలేని వారికి సహాయపడండి.” సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులతో ఈ శీర్షికను పునఃసమీక్షించి, సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో చర్చిస్తాడు. వారు ఒకరికొకరు అందింపులను ప్రదర్శించడం ద్వారా అభ్యసిస్తారు.
పాట 122 (94) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 19తో ప్రారంభమయ్యే వారం
పాట 80 (8)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారం ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించగల రెండో, మూడో క్లుప్త పత్రిక అందింపులను ప్రదర్శించండి
18 నిమి: ఇతరుల ఎడల మెప్పుదలను కనబరచండి. డిశంబరు 1, 1994, కావలికోట, 28-30 పేజీల ఆధారంగా సంఘ పెద్ద ప్రసంగమివ్వాలి. సంఘంలోని ఇతరుల ఎడల గౌరవాన్ని మరియు ప్రేమపూర్వక శ్రద్ధను చూపించవలసిన అవసరతను నొక్కి చెప్పాలి.
17 నిమి: “మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.” ప్రశ్నా-జవాబులు. టి.వి. చూడడంలో గడిపే సమయాన్ని గూర్చి, మే 22, 1991, తేజరిల్లు! (ఆంగ్లం), 11వ పేజీలోని “నిగ్రహించుకొనుట” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న సలహాలను పునఃసమీక్షించండి.
పాట 208 (105) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 26తో ప్రారంభమయ్యే వారం
పాట 75 (58)
15 నిమి: స్థానిక ప్రకటనలు. పునర్దర్శనాలు చేయవలసిన ప్రాముఖ్యతను క్లుప్తంగా నొక్కి చెప్పండి. మన బోధనా పనిలోని అధిక భాగం ఆసక్తిని పెంపొందించడానికి తిరిగి వెళ్ళినప్పుడు నిర్వహించబడుతుంది. కొందరు మాత్రమే కేవలం సాహిత్యంతో ఆత్మీయ అభివృద్ధిని సాధించగలరు. మనం తిరిగి వెళ్ళకపోతే, వారికి సహాయపడేందుకు మనకున్న చక్కని అవకాశాన్ని కోల్పోతాము. పునర్దర్శనాలు బైబిలు పఠనాలనిస్తాయి. ఒక వారం వరకు వేచి ఉండే బదులు, ఒకటి లేక రెండు రోజుల్లోనే తిరిగి వెళ్ళడం ద్వారా చాలామంది ప్రచారకులు మంచి ఫలితాలను పొందారు.—మన పరిచర్య అనే పుస్తకం 88-9 పేజీలను చూడండి.
15 నిమి: ప్రశ్నాభాగం. కావలికోట నిర్వాహకుడు ప్రశ్నా-జవాబులను చర్చించాలి. పాఠశాల నిర్దేశక పుస్తకము, 91-2 పేజీల ఆధారంగా అదనపు వ్యాఖ్యానాలను చేయండి.
15 నిమి: జూలై నెలలో అందించవలసిన సాహిత్యాన్ని పునఃసమీక్షించండి. సంఘ స్టాకులో ఉన్న బ్రోషూర్‌ల విశిష్ట అంశాలను చర్చించండి. ఇంటి ద్వారముల వద్ద వాటిని ఎలా అందించవచ్చో ప్రచారకులు క్లుప్తంగా ప్రదర్శించాలి. ఉదాహరణలు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? (26-7 పేజీలకు త్రిప్పి, అందులోని చిత్రాలను చూపించి, రానున్న పరదైసును గూర్చిన లేఖనాల్లో ఒకదానిని చర్చించండి.) జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలుసుకోగలరు? (30-1 పేజీలకు త్రిప్పి, ఎత్తి వ్రాయబడిన లేఖనాల్లో ఒకదాన్ని అవలోకించి, చిత్రాన్ని గూర్చి చర్చించండి.) మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. . . (రెండవ పేజీలో లేవదీయబడిన ప్రశ్నల వైపు శ్రద్ధ మళ్ళిస్తూ, 31వ పేజీలోని ఓదార్పునిచ్చే ఒకటో రెండో లేఖనాధార తలంపులపై వ్యాఖ్యానం చేయండి.) ప్రస్తుతం స్టాకులో ఏ బ్రోషూర్‌లున్నాయో సంఘానికి తెలియజేయండి.
పాట 225 (18) మరియు ముగింపు ప్రార్థన.