ప్రకటనలు
◼ అందించవలసిన సాహిత్యాలు ఏప్రిల్, మే: కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల చందా సేకరణ. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 70.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికల ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికలకు ఆరు నెలల చందాలేదు. చందాలను సేకరించేటప్పుడు, ఇండియన్ భాషలన్నింటిలోను నేపాలిలోను కావలికోట ఇప్పుడు పక్షపత్రికయని, కాని ఉర్దూలో మాసపత్రికయని గుర్తుంచుకోండి. తేజరిల్లు! మలయాళంలోను తమిళంలోను పక్షపత్రిక, అయితే, గుజరాతి, కన్నడ మరియు తెలుగు భాషల్లో మాసపత్రిక. బెంగాలి, హింది, మరాఠి లేక నేపాలి భాషల్లో తేజరిల్లు!కు విడిగా చందాలు లేవు, అయితే ఈ నాలుగు భాషల్లో త్రైమాస పత్రికల పంపిణీదారుల ప్రతులు సంఘాలకు లభ్యమౌతాయి. జూన్: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) వెల రూ. 45.00. ప్రాంతీయ భాషల్లో 192 పుటల ఏ క్రొత్త పుస్తకాన్నైనా మామూలు (రెగ్యులర్) వెలయైన రూ. 15.00కు అందించవచ్చు. జూలై, ఆగష్టు: క్రింద ఇవ్వబడిన 32 పుటల బ్రోషూర్‌లలో దేనినైనా రూ. 5.00 చందాకు అందించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా? నిరంతరము నిలిచే దైవిక నామము, పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలుసుకోగలరు? మరియు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే...
గమనిక: పైన పేర్కొన్న ప్రచార ఉపకరణాలను ఇంతవరకూ రిక్వెస్ట్ చేయని సంఘాలు తరువాయి నెలలోని తమ లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-AB-14)లో అలా చేయాలి.
◼ క్రితం ప్రకటించినట్లుగా, ఆదివారం, ఏప్రిల్ 23న సంఘకూటాల్లోను, అలాగే ఆ తేదీన జరిగే ప్రాంతీయ సమావేశాల్లోను, ప్రత్యేక సమావేశ దినాల్లోను ప్రత్యేక రాజ్య వార్త విడుదల చేయబడుతుంది. రాజ్య వార్త విడుదల చేయబడిన వెంటనే, దాని పంపకం మొదలు కావచ్చు. సమావేశాలు మరియు ప్రాంతీయ కాపరి సందర్శనాలు, లేదా ఇతర కార్యకలాపాల వలన తమ కూటమి పట్టికను మార్చుకోవలసి వచ్చిన సంఘాలతో సహా అన్ని సంఘాలకు ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 23 తర్వాత ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడే సంఘాలు ఏప్రిల్ 24న రాజ్య వార్తను విడుదల చేసి పంపకం మొదలు పెట్టవచ్చు.
◼ సంఘంతో సహవసించే ప్రతి ఒక్కరు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల కొరకు వ్యక్తిగత చందాలతో సహా, క్రొత్త మరియు నవీకరించే చందాలనన్నింటినీ సంఘం ద్వారా పంపించాలి.
◼ ఇప్పటి నుండి సంఘాలు తమకు కావలసినన్ని జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికలను ప్రతి సంవత్సరం రిక్వెస్ట్ చేయాలి. దయచేసి, 50ల లెక్కన మాత్రమే ఒక్కో భాషలో ఎన్నెన్ని కావాలో రిక్వెస్ట్ చేయండి. మేము ఇప్పుడు 1995 సమావేశ బాడ్జ్ కార్డులు, ప్రతిదినము లేఖనములను పరిశీలించుట 1996, 1996 క్యాలెండర్లు, 1996 వార్షిక పుస్తకములు మరియు 1996 జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికల కొరకు రిక్వెస్టులను స్వీకరిస్తున్నాము. దయచేసి ఒకే రిక్వెస్ట్ ఫారమ్ (S-AB-14)లో ఈ ఐదు ఐటెమ్‌లను రిక్వెస్ట్ చేయండి, ఇదే ఫారమ్ మీద మరి ఇతర ఐటెమ్‌లను రిక్వెస్ట్ చేయకండి. బాడ్జ్ కార్డులు ఆంగ్లం, మలయాళం, తమిళ భాషల్లో లభ్యమవుతాయి, అయితే, పరిశీలించుట 1996 మరియు 1996 జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికలు బెంగాలి, ఇంగ్లీష్, గుజరాతి, హింది, కన్నడ, మరాఠి, మలయాళం, నేపాలి, తమిళం, మరియు తెలుగు భాషల్లో లభ్యమవుతాయి. దయచేసి మీ రిక్వెస్ట్‌లను మే 6, 1995 దాటకముందే పంపించండి.
◼ దయచేసి, ‘1994-95 లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్’ (S-AB-14 3/93)లోని భాష అనే ఉపశీర్షికలో ఉన్న మార్గనిర్దేశాలను గమనించండి. ఫారమ్‌లోని పై (ముందు) పుటలో రిక్వెస్ట్ చేయబడిన అన్ని ఐటెమ్‌లు భవిష్యత్తులో మీ సంఘం యొక్క ప్రాథమిక భాషలో పంపించబడతాయి. మీ సంఘం యొక్క ప్రాథమిక భాష మీ ప్రతి నెల స్టేట్‌మెంట్‌లో సంఘ సంఖ్య తర్వాత వ్రాయబడుతుంది. మరే ఇతర భాషలోనైనా కావలసిన సాహిత్యాన్ని ఫారమ్ అటు (వెనుక) వైపున రిక్వెస్ట్ చేయాలి, ఏ భాషలో కావాలో ప్రత్యేకంగా తెలపాలి.
◼ మీ సంఘం యొక్క ప్రాథమిక భాషగా ప్రస్తుతం మా కంప్యూటర్లలో ఎక్కించిన భాషలో కాక మరో భాషలో మీరు ఎక్కువ సాహిత్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే, మీ సంఘం కొరకు ప్రాథమిక భాషగా మా కంప్యూటర్‌లో ఎక్కించిన ప్రాథమిక భాషను మార్చాలని కోరుతూ మీరు సొసైటీకి లేఖ వ్రాయవచ్చు. మీ రిక్వెస్ట్‌లలో అనేకము మీ లిటరేచర్ రిక్వెస్ట్ ఫారం పై పుటలో వ్రాయవచ్చని నిశ్చయపరుస్తుంది. అయితే ఇతర భాషల్లో అవసరమైన కేవలం కొన్ని ఐటెమ్‌లను బహుశ దాని రెండవ వైపున రిక్వెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది.
◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:
ఆంగ్లం: మహాగొప్ప బోధకుని వినుట. హింది, మలయాళం మరియు తమిళం: ప్రపంచవ్యాప్తంగా ఐకమత్యంతో దేవుని చిత్తం చేస్తున్నారు. కన్నడ మరియు మలయాళం: నీ కుటుంబ జీవితమును సంతోషభరితము చేసికొనుము. ఉర్దూ: పరదైసుకు మార్గమును ఎలా కనుగొనవచ్చు (ముస్లింల కొరకు కరపత్రం); పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము.