కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/95 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 4/95 పేజీలు 5-6

దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

జనవరి 2 నుండి ఏప్రిల్‌ 17, 1995 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై ఆధారపడిన, పుస్తకాలను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడానికి వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నకు సమాధానం వ్రాయడానికైనా బైబిలును మాత్రమే ఉపయోగించాలి. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకొరకు ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పుట మరియు పేరాగ్రాఫ్‌ల సంఖ్య ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. దావీదు బత్షెబతో చేసిన పాపాన్ని బట్టి ఆయనకు కలిగిన పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించినప్పుడు, దావీదు, అతని యింటివారు అతని చెడుప్రవర్తన వలన కలిగే ఫలితాలనుండి తప్పించుకున్నారు. [uw-E పుట 127 పేరా 5]

2. సామెతలు 11:1 లోని ప్రాథమిక సూత్రమేమంటే, మనం యెహోవా అనుగ్రహాన్ని పొందాలనుకుంటే, మన వ్యాపార వ్యవహారాలన్నింటిలో మనం నీతిమంతులుగాను, నిజాయితీగలవారుగాను ఉండాలి. [వారపు బైబిలు పఠనం; w86 11/15 పుట 19.]

3. సలహాను అంగీకరించడం బలహీనతకు సూచన. [uw-E పుట 127 పేరా 4]

4. సాధారణంగా భావోద్రేకాలు చర్యలకు నడిపిస్తాయి, కాబట్టి సామెతలు 14:17 మొదట వాటికే అవధానాన్నిస్తుంది. [వారపు బైబిలు పఠనం; కా93 8/15 పుటలు 20-1.]

5. యేసును ప్రభువు అని పిలిచే వారందరు రక్షించబడతారు. [uw-E పుట 105 పేరా 5]

6. సా.శ. 33లో యేసు పునరుత్థానుడై, దేవుని కుడి పార్శ్వమున తన స్థానమున కూర్చున్న ఆ సమయంలోనే ఆయన తన అభిషక్తులైన శిష్యులపై అధికారము చేయనారంభించాడు. (కొలొ. 1:13) [gt అధ్యాయం 132]

7. శాస్త్రజ్ఞులు జన్యు రచనను కనుగొనుటకు దాదాపు 3,000 సంవత్సరాలకు పూర్వమే దాని గూర్చిన జ్ఞానాన్ని కీర్తన 139:13-16 ప్రతిఫలించింది. [వారపు బైబిలు పఠనం; w92 5/15 పుట 4.]

8. సామెతలు 8:22-31 జ్ఞానాన్ని గూర్చిన వివరణ మాత్రమే. [వారపు బైబిలు పఠనం; w 87 5/15 పుట 28.]

9. నిజమైన క్రైస్తవుడు దేనినైనా అసహ్యించుకోకూడదు. [వారపు బైబిలు పఠనం; w92 1/1 పుట 21.]

10. సామెతలు 11:25 హెబ్రీ పద్య శైలిలోని సామ్యమైన ఆలోచనలకు లేక తలంపులకు, ఉదాహరణైతే, సామెతలు 10:7 విభిన్నమైనవాటి సామ్యమునకు ఉదాహరణ. [si-E పుట 107 పేరా 7]

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:

11. కీర్తనలు గొప్ప సాహిత్యము కన్నా చాలా ఎక్కువే, ఎందుకని? [si-E పుట 104 పేరా 23]

12. కీర్తనలను తెలుసుకొని ఉండడం యేసుకు ఎలా ప్రయోజనకరమైంది? [si-E పుట 105 పేరా 30]

13. సొలొమోనుకు జ్ఞానాన్ని ఎవరిచ్చారు, మనం సామెతలు చదివేటప్పుడు, మెప్పుదల కలిగియుండడానికి మనలను ఏది పురికొల్పాలి? [si-E పుట 106 పేరా 1]

14. మగ్దలేనే మరియ తోటలో తనతో మాట్లాడిన పునరుత్థానుడైన యేసు ఎవరని అనుకుంది, ఆయనను సరిగ్గా గుర్తుపట్టడానికి ఆమెకు ఏది సహాయపడింది? [gt అధ్యాయం 128]

15. యేసు శిష్యులమని గుర్తించబడడానికి భయపడిన, మహాసభలోని ఏ యిద్దరు సభ్యులు ఆయన శరీరమును సమాధి కొరకు సిద్ధం చేయడంలో సహాయపడ్డారు? [gt అధ్యాయం 127]

16. మన సహోదరుల యెడల స్వయం త్యాగం చేసేంతటి ప్రేమ మనకు ఉందని మన దైనందిన చర్యల్లో ఎలా చూపించగలము? [uw-E పుటలు 132-3 పేరా 3, 4]

17. కీర్తనలు 136:10-15 చారిత్రాత్మకమైన ఏ సంఘటనను గూర్చి చెబుతుంది, ఫరోకు ఏమి సంభవించింది? [వారపు బైబిలు పఠనం; కా93 6/15 పుట 5.]

18. క్రీస్తు చిందించిన రక్తము ఏ రెండు ఉద్దేశాలను నెరవేర్చింది? [uw-E పుట 115, పేరా 13.]

19. యేసు పునరుత్థానుడయ్యాడని, నమ్మకస్థులైన అపొస్తలులు, యేసు సహోదరుడైన యాకోబు, 500 కన్నా ఎక్కువ మంది శిష్యులు ఏ కారణాన ఒప్పించబడ్డారు? [gt అధ్యాయం 131]

20. యేసును జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషిగా చేసినదేమిటి? [gt ఉపోద్ఘాత వ్యాఖ్యానాలు]

క్రింది వాక్యములను పూరించడానికి అవసరమైన పదాన్ని లేక మాటలను చేర్చండి:

21. సా.శ. 33 పెంతెకొస్తున, ప్రసిద్ధిగాంచిన తన ప్రసంగంలో, పేతురు మళ్ళీ మళ్ళీ ___________________ పుస్తకం నుండి ఉదాహరించాడు; ఆ సందర్భంలో దాదాపు ___________________ మంది వ్యక్తులు బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. [si-E పుట 105 పేరాలు 25, 26]

22. యేసుకు త్రాగడానికి ___________________ యివ్వబడుతుందని, ఆయన పై__________________ చీట్లు వేయబడతాయని ___________________ అతని విడిచిపెట్టినట్లు అగుపిస్తుందని కీర్తనలు ప్రవచించాయి. [si-E పుట 105 పేరా 30]

23. యెహోవా సంస్థ దైవపరిపాలన సంబంధమైనది, అంటే, దానిని __________________ __________________; సంఘ శిరస్సయిన __________________ ద్వారా, తన వాక్యమైన __________________ ద్వారా యెహోవా నడిపింపునిస్తాడు; __________________కి యేసు ప్రత్యేక బాధ్యతను అప్పగించాడు. (మత్త. 24:45) [uw-E పుటలు 118-19, పేరాలు 4-6]

24. పరలోకానికి తీసుకువెళ్ళబడుతున్న 144,000 మందికి భిన్నంగా ఏ మానవుడు లెక్కపెట్ట లేనంత ఒక __________________ ___________________ తప్పించుకుని యీ __________________ పైనే జీవిస్తుంది. (ప్రక. 7:9, 14) [uw-E పుట 104, పేరాలు 3, 4]

25. దైవాంగీకారము గల తీర్మానాన్ని తీసుకోడానికి, మొదటి శతాబ్దములోని పరిపాలక సభ, ప్రస్తుత విషయాన్ని గూర్చి ప్రేరేపిత ___________________ చెబుతున్నవాటిని, ___________________ పనిచేస్తుందన్న రుజువును జాగ్రత్తగా పరిశీలించారు. (అపొస్తలుల కార్యములు 15:6-29) [uw-E పుట 120 పేరా 8]

క్రింది వాక్యముల నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

26. యేసు మ్రానుపై వ్రేలాడదీయబడినప్పుడు, ఆయనకు బోళము కలిపిన ద్రాక్షారసము యివ్వబడింది, కాని ఆయన దానిని త్రాగడానికి నిరాకరించాడు ఎందుకంటే (ధర్మశాస్త్రం దానిని నిషేధించింది; ఆయన నాజీరు; తాను సంపూర్ణముగా తెలివితో ఉండవలెనని ఆయన కోరుకున్నాడు). [gt అధ్యాయం 125]

27. గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకోవడమంటే (పాపములు చేయడాన్ని మానుకోవడం; పాపపరిహారాన్ని సాధ్యపరచుట కొరకైన యేసు బలి మనకు అవసరముందని గుర్తించడం; దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుని బాప్తిస్మం పొందడం). [uw-E పుట 106 పేరా 7]

28. యేసు నిర్దోషి అని కనీసం ఐదుసార్లు చెప్పిన (హేరోదు; పిలాతు; ఫిలిక్స్‌), తర్వాత యూదుల నిర్దాక్షిణ్యపు మాటలకు లోబడి యేసును వ్రేలాడదీయడానికి అప్పగించాడు. [gt అధ్యాయం 124]

29. సా.శ. (36; 35; 33)కు ముందు చనిపోయి, మృతులుగానే ఉన్న దేవుని నమ్మకస్థులైన సేవకులందరు పరలోక జీవితం కొరకు పరిశుద్ధాత్మతో అభిషేకించబడలేదు. [uw-E పుట 111 పేరా  5]

30. మానవులందరూ (ప్రేమ; ద్వేషము; వ్యక్తిగత లాభం కొరకైన అపేక్ష) వలన పురికొల్పబడుతారని, వారికి (దేవుని నామము; యితరుల; స్వంత విషయాల) యెడల ముఖ్య శ్రద్ధ అని సాతాను వాదిస్తాడు. [uw-E పుట 124 పేరా 14]

క్రింద ఇవ్వబడిన వాక్యములతో లేఖనాలను జతచేయండి: సామె. 3:27, 28; యోహాను 19:4-6; 19:25-27; రోమా. 15:2, 3; ప్రక. 7:16, 17

31. తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత క్రైస్తవులకుంది. [gt అధ్యాయం 126]

32. మనం ఎలా కనిపిస్తామన్నది యితరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందోనని మనం గంభీరంగా తలస్తాము, ఆ విధంగా మనలను మనం ప్రీతిపరచుకోడాన్ని ఇష్టపూర్వకంగా త్యజిస్తాము. [uw-E పుట 130 పేరాలు 10, 11]

33. ఆత్మీయంగానైనా, భౌతికంగానైనా ఇతరులకు మంచి చేసే అవకాశం దొరికినప్పుడెల్లా, మన పొరుగువారికి, మరి ముఖ్యంగా ఆత్మీయ సహోదరులకు సహాయం చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. [వారపు బైబిలు పఠనం; కా93 12/15 పుట 20.]

34. ప్రతికూల సమయంలోను ఉన్నతత్వాన్ని, ప్రశాంతతను చూపించడం యెహోవాకు ఘనతను తెస్తూ, మనుష్యుల్లో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. [gt అధ్యాయం 123]

35. “ఆత్మీయ పరదైసు” అని సముచితంగా పిలువబడుతున్న వాగ్దానం చేయబడిన పరిస్థితులను మనం అనుభవించడాన్ని ఇప్పటికే ఆరంభిస్తున్నాము. [uw-E పుటలు 107-9 పేరాలు 9-11]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి