ఏప్రిల్‌లోని సేవా కూటాలు
ఏప్రిల్ 3తో ప్రారంభమయ్యే వారం
పాట 203 (43)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. “జ్ఞాపకార్థ దినానికి సిద్ధంకండి” పునఃసమీక్షించండి.
15 నిమి: “మనకున్న వాటినిబట్టి కృతజ్ఞులము” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించే దానిని బట్టి ఆగష్టు 1, 1990, కావలికోట, (ఆంగ్లం) 19-20 పుటలు, 15-20 పేరాల ఆధారంగా అదనపు వ్యాఖ్యానాలను చేయండి.
20 నిమి: “కావలికోట మరియు తేజరిల్లు!—మన అత్యావశ్యక సమయాల కొరకైన పత్రికలు!” ప్రేక్షకులతో చర్చించండి. పత్రికల ఎడల మెప్పును కనబరచే అనుభవాలను చెప్పండి. (g91 7/22 పుట. 9) ఇవ్వబడిన సలహాలను ఉపయోగిస్తూ అందింపును ఎలా తయారు చేయవచ్చో ఇద్దరు ప్రచారకులు చూపించాలి, తమ అందింపులను ఒకరికొకరు ఇస్తూ, వాటిని ప్రదర్శించాలి.
పాట 219 (50) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 10తో ప్రారంభమయ్యే వారం
పాట 212 (110)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు మరియు చందా వివరాలు. “యెహోవా కే సాక్షి” అనే బాక్సు వైపుకు అవధానాన్ని మళ్ళించండి. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలనే ఆసక్తిగలవారికి సహాయపడవలసిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి. ఈ వారాంతమున ప్రాంతీయ సేవలో భాగం వహించడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “మన రాజ్య ఐక్యతను కాపాడుకొనుట.” ప్రేక్షకులతో చర్చించండి.
20 నిమి: ‘ప్రభువు కార్యమునందు చేయడానికి ఎంతో ఉంది.’ సేవాధ్యక్షుడు ప్రశ్నాజవాబులను చర్చించాలి. ప్రత్యేక రాజ్య వార్తను ఇంటింటా అందించడానికి చేయబడిన విస్తృతమైన ఏర్పాటులను పునఃసమీక్షించాలి. స్థానిక సంఘం యొక్క నియమించబడిన ప్రాంతం మొత్తం కాకపోయినా, సాధ్యమైనంత మేరకు పూర్తి చేయాలనే పథకాలను గూర్చి చర్చించాలి. క్రొత్తవారు మొదటిసారిగా సేవలో పాల్గొనడానికి సహాయపడేందుకు ఏం చేయాలో వివరించండి. (మార్చి 1995 మన రాజ్య పరిచర్య, పుట 1 చూడండి.)
పాట 150 (83) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 17తో ప్రారంభమయ్యే వారం
పాట 214 (82)
13 నిమి: స్థానిక ప్రకటనలు. జ్ఞాపకార్థ ఆచరణను గూర్చిన ప్రోత్సాహకరమైన ముఖ్యాంశాలను తెలియజేయండి, హాజరైన క్రొత్తవారికి తరువాయి సహాయాన్ని అందించగల మార్గాలను పునఃసమీక్షించండి. ఏప్రిల్ 23న ప్రత్యేక ప్రసంగానికి హాజరవ్వాలని, ఆసక్తిగల క్రొత్తవారు మళ్ళీ రావడానికి సహాయం చేయాలని అందరినీ పురికొల్పండి. రాజ్య వార్తను అందజేసేందుకు ప్రాంతీయ పరిచర్య కొరకైన ఏర్పాట్లను పునఃసమీక్షించండి.
15 నిమి: “అవసరత ఉందని మీకు అనిపించిందా?” ప్రశ్నాజవాబులు. పెద్దలు తమ కాపరి పనిలో సాధించాలని ప్రయత్నిస్తున్న ప్రస్తుత లక్ష్యాలను గూర్చి క్లుప్తంగా చెప్పండి. సహాయపడేందుకు వ్యక్తులు ఏం చేయగలరో వివరించండి.
17 నిమి: “బోధింపబడదగినవారి కొరకు అన్వేషించండి.” పునర్దర్శనాలు చేయవలసిన దాని ప్రాముఖ్యతను చర్చించాలి. బైబిలు ఉపయోగించడాన్ని ప్రోత్సహించండి. ఒకటో రెండో అందింపులను క్లుప్తంగా ప్రదర్శించాలి.
పాట 197 (57) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 24తో ప్రారంభమయ్యే వారం
పాట 167 (42)
15 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. ప్రాంతంలో రాజ్య వార్తను పంచిపెట్టడంలోని ప్రగతిని పునఃసమీక్షించండి. రాజ్య వార్తను అందించడంలో ప్రచారకులు పొందిన అనుభవాలను చెప్పడానికి వారిని ఆహ్వానించండి. స్థానిక ప్రాంతానికి తగినట్లుగా ఉండే పత్రిక అందింపులను గూర్చి సలహా ఇవ్వండి. పగటి గంటలు పెరుగుతుండగా సాయంకాల సాక్ష్యంలో సంఘం పాల్గొనడానికి ఏవైనా ఏర్పాట్లుంటే ప్రకటించండి.
12 నిమి: స్థానిక అవసరాలు. లేదా జనవరి 15, 1995, కావలికోట, 21-3 పుటల ఆధారంగా ఇతరులను ప్రోత్సహించేవారిగా ఉండండి అనే ప్రసంగం ఇవ్వండి.
18 నిమి: మీ కుటుంబ బైబిలు పఠనాన్ని క్రమంగా నిర్వహించండి. భార్యాభర్తలు తమ పిల్లల్లో ఆత్మీయ పురోగతి లేనందున బాధను వ్యక్తపరుస్తారు. తాను కుటుంబ బైబిలు పఠనాన్ని నిర్వహించే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగానున్నాడని; కొన్నిసార్లు, కుటుంబ ఉపదేశం ఏదీ లేకుండానే అనేక వారాలు గడిచిపోయాయని భర్త ఒప్పుకుంటాడు. వారు పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం), 37-8 పుటలు, 12-14 పేరాల్లో ఇవ్వబడిన ఉపదేశాన్ని, నడిపింపును పునఃసమీక్షిస్తారు. ప్రతివారం కుటుంబ పఠనానికి ప్రాముఖ్యతనివ్వాలని, తమ ఇతర కార్యక్రమాలు దాన్ని ఆటంకపర్చడాన్ని అనుమతించకూడదని ఇద్దరూ ఒప్పుకుంటారు.
పాట 142 (93) మరియు ముగింపు ప్రార్థన.